వెంకటాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

TG: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్మార్ట్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ ఇంగోలి రాజేశ్వరరావు, ఉపసర్పంచ్ మార్కెట్ రవి, వార్డు సభ్యులు, అధికారులు, కార్డుదారులు పాల్గొన్నారు.



