Education· 8 Aug 2026
హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సులకు మినిమమ్ ఫీజు ఖరారు
AP: రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సులకు గవర్నమెంట్ మినిమమ్ ఫీజులను నిర్ణయించింది. ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ ఈరోజు ఆర్డర్స్ ఇచ్చారు. డిగ్రీలో B.Scకు రూ.17,500, B.Comకు రూ.14 వేలు, BAకు రూ.13 వేలు, BBA/BBM, BCAలకు రూ.21 వేలు, BHMకు రూ.35 వేలు ఫైనల్ చేశారు. LLB, LLMకు రూ.15-22 వేలు, B-Pharmacy, Pharmacy-D కోర్సులకు రూ.45 వేలుగా నిర్ణయించారు.