Local

మైనింగ్ బ్లాస్ట్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
Local· 4d ago

మైనింగ్ బ్లాస్ట్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

TG: జోగులాంబగద్వాల జిల్లా గట్టు మండలంలో భారత్‌మాల పథకంలో భాగంగా జరుగుతున్న రహదారి పనులకు సంబంధించిన క్రషర్‌ కార్యకలాపాలపై సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. సల్కాపురం, జోగన్‌గట్టు గ్రామాల శివారులో మెగా కంపెనీకి సంబంధించిన సబ్‌కాంట్రాక్ట్‌ క్రషర్‌ ఐదేళ్లుగా కొనసాగుతోందని సీపీఎం నాయకుడు నర్సింహులు తెలిపారు. సల్కాపురం గ్రామానికి చెందిన రైతు ఏసన్నకు చెందిన రెండున్నర ఎకరాల పొలంలో బోరుబావి ఉందన్నారు. క్రషర్‌ నుంచి వెలువడుతున్న కంకర, దుమ్ము, బ్లాస్టింగ్‌ ప్రభావంతో బోరుబావి పూడిపోయిందని ఆరోపించారు.

పేదల గుడిసెలకు పట్టాలివ్వాలి.. వరంగల్‌లో సీపీఎం ధర్నా
Local· 4d ago

పేదల గుడిసెలకు పట్టాలివ్వాలి.. వరంగల్‌లో సీపీఎం ధర్నా

TG: వరంగల్ జిల్లా కేంద్రంలో పేదల గుడిసెలకు ఇంటి పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ, నిరుపయోగ స్థలాల్లో ఏళ్ల తరబడి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎర్రజెండాలు చేతబూనిన పేదలు, మహిళలతో కలిసి నాయకులు కలెక్టరేట్‌ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు.