← Back to news

గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ నిరసన

By Sagar· 4d ago· Peddapalli
గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ నిరసన

TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్‌ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఛత్తీస్‌గఢ్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రామగుండం కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై హల్ద్వానీ ర్యాలీ అనంతరం బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడాన్ని రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ప్రశ్నించారని తెలిపారు.

More in Local