← Back to news

దర్శనం చేసుకుని వస్తుండగా జీపు బోల్తా

By Nani Gaini· 4d ago· Nirmal
దర్శనం చేసుకుని వస్తుండగా జీపు బోల్తా

TG: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రావణమాసం సందర్భంగా కైలాష్ టేక్డీ, సాసర్‌ఖండ్ దర్శనానికి వెళ్లిన 19మంది భక్తులు జీపులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని తొటంబ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో గంగన్న (70), సాయిలు (69), ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ తులసిరామ్ (26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పలువురు గాయపడగా భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

More in Local