← Back to news

పనులు చేయించుకున్నారు, బిల్లులు చెల్లించడం లేదు

By K naga Suresh· 4d ago· కాకినాడ జిల్లా

AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ సురవరపు సత్తిరాజు పురపాలక అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లుగా పురపాలికలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని తెలిపారు. వైసీపీ హయాంలో వైఎస్సార్‌ గార్డెన్స్‌లో రూ.7 లక్షలతో రోడ్డు నిర్మించానని, ఆ పనికి సంబంధించిన బిల్లుల కోసం ఇంజినీరింగ్‌ అధికారులు ఎంబుక్‌లు నమోదు చేసుకున్నా చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.

More in Local