← Back to news

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

By Sagar· 4d ago· Peddapalli
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

TG: మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్‌ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, రైతులకు సమస్యలు ఎదురైన సమయంలో కేసీఆర్‌ బాధిత ప్రాంతాలకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అంటే పదవి, జీతం, ప్రభుత్వ సదుపాయాలు అనుభవించడం మాత్రమే కాదని, ప్రజల మధ్య నిలబడి వారి సమస్యలపై పోరాడే బాధ్యత కూడా ఉందన్నారు.

More in Local