Local· 23 Aug 2026
ఇక ఆటోలు ఆగిపోతాయ్!
అర్ధరాత్రి నుంచి రోడ్డు మీద ఆటోలు కనిపించకపోవచ్చు! తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. సిఐటియు నేత ఎం.రాజు డిమాండ్లు లిస్ట్ చేశారు: ఆర్టీసీ ప్రతిపాదన ఉపసంహరణ, సంక్షేమ బోర్డు, రూ.12,000 సాయం, చలాన్ మినహాయింపు, జీవో 263 అమలు, పెట్రోల్-డీజిల్ ధరలకు తగ్గ మీటర్ చార్జీల పెంపు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రజలు ఆటో కోసం ఎదురుచూడాల్సిందే!