Local· 23 Aug 2026
మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్
AP : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ 'మెగా జాబ్ క్యాలెండర్' రిలీజ్ చేయాలని DYFI డిమాండ్ చేసింది. నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరుగుతున్న DYFI ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ నగర్, గుర్రాల మడుగు, శెట్టిగుంట రోడ్ లాంటి పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశారు. నిరుద్యోగం, మత్తుపదార్థాల వాడకం లాంటి యూత్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లెమ్స్పై ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు DYFI జిల్లా నాయకులు నరసింహ, రమణ తెలిపారు.