సీహెచ్‌సీలో నిరుపయోగ జనరేటర్.. రోగుల ఇబ్బంది

మందసలోని హరిపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ నిరుపయోగంగా మూలుగుతోంది. పవర్ కట్ సమయాల్లో జనరేటర్ సౌకర్యం ఉన్నా సద్వినియోగం చేసుకోకపోవడంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. డీజిల్ లేదనే సాకు లేదా సిబ్బంది నిర్లక్ష్యంతో జనరేటర్ ఆన్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ డా. స్వరాజ్యలక్ష్మి వివరణ ఇస్తూ జనరేటర్ పనిచేయడం లేదని, ఇన్వర్టర్లను వాడుతున్నామని చెప్పారు.



