Latest

మీ ఓటు సేఫ్‌గానే ఉందా?
Current Affairs· 23 Aug 2026

మీ ఓటు సేఫ్‌గానే ఉందా?

ఉత్తరాఖండ్ ఓటర్ల లిస్ట్ SIR ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అన్ వెరిఫైడ్ బల్క్ అప్లికేషన్ల ద్వారా ఓటర్ల పేర్లను డిలీట్ చేస్తున్నారని ఎలక్షన్ కమీషన్ కి కంప్లైంట్ చేసింది. కిచ్ఛా కాన్స్టిట్యూషన్ లో ఒక్క పర్సన్ ఏకంగా 6,410 ఆబ్జెక్షన్స్ సబ్మిట్ చేశారని, మరో 262 మంది చెరో 10కి పైగా ఫారమ్-7 అప్లికేషన్లు ఇచ్చారని చెప్పింది. పాస్ట్ లో అస్సాం, గుజరాత్, రాజస్థాన్ లలో కూడా సేమ్ ఇలాగే బల్క్ సబ్మిషన్స్ జరిగాయని ఆందోళన వ్యక్తంచేసింది.

సఫాయి పనికెళ్తుంటే.. హత్య!
Local· 23 Aug 2026

సఫాయి పనికెళ్తుంటే.. హత్య!

జగిత్యాల రూరల్ తిమ్మాపూర్‌లో ఆదివారం ఉదయమే ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సఫాయి కూలీ బడుగు రామక్క పనికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దారుణంగా దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్యకు కారణం ఏమిటనే కోణంలో ఊరంతా కలవరపడుతోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఫొటోలు, ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? సీసీ కెమెరాలు ఏమైనా రికార్డ్ చేశాయా? అన్నది ఇప్పుడు కీలకం. నిందితుడి కోసం గాలింపు మొదలైంది. పూర్తి వివరాల కోసం ఎదురుచూడాల్సిందే!

చికెన్ ధర పడిపోయింది.. నోరూరుతోంది!
Local· 23 Aug 2026

చికెన్ ధర పడిపోయింది.. నోరూరుతోంది!

కామారెడ్డి ఫుడీలకు శుభవార్త! గత వారం కంటే ఈ వారం చికెన్ కాస్త చౌకైంది. ఇప్పుడు కిలో చికెన్ రూ.190-కే దొరుకుతోంది, స్కిన్ తీసేస్తే రూ.210. లైవ్ కోడి అయితే రూ.110–150 మధ్యలో ట్రేడ్ అవుతోంది. గుడ్ల ప్రియులకు కూడా గుడ్ న్యూస్ – డజన్ గుడ్లు రూ.72-కే అందుబాటులో. కానీ మటన్ మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది, కామారెడ్డి టౌన్లో రూ.880–1000, మండలాల్లో రూ.700–900. ధరలు పడ్డాయంటే ఓ మోస్తరు ఎంజాయ్ చేయొచ్చు.. ఎప్పుడు మళ్లీ పెరుగుతాయో చెప్పలేం కదా!<br>గమనిక: ఈ ధరలు స్థానిక సిటిజన్ జర్నలిస్టు మేరకే. క్రాస్ వెరిఫై చేయలేదు

ఆదివారం అర్ధరాత్రి ఆటోలు, క్యాబ్ లు బంద్!
TG· 23 Aug 2026

ఆదివారం అర్ధరాత్రి ఆటోలు, క్యాబ్ లు బంద్!

తెలంగాణలో ఆదివారం అర్ధరాత్రి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల స్టేట్‌వైడ్ బంద్ స్టార్ట్ కానుంది. దోమలగూడ, చిక్కడపల్లిలో శనివారం బంద్ పోస్టర్ రిలీజ్ చేసిన JAC, TNTUC లీడర్లు MK బోసు, అల్లూరి రవిశంకర్, కాంగ్రెస్ ప్రామిస్ చేసిన ఇయర్లీ రూ.12 వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్లే 200 మంది డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారని ఫైర్ అయ్యారు. బైక్ ట్యాక్సీల బ్యాన్, RTC ఈవీ ఆటోల ప్లాన్ క్యాన్సిల్, ట్రాఫిక్ చలాన్లపై 80% సబ్సిడీతో పాటు వెల్ఫేర్ బోర్డ్ సెటప్ చేయాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు.

రోడ్డు కొట్టుకుపోయింది.. ఇక ఎలా?
Local· 23 Aug 2026

రోడ్డు కొట్టుకుపోయింది.. ఇక ఎలా?

ASR గూడెం కొత్తవీధిలోని M.బూషికొండ రోడ్డు ఇప్పుడు మైన్ఫీల్డ్ లా ఉంది. శుక్రవారం కురిసిన వర్షానికి కొండపై నుంచి వరద నీరు రోడ్డు మీదుగానే ప్రవహించింది – ఎందుకంటే డ్రైనేజీ అనేది అక్కడ లేనేలేదు. ఫలితంగా రోడ్డంతా పెద్ద పెద్ద గోతులు, ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్పందించిన లోకల్ యువకులు మట్టి కాలువలు తవ్వి నీటిని మళ్లించారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. గ్రామస్తుల డిమాండ్ క్లియర్ – అధికారులు, కాంట్రాక్టర్ వెంటనే రోడ్డు రిపేర్ చేసి పక్కా డ్రైనేజీ వేయాలి. లేకపోతే మళ్లీ వర్షం వస్తే.. అదే జనరల్ స్టోరీ!

ఇక ఆటోలు ఆగిపోతాయ్!
Local· 23 Aug 2026

ఇక ఆటోలు ఆగిపోతాయ్!

అర్ధరాత్రి నుంచి రోడ్డు మీద ఆటోలు కనిపించకపోవచ్చు! తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. సిఐటియు నేత ఎం.రాజు డిమాండ్లు లిస్ట్ చేశారు: ఆర్టీసీ ప్రతిపాదన ఉపసంహరణ, సంక్షేమ బోర్డు, రూ.12,000 సాయం, చలాన్ మినహాయింపు, జీవో 263 అమలు, పెట్రోల్-డీజిల్ ధరలకు తగ్గ మీటర్ చార్జీల పెంపు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రజలు ఆటో కోసం ఎదురుచూడాల్సిందే!

CJP ఫైట్‌కి దిగొచ్చిన గవర్నమెంట్..
Education· 23 Aug 2026

CJP ఫైట్‌కి దిగొచ్చిన గవర్నమెంట్..

రాజస్థాన్‌లోని బాగురులో గేదెల కొట్టంలో నడుస్తున్న గవర్నమెంట్ స్కూల్‌ను పరిశీలించడానికి వెళ్లిన CJP స్పోక్స్ పర్సన్ <a href="https://x.com/AshutoshRanka/status/2091221834700300592?s=20">అశుతోష్ రాంక</a> అండ్ టీమ్‌పై <a href="https://www.theclearcutnews.com/n/68iggj5">దాడి</a> జరగడం కలకలం రేపింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత స్పందించిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా సొంత బిల్డింగ్స్ లేని 611 పాఠశాలలు ఉన్నాయని, 2,000 పైగా స్కూళ్లలో టాయిలెట్స్, తాగునీరు లేవని అంగీకరించింది. ఈ ఘటనతో దిగొచ్చిన రాజస్థాన్ సర్కార్.. రాంపుర స్కూల్‌కు కొత్త బిల్డింగ్ కట్టేందుకు ₹18 లక్షలు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది.

💭 మీ చిన్ననాటి కల గుర్తుందా?
Motivational· 23 Aug 2026

💭 మీ చిన్ననాటి కల గుర్తుందా?

చిన్నప్పుడు “పెద్దయ్యాక ఇది అవుతా” అని ఎంత నమ్మకంగా చెప్పేవాళ్లం.. కానీ పెద్దయ్యేసరికి ఆ కలే ఎందుకు మారిపోతుంది? వయసు పెరిగేకొద్దీ మనకు ఎదురయ్యే అనుభవాలు, కుటుంబ పరిస్థితులు, చదువు, డబ్బు, సమాజం పెట్టే అంచనాలు మన ఆలోచనలను నెమ్మదిగా మార్చేస్తాయి. చిన్నప్పుడు మనకు నచ్చింది ముఖ్యమైతే.. పెద్దయ్యాక స్థిరమైన జీవితం, ఉద్యోగం, బాధ్యతలు కూడా నిర్ణయాల్లో భాగమవుతాయి. అందుకే చిన్ననాటి కల మారిపోవడం అంటే మనం ఓడిపోయినట్టు కాదు.. మన గురించి అవగాహన మారిందని అర్థం. కొన్నిసార్లు పాత కల కొత్త రూపంలో తిరిగి రావచ్చు.

NICUలో ఫైర్ యాక్సిడెంట్.. పసికందు బలి!
National· 23 Aug 2026

NICUలో ఫైర్ యాక్సిడెంట్.. పసికందు బలి!

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ NICUలో వార్మర్ మెషిన్ ఫైర్ అవ్వడంతో ఒక్క రోజే వయసున్న పసికందు ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు నవజాత శిశువులకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం జబల్‌పూర్‌కి షిఫ్ట్ చేశారు. ఈ యాక్సిడెంట్ పై అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. ఈ ఇన్సిడెంట్ పై అపోజిషన్ లీడర్ ఉమంగ్ సింగార్ సీరియస్ అయి, స్టేట్ వైడ్‌గా హాస్పిటల్స్ లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయాలని CM మోహన్ యాదవ్‌ను డిమాండ్ చేశారు.

చైనాకు ఇండియా హెల్ప్ చేస్తోందా?
International· 23 Aug 2026

చైనాకు ఇండియా హెల్ప్ చేస్తోందా?

అమెరికా తమపై విధించిన టారిఫ్స్ నుండి తప్పించుకోవడానికి చైనాకు భారత్ సహా 40 దేశాలు హెల్ప్ చేస్తున్నాయని వైట్ హౌస్ సీరియస్ ఆరోపణలు చేసింది. 'ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్' పేరుతో రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో, చైనీస్ ప్రొడక్ట్స్‌ను ఇండియా లాంటి థర్డ్ కంట్రీస్‌కి పంపి, అక్కడ రీప్యాకింగ్ చేసి యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఇండియా తోసిపుచ్చింది. దేశంలో జెన్యూన్ మాన్యుఫ్యాక్చరింగే జరుగుతోందని క్లారిటీ ఇచ్చింది.

ఈరోజు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి
Current Affairs· 23 Aug 2026

ఈరోజు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేట్లు ఈ రోజు ఇలా ఉన్నాయి. సప్లై, మార్కెట్ డిమాండ్ ఆధారంగా లోకల్ ఏరియాలను బట్టి ప్రైసెస్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లైవ్ కోడి కిలో రూ. 140 నుండి రూ. 170 వరకు ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 240 నుండి రూ. 330 మధ్య సేల్ అవుతోంది. ఇక బోన్‌లెస్ చికెన్ రూ. 350 నుండి రూ. 420 వరకు, నాటుకోడి రూ. 600 నుండి రూ. 750 పైనే పలుకుతోంది. ప్రాంతం, రిటైల్ షాపులను బట్టి ఈ రేట్లలో చిన్న చేంజెస్ ఉండొచ్చు.

యుద్ధానికి ఎండ్ కార్డ్.. ఇరాన్ బిగ్ కామెంట్స్!
International· 23 Aug 2026

యుద్ధానికి ఎండ్ కార్డ్.. ఇరాన్ బిగ్ కామెంట్స్!

వెస్ట్ ఏషియాలో అమెరికాతో నెలకొన్న వార్‌ను ముగించడానికి ఇది సరైన టైమ్ అని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. ప్రస్తుతం తమ కంట్రీ స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉందని, USతో జూన్‌లో చేసుకున్న ఒప్పందం తమ ఓటమి కాదని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ ఎకానమీని ఐసొలేట్ చేయాలన్న US ప్లాన్‌ను చైనా తీవ్రంగా ఖండించింది. సాంక్షన్లతో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవని కామెంట్స్ చేసింది. సెప్టెంబర్ 24న జరిగే వైట్ హౌస్ విజిట్‌లో షీ జిన్‌పింగ్ ఈ ఇష్యూపై మాట్లాడే ఛాన్స్ ఉంది.

మొక్కజొన్నకి ఫుల్ డిమాండ్..
Current Affairs· 23 Aug 2026

మొక్కజొన్నకి ఫుల్ డిమాండ్..

ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ పెంచడంతో మొక్కజొన్నకి డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో ఎక్స్‌పోర్ట్ చేసిన ఇండియా, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్‌గా క్రూడ్ ప్రైస్ తగ్గినా E20 ఫ్యూయెల్ కాస్ట్ మాత్రం తగ్గడం లేదు. లో ప్రొడక్షన్, షుగర్ బ్యాలెన్సింగ్ అండ్ ప్రాసెసింగ్ లిమిటేషన్స్ దీనికి మెయిన్ రీజన్స్. ప్రస్తుతం పెట్రోల్ బ్లెండింగ్ ఇథనాల్‌లో దాదాపు సగం వరకు మొక్కజొన్న నుంచే నుంచే వస్తోంది.

ఈరోజు గోల్డ్ రేట్ ఎంతంటే!
Current Affairs· 23 Aug 2026

ఈరోజు గోల్డ్ రేట్ ఎంతంటే!

లేటెస్ట్ మార్కెట్ అప్‌డేట్ ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ సిటీస్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ ₹1,63,090గా ఉంది. ఇక ఆర్నమెంటల్ గోల్డ్ ఐన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,49,500 వద్ద ఉంది. మరోవైపు సిల్వర్ ప్రైస్ కూడా భారీగానే పెరిగింది. AP,TG రెండు నగరాల్లో కిలో వెండి ధర ₹2,70,000గా రికార్డయ్యింది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి, కాబట్టి బయ్ చేసేముందు లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెటర్.

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. NEHS సేవలు కొనసాగింపు
TG· 23 Aug 2026

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. NEHS సేవలు కొనసాగింపు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు వైద్య ఖర్చులు తగ్గించే విషయం. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) కింద నగదు రహిత వైద్య సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇందుకు ఒప్పుకున్నాయి. ప్రభుత్వం హాస్పిటల్స్ కు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో ఆపేసిన వైద్య సేవలు తిరిగి మొదలౌతాయి. అర్హులైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు తక్షణమే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఒక్క నిర్ణయం.. మీ జీవితాన్నే మార్చగలదా? 👀
Motivational· 22 Aug 2026

ఒక్క నిర్ణయం.. మీ జీవితాన్నే మార్చగలదా? 👀

జీవితంలో కొన్ని నిర్ణయాలు చిన్నవిగానే అనిపిస్తాయి.. కానీ అవే మన Futureను ఊహించని విధంగా మార్చొచ్చు. ఏ Career ఎంచుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో కలిసి ముందుకు వెళ్లాలి, ఒక అవకాశాన్ని తీసుకోవాలా వద్దా వంటి నిర్ణయాలు తర్వాతి ఎన్నో సంవత్సరాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మనం తీసుకోకుండా వదిలేసిన అవకాశాలు కూడా మన జీవిత దిశను మార్చగలవు. అందుకే ప్రతి నిర్ణయానికి వెంటనే సరైన సమాధానం ఉండకపోయినా.. సమాచారం తెలుసుకుని, ఫలితాలను ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుపై మన నియంత్రణను పెంచుతాయి.

కలలో కనిపించే ముఖాలు ఎక్కడి నుంచి వస్తాయి?
Education· 22 Aug 2026

కలలో కనిపించే ముఖాలు ఎక్కడి నుంచి వస్తాయి?

మనం రోజంతా చూసే ప్రతి ముఖం మనకు గుర్తుండకపోయినా.. మెదడు వాటిని మాత్రం స్టోర్ చేసుకుంటుంది. అందుకే కలలో కనిపించే వ్యక్తులు మనకు పూర్తిగా కొత్తవాళ్లలా అనిపించొచ్చు. సినిమా, టీవీ, సోషల్ మీడియా, బయట కనిపించినవాళ్ల ముఖాలు కూడా కలల్లోకి రావచ్చు. అయితే ప్రతి కలలో కనిపించే ముఖం నిజ జీవితంలో మనం చూసిన వ్యక్తిదే అని చెప్పలేం. 🧠ఆసక్తికరంగా.. మెదడు పాత జ్ఞాపకాలను కలిపి కొత్త కథలా చూపిస్తుంది. అందుకే కొన్ని కలలు లేచిన తర్వాత కూడా చాలా నిజంగా జరిగినట్టే అనిపిస్తాయి.

వికారాబాద్ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల తిప్పలు
Local· 22 Aug 2026

వికారాబాద్ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల తిప్పలు

వికారాబాద్ ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో విద్యుత్ కోతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనరేటర్ ఉన్నా మెయింటెనెన్స్ లేక బ్యాటరీలు నిలిచిపోవడంతో అత్యవసర పరికరాలు పనిచేయడం లేదు. గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన వార్మర్లు, వెంటిలేటర్లు పని చేయడం లేదు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై రోగుల బంధువులు, స్థానికులు మండిపడుతున్నారు. చీకటిలో రోగులు, బంధువులు మొబైల్ టార్చ్ల ఆధారంగా కష్టాలుపడుతూ, వైద్యం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది .

శంకవరం ఎస్సీ హాస్టల్ వెంటనే తెరవాలి... లేదంటే...
Local· 22 Aug 2026

శంకవరం ఎస్సీ హాస్టల్ వెంటనే తెరవాలి... లేదంటే...

కాకినాడ జిల్లా శంకవరం ఎస్సీ హాస్టల్ మూసివేతపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్నవరంలో జరిగిన దళిత ఐక్య రౌండ్ టేబుల్ సమావేశంలో హాస్టల్‌ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే సోమవారం కాకినాడ కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. హాస్టల్ మూసివేతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యా హక్కుతో ముడిపడిన అంశాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని నాయకులు మండిపడ్డారు. సోమవారం దళిత, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని తంతటి కిరణ్, మధుబాబు ప్రకటించారు.

భద్రాద్రి రామయ్య భక్తుల కష్టాలకు తెర.. రూ.185 కోట్లు
Local· 22 Aug 2026

భద్రాద్రి రామయ్య భక్తుల కష్టాలకు తెర.. రూ.185 కోట్లు

భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణ కష్టాలకు త్వరలో తెరపడనుంది. దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న బూర్గంపాడు ప్రాంత రహదారుల కోసం ప్రభుత్వం రూ.185.57 కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, బూర్గంపాడు–పాల్వంచ లింక్ రోడ్డు కోసం రూ.17.56 కోట్లు కేటాయించారు. ఈ మార్గం అభివృద్ధి చెందితే భద్రాచలం వెళ్లే భక్తుల ప్రయాణం సులభతరం కానుంది. రోడ్డు నిర్మాణం వల్ల కాలయాపన పోయి నిత్యం రాకపోకలు సాగించే స్థానికులు, వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.

పిచ్చుకలపాలెం మాదిగల స్మశానవాటికకు ఆక్రమణల నుంచి విముక్తి
Local· 22 Aug 2026

పిచ్చుకలపాలెం మాదిగల స్మశానవాటికకు ఆక్రమణల నుంచి విముక్తి

శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెంలోని మాదిగల స్మశానవాటికపై ఆక్రమణలు తొలగించడంతో దళితులు ఊరట చెందారు. సర్వే నెంబర్ 280-2 (LP నెం.1643)లో 299 సెంట్ల స్మశానవాటికను కొందరు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్న విషయాన్ని స్థానిక దళితులు, ప్రజా సంఘాలు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు స్మశానవాటిక చుట్టూ బౌండరీ ఏర్పాటు చేశారు. ఆక్రమణలకు తావు లేదని హెచ్చరిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యతో స్మశానవాటిక ఆక్రమణల నుంచి విముక్తి పొందింది.