చైనాకు ఇండియా హెల్ప్ చేస్తోందా?

అమెరికా తమపై విధించిన టారిఫ్స్ నుండి తప్పించుకోవడానికి చైనాకు భారత్ సహా 40 దేశాలు హెల్ప్ చేస్తున్నాయని వైట్ హౌస్ సీరియస్ ఆరోపణలు చేసింది. 'ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్' పేరుతో రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో, చైనీస్ ప్రొడక్ట్స్‌ను ఇండియా లాంటి థర్డ్ కంట్రీస్‌కి పంపి, అక్కడ రీప్యాకింగ్ చేసి యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఇండియా తోసిపుచ్చింది. దేశంలో జెన్యూన్ మాన్యుఫ్యాక్చరింగే జరుగుతోందని క్లారిటీ ఇచ్చింది.



