Latest

మొక్కజొన్నకి ఫుల్ డిమాండ్..
Current Affairs· 23 Aug 2026

మొక్కజొన్నకి ఫుల్ డిమాండ్..

ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ పెంచడంతో మొక్కజొన్నకి డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో ఎక్స్‌పోర్ట్ చేసిన ఇండియా, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్‌గా క్రూడ్ ప్రైస్ తగ్గినా E20 ఫ్యూయెల్ కాస్ట్ మాత్రం తగ్గడం లేదు. లో ప్రొడక్షన్, షుగర్ బ్యాలెన్సింగ్ అండ్ ప్రాసెసింగ్ లిమిటేషన్స్ దీనికి మెయిన్ రీజన్స్. ప్రస్తుతం పెట్రోల్ బ్లెండింగ్ ఇథనాల్‌లో దాదాపు సగం వరకు మొక్కజొన్న నుంచే నుంచే వస్తోంది.

ఈరోజు గోల్డ్ రేట్ ఎంతంటే!
Current Affairs· 23 Aug 2026

ఈరోజు గోల్డ్ రేట్ ఎంతంటే!

లేటెస్ట్ మార్కెట్ అప్‌డేట్ ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ సిటీస్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ ₹1,63,090గా ఉంది. ఇక ఆర్నమెంటల్ గోల్డ్ ఐన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,49,500 వద్ద ఉంది. మరోవైపు సిల్వర్ ప్రైస్ కూడా భారీగానే పెరిగింది. AP,TG రెండు నగరాల్లో కిలో వెండి ధర ₹2,70,000గా రికార్డయ్యింది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి, కాబట్టి బయ్ చేసేముందు లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెటర్.

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. NEHS సేవలు కొనసాగింపు
TG· 23 Aug 2026

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. NEHS సేవలు కొనసాగింపు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు వైద్య ఖర్చులు తగ్గించే విషయం. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) కింద నగదు రహిత వైద్య సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇందుకు ఒప్పుకున్నాయి. ప్రభుత్వం హాస్పిటల్స్ కు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో ఆపేసిన వైద్య సేవలు తిరిగి మొదలౌతాయి. అర్హులైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు తక్షణమే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఒక్క నిర్ణయం.. మీ జీవితాన్నే మార్చగలదా? 👀
Motivational· 22 Aug 2026

ఒక్క నిర్ణయం.. మీ జీవితాన్నే మార్చగలదా? 👀

జీవితంలో కొన్ని నిర్ణయాలు చిన్నవిగానే అనిపిస్తాయి.. కానీ అవే మన Futureను ఊహించని విధంగా మార్చొచ్చు. ఏ Career ఎంచుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో కలిసి ముందుకు వెళ్లాలి, ఒక అవకాశాన్ని తీసుకోవాలా వద్దా వంటి నిర్ణయాలు తర్వాతి ఎన్నో సంవత్సరాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మనం తీసుకోకుండా వదిలేసిన అవకాశాలు కూడా మన జీవిత దిశను మార్చగలవు. అందుకే ప్రతి నిర్ణయానికి వెంటనే సరైన సమాధానం ఉండకపోయినా.. సమాచారం తెలుసుకుని, ఫలితాలను ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుపై మన నియంత్రణను పెంచుతాయి.

కలలో కనిపించే ముఖాలు ఎక్కడి నుంచి వస్తాయి?
Education· 22 Aug 2026

కలలో కనిపించే ముఖాలు ఎక్కడి నుంచి వస్తాయి?

మనం రోజంతా చూసే ప్రతి ముఖం మనకు గుర్తుండకపోయినా.. మెదడు వాటిని మాత్రం స్టోర్ చేసుకుంటుంది. అందుకే కలలో కనిపించే వ్యక్తులు మనకు పూర్తిగా కొత్తవాళ్లలా అనిపించొచ్చు. సినిమా, టీవీ, సోషల్ మీడియా, బయట కనిపించినవాళ్ల ముఖాలు కూడా కలల్లోకి రావచ్చు. అయితే ప్రతి కలలో కనిపించే ముఖం నిజ జీవితంలో మనం చూసిన వ్యక్తిదే అని చెప్పలేం. 🧠ఆసక్తికరంగా.. మెదడు పాత జ్ఞాపకాలను కలిపి కొత్త కథలా చూపిస్తుంది. అందుకే కొన్ని కలలు లేచిన తర్వాత కూడా చాలా నిజంగా జరిగినట్టే అనిపిస్తాయి.

వికారాబాద్ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల తిప్పలు
Local· 22 Aug 2026

వికారాబాద్ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల తిప్పలు

వికారాబాద్ ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో విద్యుత్ కోతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనరేటర్ ఉన్నా మెయింటెనెన్స్ లేక బ్యాటరీలు నిలిచిపోవడంతో అత్యవసర పరికరాలు పనిచేయడం లేదు. గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన వార్మర్లు, వెంటిలేటర్లు పని చేయడం లేదు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై రోగుల బంధువులు, స్థానికులు మండిపడుతున్నారు. చీకటిలో రోగులు, బంధువులు మొబైల్ టార్చ్ల ఆధారంగా కష్టాలుపడుతూ, వైద్యం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది .

శంకవరం ఎస్సీ హాస్టల్ వెంటనే తెరవాలి... లేదంటే...
Local· 22 Aug 2026

శంకవరం ఎస్సీ హాస్టల్ వెంటనే తెరవాలి... లేదంటే...

కాకినాడ జిల్లా శంకవరం ఎస్సీ హాస్టల్ మూసివేతపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్నవరంలో జరిగిన దళిత ఐక్య రౌండ్ టేబుల్ సమావేశంలో హాస్టల్‌ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే సోమవారం కాకినాడ కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. హాస్టల్ మూసివేతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యా హక్కుతో ముడిపడిన అంశాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని నాయకులు మండిపడ్డారు. సోమవారం దళిత, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని తంతటి కిరణ్, మధుబాబు ప్రకటించారు.

భద్రాద్రి రామయ్య భక్తుల కష్టాలకు తెర.. రూ.185 కోట్లు
Local· 22 Aug 2026

భద్రాద్రి రామయ్య భక్తుల కష్టాలకు తెర.. రూ.185 కోట్లు

భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణ కష్టాలకు త్వరలో తెరపడనుంది. దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న బూర్గంపాడు ప్రాంత రహదారుల కోసం ప్రభుత్వం రూ.185.57 కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, బూర్గంపాడు–పాల్వంచ లింక్ రోడ్డు కోసం రూ.17.56 కోట్లు కేటాయించారు. ఈ మార్గం అభివృద్ధి చెందితే భద్రాచలం వెళ్లే భక్తుల ప్రయాణం సులభతరం కానుంది. రోడ్డు నిర్మాణం వల్ల కాలయాపన పోయి నిత్యం రాకపోకలు సాగించే స్థానికులు, వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.

పిచ్చుకలపాలెం మాదిగల స్మశానవాటికకు ఆక్రమణల నుంచి విముక్తి
Local· 22 Aug 2026

పిచ్చుకలపాలెం మాదిగల స్మశానవాటికకు ఆక్రమణల నుంచి విముక్తి

శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెంలోని మాదిగల స్మశానవాటికపై ఆక్రమణలు తొలగించడంతో దళితులు ఊరట చెందారు. సర్వే నెంబర్ 280-2 (LP నెం.1643)లో 299 సెంట్ల స్మశానవాటికను కొందరు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్న విషయాన్ని స్థానిక దళితులు, ప్రజా సంఘాలు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు స్మశానవాటిక చుట్టూ బౌండరీ ఏర్పాటు చేశారు. ఆక్రమణలకు తావు లేదని హెచ్చరిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యతో స్మశానవాటిక ఆక్రమణల నుంచి విముక్తి పొందింది.

22 మంది Indians ఉన్న రెండు నౌకలు హైజాక్
International· 22 Aug 2026

22 మంది Indians ఉన్న రెండు నౌకలు హైజాక్

సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు నౌకలు హైజాక్ కావడంతో 22 మంది భారతీయ నావికుల భద్రతపై ఆందోళన మొదలైంది. యెమెన్, సోమాలియా తీరాల దగ్గర జరిగిన వేర్వేరు ఘటనల్లో MT Sibuలో 16 మంది, MV Lutufలో 6 మంది భారతీయులు ఉన్నారు. ఆయుధాలతో వచ్చిన సముద్ర దొంగలు నౌకలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం మొత్తం 22 మంది భారతీయ నావికులు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. భారత్ సోమాలియా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేత
Local· 22 Aug 2026

హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేత

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హాడ్గావ్‌లో పరిశుభ్రతపై అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా, గ్రామ సమీపంలోని కుంటలో పారబోస్తున్నారు. ఇది పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. చెత్త కుంటలో పడటంతో దుర్వాసన, పరిశుభ్రత సమస్యలు తీవ్రమయ్యాయి. స్థానిక సమస్యలను ఎంపీఓ పర్యవేక్షించకపోవడం, రికార్డులను తనిఖీ చేయకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యతారహితంగా ఉన్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైతులు లేని టైంలో స్టే భూముల్లో రీ-సర్వే
Local· 22 Aug 2026

రైతులు లేని టైంలో స్టే భూముల్లో రీ-సర్వే

ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 10.14 ఎకరాల అసైన్డ్ భూమిలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులకు 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూమికి పట్టాలు ఇవ్వగా, ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ స్టే ఉన్న భూమిలోకి ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే శాపంగా మారింది. ఎలాంటి నోటీసులు లేకుండా, రైతులు లేని సమయంలో అధికారులు సర్వేకు రావడంతో రైతులు నిలదీశారు. అయితే, తమ పనికి అడ్డుపడితే కేసులు పెడతామంటూ అధికారులు భయపెట్టారు.

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: డీసీసీ
Local· 22 Aug 2026

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: డీసీసీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు కిషన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.<br>సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కమిటీ ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, పార్టీ నిబంధనలకు లోబడి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులను ఆదేశించారు.

చౌదరిగూడలో ఎస్‌ఐ విజయ్‌కుమార్కు ఘన వీడ్కోలు
Local· 22 Aug 2026

చౌదరిగూడలో ఎస్‌ఐ విజయ్‌కుమార్కు ఘన వీడ్కోలు

జిల్లేడు మండలం చౌదరిగూడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్కు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు నిర్వహించారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన చేసిన సేవలను నాయకులు, కార్యకర్తలు కొనియాడారు. ఆయన విధులు నిర్వహించిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి ఆరోగ్యంతో విజయాలు సాధించాలంటూ ఆత్మీయ వీడ్కోలు పలికారు.

సీహెచ్‌సీలో నిరుపయోగ జనరేటర్.. రోగుల ఇబ్బంది
Local· 22 Aug 2026

సీహెచ్‌సీలో నిరుపయోగ జనరేటర్.. రోగుల ఇబ్బంది

మందసలోని హరిపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ నిరుపయోగంగా మూలుగుతోంది. పవర్ కట్ సమయాల్లో జనరేటర్ సౌకర్యం ఉన్నా సద్వినియోగం చేసుకోకపోవడంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. డీజిల్ లేదనే సాకు లేదా సిబ్బంది నిర్లక్ష్యంతో జనరేటర్ ఆన్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ డా. స్వరాజ్యలక్ష్మి వివరణ ఇస్తూ జనరేటర్ పనిచేయడం లేదని, ఇన్వర్టర్లను వాడుతున్నామని చెప్పారు.

Droneలతో Armyకి కొత్త బలం.. ఎందుకో తెలుసా?
National· 22 Aug 2026

Droneలతో Armyకి కొత్త బలం.. ఎందుకో తెలుసా?

డ్రోన్లు ఇప్పుడు సైన్యానికి కేవలం నిఘా సాధనాలు కాదు.. యుద్ధంలో వేగంగా నిర్ణయం తీసుకునే ‘కళ్లూ, చెవులూ’గా మారుతున్నాయి. అందుకే భారత సైన్యం పంజాబ్‌లో తొలి ప్రత్యేక ‘బాజ్’ డ్రోన్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసింది. జలంధర్‌లోని 11 కార్ప్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ యూనిట్‌ డ్రోన్లతో సరిహద్దు నిఘా, సమాచార సేకరణ, అవసరమైనప్పుడు దాడి సామర్థ్యాలను పెంచనుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత సైన్యం టెక్నాలజీ ఆధారితంగా మారుతున్న నేపథ్యంలో ఇది కీలక అడుగుగా కనిపిస్తోంది. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లదే కీలక పాత్ర.

పాఠశాలకు ప్రింటర్.. పూర్వ విద్యార్థుల విరాళం
Local· 22 Aug 2026

పాఠశాలకు ప్రింటర్.. పూర్వ విద్యార్థుల విరాళం

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం యాదిరెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థులు ప్రింటర్ విరాళంగా అందించారు. పాఠశాలకు ప్రింటర్ అవసరమని హెడ్‌మాస్టర్ తెలపడంతో అక్కడే చదువుకున్న నస్రీన్ (ఎస్ఐ), ఎండి సయ్యద్ పాషా (పిసి), ఎండి ఖాజా (ఎస్జీటీ) స్పందించారు. శనివారం ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ సమక్షంలో ప్రింటర్ అందజేశారు. పాఠశాల తరఫున వారికి సన్మానం చేశారు. గ్రామ పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారిని గ్రామస్తులు అభినందించారు.

అనాథ శవాలకు అంత్యక్రియలు.. ఎండిఆర్ మానవత్వం
Local· 22 Aug 2026

అనాథ శవాలకు అంత్యక్రియలు.. ఎండిఆర్ మానవత్వం

మరోసారి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. పటాన్చెరు పట్టణంలో మహంకాళి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడి ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తి బస్టాండ్ ముందు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని చికిత్సలో మృతి చెందాడు. వీరిద్దరి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఎండిఆర్ ఫౌండేషన్‌కు సమాచారం ఇవ్వగా వారు అంత్యక్రియలు నిర్వహించారు.

మైనర్ డ్రైవింగ్‌పై విద్యార్థులకు న్యాయ అవగాహన
Local· 22 Aug 2026

మైనర్ డ్రైవింగ్‌పై విద్యార్థులకు న్యాయ అవగాహన

మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కాకతీయ విద్యాలయంలో న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. జడ్జిలు దుర్గా ప్రసాద్, ఉషా కిరణ్ పాల్గొన్నారు. న్యాయవాది మచ్చర్ల విజయ్ సామ్రాట్ మైనర్ డ్రైవింగ్, జువినైల్ జస్టిస్ యాక్ట్, రహదారి భద్రత, బాలల హక్కులపై వివరించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు గురించి చెప్పి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

నూకపల్లి కాలనీకి 30కోట్లు.. ధర్నా ఫలితం
Local· 22 Aug 2026

నూకపల్లి కాలనీకి 30కోట్లు.. ధర్నా ఫలితం

జగిత్యాల జిల్లాలోని నూకపల్లి అర్బన్ డబుల్ బెడ్రూం కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న 15 ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించనందున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా. విశారదన్ మహరాజ్ స్థానికులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. కాలనీ మౌలిక సదుపాయాల కోసం సుమారు 30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఇది జేఏసీ పోరాట ఫలితమేనని సంఘం నాయకులు తెలిపారు.

మజీద్‌కు పొజిషన్ సర్టిఫికెట్.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు
Local· 22 Aug 2026

మజీద్‌కు పొజిషన్ సర్టిఫికెట్.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు

పలమనేర్ లోని గంగవరం మండల మైనారిటీ సోదరులు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. డ్రైవర్స్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న మహమ్మదీయ మజీద్‌కు పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించినందుకు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాజాపీర్, ముతవల్లి జమాల్ బాషా, పటేల్ ఎండి.మొహమ్మద్, సర్కార్ భాషా, అమర్, చాంద్ భాషా సిరాజ్, గుడుసాబ్ తదితరులు పాల్గొన్నారు.