Latest

జావెలిన్‌లో నీరజ్‌కు సిల్వర్, యశ్వీర్‌కు బ్రోన్జ్
2026 కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ వచ్చింది. తను 85.83 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆటగాడు రమేశ్ పతిరగె 89.75 మీటర్లు విసిరి గోల్డ్ గెలిచాడు. ఇదే ఆటలో యువ ఆటగాడు యశ్వీర్ సింగ్ తన చివరి ప్రయత్నంలో 85.41 మీటర్లు విసిరి బ్రోన్జ్ సాధించాడు. దీంతో భారత్ కు ఒకేసారి రెండు పతకాలు వచ్చాయి. ఇంకో భారత ఆటగాడు రోహిత్ యాదవ్ 81.56 మీటర్లు విసిరి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

కనుల వేడుకగా రావిశాస్త్రి కథా పురస్కారాల కార్యక్రమం
TG: హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రావిశాస్త్రి కథా పురస్కారాల కార్యక్రమంగా కనుల వేడుకగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు అధ్యక్షత వహించారు. పురస్కార గ్రహీతలు స్వర్ణకిలారి, నరేష్కుమార్ సూఫీ, చరణ్ పరిమి, మహమ్మద్ గౌస్‌లకు నిర్వాహకులు కుమార్ కూనపరాజు, అతిథులు కలిసి పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం కుప్పిలి పద్మ, తాడి ప్రకాశ్, అరుణాంక్ లత, వేంపల్లె షరీఫ్ వారి పుస్తకాల గురించి మాట్లాడారు.

ప్రధానిపై కామెంట్స్.. బాలిక క్షమాపణలు
జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడాకు చెందిన రుచికా సింగ్ క్షమాపణలు కోరారు. 'తనకు 15 ఏళ్లు మాత్రమేనని, తోటి నిరసనకారుల ప్రభావంతోనే అలా మాట్లాడానని' వీడియోలో తెలిపారు. 'తాను చేసిన వ్యాఖ్యలు క్షమించరాని తప్పని అంగీకరిస్తూ, దేశ ప్రజలను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని' ఆమె అన్నారు. ఈ ఘటనపై నమోదైన 'ZERO FIR'ను దిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు.

పెరిగిన వరద ఉద్ధృతి.. భద్రాచలంలో హైఅలర్ట్
TG: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నీటిమట్టం 55.1 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుమ్ముగూడెం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల స్నానఘట్టాలు, సీతవాగు వద్ద పలు ప్రాంతాలు నీటమునిగాయి. చర్ల మండలంలోని ఇసుక క్వారీలో చిక్కుకున్న 44 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యల సమయంలో సీఐ, ఎస్సై వరద నీటిలో పడినా క్షేమంగా బయటపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

GCDO అరుంధతిపై చర్యలు తీసుకోవాలి: AISF
TG: నల్గొండ KGBV జిల్లా సమన్వయ అధికారిణి (GCDO), MEOగా బాధ్యతలు నిర్వహిస్తున్న అరుంధతిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని AISF నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ.. KGBV పాఠశాలలను సక్రమంగా పర్యవేక్షించకపోవడం వల్ల విద్యాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. దీంతో విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అపార్ట్‌మెంట్ నుంచి దూకిన టెక్కీ
TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వాసవి JP ట్రెండ్స్ అపార్ట్‌మెంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సుజీత్ కుమార్ పండిట్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 17వ అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు మానసిక ఒత్తిడా, వ్యక్తిగత సమస్యలా లేదా మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

పెట్టుబడిదారులకు CM కీలక హామీ
తెలంగాణ పెట్టుబడులకు అత్యంత సురక్షిత గమ్యస్థానమని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం కొనసాగుతోందన్నారు. మంచి పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చే సంస్థలకు పూర్తి ప్రోత్సాహం, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీలను తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

యూనివర్సిటీల్లో భారీ మార్పులు
AP: రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నామినేట్ చేసిన సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్లాజ్-2 కింద నియమితులైన సభ్యులకే ఈ నిర్ణయం వర్తిస్తుందని, క్లాజ్-1 కింద ఉన్న ఎక్స్ ఆఫిషియో సభ్యులు యథావిధిగా కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాల పాలనలో పారదర్శకత, సమర్థత పెంచే దిశగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది.

ఆయిల్‌పామ్ కంపెనీలకు తుమ్మల స్ట్రాంగ్ వార్నింగ్
TG: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధి లక్ష్యాలను చేరుకోని కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంపెనీల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 85వేల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు కేవలం 17,090 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని వెల్లడించారు. పలుమార్లు సమావేశాలు, నోటీసులు ఇచ్చినా పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు. ఇకపై లక్ష్యాలు సాధించని కంపెనీల నుంచి జిల్లాలను వెనక్కి తీసుకుని ఇతర సంస్థలకు అప్పగిస్తామని హెచ్చరించారు.
కష్టపడి మెడిసన్ చదవకండి.. వేస్ట్- ఎలన్ మస్క్
మెడికల్ కాలేజీలలో చేరి ఎంబీబీఎస్ చదవడం శుద్ధ వేస్ట్ అంటున్నారు ఎలన్ మస్క్. మరో మూడేళ్లలో ఆప్టిమస్ రోబోలు ఈ భూమిపై ఉన్న ఏ బెస్ట్ డాక్టర్ల కన్నా మెరుగైన సర్జరీలు చేయగలవని, అదికూడా భారీ స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆయనంటున్నారు. మెడికల్ టెక్నాలజీ అంతలా అభివృద్ధి చెందుతుందని మస్క్ అంచనా

ఆర్థ రైటిస్ వెంటాడినా ఓ రెజ్లర్ మదర్ సంచలనం !
మాతృత్వం తర్వాత తీవ్రమైన ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) బారిన పడినా, భారత రెజ్లర్ సీమా కాలిరామ్నా అసాధారణ పట్టుదలతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో బ్రాంజ్ మెడల్ సాధించింది. డెలివరీ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ పెయిన్ ఉన్నప్పటికీ తీవ్రంగా శ్రమించి మ్యాట్ పైకి రీ-ఎంట్రీ ఇచ్చింది. విపరీతమైన ఫిజికల్ ఛాలెంజెస్ , డిప్రెసింగ్ సిట్యుయేషన్స్‌ను దాటుకుని మెడల్ గెలవడం ఆమె డెడికేషన్ అండ్ విల్ పవర్‌కు నిదర్శనంగా నిలిచింది.

మెకానిక్ కుమార్తెకు జుడోలో గోల్డ్ మెడల్ !
కామన్వెల్త్ గేమ్స్ జూడో 48 కేజీల కేటగిరీలో అస్మితా డే గోల్డ్ మెడల్ సాధించి ఇండియాకు సరికొత్త రికార్డును అందించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఒక సాధారణ సైకిల్ మెకానిక్ కూతురైన అస్మిత, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ క్రైసిస్‌ను ఎదుర్కొని ఈ గ్లోబల్ స్టేజ్‌పై ఇండియన్ ఫ్లాగ్‌ను ఎగురవేసింది. ఆమె డెడికేషన్ అండ్ హార్డ్‌వర్క్‌పై స్పోర్ట్స్ వరల్డ్ ప్రశంసలు కురిపిస్తోంది.

కశ్మీర్లో ఉగ్రదాడి- బీహారీ కార్మికుని మృతి !
జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బీహార్‌కు చెందిన ఒక వలస కార్మికుడు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏరియాలో లోకల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ వర్గాలు వెంటనే అలర్ట్ అయి, దాడి జరిగిన ప్రాంతాన్ని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) తో స్వాధీనం చేసుకున్నాయి. గత కొంతకాలంగా నాన్-లోకల్స్ టార్గెటెడ్ కిల్లింగ్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

స్టూడెంట్స్ కోపం న్యాయమైనదే-రాఘవ్ చద్దా !
NEET పేపర్ లీక్ వివాదంపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన మౌనాన్ని వీడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు చర్చలో మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం తన విధి అని, ఇప్పుడు ట్రెజరీ బెంచ్‌లో ఉన్నందున సమస్యకు పరిష్కారం చూపడమే తన బాధ్యతని పేర్కొన్నారు. కేవలం మీడియా సౌండ్‌బైట్స్ లేదా హెడ్‌లైన్స్ కోసం కాకుండా, పేపర్ లీక్స్‌ని నిరోధించే పక్కా చట్టం మరియు ఇన్సిటిట్యూషనల్ సొల్యూషన్ వచ్చే వరకు వేచి చూశానని, విద్యార్థుల కోపం పూర్తిగా సరైనదేనని ఆయన స్పష్టం చేశారు.

భోగాపురం రైతులకు కోర్టు ద్వారా సెటిల్మెంట్- మంత్రి
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ అక్విజిషన్‌లో భూములిచ్చిన రైతులకు కాంపెన్సేషన్ ఇష్యూను కోర్టు ద్వారా సాల్వ్ చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్రోచ్ రోడ్డు కోసం ఎకరాకు ₹1 కోటి డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం ₹48 లక్షలు ఆఫర్ చేసింది. ఈ అమౌంట్‌ను విశాఖపట్నం ట్రిబ్యునల్‌లో డిపాజిట్ చేశామని, కొద్ది నెలల్లోనే లీగల్ ప్రోసెస్ ద్వారా రైతులకు డబ్బులు అందేలా చూస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రామిస్ చేశారు.

భోగాపురం డేటా సెంటర్ పై మళ్లీ రివ్యూ చేయాలి- శర్మ
దేశంలో ఏర్పాటవుతున్న ప్రతీ AI, డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను సమగ్రంగా పరిశీలించి, పర్యావరణ చట్టాలకు లోబడి ఉన్నాయో లేదో నిర్ధారించుకున్నాకే ముందడుగు వేయాలని కేంద్ర పర్యావరణ శాఖను మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ E.A.S. శర్మ కోరారు. ఇవి భారీగా విద్యుత్, నీటిని వినియోగిస్తూ స్థానిక పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భోగాపురం పరిసరాల్లో రిలయెన్స్ డేటా సెంటర్ కు కేటాయించిన స్థలాలు తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలని, సరైన పర్యావరణ సమీక్ష లేకుండా అనుమతులివ్వడం సరికాదని హెచ్చరించారు.

రైతులు, నిర్వాసితులకు న్యాయం చేయండి !- EASశర్మ
భోగాపురం ఎయిర్ పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు శాశ్వత జీవనోపాధి కల్పించాలని,పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్.శర్మ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎపి పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం - 2019 ప్రకారం 75 శాతం ఉద్యోగాలను లోకల్స్ కే ఇచ్చేలా జీఎంఆర్ సంస్థను ఆదేశించాలన్నారు. అటు విశాఖ ఎయిర్ పోర్టుపై ఆధారపడిన వారికి కూడా న్యాయం చేయాలన్నారు.సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పరిహారం, ఉపాధి భద్రత, స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

లోకల్స్ ని వదిలేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ?
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు పర్యావరణ క్లియరెన్స్ ఇచ్చే ప్రాసెస్ లో లోకల్స్ అభ్యంతరాలను పట్టించుకోలేదనే విమర్శలొస్తున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌లో లోపాలు ఉన్నాయని, పబ్లిక్ హియరింగ్‌లో రైతులు చెప్పిన జీవనోపాధి నష్టం, వాటర్ టేబుల్ పడిపోవడం వంటి టెక్నికల్ ఇష్యూస్‌ను క్లియరెన్స్ కమిటీ కన్సిడర్ చేయలేదన్నది ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ల ఆరోపణ. రీహ్యాబిలిటేషన్ ప్లాన్ లేకుండానే ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మండిపడుతున్నారు. రైతులకు ఉచిత ఫ్లైట్ జర్నీతో చేతులు దులిపేసుకుంటున్నారు.

భోగాపురంఎయిర్ పోర్టు నైట్ వ్యూ సింప్లీ సూపర్బ్ !
భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కోసం అర్ధరాత్రుళ్లు కూడా కార్మికులు తుది మెరుగులు దిద్దుతున్నారు. శనివారం నాటి సభకోసం విఐపీలు, వివిఐపీలు, ఎయిర్ పోర్టుకు ల్యాండ్ ఇచ్చిన రైతులు, నిర్మించిన సంస్థ జీఎంఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వేర్వేరు గ్యాలరీలు రెడీ చేశారు. స్పెషల్ లైటింగ్ ఏర్పాట్లతో చీకట్లోనూ లేజర్ షోను పోలిన కళను తీసుకొచ్చారు. ఎల్ ఈడీ లైట్లు, నియాన్ బల్బులు, విద్యుద్ధీపాలతో కలర్ పుల్ గా ఎయిర్ పోర్టు కనిపిస్తోంది.రన్ వే, టాక్సీ వే, ఎప్రాన్ ఇలా అన్ని మార్గాలూ లైట్ల వెలుగులో కళకళలాడుతున్నాయి.

విశాఖ ఎయిర్ పోర్టుకు ఇక శెలవు !
భోగాపురం కేంద్రంగా ఆగస్ట్ 17 అర్ధరాత్రి ఒంటిగంట నుంచి విమాన రాకపోకలు మొదలవుతాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను ఇక నిలిపేస్తు సివిల్ ఏవియేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 30 సంవత్సరాల పాటు విశాఖ ఎయిర్‌పోర్ట్ (ఐఎన్‌ఎస్ డేగ) సివిల్ ఎన్‌క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ అవసరాలకు మాత్రమే విశాఖ ఎయిర్‌పోర్ట్ ను వాడతారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు ఐఏటీఏ కోడ్ VTZను కొత్త ఎయిర్ పోర్టుకు బదిలీ చేస్తారు.

మోడ్రన్ టెక్నాలజీకి మారు పేరు ఈ ఎయిర్ పోర్ట్ !
భోగాపురం ఎయిర్ పోర్టు కంప్లీట్ గా డిజిటల్ టెక్నాలజీతో రూపొందింది. ప్రయాణికులకు ఫాస్ట్ అండ్ ఈజీ ట్రావెల్ కోసం మోడ్రన్ చెక్-ఇన్ కౌంటర్లు,సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ,ఆటో మేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ లను ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రయాణికులకే కాకుండా బిజినెస్ రంగాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉద్దేశించిన ఎయిర్ పోర్టు. ఏటా 20,000 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ కూడా చేసేలా రూపొందింది. దాదాపు వెయ్యి మందికి నేరుగా జాబ్స్ కల్పించనుంది. ఉత్తరాంధ్ర ఎకానమీకి ఇది బూస్టప్ ఇస్తుంది.