Latest

మోదీని మించిన నాయకుడు లేడు: పవన్ కల్యాణ్
AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అనంతరం నిర్వహించిన సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి కొందరు చెడ్డగా మాట్లాడటం తనకు బాధగా అనిపించిందన్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారన్నారు. ఆయన విదేశీ శత్రువులతోపాటు దేశంలో ఉండే శత్రువులతోనూ పోరాడాల్సి వస్తోందన్నారు. మోదీని మించిన నాయకుడు లేడు..రాబోడు అని పవన్ కల్యాణ్ పొగిడారు.

మ్యాన్‌హోల్ ఘటన.. ఇంకా దొరకని బాలయ్య
TG: హైదరాబాద్ హఫీజ్‌పేట్ వైశాలీనగర్ <a href="https://www.theclearcutnews.com/n/dEoT7aN">మ్యాన్‌హోల్‌లో</a> కొట్టుకుపోయిన బాలయ్య కోసం మూడో రోజూ గాలింపు కొనసాగుతోంది. GHMC, SDRF, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 450 మంది సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరు ముత్తంగి వరకు రోబోటిక్ టెక్నాలజీతో నాలాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు బాలయ్య నిజంగా నాలాలో పడిపోయాడా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాలింపు చర్యల సందర్భంగా ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ నాలాలను పూర్తిగా శుభ్రం చేస్తున్నారు.
శ్మశానానికి రైల్వే పట్టాలు అడ్డు.. గ్రామస్తులు ఆందోళన
AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో శ్మశానానికి వెళ్లే దారి లేక గ్రామ ప్రజలు రైల్వే పట్టాలు దాటి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిసారి ప్రాణాలను పణంగా పెట్టి రైల్వే లైన్ దాటాల్సివస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
‘ముఖ్యమంత్రి పవన్’..కేంద్రం మంత్రి టంగ్ స్లిప్
AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అనంతరం నిర్వహించిన సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభోపన్యాసం చేశారు. అయితే స్పీచ్ మధ్యలో ఆయన ‘ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..ఉప ముఖ్యమంత్రి నారా..’ అని అనడంతో కలకలం రేగింది. జనం నుంచి స్పందన రావడంతో వెంటనే సర్దుకొని ఆయన ‘ముఖ్యమంత్రి చంద్రబాబు..ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్’ అని సరిచేసుకొని తన ప్రసంగం కొనసాగించారు.

గోదావరి ఉగ్రరూపం.. గ్రామాలు జలదిగ్బంధం
TG: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.60 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి ప్రభావంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంతెనలు నీటమునగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

IBPSలో 11,403 ఉద్యోగాలు
IBPS 11,403 బ్యాంక్ క్లర్క్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్‌లో 186 వేకెన్సీలున్నాయి. ఈరోజు నుంచి <a href="https://ibpsreg.ibps.in/csaxvijul26/">అప్లికేషన్స్</a> ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్‌లో ప్రిలిమ్స్, డిసెంబర్‌లో మెయిన్స్ జరగనున్నాయి. నెలవారీ జీతం రూ.24 వేల నుంచి రూ.64 వేల వరకు ఉంటుంది. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. అప్లికేషన్ ఫీజు SC/STలకు రూ.175, ఇతరులకు రూ.850గా నిర్ణయించారు.

స్కెచ్ వేసి చివరికి బుక్కయ్యాడు
TG: కరీంనగర్‌లో భూవివాదంలో ప్రత్యర్థిని <a href="https://www.theclearcutnews.com/n/5YvSyTa">ఇరికించేందుకు</a> గంజాయి కేసు సృష్టించిన ఈగల్ టీమ్ కానిస్టేబుల్ నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భూతగాదాలో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేయించేందుకు వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి దుకాణంలో ఉంచినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు పెట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 370 గ్రాముల గంజాయిని దాచిపెట్టినట్లు విచారణలో తేలింది. గంజాయి, 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు ACP విజయ్‌కుమార్ తెలిపారు.

హాస్టల్‌లో విద్యార్థినుల గొంతు కోసే ప్రయత్నం
AP: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్‌లో నిద్రపోతున్న సుస్మిత, సోఫియా అనే ఇద్దరు విద్యార్థినుల గొంతును మరో అమ్మాయి బ్లేడుతో కోసే ప్రయత్నం చేయగా, వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనను దాచిపెట్టి, హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన వార్డెన్ నల్లమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోదీ
AP: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుని టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎంపీలు, ఇతర నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘రంగ్ దే బసంతి’కి 20 ఏళ్లు - విద్యార్థి పోరాటాలు!
ఇటీవల నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై GenZ విద్యార్థులు చేసిన పోరాటాలు చూస్తే, సరిగ్గా 20 ఏళ్ల ముందు వచ్చిన ‘రంగ్ దే బసంతి’(2006) సినిమానే కళ్లముందు కనిపించింది.ప్రజాస్వామ్యం, ప్రశ్నించే స్వేచ్ఛ ఊరికే రావు, అన్యాయం జరిగినప్పుడు నిలదీయడమే నిజమైన విప్లవం అని ఈ సినిమా తెలియజేస్తోంది. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఎలుగెత్తిన నినాదాలు, పాడిన 'ఖూన్ చలా' పాటలు, వ్యవస్థలోని అవినీతి, అధికారుల నిర్లక్ష్యంపై నేటి యువతలో ఎంత ఆక్రోశం ఉందో, నాటి భగత్ సింగ్, ఆజాద్ ల పోరాట స్ఫూర్తిని గుర్తుచేశాయి.

లహావుల్ లోయలో హైదరాబాద్ బైకర్ అదృశ్యం
హైదరాబాద్‌కు చెందిన అనిల్ మార్ల(42) లహావుల్ లోయలో బైక్‌పై వెళ్తూ కనిపించకుండా పోయాడు. జూలై 19 నుంచి అతడి ఆచూకీ లేదు. అనిల్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తు 'సుమ్దో మోడ్ 3' దగ్గర లోయలో పడింది. పోలీసులు, SDRF బృందాలు డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నారు. ఘటనా స్థలంలో బైక్ భాగాలు, హెల్మెట్, ఫోన్ దొరికాయి. నదీ ప్రవాహంలో అనిల్ కొట్టుకుపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త దొరికే వరకు గాలింపు చర్యలు ఆపవద్దని అనిల్ భార్య సుమిత కోరింది. ప్రస్తుతం వెతుకులాట కొనసాగుతోంది.

లోకల్, సర్పంచ్ ఎన్నికలపై EC క్లారిటీ
AP: ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ ఎలెక్షన్స్ ఏర్పాట్లుపై EC పనులను వేగవంతం చేసింది. ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో ఎలెక్షన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశమౌతున్నారు. ముందుగా ZPTC, MPTC ఎన్నికల తరువాత గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఎలెక్షన్స్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎలెక్షన్ ఆఫీసర్స్‌తో పాటు రాజకీయ పార్టీలు ఎన్నికల ఏర్పాట్లుకు సిద్ధమవుతున్నాయి.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
AP: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో విమానాశ్రయాన్న ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

భారత్‌లో హాలీవుడ్ చిత్రాల సునామీ!
ఇటీవల విడుదలైన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం మొదటి రోజే భారతదేశ బాక్సాఫీస్ వద్ద రూ.61 కోట్లు రాబట్టి ఆకట్టుకుంది. దీనికి ముందే క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన 'ది ఒడిస్సీ' విడుదలైన తొలి రోజే రూ.16.9 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.మన దేశంలో ప్రముఖ స్థానిక నటీనటుల సినిమాలకు లభించే స్థాయిలో హాలీవుడ్ సినిమాలు, దర్శకులకు క్రేజ్ పేరగడం విశేషం.

APలో పెరుగుతున్న కొత్త కరోనా కేసులు
AP: రాష్ట్రంలో కొత్తగా మరో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో 6 రాగా, అనకాపల్లి, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున రికార్డుఅయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 59కి చేరాయి. ఇప్పటివరకు 15 జిల్లాలకు ఈ వైరస్ పాకింది. మొత్తం 531 మందికి టెస్టులు చేశారు. అన్నిటికంటే ఎక్కువగా విశాఖ, రాజమండ్రిలో 11 కేసులు చొప్పున ఉన్నాయి.

'ఫౌజీ'లో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి!
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఫౌజీ'. ఇందులో సీనియర్ హీరోయిన్ 'జయప్రద' ప్రభాస్‌కు తల్లిగా పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయని సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మా గ్రామానికి వచ్చా.. పోరాటం మాత్రం ఆగదు: సోనం వాంగ్‌చుక్
దిల్లీలో జరిగిన నిరాహార దీక్ష ముగిసిన అనంతరం సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 'ఎక్స్'లో భావోద్వేగ పోస్ట్ చేశారు. 'తిరిగి నా గ్రామానికి వచ్చాను... కానీ నేను పోరాడిన అంశాలను మాత్రం మరచిపోలేదు. ప్రభుత్వం మిగిలిన హామీలను కూడా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు. 'ఈ పోస్టుకు ఎలాంటి కాపీరైట్స్ లేవు.. స్వేచ్ఛగా షేర్ చేసుకోవచ్చు' అని తన సందేశంలో తెలిపారు.

చివరి వీడ్కోలులోనూ గాయని కి దక్కని గౌరవం!
లెజెండరీ గాయని జమునా రాణి (88) అంత్యక్రియలు నిన్న బెంగళూరులో ముగిశాయి.జీవితాంతం బ్రహ్మచారిణిగా జీవించిన ఆమె చివరి వీడ్కోలు కార్యక్రమానికి కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.టాలీవుడ్ నుంచి ఒకరిద్దరు మినహా ప్రముఖులెవరూ సంతాపం తెలపకపోవడం బాధాకరం.వేలాది మధుర గీతాలను అందించిన ఆమెకు కనీస గౌరవం దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చివరగా 'మిథునం' చిత్రంలో పాట పాడారు.

జావెలిన్‌లో నీరజ్‌కు సిల్వర్, యశ్వీర్‌కు బ్రోన్జ్
2026 కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ వచ్చింది. తను 85.83 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆటగాడు రమేశ్ పతిరగె 89.75 మీటర్లు విసిరి గోల్డ్ గెలిచాడు. ఇదే ఆటలో యువ ఆటగాడు యశ్వీర్ సింగ్ తన చివరి ప్రయత్నంలో 85.41 మీటర్లు విసిరి బ్రోన్జ్ సాధించాడు. దీంతో భారత్ కు ఒకేసారి రెండు పతకాలు వచ్చాయి. ఇంకో భారత ఆటగాడు రోహిత్ యాదవ్ 81.56 మీటర్లు విసిరి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

కనుల వేడుకగా రావిశాస్త్రి కథా పురస్కారాల కార్యక్రమం
TG: హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రావిశాస్త్రి కథా పురస్కారాల కార్యక్రమంగా కనుల వేడుకగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు అధ్యక్షత వహించారు. పురస్కార గ్రహీతలు స్వర్ణకిలారి, నరేష్కుమార్ సూఫీ, చరణ్ పరిమి, మహమ్మద్ గౌస్‌లకు నిర్వాహకులు కుమార్ కూనపరాజు, అతిథులు కలిసి పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం కుప్పిలి పద్మ, తాడి ప్రకాశ్, అరుణాంక్ లత, వేంపల్లె షరీఫ్ వారి పుస్తకాల గురించి మాట్లాడారు.

ప్రధానిపై కామెంట్స్.. బాలిక క్షమాపణలు
జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడాకు చెందిన రుచికా సింగ్ క్షమాపణలు కోరారు. 'తనకు 15 ఏళ్లు మాత్రమేనని, తోటి నిరసనకారుల ప్రభావంతోనే అలా మాట్లాడానని' వీడియోలో తెలిపారు. 'తాను చేసిన వ్యాఖ్యలు క్షమించరాని తప్పని అంగీకరిస్తూ, దేశ ప్రజలను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని' ఆమె అన్నారు. ఈ ఘటనపై నమోదైన 'ZERO FIR'ను దిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు.