Latest

ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి స్కిల్ తప్పనిసరి
TG: రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులకు ప్రాథమిక ఉద్యోగ దరఖాస్తు కూడా రాయడం రాకపోవడం ఆందోళనకరమని CM రేవంత్ రెడ్డి అన్నారు. జర్మనీ, ఫిన్లాండ్‌లలో అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జర్మనీ, ఫిన్లాండ్ విద్యా విధానాలను అధ్యయనం చేసి విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు.

APలో 800 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ, సుజ్లాన్ సంస్థల ఆధ్వర్యంలో రూ.5,750 కోట్లతో 800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1200 మందికి ఉపాధి, భూములు ఇచ్చిన 1100 మంది రైతులకు 30 ఏళ్లపాటు లీజు ఆదాయం లభించనుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడమే ప్రధాన లక్ష్యమన్నారు.

మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA, సీనియర్ BRS నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల గుండెపోటుకు గురైన అనంతరం ఆయన ఆస్పత్రిలో చేరారు. 2019లో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. KCRకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు క్లియర్
TG: ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చింది. గత 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిల చెల్లింపులను పూర్తి చేసినట్లు ప్రకటించింది. గురువారం మరో రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. CM రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులు విడుదలయ్యాయి. మూడు విడతల్లో ఒక్కోసారి రూ.2,000 కోట్ల చొప్పున మొత్తం రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లించడంతో విశ్రాంత ఉద్యోగుల కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా క్లియర్ అయ్యాయి.

రాజస్థాన్ ఎడారుల్లో స్ట్రాబెర్రీ పంట !
సాధారణంగా చల్లని ప్రాంతాల్లో మాత్రమే పండే స్ట్రాబెర్రీ పంటను రాజస్థాన్‌లోని ఎడారి నేలల్లో పండించి కొందరు రైతులు విప్లవాత్మక మార్పు తెచ్చారు. డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్/మల్చింగ్ సాంకేతికత,వినూత్న వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి వారు ఈ అసాధ్యమైన పంటను సాధ్యం చేశారు. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడి సాధిస్తూ, స్థానిక రైతులు సంప్రదాయ పంటల కంటే కొన్ని రెట్లు ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. ఈ విజయం ఎడారి ప్రాంతాల్లో ఉద్యానవన రంగానికి (Horticulture) కొత్త ఊపిరి పోసింది.

మీ మెమరీకి మూలం మీరు తిసుకునే పుడ్డే !
మన మెమరీ పవర్ మనం తినే ఫుడ్ పై డిపెండ్అయి ఉంటుందని మీకు తెలుసా? మితిమీరి జంక్ ఫుడ్తినడం, పోషకాహార లోపం ఉంటే మెదడులోని హిప్పో క్యాంపస్ అంటే మెమరీ పవర్ కి కేంద్రం పనితీరును దెబ్బ తింటుందం టున్నారు సైంటిస్టులు. బాలెన్స్ డ్ పుడ్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుందని, అల్జీమర్స్ లాంటి సమస్యల ముప్పు తగ్గుతుందని సైంటిస్టులు అంటున్నారు.

‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ విడుదల: విశేషాలు ఇవే!
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రామాయణ: పార్ట్ 1' 4 నిమిషాల నిడివితో ఉన్న గ్రాండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యాష్ తమ నటనతో మెప్పించారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG నిర్మిస్తున్న ఈ దృశ్యకావ్యం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

నేరాలకు, బాధితులకందే సాయానికీ పొంతనే లేదు
దేశంలో మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి గంటకు సగటున 51 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదవుతున్నప్పటికీ, నష్టపరిహారం అందుతున్న బాధితుల సంఖ్య ఏడుగురిలో ఒకరి కంటే తక్కువగానే ఉందంటూ ఓ నివేదిక వెల్లడించింది. తీవ్రమైన లైంగిక దాడి కేసుల్లో కూడా అవగాహన లోపం, సంక్లిష్టమైన దరఖాస్తు ప్రక్రియ, ఫండ్స్ వినియోగంలో నిర్లక్ష్యం వల్ల మెజారిటీ బాధితులకు ప్రభుత్వ సాయం అందడం లేదు. న్యాయ ప్రక్రియలో ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

విద్యావ్యవస్థపై హరగోపాల్ ప్రసంగాల సంకలనం ఆవిష్కరణ !
పాలమూరు అధ్యయన వేదిక, డెమోక్రటిక్ టీచర్స్ పెడరేషన్ జాయింట్ గా రూపొందించిన సంక్షోభ కాలంలో విద్యారంగం బుక్ ఆవిష్కరణ ఆగస్టు 2, ఆదివారం హైదరాబాద్ లోని బాగ్ లింగం పల్లి, సుందరయ్య విజ్ఞాన వేదికలోని కాట్రగడ్డ శ్రీనివాస రావు హాలులో జరగనుంది.1980 నుంచి 2026 నేటి కాక్రోచ్ ఉద్యమం వరకూ క్షీణిస్తున్న విద్యావ్యవస్థ తీరును వివిధ వేదికలపై ప్రొఫెసర్ హర గోపాల్ చేసిన ప్రసంగాల ఆధారంగా పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రొపెసర్ వి. ఎస్ . ప్రసాద్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

కడప జిల్లాలో మెగా స్టార్ మూవీకి అరుదైన రికార్డ్
ఓటీటీలు వచ్చాక పెద్ద సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడే పరిస్థితి లేని ఈ తరుణంలో థియేటర్లలో నటుడు చిరంజీవి మూవీ ఏకంగా 200రోజులు ఆడింది. ఈ ఏడాది 2026 జనవరి 12న విడుదలైన మన శివ శంకర వర ప్రసాద్ మూవీ కడప జిల్లా, యర్రగుంట్లలోని "హేమ పిక్చర్ ప్యాలెస్"లో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే OTT లోకి వచ్చినప్పటికి ధీయేటర్ లో రోజూ ఇప్పటికీ 4 ఆటలుతో కొనసాగుతుండటం విశేషం.!

ఈట్ క్లబ్ సెంట్రల్ కిచెన్ లైసెన్స్ సస్పెన్షన్
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లోని ఈట్ క్లబ్ బ్రాండ్స్ సెంట్రల్ కిచెన్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి అనేక నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. పరిశుభ్రత లోపం,పురుగుల ముట్టడి, ఫుడ్ నిల్వల్లో నిబంధనలు క్రాస్ చేయడం, లేబిలింగ్ లోపాలు, సింథటిక్ కలర్స్ వాడటం లాంటి అంశాలు చూశాక లై సెన్స్ సస్పెండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నారు.

విద్యా రుణాల పంపిణీ రెట్టింపుకు కేంద్రం భారీ ప్రణాళిక
దేశంలో విద్యా రుణాల (Education Loans) పంపిణీని రాబోయే ఏడాదిలో రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రక్రియను వేగవంతం చేసి, 10 రోజుల్లోనే రుణాలు మంజూరు చేసేలా బ్యాంక్‌లకు మార్గదర్శకాలు ఇచ్చారు. కళాశాలల్లోనే ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి స్పాట్ శాంక్షన్లు ఇవ్వనున్నారు. రూ. 7.5 లక్షల వరకు గ్యారెంటీ కవరేజ్, co-applicant నిబంధనల సడలింపు ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇకపై బట్టలకు ఇండియన్ సైజ్ కొలతలు !
ఇప్పటివరకు యూఎస్ (US), యూకే (UK) సైజ్ చార్టుల ఆధారంగా దుస్తులు తయారవు తుండగా, త్వరలోనే భారతీయుల శరీర ఆకృతికి సరిపోయేలా సొంత సైజ్ చార్ట్ రాబోతోంది. భారత జౌళి మంత్రిత్వ శాఖ, నిఫ్ట్ (NIFT) సంయుక్తంగా 'INDIAsize' ప్రాజెక్టు ద్వారా 3D బాడీ స్కేనింగ్ పరిజ్ఞానంతో 25,000 మందికి పైగా భారతీయుల శారీరక కొలతలను సేకరించాయి. దీనివల్ల బట్టల ఫిట్టింగ్ సమస్యలు తొలగిపోయి, ఫిర్యాదులు , ఆన్‌లైన్ రిటర్న్‌లు గణనీయంగా తగ్గుతాయి.

హైబ్రిడ్ యుగానికి సూటయ్యే 'క్విన్టెసెన్షియల్' ల్యాప్ టాప్స్
ఆఫీస్,హోమ్ ఆఫీస్ (హైబ్రిడ్) రెండింటికీ యూజ్ అయ్యేలా డిజైన్ చేసిన ల్యాప్‌టాప్‌లు నేడు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. Lenovo ThinkPad X1 Carbon (లేదా X1 2-in-1), HP EliteBook / Dragonfly Series, MacBook Air/Pro మోడల్స్ ఈ విభాగంలో ముందంజలో ఉన్నాయి. లైట్ వెయిట్ లో రొజంతా సరిపోయే బ్యాటరీ సామర్ధ్యం, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఎన్ పియూ ప్రోసెసర్లు బ్యాటరీ వేస్ట్ కాకుండా వీడియో కాల్స్ వాయిస్ ఐసోలేషన్, బ్యాక్ గ్రౌండ్ టాస్క్ లను పూర్తి చేస్తాయి.

గ్లాస్ గో ప్రజల లైఫ్ స్టైల్ లో భాగమైన కర్రీ పాయింట్స్
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో (Glasgow) నగరంలో 'కరీ హౌసెస్' (ఇండియన్ రెస్టారెంట్లు) అక్కడి కల్చర్ లో భాగమయ్యాయి. 1950ల నుండి దక్షిణాసియా వలసదారుల రాకతో ప్రారంభమైన ఈ ఆహార సంస్కృతి, స్థానిక బ్రిటీష్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ 'చికెన్ టిక్కా మసాలా' ఇక్కడే పుట్టిందని నమ్ముతారు. కాలక్రమేణా ఇవి కేవలం భోజనశాలలుగానే కాక, గ్లాస్గో ప్రజల నిత్య జీవితంలో, వేడుకల్లో కీలక వేదికలుగా స్థిరపడ్డాయి.

క్రియేటివిటీ లోపించిన విద్యా విధానం !
ప్రస్తుత విద్యావిధానంలో సృజనాత్మకత నశిస్తోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సృజనాత్మకత, విమర్శ నాత్మక ఆలోచనలకు ప్రయారిటీ లేక పోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. నోమ్ చోమ్‌స్కీ వంటి ఆలోచనాపరులు విద్యావ్యవస్థ స్వేచ్ఛా ఆలోచనను అణిచేసే ఫిల్టర్‌లా మారిందని విమర్శించగా, అతి పోటీ తత్వం విద్యార్థులలో మానసిక ఒత్తిడి పెంచుతోందన్నారుఆల్బర్ట్ ఐన్‌స్టీన్. దీపక్ నయ్యర్ వంటి భారతీయ విద్యావేత్తలు ప్రాక్టికల్ నైపుణ్యాలు లోపిస్తున్నాయని హెచ్చరించారు. బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలకాలన్నారు.

లక్ష కోట్లు దాటేసిన IPL బిజినెస్ వాల్యూ !
దిగ్గజ క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL) వ్యాపార విలువ ఏకంగా 20.6 బిలియన్ డాలర్లకు (సుమారు ₹1.97 లక్షల కోట్లు) చేరింది. హులిహాన్ లోకీ IPL వాల్యుయేషన్ స్టడీ 2026 ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఐపీఎల్ విలువ 11.4% పెరగ్గా, బ్రాండ్ విలువ 10.3% పెరిగి $4.3 బిలియన్లకు చేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) $312 మిలియన్ల బ్రాండ్ విలువతో అత్యంత విలువైన జట్టుగా నిలిచింది. ఫ్రాంచైజీల భారీ విక్రయాలు ఈ ఎదుగుదలకు దోహదపడ్డాయి.

నెమలి ఈకల తలపాగాలతో రాష్ట్రపతి భవన్‌లో సందడి!
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బస్తర్ పీపుల్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, హోంమినిస్టర్ అమిత్ షాని కలిశారు. తమ ప్రత్యేకమైన 'మాంఝీ-చలాకీ' సంప్రదాయ దుస్తులు, నెమలి ఈకల తలపాగాలు ధరించి వచ్చిన వారితో <a href="https://x.com/AmitShah/status/2082806776395899194?s=20">అమిత్ షా</a> ప్రత్యేకంగా మాట్లాడారు. బస్తర్ సంస్కృతి, వారి పండుగలను కాపాడుకోవడం గ్రేట్ అని, ఫ్యూచర్‌లో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుందని చెప్పారు.

ఇరాన్‌పై చైనాకు నిజంగానే అంత పట్టు ఉందా?
చైనా ఒక్క మాట చెబితే ఇరాన్ ఆగిపోతుందా..? ఇదే ఇప్పుడు గల్ఫ్ దేశాల ఆశ. ఇరాన్‌తో యుద్ధం మళ్లీ తీవ్రం కావడంతో, గల్ఫ్ దేశాలు ఇప్పుడు అమెరికా కంటే చైనా వైపు చూస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో రాకపోకలు సజావుగా కొనసాగేలా ఇరాన్‌పై తన ఆర్థిక ప్రభావాన్ని ఉపయోగించాలని చైనాను కోరుతున్నాయి. అయితే చైనా మాత్రం యుద్ధంలో ఏ పక్షం వైపు నిలవకుండా, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని చెబుతోంది. దీంతో ఇరాన్‌పై చైనాకు నిజంగా ఎంత ప్రభావం ఉందనే విషయం ఇప్పుడు పరీక్షగా మారింది.

ఇండియాలో 'డైట్ కోక్' కొరత!
ఇండియాలో ఇటీవల Diet Coke కొరత ఏర్పడటానికి కారణం దాని డిమాండ్ విపరీతంగా పెరగడమేనని కోకాకోలా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ మర్ఫీ తెలిపారు. వెస్ట్ ఏషియా వార్ వల్ల అల్యూమినియం క్యాన్ల సప్లై దెబ్బతిని, ప్యాకేజింగ్ కాస్ట్స్ పెరగడం వల్లనే ఈ షార్టేజ్ వచ్చిందని చెప్పారు. డైట్ కోక్ కేవలం క్యాన్లలోనే అమ్మడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువైందని. కొరత ఉన్నప్పటికీ, ఇండియా తమకు లాంగ్ టర్మ్‌లో బిగ్ ఆపర్స్యూనిటీ అని, ఈ ఇయర్ ఆర్డర్లు 10 రెట్లు పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

తోటి నటీమణులపై పోలీస్ కేస్?
మలయాళ నటి అన్సిబా హాసన్ ఫిర్యాదు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు రెస్పాండ్ అయింది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియోపై కేస్ రిజిస్టర్ చేయడానికి లోకల్ కోర్టు నో చెప్పడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తోటి నటీమణులు లక్ష్మీప్రియ, శ్వేతా మీనన్‌లపై FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ జరిపేలా పోలీస్‌లను ఆదేశించాలని రిక్వెస్ట్ చేశారు. అన్సిబా పిటిషన్‌ను యాక్సెప్ట్ చేసిన హైకోర్టు, దీనిపై వివరణ ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్‌కు నోటీసులు ఇచ్చింది.