Latest
బాలుడు యూరిన్ చేశాడని టీచర్ కత్తితో దాడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణ ఘటన జరిగింది. వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు టీచర్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ విద్యార్ధి ప్యాంట్‌లోనే యురీన్ పోసుకున్నాడు. ఐదేళ్ల బాలుడిని టీచర్ మరో గదికి తీసుకెళ్లి వేడి కత్తితో అతని ప్రైవేట్ భాగాన్ని కాల్చి, ఎవరికీ చెప్పొదంటూ బెదిరించింది. ఇంటికి వెళ్లిన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ప్రిన్సిపాల్‌ను కలిశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ONGC నుంచి RSS అనుబంధ సంస్థలకు ₹670.97 కోట్లు
ప్రభుత్వ రంగ సంస్థ ONGC నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) అనుబంధ సంస్థలకు భారీగా నిధులు వెళ్లాయని "The News Minute" ప్రచురించిన న్వెస్టిగేటివ్ స్టోరీ సంచలనం సృష్టిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) కింద ONGC 2013 నుంచి 20 RSS అనుబంధ సంస్థలకు ₹670.97 కోట్లు విరాళాలు ఇచ్చిందని ఈ రిపోర్ట్ చెప్తోంది. 2015 నుంచి 2025 వరకు ONGC 2,000కు పైగా సంస్థలు, ప్రాజెక్టులకు ₹4,531 కోట్ల రూపాయల్ని CSR కింద ఇస్తే.. అందులో ₹668.01 కోట్లు సంఘ్-అనుబంధ సంస్థలకే వెళ్లాయి. <a href="https://www.thenewsminute.com/news/state-owned-ongc-donated-over-rs-668-crore-to-20-sangh-linked-organisations-across-10-years">Read The News Minute Report </a>

NEET పై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్
బట్టీ పట్టే చదువులు ఇక ఏమాత్రం పనికిరావని రామ్ గోపాల్ వర్మ అన్నారు. డాక్టర్లు పదేళ్లు కష్టపడి చదివే విషయాలు, 'AI'కి ముందే తెలుసు. మనుషుల కంటే 'AI' చాలా ఫాస్ట్‌గా, కరెక్ట్‌గా రోగాలను గుర్తిస్తుంది. త్వరలో సర్జరీలు కూడా రోబోలే చేస్తాయి. సిలబస్ అంటూ టీచర్లు, పేరెంట్స్ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. ఫోన్‌కు ముందే తెలిసినవి మేమెందుకు బట్టీ పట్టాలని అడిగే యువకులను తప్పుబట్టకండి. పనికిరాని ఈ పాత విద్యా విధానాన్ని పూర్తిగా వదిలేసి, త్వరగా 'AI' వైపు మారండి అని వర్మ తన 'X' అకౌంట్ లో పోస్ట్ చేశారు.
వాళ్లు ఉగ్రవాదులు కాదు: ప్రియాంకా గాంధీ
బీహార్, వెస్ట్ బెంగాల్‌లో సీజేపీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై FIRలు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. నిరసనకు వెళ్లిన అమ్మాయిల ఇళ్లకు ఫోన్ చేసి వాళ్ల కుటుంబాలను బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. వాళ్లు ఉగ్రవాదులు కాదని.. విద్యార్థులని ఆమె అన్నారు.

18 ఏళ్లుగా రూపాయి కూడా వాడకుండా బతుకుతున్నాడు.. ఎలా?
"డబ్బు లేకుండా బతకడం అసాధ్యం" అనుకుంటాం. కానీ కెనడాకు చెందిన డేవిడ్ ఆర్థర్ జాన్స్టన్ మాత్రం 18 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా వాడకుండా జీవిస్తున్నానని చెబుతున్నాడు. భోజనం, బట్టలు, అవసరమైన వస్తువులు అన్నీ దానం లేదా కమ్యూనిటీ సపోర్ట్‌తోనే పొందుతూ జీవిస్తున్నాడు. 'అవసరాలు తగ్గించుకుంటే డబ్బు మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు' అనేది ఆయన నమ్మకం. ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఇలా కూడా బ్రతుకుతారా?' అని కొందరు ఆశ్చర్యపడుతుంటే.. 'డబ్బు లేకుండా ఈ రోజుల్లో ఎలా సాధ్యం?' అంటూ మరికొందరు చర్చిస్తున్నారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశం
TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హైదరాబాద్ లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా, 63 కోర్టు ధిక్కరణ కేసులను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ కొనసాగితే 'రూల్ ఆఫ్ లా' దెబ్బతింటుందని, ఆయన పదవిలో కొనసాగడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఆన్‌లైన్ వేధింపులపై మోడల్ రియా ఫిర్యాదు
ముంబైలో నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని మోడల్ రియా యాదవ్ ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఆ సంఘటన తర్వాత తనను కొందరు తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె మహారాష్ట్ర సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమర్శించే స్వేచ్ఛ అందరికీ ఉన్నా, ఇతరులను కించపరిచేలా కామెంట్స్ చేసే హక్కు ఎవరికీ లేదని, తప్పుగా ఉన్న ప్రతిదానికీ వ్యతిరేకంగా నేను పోరాడతానంటూ రియా చెప్పింది.

ఇరాన్ ఒక్కసారిగా సైలెంట్..!
ఇన్ని రోజులుగా మిస్సైళ్లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడిన అమెరికా-ఇరాన్.. ఇప్పుడు కాస్త కూల్ అయినట్టు కనిపిస్తోంది. "ప్రస్తుతానికి ప్రతీకార దాడులు ఆపేస్తున్నాం" అని ఇరాన్ ప్రకటించింది. అటు ట్రంప్ కూడా "చర్చలకు కొంచెం టైమ్ ఇస్తున్నాం" అని చెప్పడంతో గత రెండు రోజులుగా అమెరికా నుంచి కూడా కొత్త దాడులు జరగలేదు. దీంతో వెస్ట్ ఆసియాలో టెన్షన్ కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. అయితే ఈ నిశ్శబ్దం శాశ్వతమా.. లేక మరోసారి యుద్ధం మొదలవుతుందా అనేదే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది.

నిన్న CM పక్కన సరదాగా మాట్లాడి.. నేడు అంతలోనే ఘోరం!
పోలవరం జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని CM చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో CM పక్కన కూర్చుని మాట్లాడిన శివాని ఇంట్లో ఉరివేసుకుంది. “డాడీ మీ డ్రీమ్ నెరవేర్చలేకపోతున్నా” అని సూసైడ్ నోట్ రాసింది. ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియకపోవడంతో దీనిపై సమగ్ర విచారణకు CM ఆదేశించారు. ఎలాంటి సమస్యలొచ్చినా విద్యార్థులు ధైర్యంగా నిలబడాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
E20కి వ్యతిరేకంగా దిల్లీలో ప్రోగ్రాం.. కేజ్రీవాల్ పిలుపు
దేశంలోని యువత ఏకమై గళం విప్పడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదే విధంగా E20కి వ్యతిరేకంగానూ ప్రజలు ఏకమై తమ గళాన్ని వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శనివారం దిల్లీలో నిర్వహించే 'నేషనల్ టౌన్‌హాల్ అగైనెస్ట్ E20' కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిప్రాయాలు పంచుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
NEET OMR షీట్‌పై స్టూడెంట్ ఆరోపణ
కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లాకు చెందిన NEET-UG స్టూడెంట్ బిందుశ్రీ పవార్ తన OMR షీట్ సరైనది కాదని ఆరోపించింది. NTA ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన OMR షీట్ తనది కాదని, షీట్‌లో -14 మార్కులు ఉందని, ఫైనల్ రిజల్ట్‌లో -11 మార్కులు వచ్చాయని..ఇది తనది కాదని వివరించింది. దీనిపై NTA విచారించాలని కోరింది.

హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు!
లతుకుంట భూముల వివాదంలో హైదరాబాద్ CP రంగనాథ్ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషనర్ తప్పుడు ప్రచారం చేశారని, లతుకుంట సర్వే నంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలో తాము జోక్యం చేసుకోలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అయితే కమిషనర్ రంగనాథ్‌పై ఏకంగా 63 కంటెమ్ట్ కేసులు ఉండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయని ప్రశ్నించింది.
కొండచరియలు పడి 13 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉదయ్‌పూర్-పాంగి మార్గంలో టాటా సుమోపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమోలోని 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్యాంక్ మేనేజర్‌ను కొట్టిన మాజీ సీఎం కరుణానిధి మనవరాలు
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవరాలు కయల్విళి, చెన్నై అడయార్‌లోని ఎస్‌బిఐ బ్యాంక్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జూలై 20న ఈ ఘటన జరిగింది. ఆ బ్యాంకు ఉన్న బిల్డింగ్ కయల్విళిదే. అయితే అందులో లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఆమె మేనేజర్ దగ్గరకు వెళ్లి తీవ్రంగా గొడవ పెట్టుకుంది. ఆయన స్టైల్‌ను ఎక్కిరిస్తూ కోపంతో చెంప మీద కొట్టింది. మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కయల్విళిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఉద్యోగులను త్వరగా ఇంటికి పంపండి: సైబరాబాద్ పోలీసులు
TG: భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు ఉద్యోగులకు విడతల వారీగా ముందుగానే లాగ్‌అవుట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు అత్యవసర సేవలకు అంతరాయం ఉండదని తెలిపారు. కార్యాలయ స్థానం, ముందస్తు లాగ్‌అవుట్ సమయాల వివరాలను trfcord@scsc.in మెయిల్‌కు పంపించాలని సంస్థలను కోరారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల భద్రతకు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడడమే ఈ చర్య ఉద్దేశమని తెలిపారు.

అరెస్టులు ఆపకపోతే ఊరుకోం: CJP ఆగ్రహం!
అస్సాం, వెస్ట్ బెంగాల్, బిహార్‌లలో ప్రొటెస్టర్లను అరెస్ట్ చేయడంపై CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ తీవ్రంగా స్పందించారు. నిరసనకారులపై ఎలాంటి యాక్షన్ తీసుకోమని కేంద్రం హామీ ఇచ్చాకే ప్రొటెస్ట్ ఆపామని, ఇప్పుడు మాట తప్పడం నమ్మకద్రోహమని ఫైర్ అయ్యారు. డిటైన్ చేసిన వారిని మంగళవారంలోగా రిలీజ్ చేసి, ఫైల్ చేసిన FIRలను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని, లేదంటే నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. CJP లీగల్ టీమ్ ప్రొటెస్టర్లకు సపోర్ట్‌గా ఉందని స్పష్టం చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు!
రాజీనామా చేసిన తర్వాత కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి పార్లమెంట్‌కు వచ్చారు. సంసద్ గేట్ వద్దే వెయిట్ చేస్తున్న NDA MPలు ఆయనకు ఘనంగా వెల్‌కమ్ చెప్పి మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అయితే అదే టైమ్‌లో ఆపోజిషన్ MPలు ఆయనను చూసి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌కు ఎంట్రీ ఇవ్వగానే, NDA లీడర్లు మాత్రం మద్దతుగా తమ యూనిటీని చూపించారు.
NEET ఉద్యమం.. ఇంకా ఆగలేదు!
NEET ఉద్యమం ముగిసిందనుకునేలోపే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బీహార్‌లో నిరసనల్లో పాల్గొన్న దాదాపు 200 మంది విద్యార్థులు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారని లాయర్లు చెబుతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో బంద్ సందర్భంగా AK-47తో కాల్పులు జరిపిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. దీంతో "విద్యార్థులపై ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?" అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి.
సొనమ్ వాంగ్‌చుక్ స్పెషల్ మెసేజ్!
సొనమ్ వాంగ్‌చుక్ గుర్గావ్‌లోని వేదాంత హాస్పిటల్ నుంచి ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హెల్త్ బెటర్‌గా ఉందన్న ఆయన, సపోర్ట్ చేసిన అందరికీ అండ్ డాక్టర్స్ టీమ్‌కి థ్యాంక్స్ చెప్పారు. లదాఖ్ వెళ్లేముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వెళ్ళి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తానని, గతంలోనూ ఉద్యమం ముందు రాజ్‌ఘాట్ వెళ్లానని వీడియోలో చెప్పారు. సపోర్ట్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

యూనియన్ బ్యాంకులో 395 ఉద్యోగాల నోటిఫికేషన్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 395 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టు ప్రకారం డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, ఎంటెక్ పాసై, బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.1,56,500 వరకు జీతం. ఆసక్తి ఉన్నవాళ్లు ఆగస్టు 10వ తేదీలోపు <a href="https://www.unionbankofindia.bank.in/en/common/recruitment">ఆన్‌లైన్</a>లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ
TG: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ డీలర్ల పిటిషన్‌ను కొట్టివేయడంతో పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 15 వరకు రేషన్ పంపిణీ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.