Latest

ఉచిత కంటి పరీక్షలు
జడ్చర్ల ఎమ్మెల్యే గౌరవ జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తూరు బ్రాంచ్ ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో గంగాపూర్ గ్రామంలో కంటి పరీక్షలు చేశారు. గంగాపూర్ గ్రామ సర్పంచ్ బండగిరి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.

87 ఏళ్ల వయసు.. ఆరేళ్లుగా అందని కుటుంబ పింఛన్
గుంటూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్‌టీఓ ఎం.డి. అన్వర్‌ఉల్లా బేగ్ భార్య రహమతున్నిసా బేగంకు ఇప్పుడు 87 ఏళ్లు. 19 ఏళ్లుగా తనకు రావాల్సిన కుటుంబ పింఛన్ బకాయిల కోసం ఆరేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. 2020 ఫిబ్రవరిలో మొదటిసారి స్పందన కార్యక్రమంలో అధికారులకు తన సమస్య విన్నవించారు. నేటికీ ఆమె సమస్యకు పరిష్కారం రాలేదు. దీంతో మరోసారి గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి తన సమస్య వివరించేందుకు వచ్చారు.

ORC భూములకు పట్టాలు ఇవ్వాలని వినతి
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని జనుంపల్లి గ్రామంలోని దళితుల భూములకు సంబంధించి గతంలో జారీ చేసిన ORCలకు నాలుగేళ్లు గడిచినా పట్టాలు ఇవ్వలేదని సీపీఐ(ఎం) గ్రామ కమిటీ ఆరోపించింది. రైతులు రైతు భరోసా వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసి, ORCల ఆధారంగా అర్హులైన భూలబ్ధిదారులకు తక్షణమే పట్టాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి పి.శివశంకర్, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.

జమ్మూలో ‘పాకిస్థాన్ నంబర్’తో పావురం.. సెక్యూరిటీ అలర్ట్!
జమ్మూకశ్మీర్‌లోని కథువాలో పాకిస్థాన్ మొబైల్ నంబర్ ఉన్న రింగ్‌తో ఓ పావురం కనిపించడం కలకలం రేపింది. స్థానికులు దాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బార్డర్ ప్రాంతం కావడంతో అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. రింగ్‌పై ఉన్న నంబర్‌ను ఎగ్జామిన్ చేస్తున్నారు. పావురాన్ని ఏదైనా మెసేజ్ లేదా ఇన్ఫర్మేషన్ పంపేందుకు యూస్ చేశారా? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇది స్పైయింగ్ కోసమేనని ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

సంచార జాతుల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్
సంచార, విముక్త జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో 75వ విముక్తి దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా యువతను ఆర్థికంగా స్వావలంబన దిశగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.చెన్నయ్య, అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

CJP మార్చ్‌ను ఆపలేం.. సుప్రీంకోర్ట్
సెప్టెంబర్ 5న కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ప్లాన్ చేసిన ప్రొటెస్ట్ మార్చ్‌ను ఆపలేమని సుప్రీంకోర్ట్ క్లారిటీ ఇచ్చింది. ప్రొటెస్ట్ టైమ్‌లో అందరూ పీస్‌ఫుల్‌గా, లీగల్‌గా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నట్లు కోర్ట్ కామెంట్ చేసింది. ఎగ్జామ్ ఇష్యూస్‌పై ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చలేదని సెంట్రల్ గవర్నమెంట్‌పై CJP ఈ ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చింది. నీట్ ప్రొటెస్ట్స్ టైమ్‌లో జరిగిన పోలీస్ వైలెన్స్‌పై ఎంక్వైరీ చేస్తున్న కమిటీకి తమ పిటిషన్ సబ్మిట్ చేయాలని పిటిషనర్‌ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది.

నర్సు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
హైదరాబాద్ లో నర్సును దారుణంగా హత్య పైన పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడు సనాఉల్లాను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం ఆదివాసీ JAC కమిటీతో పాటు తిమ్మంపేట JAC నాయకులు డిమాండ్ చేశారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. బీహార్ వ్యక్తి సనావుల్లా ఆగస్ట్ 28న నర్సు రూంలోకి వెళ్లి రేప్ అటెమ్ట్ చేసి, హత్య చేశాడు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులపై విచారణ అవసరం
మందమర్రి మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్మం, చిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్ మాట్లాడుతూ జాబితాలో అనర్హులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. జాబితాలో మొదట 447 ఇళ్ల వివరాలు ఉండగా, ఒక్కరోజులోనే అర్హుల సంఖ్య 491కి పెరగడంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఇథనాల్ శాతం బిల్లుపై చూపించాలి.. సుప్రీంకోర్టులో PIL!
పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ శాతాన్ని బంకుల్లో క్లియర్‌గా చూపించాలని PIL ఫైల్ చేశారు. డిస్పెన్సింగ్ నాజిల్స్‌తో పాటు పెట్రోల్ బిల్లులు, రిసీట్‌పై కూడా ఇథనాల్ శాతాన్ని ప్రింట్ చేయాలని పిటిషనర్ కోరారు. తాము కొన్న ఫ్యూయల్‌లో ఏం ఉందో తెలుసుకునే హక్కు కస్టమర్లకు ఉందని వాదించారు. అయితే ఈ PILను హియరింగ్‌కు తీసుకోవడానికి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఈ అంశంపై హైకోర్టును లేదా సంబంధిత అధికారిని అప్రోచ్ అవ్వొచ్చని సూచించింది. ఈ20 పాలసీని వ్యతిరేకించడం తమ ఉద్దేశం కాదని తెలిపింది.
మస్టర్లు వేయలేదంటూ కూలీల ఆందోళన
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నర్సారెడ్డి పాలెంలోని ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. పనిచేస్తున్నప్పటికీ మాస్టర్లు వేయడం లేదని అంటున్నారు. రాజకీయ ఉద్దేశంతో కూలీలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరో తెలియక తికమకి పడిపోతున్నామని చెబుతున్నారు. రోజుకొకరు వచ్చి అటెండెన్స్ తీసుకోవడంతో ఎప్పుడు వస్తారో తెలియక కందరగోళంగా ఉందని అంటున్నారు. పై అధికారులు స్పందించి చర్యలు తీసుకొని కూలీలకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పార్కు నిర్మాణానికి శ్రీకారం
AP: తాడేపల్లి మండలం రాధారంగనగర్‌లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి పార్కు కీలకంగా మారనుంది. ఆంజనేయస్వామి విగ్రహం పక్కన ఉన్న స్థలంలో రూ.83 లక్షలతో చేపట్టనున్న పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ పనులకు శ్రీకారం చుట్టారు.

బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
తెలంగాణలో 30 లక్షల మంది విద్యార్థులకి సంబంధించిన రూ.14 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని DSP ధర్మ సమాజ్ పార్టీ & BC, SC, ST -JAC సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టర్‌కి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు దువ్వాక శివ మహారాజ్, BC, SC, ST-JAC జిల్లా అధ్యక్షుడు మనాల కిషన్, ప్రధాన కార్యదర్శి జితేందర్, సహాయ కార్యదర్శి గుమ్ముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కదిలే బస్సులో దారుణం.. మైనర్ పై గ్యాంగ్ రేప్!
ఢిల్లీలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన 16 ఏళ్ల బాలిక కుటుంబంతో గొడవపడి నోయిడా వెళ్లే ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కింది. బస్సులో ఎవరూ లేకపోవడం చూసి డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. 45Min బస్సును తిప్పుతూ అఘాయిత్యం చేసి, కశ్మీరీ గేట్ వద్ద దింపి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 4న జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆలస్యంగా బయటకు వచ్చింది.
సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే
నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం మాడుగు గ్రామంలో సీతారామాంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
రోడ్డు మీద కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త!
చాలామంది రోడ్డు మీద కారు ఆపేసి, టక్కున డోర్ తెరుస్తుంటారు. దీని వల్ల రోడ్డు మీద వెళ్తున్న బండ్లకు తగిలి, దాని మీదున్న వాళ్లు కిందపడిపోతారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోతుంటాయి. అందుకే రోడ్డు మీద కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు వైపు కాకుండా మరో వైపు డోర్ తీయాలని HYD ట్రాఫిక్ పోలీసులు తమ ఎక్స్ అకౌంట్ ద్వారా సూచించారు. గతంలో జరిగిన ప్రమాదం వీడియోను పోస్ట్ చేసి, అలా జరగకుండా జాగ్రత్త పడాలని వివరించారు. పోలీసుల సజెషన్ తప్పకుండా పాటిస్తారు కదూ!

‘Toxic’పై రాజాసింగ్ రివ్యూ.. షాకింగ్ రియాక్షన్!
యశ్ నటించిన ‘టాక్సిక్’ మూవీపై గోషామహల్ MLA రాజాసింగ్ కామెంట్స్ చేశారు. ఫ్రెండ్స్‌తో కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమా చూసిన ఆయన.. సినిమాలోని వల్గారిటీ, వైలెన్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యలోనే బయటకు వచ్చేశారు. డ్రగ్స్, మర్డర్స్, మహిళలను అబ్సీన్‌గా చూపించే సీన్స్ ఉన్నాయని విమర్శించారు. సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్‌కే పరిమితం కాకూడదని అన్నారు. రవితేజ 'ఇరుముడి' లాంటి ధర్మం కోసం, భక్తి, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని చెప్పారు. ఇలాంటి మూవీస్ ఫ్యామిలీతో కలిసి చూడొద్దని అన్నారు.

30 ఏళ్ల కల సాకారం.. కృష్ణమ్మ పరుగులు పెట్టింది!
30 ఏళ్ల కల సాకారమైంది. ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద సోమవారం సీఎం చంద్రబాబు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించారు. కృష్ణా జలాలు సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు చేరాయి. తొలి దశలోనే 10.70 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇప్పటికే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు ఈ ప్రాజెక్ట్ వరం. ప్రకాశం జిల్లాలోనే 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరులో 84,000 ఎకరాలు, కడపలో 27,200 ఎకరాలు సాగవుతాయి.

ఆ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం
జగిత్యాలలో సోమవారం ప్రజావాణి జరిగింది. ప్రజల నుంచి 53 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత అధికారులకు క్లియర్ ఆదేశాలు ఇచ్చారు: "ఫిర్యాదులను సమగ్రంగా విచారించి, సత్వరమే పరిష్కరించండి. అర్జీలు పెండింగ్‌లో పడేయొద్దు'' అని. పెండింగ్ దరఖాస్తులపై వచ్చే ప్రజావాణి లోగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక, ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు 41వ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ ‘దారి’ద్రం తీరేదాకా..నిరసన తప్పదు
హైదరాబాద్‌లోని ఇమ్లిబన్–పుట్లిబౌలి అధ్వాన రోడ్డు పరిస్థితికి నిరసనగా ఓ వ్యక్తి చిత్రమైన ఆందోళన చేశాడు. ఈ రహదారిలో పెద్ద గుంతలో పడుకొని తన నిరసన తెలిపాడు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి కోటి, చాదర్‌ఘాట్ వైపు వెళ్లే ఈ రహదారి ఎప్పుడూ భారీ ట్రాఫిక్‌తో నిండి ఉంటుంది. ప్రమాదకరమైన గుంతలు, దెబ్బతిన్న రహదారి ఉపరితలం కారణంగా ప్రజలు చాలా కాలంగా కంప్లైంట్లు చేస్తున్నారు. అతను చేసిన ఈ నిరసన కారణంగా కొద్దిసేపు బండ్లు ఆగిపోయాయి. పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.

భువనగిరిలో యూత్ కాంగ్రెస్ బ్రెయిన్‌స్టార్మింగ్!
భువనగిరిలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించింది. అధ్యక్షులు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో యువతను పార్టీతో కనెక్ట్ చేసేందుకు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వ్యూహాలను రూపొందించారు. రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం. సోషల్ మీడియా క్యాంపెయిన్‌లు, క్యాంపస్‌లలో యూత్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. "రాబోయే రోజుల్లో యూత్ కాంగ్రెస్ మరింత యాక్టివ్ గా కనిపిస్తుంది" అని నాయకులు అంటున్నారు.

సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు ఐదుగురు సభ్యులు సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్‌తో పాటు సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.