Latest

RSS చీఫ్ మాటలు వినండి: అభిజీత్ దిప్కే?
CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే BJP నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. వరుసగా 12 ఏళ్లు అధికారంలో ఉండటంతో BJP నేతలు తమను తాము RSS కంటే పెద్దగా భావిస్తున్నారని కామెంట్స్ చేశారు. మోహన్ భగవత్ మాటలను కూడా BJP లీడర్లు వినడం లేదని, GenZ నిరసనకారులను దేశద్రోహులుగా చూడకూడదని భగవత్ చెబితే.. ప్రధానమంత్రి మాత్రం వారిని 'దిమాగీ నక్సల్స్' అని పిలవడం దారుణమన్నారు. తమ మాటలు వినకపోయినా, కనీసం BJP అధికారంలోకి రావడానికి కారణమైన మోహన్ భగవత్ సలహాలనైనా వినాలని ఆయన సలహా ఇచ్చారు.

డాక్టర్ల AI కూడా తప్పులు చేస్తుందా?
డాక్టర్లు వాడుతున్న AI టూల్స్ కూడా తప్పులు చేస్తున్నాయట. NHSలో డాక్టర్లతో మాట్లాడే సమయంలో నోట్స్ తయారు చేసే AI టూల్స్ కొన్ని మందుల పేర్లు, వ్యాధుల వివరాలను తప్పుగా రాస్తున్నట్టు Healthwatch England తాజా పరిశీలనలో గుర్తించింది. కొన్ని తప్పులను డాక్టర్లు గుర్తించకపోయినా.. పేషెంట్లు వాటిని గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. AI నోట్స్ పని సులభం చేస్తున్నా.. వాటిని డాక్టర్లు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మాలల ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు 20 పాయింట్లలోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని, జీవో నంబర్ 99ను రద్దు చేయాలని మాల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు పోలీసుల నిర్బంధాలను అధిగమించి సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల తోపులాటలో జాతీయ అధికార ప్రతినిధి దార సత్యంకు గాయాలయ్యాయని, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అస్వస్థతకు గురయ్యారని నిర్వాహకులు తెలిపారు.

జాబ్ పోయింది.. ఆరు కోళ్లతో బిజినెస్ మొదలైంది!
Amazonలో జాబ్ పోయిన తర్వాత మళ్లీ మరో ఉద్యోగం వెతుక్కోవడమే సాధారణం. కానీ హైదరాబాద్‌కు చెందిన మారియా హర్షిత మాత్రం ఊహించని దారి ఎంచుకున్నారు. మార్చి 2026లో ఉద్యోగం కోల్పోయిన ఆమెకు వరుసగా జాబ్ రిజెక్షన్లు రావడంతో.. భర్తతో కలిసి ఆరు కోళ్లతో పెంపకం మొదలుపెట్టారు. తర్వాత కోళ్ల సంఖ్య పెరిగి గుడ్లు రావడంతో.. వాటిని అమ్మడం మొదలుపెట్టారు. అలా ఇంటి అవసరాల కోసం మొదలైన పని ఇప్పుడు చిన్న బిజినెస్‌గా మారింది. జాబ్ పోయినా కొత్తగా ఏదైనా మొదలుపెట్టొచ్చని ఆమె కథ చూపిస్తోంది.

గురుకుల విద్యార్థులకు క్రీడా పోటీలు
ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల సంక్షేమ పాఠశాలలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ నీతాపోల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడల ప్రాధాన్యత గురించి వివరించారు. కోకో, కబడ్డీ, హాకీ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు.

AI వల్ల భారత ITకి మళ్లీ మంచి రోజులు వస్తాయా?
AI వల్ల భారత IT కంపెనీల జాబ్‌లు, ఆదాయం తగ్గిపోతాయనే భయాల మధ్య.. ఇప్పుడు సీన్ మారొచ్చన్న అంచనాలు వస్తున్నాయి. ఆనంద్ రాఠీ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా AIపై ఖర్చు కేవలం మౌలిక సదుపాయాల కోసం కాకుండా.. కంపెనీలు నేరుగా AIని వాడుకునే దిశగా మారుతోంది. దీంతో AIని కంపెనీల్లో అమలు చేయడం, డేటాను సిద్ధం చేయడం, కొత్త సేవలు రూపొందించడం వంటి పనులకు భారత IT కంపెనీలకు మరిన్ని చాన్స్‌లు రావచ్చని రిపోర్ట్ చెబుతోంది. ఈ మార్పుతో 2027 నుంచి భారత IT రంగానికి మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉందట.

సత్వరం సమస్యలు పరిష్కరించాలి
CPM మదనపురం మండల కమిటీ ఆధ్వర్యంలో విద్య, వైద్యం స్థానిక సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో రేపోల రాజుకు వినతిపత్రం అందించారు. మండల కార్యదర్శి వెంకట్ రాములు మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి మండలంలో విద్య, వైద్యం స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించామన్నారు. సత్వరం సమస్యలు పరిష్కరించాలని కోరారు.

టాలీవుడ్‌లో కొత్త కపుల్.. పిక్స్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ <a href="https://www.instagram.com/p/DcsymJtHdkr/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==">కావ్య</a> కల్యాణ్‌రామ్, మ్యూజిక్ డైరెక్టర్ <a href="https://www.instagram.com/p/DcsymQIgbQN/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==">కాల భైరవ</a> తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ షేర్ చేస్తూ లవ్ లైఫ్‌పై స్పెషల్ క్యాప్షన్స్ పోస్ట్ చేశారు. తన లైఫ్‌లోకి సరైన పర్సన్ వచ్చాడని, తనను ఎంతగానో కేర్ చేస్తున్నాడని కావ్య రాసుకొచ్చింది. ఇక కాల భైరవ స్పందిస్తూ.. కావ్యతో ఉండటం తనకి సొంత ఇంటికి వచ్చినంత పీస్‌ఫుల్‌గా ఉంటుందని, తమ లైఫ్‌లాంగ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని చెప్పాడు.

కంటతడి పెట్టిన కల్వకుంట్ల కవిత
TG: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టారు. నిజామాబాద్లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ తన జైలు జీవితం గురించి చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో అవమానాలను తట్టుకొని నిలబడ్డానని, ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని ఆమె చెప్పారు. ఏ తప్పూ చేయని తనని తీహార్ జైల్లో పెట్టారని అన్నారు. అన్యాయంగా తనను పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు. అన్నింటికీ సమాధానం చెప్పే రోజు వస్తుందని ఆమె వివరించారు.

మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం
TG: మూసీ నదిపై నిర్మించిన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత ఈజీగా సాగనున్నాయి. ట్రావెలింగ్ టైం చాలా తగ్గుతుంది. సుమారు రూ.52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తున్నారు.

సన్యాసి వీడియో వైరల్.. ప్రజల ఆగ్రహం
పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ జిల్లా సితాయ్‌లోని ఓ ఆశ్రమానికి చెందిన సన్యాసి ఓ యువతితో ఉన్న అభ్యంతరకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమం ముందు చేరి నిరసన చేశారు. సన్యాసిని వెంటనే అరెస్టు చేయాలని, విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియో నిజమైనదా, నకిలీదా తేలేవరకూ ప్రజలు శాంతంగా ఉండాలని పోలీసులు స్థానికులను కోరారు.

దళిత నాయకుడి పట్ల వివక్ష..చర్యలకు వినతి
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల వివక్ష చూపుతూ శుద్ధీకరణ చేపట్టిన ఘటనపై చర్యలు తీసుకోవాలని మిడ్జిల్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఘటనకు బాధ్యులైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ గడ్డల రాజేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రాచమల్ల చెన్నయ్య పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ‘పోలీస్ యాక్ట్ 1861’ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. రూల్స్‌కు విరుద్ధంగా డీజేలు వినియోగించడంపై నిషేధం ఉంటుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పాతపట్నం కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాతపట్నం కోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యు.దాలయ్య, కార్యదర్శి ఎం.రమణ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులకు దూరంగా ఉండి నిరసన తెలిపారు.

ఇన్ఫ్లుయెన్సర్ మర్డర్‌లో షాకింగ్ ట్విస్ట్!
పంజాబీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ మర్డర్ కేసులో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. జూలైలో కిడ్నాప్ చేసి, చెట్టుకు కట్టేసి తగలబెట్టడంతో గాయపడిన ఆమె ఇటీవల హాస్పిటల్‌లో చనిపోయింది. అయితే పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఆమె 7 వీక్స్ ప్రెగ్నెంట్ అని తేలింది. CCTV ఫుటేజ్ మిస్ అవ్వడం, డిజిటల్ ఎవిడెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ క్లిష్టంగా మారింది. చనిపోయే ముందు ఆమె స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. దీంతో ఈ కేసుపై స్పెషల్ ఆఫీసర్లతో ఇన్క్వైరీ చేయించాలని పంజాబ్ DGP ఆర్డర్స్ ఇచ్చారు.

శక్తి స్కీమ్ జీవో 97ను రద్దు చేయాలి
పాలిటెక్నిక్ కళాశాలలను సిల్క్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన శక్తి స్కీం జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. షాద్‌నగర్ విద్యార్థిసేన ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. సేన అధ్యక్షుడు టీకే శివప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు పాలిటెక్నిక్ విద్యను దూరం చేసే ఈ జీవోను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

గ్రామాల్లో ప్రధాన సమస్యలు పరిష్కరించాలి
గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని పానగల్ ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్డి జబ్బర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య వైద్య రంగాలు నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, వందరోజుల పని చేసినటువంటి ఉపాధి కూలీలకు పెండింగ్ డబ్బులు ఇవ్వాలని కోరారు. వంద రోజుల పనిని 200 రోజులకు పెంచి, రోజు కూలి రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
RSS చీఫ్‌కి ధ్రువ్ రాఠీ ఓపెన్ ఛాలెంజ్!
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, RSS చీఫ్ మోహన్ భగవత్‌కు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ వెళ్లిన భగవత్, అక్కడ డెమోక్రసీ ఇచ్చే ఫ్రీడమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. కానీ ఇండియాలో మాత్రం RSS సపోర్టర్లు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా లాంటి వారి ప్రైవేట్ షోలను రద్దు చేయిస్తూ ప్రెజర్ పెడుతున్నారని విమర్శించారు. నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌పై నమ్మకం ఉంటే, నాగపూర్‌లోని RSS హెడ్‌క్వార్టర్స్‌లో కునాల్ కమ్రాతో కామెడీ షో ఆర్నగైజ్ చేయాలని ఛాలెంజ్ చేశారు.

ఉచిత కంటి పరీక్షలు
జడ్చర్ల ఎమ్మెల్యే గౌరవ జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తూరు బ్రాంచ్ ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో గంగాపూర్ గ్రామంలో కంటి పరీక్షలు చేశారు. గంగాపూర్ గ్రామ సర్పంచ్ బండగిరి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.

87 ఏళ్ల వయసు.. ఆరేళ్లుగా అందని కుటుంబ పింఛన్
గుంటూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్‌టీఓ ఎం.డి. అన్వర్‌ఉల్లా బేగ్ భార్య రహమతున్నిసా బేగంకు ఇప్పుడు 87 ఏళ్లు. 19 ఏళ్లుగా తనకు రావాల్సిన కుటుంబ పింఛన్ బకాయిల కోసం ఆరేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. 2020 ఫిబ్రవరిలో మొదటిసారి స్పందన కార్యక్రమంలో అధికారులకు తన సమస్య విన్నవించారు. నేటికీ ఆమె సమస్యకు పరిష్కారం రాలేదు. దీంతో మరోసారి గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి తన సమస్య వివరించేందుకు వచ్చారు.

ORC భూములకు పట్టాలు ఇవ్వాలని వినతి
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని జనుంపల్లి గ్రామంలోని దళితుల భూములకు సంబంధించి గతంలో జారీ చేసిన ORCలకు నాలుగేళ్లు గడిచినా పట్టాలు ఇవ్వలేదని సీపీఐ(ఎం) గ్రామ కమిటీ ఆరోపించింది. రైతులు రైతు భరోసా వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసి, ORCల ఆధారంగా అర్హులైన భూలబ్ధిదారులకు తక్షణమే పట్టాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి పి.శివశంకర్, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.