Latest

Jio Satellite Internet‌కు గ్రీన్ సిగ్నల్
Technology· 17 Jul 2026

Jio Satellite Internet‌కు గ్రీన్ సిగ్నల్

జియో భారీ Satellite Internet ప్రాజెక్ట్‌కు IN-SPACE నుంచి టెక్నికల్ అప్రూవల్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 1,600 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనేది జియో లక్ష్యం. గ్రామాలు, కొండ ప్రాంతాలు, ఫైబర్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌తో స్టార్లింక్‌కు గట్టి పోటీ ఇవ్వాలని జియో చూస్తోంది.

సోనమ్ వాంగ్‌చుక్‌పై అమీర్‌ఖాన్ కామెంట్స్
Politics· 17 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్‌పై అమీర్‌ఖాన్ కామెంట్స్

‘3 ఇడియట్స్’ సినిమాలో తన క్యారెక్టర్ సోనమ్ వాంగ్‌చుక్ లైఫ్ ఆధారంగా తీసింది కాదని బాలీవుడ్ యాక్టర్ ఆమిర్‌ఖాన్ తెలియచేశారు. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ సినిమా తీసే సమయంలో తనకు కానీ, సినిమా రైటర్స్ రాజు, అభిజత్‌లకు సోనమ్ గురించి అస్సలు తెలియదని అన్నారు. అది అపోహ మాత్రమేనని చెప్పారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న సోషల్ సర్వీస్‌ను తాము ఎంతో గౌరవిస్తామని, ఆయన చేస్తున్న నిరాహార దీక్షపై తనకు కంగారుగా ఉందని తెలిపారు.

మూసీ నుంచి చికాగో దాకా.. హిస్టరీ ఛేదిస్తున్న మిలింద్
Education· 17 Jul 2026

మూసీ నుంచి చికాగో దాకా.. హిస్టరీ ఛేదిస్తున్న మిలింద్

24 ఏళ్ల హైదరాబాదీ కెమెరాతో చరిత్రకు జీవం పోస్తున్నాడు. అమెరికాలో MA హిస్టరీ చేస్తున్న రాహుల్ మిలింద్.. తనే స్టోరీ, కెమెరా, మ్యూజిక్, డైరెక్షన్ చేస్తూ 3 డాక్యుమెంటరీస్ తీశాడు. మూసీ చరిత్ర, 1984 సిక్కుల ఊచకోత డాక్యుమెంటరీస్ జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ గెలిచాయ్. దక్షిణాసియా నుంచి చికాగోకు వలస వెళ్లిన వారి అనుభవాలతో తీసిన "The Shape of Belonging" జులై 18న చికాగో సౌత్ ఏషియా ఇన్ స్టిట్యూట్లో ప్రదర్శిస్తున్నారు. రామచంద్ర గుహ శిష్యుడైన రాహుల్ మిలింద్ తెలంగాణ ఉద్యమకారుడు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VC ఘంటా చక్రపాణి కుమారుడు.

ORRపై ఘోర ప్రమాదం
Crime· 17 Jul 2026

ORRపై ఘోర ప్రమాదం

TG: మేడ్చల్ జిల్లా కీసర PS పరిధిలోని ORRపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు మెదక్ జిల్లాకు చెందిన రాములు (60), రషీద్ (40)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం వాహన డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బండి సంజయ్ కామెంట్స్ కి చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్!
Politics· 17 Jul 2026

బండి సంజయ్ కామెంట్స్ కి చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్!

మహిళల సేఫ్టీ కంటే సాంప్రదాయాలకే ఇంపార్టన్స్ ఇస్తున్నారంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. BJP అధికారంలోకి వస్తే బొట్టు, గాజులు తప్పనిసరి చేస్తామన్న బండి సంజయ్ కామెంట్స్ పై ఆమె స్పందించారు. దేశంలో పసిపిల్లల నుండి శవాల వరకు రేప్స్ జరుగుతున్నా పట్టించుకోకుండా, ఇలాంటి నియమాలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పోక్సో నిందితుడు బెయిల్‌పై వచ్చి ఆరుగురిని చంపిన ఘటనను గుర్తు చేస్తూ, మహిళలపై క్రైమ్స్ ఆపడం కంటే బొట్టు, గాజులు ముఖ్యమా అంటూ ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

గొంతునొప్పికి భూత వైద్యం.. గర్భిణి మృతి
TG· 17 Jul 2026

గొంతునొప్పికి భూత వైద్యం.. గర్భిణి మృతి

TG: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంట మండలం మారాయిగూడెం గ్రామానికి చెందిన కురసం హెంకి ఆరునెలల గర్భిణి. ఆమెకు గొంతు నొప్పి రావడంతో స్థానిక భూత వైద్యుడిని సంప్రదించింది. చికిత్స పేరుతో అతడు మహిళ గొంతును బలంగా కొరకడంతో తీవ్ర గాయమై ఇన్ఫెక్షన్ సోకింది. ముఖం, గొంతు తీవ్రంగా వాచిపోయింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ICUలో ఉంచి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందింది.

బస్టాండ్‌లో యువతిని మర్డర్ చేసిన ప్రేమోన్మాది!
Crime· 17 Jul 2026

బస్టాండ్‌లో యువతిని మర్డర్ చేసిన ప్రేమోన్మాది!

కర్ణాటకలోని మంగళూరు దగ్గర ఒక ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బంట్వాల్ బస్టాండ్‌లో 21 ఏళ్ల లావణ్య అనే యువతిని నడిరోడ్డుపైనే కత్తితో నరికి దారుణంగా చంపేశాడు. ఆమె దూరపు బంధువైన చేతన్ అనే యువకుడు ఈ క్రైమ్‌కి పాల్పడి అక్కడి నుండి పారిపోయాడు. తన లవ్‌ను లావణ్య రిజెక్ట్ చేసిందనే కోపంతోనే చేతన్ ఈ మర్డర్ చేసినట్లు పోలీసులు డౌట్ పడుతున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి స్పెషల్ పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి.

హామీ అమలు చేయకపోతే స్కూటీలు తీసుకెళ్లండి
Politics· 17 Jul 2026

హామీ అమలు చేయకపోతే స్కూటీలు తీసుకెళ్లండి

TG: నిజామాబాద్‌లో నిర్వహించిన 'ఇందూర్ రణభేరి' కార్యక్రమంలో ఆర్మూర్ MLA రాకేశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. హామీ అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలకు చెందిన షోరూమ్‌ల నుంచి విద్యార్థినులు స్కూటీలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే చలో కొడంగల్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

బీటెక్ విద్యార్థులకు ఊహించని గుడ్‌న్యూస్
General· 17 Jul 2026

బీటెక్ విద్యార్థులకు ఊహించని గుడ్‌న్యూస్

ఇంజినీరింగ్ పూర్తి చేసినవాళ్లకి ఇండియన్ ఆర్మీ గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) ద్వారా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. బీటెక్‌లో సాధించిన మార్కులను బట్టి షార్ట్‌లిస్ట్ చేసి, ఆ తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్లకి ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం వస్తుంది. అలవెన్సులతో కలిపి నెలకు రూ.1.5 లక్షల వరకు జీతం ఉంటుంది.

యువ సంగ్రామ సభకు బ్రేక్
Politics· 17 Jul 2026

యువ సంగ్రామ సభకు బ్రేక్

TG: హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న BRS యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదని MLA సుధీర్ రెడ్డి ఫైరయ్యారు. సదస్సు ఏర్పాట్లను MLC శంభిపూర్ రాజు, పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. 18 రోజుల క్రితమే దరఖాస్తు చేసినా ఇప్పటికీ పర్మిషన్ రాలేదన్నారు. యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తారనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కోర్టు నుంచి అనుమతి వస్తుందనే విశ్వాసం తమకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తామన్నారు.

మిక్స్‌డ్ వెజిటబుల్ బాత్‌తో ఆరోగ్యానికి మేలు
Health· 17 Jul 2026

మిక్స్‌డ్ వెజిటబుల్ బాత్‌తో ఆరోగ్యానికి మేలు

రోజూ ఒకే రకమైన ఫుడ్ కాకుండా బీట్‌రూట్, టమాటా, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలతో మిక్స్‌డ్ వెజిటబుల్ బాత్ తయారు చేసుకుని తింటే బాడికి అవసరమైన అనేక Nutrients అందుతాయి. బీట్‌రూట్‌లో ఐరన్, క్యారెట్‌లో విటమిన్–A, టమాటాలో యాంటీఆక్సిడెంట్లు, బీన్స్‌లో ఫైబర్, ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్లు సరిపడా ఉంటాయి. ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుపడటంతో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. టస్టీగా ఉండే ఈ వెజిటబుల్ బాత్‌ను పిల్లలు, పెద్దలు అందరూ తమ ఆహారంలో తీసుకుంటే హెల్త్ కి మంచిది.

35 ఏళ్ళ తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు
General· 17 Jul 2026

35 ఏళ్ళ తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు

చైనాలో రెండేళ్ల వయసులో తప్పిపోయిన జోంగ్ ఫెంగ్లిన్ అనే అమ్మాయి 35 ఏళ్ల తర్వాత డీఎన్ఏ పరీక్షతో మళ్లీ తన కన్నతల్లిని చేరుకుంది. 1991లో మార్కెట్‌లో జనాల మధ్య తప్పిపోయిన ఆమెను ఒక బట్టల వ్యాపారి పెంచి పెద్ద చేశాడు. జోంగ్ తనపై ఉన్న గాయాల వల్ల పేరెంట్స్ వదిలేశారని అనుకుంది. కానీ ఆమె కోసం కుటుంబం వెతుకుతూనే ఉంది. 'బేబీ కమ్ హోమ్' సేవా సంస్థ ద్వారా నిజం తెలుసుకొని జులై 7న ఆమె తన తల్లిని కలుసుకుంది.

రేవంత్ రెండు ఓట్లపై చర్యలు?
TG· 17 Jul 2026

రేవంత్ రెండు ఓట్లపై చర్యలు?

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు చోట్ల ఓటరుగా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ 'SIR' సమన్వయ కమిటీ గురువారం ఫిర్యాదు చేసింది. BRS నాయకురాలు మమత, కమిటీ సభ్యులు కలసి ఆయనకు వినతిపత్రం అందచేశారు. ఎపిక్ నంబర్ టీఈఎస్0274035తో కొడంగల్, కొండారెడ్డిపల్లి/అచ్చంపేట ఓటరు నమోదుపై టైమ్ స్టాంపుతో కూడిన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు.

స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు
News· 17 Jul 2026

స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు

వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఒక స్కూల్ బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. బస్సు పూర్తిగా దెబ్బతింది. లోపలున్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైల్వేగేట్లు తెరిచే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

వసతుల కోసం గురుకులంలో బాలికల ధర్నా
TG· 17 Jul 2026

వసతుల కోసం గురుకులంలో బాలికల ధర్నా

TG: సరైన వసతులు లేవని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు గురువారం గేట్ ముందు ధర్నాకి దిగారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని నెల రోజులుగా చెబుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఏదైనా రిపేర్ వస్తే తమ దగ్గర డబ్బులు అడుగుతారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షడు రూప్‌సింగ్ వారికి ధైర్యం చెప్పి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కతో మాట్లాడించారు. వెంటనే వసతులు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థినులు ధర్నా విరమించారు.

రూ.2 వేలు దాటిన UPI పేమెంట్స్‌పై ఛార్జీలకు ప్లాన్
Infotainment· 17 Jul 2026

రూ.2 వేలు దాటిన UPI పేమెంట్స్‌పై ఛార్జీలకు ప్లాన్

కేంద్ర ప్రభుత్వం UPI పేమెంట్స్‌పై కొత్త మార్పులకు సిద్ధమవుతోంది. పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో దేశంలో కోట్లాది మంది ఈ విధానాన్ని వాడుతున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం రూ.2 వేలకు పైన ఉన్న పేమెంట్స్‌కు మర్చెంట్ డిస్కౌంట్ రేట్(MDR ) వర్తించనుంది. ఇది కేవలం పెద్ద వ్యాపారస్తులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని చెబుతున్నారు. వచ్చే రెండు వారాల్లో దీనిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఓపెన్ జైలులో..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
News· 17 Jul 2026

ఓపెన్ జైలులో..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నఇద్దరు ఖైదీలు ప్రేమలో పడ్డారు. ఈ లవ్‌స్టోరీకి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఓపెన్ జైలు వేదికగా మారింది. మాండోర్ ఓపెన్ జైలు పొలాల్లో పనిచేసేటప్పుడు పరిచయమైన మూలారామ్, సీమా ఘడ్సే అనే ఇద్దరు ఖైదీలు ప్రేమలో పడ్డారు. వారు పెళ్లి చేసుకోవడానికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్ట్రిక్ట్ సెక్యూరిటీ మధ్య జరగబోయే ఈ పెళ్లికి ఇరువైపులా కలిపి 21 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే?
Politics· 17 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే?

సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న హంగర్ స్ట్రైక్ నేటితో 20వ రోజుకు చేరింది. టుడే ఆయన హెల్త్ అప్‌డేట్ చూస్తే, ఈ 20 రోజుల్లో ఏకంగా 9.5 Kgల వెయిట్ లాస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బ్లడ్ ప్రెజర్ (BP) 108/68 గా ఉంది. బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గి డీహైడ్రేషన్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. రోజు రోజుకు ఆయన హెల్త్ కండిషన్‌పై అందరిలో టెన్షన్ పెరుగుతోంది.

పార్శి డైయిరీ  ఫామ్ లైసెన్సు రద్దు
News· 17 Jul 2026

పార్శి డైయిరీ ఫామ్ లైసెన్సు రద్దు

ముంబైలో 110 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక పార్శీ డెయిరీ ఫామ్ లైసెన్స్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) రద్దు చేసింది. జూలై 14న మెరైన్ లైన్స్‌లోని ఈ డెయిరీలో అధికారులు చేసిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. ముడి పదార్థాలను నేలపైనే పడేయడం, ఉత్పత్తులపై ఎక్స్‌పైరీ డేట్లు వేయకపోవడంతోపాటు పాల్ఘర్‌లోని మరో బ్రాంచ్‌పై దాడి చేసి రూ.32 లక్షల కల్తీ అనుమానిత వెన్న, పనీర్, జున్ను పాలను అధికారులు సీజ్ చేశారు. జూలై 15 నుండి అన్ని రకాల తయారీ, అమ్మకాలను నిషేధించారు.

Wi-Fi స్లోగా ఉందా..ఎందుకు?
Infotainment· 17 Jul 2026

Wi-Fi స్లోగా ఉందా..ఎందుకు?

ఇంట్లో వైఫై సడన్‌గా స్లో అవుతోందా? దానికి చాలా కారణాలుంటాయి. అపార్ట్‌మెంట్‌లు లేదా దగ్గర దగ్గరగా ఉన్న ఇళ్లల్లో అనేక వైఫై రూటర్లు ఒకే ఛానల్‌లో పనిచేయడంతో ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా 2.4 GHz బ్యాండ్‌లో ఇది ఎక్కువగా జరుగుతుంది. మైక్రోవేవ్ పనిచేస్తున్నప్పుడు 2.4 GHz వైఫై సిగ్నల్‌కు అంతరాయం కలగడం ద్వారా ఆ సమయంలో వైఫై స్పీడ్ తగ్గుతుంది. బ్లూటూత్ స్పీకర్లు, హెడ్‌ఫోన్లు, కీబోర్డులు, మౌస్ వంటి పరికరాలు కూడా 2.4 GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తాయి. దీనివల్ల కూడా వైఫై స్లో అవుతుంది.

అర్జెంటీనా ప్రెసిడెంట్ సెంటిమెంట్
Sports· 17 Jul 2026

అర్జెంటీనా ప్రెసిడెంట్ సెంటిమెంట్

అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ ఓ క్రేజీ సెంటిమెంట్ వల్ల ఈసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ చూడటానికి స్టేడియానికి వెళ్లట్లేదట. 1990లో అప్పటి ప్రెసిడెంట్ కార్లోస్ మెనెమ్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన వెంటనే అర్జెంటీనా ఓడిపోయింది. దాంతో టీమ్‌కు బ్యాడ్‌లక్ రాకూడదని అక్కడి ప్రెసిడెంట్లు మ్యాచ్‌లకు దూరం ఉంటున్నారు. మిలీ కూడా ఈ ఫైనల్‌ను ఇంట్లో టీవీలో చూస్తానని చెప్పారు.