Latest
స్కూల్ మునిగిపోయింది... కానీ 1,643 మంది సేఫ్!
నేపాల్‌లోని త్రిశూలి నదిలో 30 మీటర్ల ఎత్తులో వచ్చిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ త్రిభువన్ త్రిశూలి స్కూల్‌ను ముంచెత్తాయి. ప్రిన్సిపాల్ రాజేంద్ర దాదాబీ సమయస్ఫూర్తితో 1,643 మంది స్టూడెంట్స్ సేఫ్‌గా బయటపడ్డారు. ఊరు కొట్టుకుపోతోందని ఫ్రెండ్ నుండి అలర్ట్ రాగానే, ఆయన వెంటనే స్కూల్ బెల్ కొట్టి పిల్లలను ఎత్తైన ప్రదేశానికి పంపారు. వస్తున్న స్కూల్ బస్ డ్రైవర్లకు ఫోన్ చేయడంతో, బ్రిడ్జ్ కూలిపోయే ముందే బస్ సేఫ్‌గా క్రాస్ అయింది. దాదాబీ చూపిన సమయస్ఫూర్తిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిల్లీలో షాకింగ్ ఘటన.. కదులుతున్న బస్‌లో బాలికపై దారుణం!
UPకి చెందిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న స్లీపర్ బస్‌లో ఇద్దరు వ్యక్తులు సెక్సువల్ అబ్యూజ్ చేశారని పోలీసులు తెలిపారు. భారీ వర్షంలో దారి తప్పిన బాలిక.. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద బస్ ఎక్కినట్లు తెలుస్తోంది. 47 కి.మీ. జర్నీలో ఈ ఘటన జరిగినట్లు కేసు నమోదైంది. తరువాత కశ్మీరీ గేట్ దగ్గరలో బాలికను వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేశారు. అధికారులు CCTV ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి, బస్‌ను ఫోరెన్సిక్ టెస్ట్‌కు పంపించారు. ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది.

వర్షం లేక.. మిర్చి, పత్తి కళ్లు తేలేస్తున్నాయ్!
పల్నాడు దాచేపల్లి రైతులకు వర్షమే పెద్ద టెన్షన్‌గా మారింది. మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల నీళ్లు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో పంటలకు నీరందించడం కష్టంగా మారింది. ఇలాగే కొనసాగితే పంట నాణ్యత దెబ్బతింటుంది. మార్కెట్లో ధర కూడా రాదు. ఇది రైతులకు రెట్టింపు నష్టం! ఎపి మొత్తం ఇదే పరిస్థితి. ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో 52% వర్షపాతం లోటు నమోదైంది. దేశవ్యాప్తంగా కూడా 13% లోటే. ఐఎండీ అంచనా ప్రకారం సెప్టెంబర్లోనూ వర్షాలు తగ్గే అవకాశమే ఉంది. మీ ఊళ్లో వర్షాలు, పంటల పరస్థితి ఎలా ఉంది? కామెంట్ చేయండి.

ప్రకృతి వ్యవసాయం కోసం బయల్దేరిన బస్సు!
అనపర్తిలో సోమవారం ఓ ప్రత్యేక బస్సు బయలుదేరింది. MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులో 110 మంది రైతులు ఉన్నారు. వీళ్లంతా మార్టేరు పరిశోధనా కేంద్రానికి వెళ్తున్నారు. రసాయనాల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం పెంచడం ఈ యాత్ర ఉద్దేశ్యం. మార్టేరులో కొత్త వరి వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు అభివృద్ధి చేశారు. వాటిని రైతులు ప్రత్యక్షంగా చూడాలని ఈ యాత్ర ఏర్పాటు చేశారు. "ఇంతకాలం రసాయనాల ఆధారంగా సాగు చేశాం. ఇప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటూ.. అధిక దిగుబడులు సాధించాల''ని MLA చెప్పారు.

ఉంగరాల జుట్టుపై హీరోయిన్ కామెంట్స్!
ఇన్‌స్టాగ్రామ్‌తో పాపులర్ అయి 'సింగ్ గీతం' మూవీతో ఎంట్రీ ఇచ్చిన యాక్ట్రెస్ అహల్య బామ్రూ, కర్లీ హెయిర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉంగరాల జుట్టు మెస్సీగా ఉంటుందనే పాత ఆలోచనను తీసేయాలన్నారు. టీవీ, ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్ట్రెయిట్ హెయిర్‌నే అందంగా చూపించడం వల్ల ఈ మైండ్‌సెట్ వచ్చిందని, కానీ నేచురల్ కర్ల్స్ చాలా అమేజింగ్‌గా ఉంటాయని చెప్పారు. ప్రాపర్ కేర్‌తో మీ ఓరిజినల్ హెయిర్‌ని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మైంటైన్ చేయచ్చని, దాన్ని దాచాల్సిన అవసరమే లేదని అన్నారు.

GO 97.. పాలిటెక్నిక్‌లు ప్రైవేట్ అవుతున్నాయా?
అవుననే అంటోంది పాలిటక్నిక్ Jac. GO97 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాలిటెక్నిక్ కళాశాలలు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)తో విలీనం చేసి SHAKTI శాఖ కిందకు వెళ్తాయి. ఇది PPP (public private partnership) మోడల్.<br>ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల్లో చదువుతున్నది 90% మంది పేద, బడుగు విద్యార్థులే. వీరు ECET ద్వారా B.Tech లో లాటరల్ ఎంట్రీ పొందుతున్నారు. PPP మోడల్‌కు మారితే ఫీజులు పెరుగుతాయని, ఉన్నత విద్యకు దారులు మూసుకుపోతాయని భయపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులూ ప్రైవేట్ వశమవుతాయని ఆందోళన.

చెత్త నుంచి డబ్బు.. NTPC చైతన్య కార్యక్రమం!
రామగుండం టౌన్‌షిప్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. NTPC పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో "వేస్ట్ టు వాల్యూ" – అంటే వ్యర్థాల నుంచి ఆదాయం అనే అవగాహన సెషన్ నిర్వహించారు. చెత్తను తడి, పొడి, పునర్వినియోగ వ్యర్థాలుగా వేరు చేయడం, సురక్షితంగా సేకరించడం, శాస్త్రీయంగా తరలించడం – ఇవన్నీ ఈ సెషన్ లో కవర్ చేశారు. టౌన్‌షిప్ నివాసితులు కాగితం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వాటిని తీసుకొచ్చి అందజేశారు. చెత్తలో కూడా డబ్బు ఉంటుందని, పర్యావరణానికి మేలు చేస్తూ ఆదాయం సంపాదించొచ్చని అధికారులు వివరించారు.
బొత్సపై కేఏ పాల్ సంచలన కామెంట్స్
AP: మాజీ మంత్రి బొత్సపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. “బొత్స ఒక నత్తోడు. ఆయన ఎలా మంత్రి అయ్యారో కూడా నాకు తెలియదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రపంచంలో యుద్ధాలను ఆపేందుకు తిరుగుతున్నానని, అలాంటి తన గురించి బొత్స మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. “లక్షల మంది ఎదుట బొత్స నా కాళ్లు పట్టుకుని నన్ను గెలిపించమని అడగలేదా?” అంటూ ప్రశ్నించారు.

ఆ 8 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం!
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆగస్టు 27న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామానికి చెందిన 8 మంది ఆటోలో వెళ్తుండగా.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. 8 మంది స్పాట్ డెడ్. మరో 10 మందికి తీవ్ర గాయాలు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. ఎపిలో ప్రతి 100 ప్రమాదాల్లో 42.7 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు ఏం చేద్దాం? కామెంట్ చేయండి.

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం
కరప మండలంలోని నడకుదురు గ్రామంలో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని, అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని తెలిపారు. గత 35 రోజులుగా పర్యటిస్తున్న సమయంలో గ్రామాల్లో అనేకమంది పింఛన్లు అందడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

తెలంగాణ స్కూల్స్‌లో ‘No Bag Day’.. బ్యాగ్‌కు బ్రేక్!
TG: రాష్ట్రంలో 2026-27 అకడమిక్ ఇయర్‌లో ప్రతి నెల మూడో శనివారం ‘No Bag Day’గా ఇంప్లిమెంట్ చేయనున్నారు. 1st - 10th క్లాస్ Govt. స్టూడెంట్స్‌కి బ్యాగులు, పుస్తకాలు లేకుండా స్కూల్‌కు అటెండ్ అవుతారు. రెగ్యులర్ క్లాసులకు బదులుగా గేమ్స్, క్రియేటివ్ యాక్టివిటీస్, ప్రాక్టికల్ లెర్నింగ్ వంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. స్టూడెంట్స్‌పై బ్యాగ్ భారం, స్ట్రెస్ తగ్గించి లెర్నింగ్‌ను మరింత ఫన్‌గా మార్చడమే ఈ ప్రోగ్రామ్ టార్గెట్. 2027 మార్చ్ వరకు నో బ్యాగ్ డే డేట్స్‌ను ఎడ్యుకేషన్ డిపాట్మెంట్ కన్ఫర్మ్ చేసింది.

డియర్ స్టూడెంట్స్.. Sports ఆడేద్దామా.. అయితే చలో..
రామగుండంలో క్రీడా పండుగ మొదలైంది. Sept 1, 2 తేదీల్లో గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మండల స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయlr రామగుండం MEO జింక మల్లేష్ చెప్పారు. Sept 1: బాలురు (అండర్ 14, 17) – కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, Sept 2: బాలికలు (అండర్ 14, 17) – ఇవే గేమ్స్! ఆటల్లో పాల్గొనే స్టూడెంట్స్ తమ స్కూల్ ప్రిన్సిపాల్స్ నుంచి NGF సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. More info కోసం ఫిజికల్ డైరెక్టర్ ఎం. రామాదేవి: 9491480393, జడ్పీహెచ్ఎస్ జనగామ ఫిజికల్ డైరెక్టర్ రమ్య: 9182669825 కు కాల్ చేయాలి.

యూరియా వచ్చేసింది.. ఆన్లైన్లో బుక్ చేసుకోండి!
వేంసూరు రైతులకు గుడ్ న్యూస్! లచ్చన్నగూడెం, భరణిపాడు, దుద్దేపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, మర్లపాడు గ్రోమోర్ సెంటర్లో యూరియా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం మండల వ్యవసాయశాఖ అధికారి పచ్చల రామ్మోహన్ రావు చెప్పారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. యాప్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే తమకు తెలపాలని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఐ సమరశంఖం
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు భీమదేవరపల్లి మండలం నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు ప్రయోజనం కల్పిస్తామని హామీలు ఇచ్చిందన్నారు. ఆ హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

భీమదేవరపల్లి మండల కమిటీ ఏర్పాటు
ఎమ్మార్పీఎస్ భీమదేవరపల్లి మండల నూతన కమిటీని ఏర్పాటు చేసింది. ముల్కనూరులోని విశ్వశాంతి హైస్కూల్‌లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్వరరావు మాదిగ, జిల్లా కో-ఇన్‌చార్జి తనుగుల విజయ్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భీమదేవరపల్లి మండల అధ్యక్షుడిగా వేల్పుల ప్రశాంత్ మాదిగ, అధికార ప్రతినిధిగా మాడుగుల ప్రణయ్‌దేవ్, ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి రమేష్, ఉపాధ్యక్షులుగా ఎర్రబెల్లి దిలీప్ ఎన్నికయ్యారు.

పల్లె సమస్యలే ఎజెండా.. అభివృద్ధే లక్ష్యం!
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా ముత్తారం, గొల్లపల్లి, ముస్తఫాపూర్, వీరభద్రనగర్, గట్ల నర్సింగాపూర్, బొల్లోనిపల్లి గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి, పలువురు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు. ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

గోల్డ్ రేట్లకు బ్రేక్.. ఈ వారం కూడా తగ్గే ఛాన్స్!
దేశంలో గోల్డ్ రేట్లు గత వారం దాదాపు 3 శాతం డౌన్ అయ్యాయి. US Federal Reserve వడ్డీ రేట్లు పెంచొచ్చన్న అంచనాలు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్‌తో గోల్డ్‌పై ప్రెజర్ పెరిగింది. ఈ వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉ. 9.30 గం.లకు పసిడి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రా. రూ.1,56,770 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,700గా ఉంది. కిలో వెండి రూ.2,60,000గా కొనసాగుతోంది.

ఫ్యూచర్ సిటీలో దేశంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం!
TG: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు స్థలం కోసం సెర్చ్ చేస్తున్నారు. డిసెంబరులో స్టేడియం పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. 100 ఎకరాల్లో 1.32 లక్షల సీట్లకు మించి దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. కన్‌స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ఖర్చులను BCCI చేసుకోగా, ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వనుంది. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, భారీ కాన్సర్ట్స్‌కు కూడా వేదికగా ఉండనుంది.

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్!
TG: హైదరాబాద్ తుక్కుగూడలో యువతి (21) దారుణంగా హత్యకు గురైంది. ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఆమె.. శుక్రవారం రాత్రి తన రూమ్‌లో ఒంటరిగా ఉన్న టైమ్‌లో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పంక్చర్ లివర్‌తో గట్టిగా కొట్టి మర్డర్ చేసినట్లు గుర్తించారు. దగ్గరలోని మెకానిక్ షాపులో పనిచేసే బిహార్ వ్యక్తిని (సాధావుల్లా) అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం జరిగిందనే ఆరోపణలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. పోస్టుమార్టం, మెడికల్ రిపోర్టులు వచ్చాకే లైంగికదాడిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెప్పారు.

వరల్డ్ చెస్ No 1 ప్రజ్ఞానంద
చెస్‌లో భారత్ మరో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. 21 ఏళ్ల ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఫైనల్లో అమెరికా స్టార్ ఫాబియానో కరువానాపై 15-13 తేడాతో గెలిచాడు. చివరి రోజు 6 పాయింట్లు వెనుకబడి ఉండి కూడా కమ్ బ్యాక్ ఇచ్చి.. 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలిచాడు. దీనిపై విశ్వనాథన్ ఆనంద్ "ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ 1 ప్లేయర్ ప్రజ్ఞానందే" అని అభినందించారు.

రౌడీషీట్ తొలగింపుకు ఛాన్స్.. ఎస్ఐ ఆఫర్!
గురజాలలో ఆదివారం ఓ ప్రత్యేక కౌన్సెలింగ్ జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినోద్ కుమార్ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. "సత్ప్రవర్తనతో మెలిగితే భవిష్యత్తులో రౌడీషీట్ తొలగించే అవకాశం ఉంది. కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు ప్రయోగిస్తాం. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు."ని ఆయన చెప్పారు. వాస్తవానికి పిడియాక్టు అనేది హెచ్చరిక అయినప్పటికీ చట్టాన్ని గౌరవిస్తే రౌడీ షీట్ నుంచి మినహాయింపునిచ్చే అవకాశం కూడా ఇందులో ఉందని, ఇది మంచి ప్రయోగమని స్థానికులు చెబుతున్నారు.