Latest

ఫ్యూచర్ సిటీలో దేశంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం!
TG: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు స్థలం కోసం సెర్చ్ చేస్తున్నారు. డిసెంబరులో స్టేడియం పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. 100 ఎకరాల్లో 1.32 లక్షల సీట్లకు మించి దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. కన్‌స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ఖర్చులను BCCI చేసుకోగా, ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వనుంది. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, భారీ కాన్సర్ట్స్‌కు కూడా వేదికగా ఉండనుంది.

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్!
TG: హైదరాబాద్ తుక్కుగూడలో యువతి (21) దారుణంగా హత్యకు గురైంది. ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఆమె.. శుక్రవారం రాత్రి తన రూమ్‌లో ఒంటరిగా ఉన్న టైమ్‌లో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పంక్చర్ లివర్‌తో గట్టిగా కొట్టి మర్డర్ చేసినట్లు గుర్తించారు. దగ్గరలోని మెకానిక్ షాపులో పనిచేసే బిహార్ వ్యక్తిని (సాధావుల్లా) అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం జరిగిందనే ఆరోపణలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. పోస్టుమార్టం, మెడికల్ రిపోర్టులు వచ్చాకే లైంగికదాడిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెప్పారు.

వరల్డ్ చెస్ No 1 ప్రజ్ఞానంద
చెస్‌లో భారత్ మరో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. 21 ఏళ్ల ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఫైనల్లో అమెరికా స్టార్ ఫాబియానో కరువానాపై 15-13 తేడాతో గెలిచాడు. చివరి రోజు 6 పాయింట్లు వెనుకబడి ఉండి కూడా కమ్ బ్యాక్ ఇచ్చి.. 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలిచాడు. దీనిపై విశ్వనాథన్ ఆనంద్ "ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ 1 ప్లేయర్ ప్రజ్ఞానందే" అని అభినందించారు.

రౌడీషీట్ తొలగింపుకు ఛాన్స్.. ఎస్ఐ ఆఫర్!
గురజాలలో ఆదివారం ఓ ప్రత్యేక కౌన్సెలింగ్ జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినోద్ కుమార్ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. "సత్ప్రవర్తనతో మెలిగితే భవిష్యత్తులో రౌడీషీట్ తొలగించే అవకాశం ఉంది. కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు ప్రయోగిస్తాం. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు."ని ఆయన చెప్పారు. వాస్తవానికి పిడియాక్టు అనేది హెచ్చరిక అయినప్పటికీ చట్టాన్ని గౌరవిస్తే రౌడీ షీట్ నుంచి మినహాయింపునిచ్చే అవకాశం కూడా ఇందులో ఉందని, ఇది మంచి ప్రయోగమని స్థానికులు చెబుతున్నారు.

బస్సు కోసం గంటల కొద్దీ వెయిటింగ్.. వచ్చినవి ఆగవు
గుంటూరు జిల్లా నరసరావుపేట రోడ్డు మీద ఉన్న ఊరు పేరు వేములూరుపాడు.. ఇక్కడి ప్రజలకు బస్సు రాకపోవడం ఓ రోజువారీ టెన్షన్. నరసరావుపేట డిపో నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉండాలి. కానీ టైముకు రావు. వస్తే 4 బస్సులు ఒకేసారి వస్తాయి. లేదంటే గంటలు గడిచినా రావు. వచ్చినా ఆపకుండా వెళ్లిపోతాయి. APSRTC యాప్‌లో మాత్రం ప్రతి 15 నిమిషాలకు బస్సు చూపిస్తుంది. కానీ అది just Display మాత్రమే. స్టూడెంట్స్, ఉద్యోగులు ఇలా అందరికీ ఇబ్బందే. RTC పట్టించుకుంటుందా? చూడాలి. వ్యూయర్స్! మీ ఊళ్లో ఇలాగే ఉందా? కామెంట్ చేయండి.
నీళ్లొచ్చాయ్.. కానీ కళ్లలో కన్నీళ్లే!
వెలిగొండ ట్రయల్ రన్‌తో కల్నూతలకు నీళ్లొచ్చాయి. కానీ ఆ గ్రామస్తుల కళ్లలో ఆనందం లేదు. ఎందుకంటే వారి గ్రామంతో పాటు మరో 10 గ్రామాలు మునిగిపోతున్నాయి. సుమారు 7500 ఫ్యామిలీస్ ఇల్లు, ఊరు వదిలి వెళ్లాలి. ''భూమిలేదు. ఇల్లులేదు. ఇంకా 1000 మంది పేర్లు ప్యాకేజీలో చేరాలి. పోనీ పునరావస ఊళ్లకు పోతే అక్కడ రోడ్లు లేవు. తాగునీళ్లు లేవు. 18 yrs వారికి రూ.2 లక్షలు, వంశధారలో 18 yrs వారికి రూ.6 లక్షలు ఇస్తామన్నారు. అవి ఎప్పుడొస్తవో తెల్వదు. మాకు త్యాగమనే బిరుదిచ్చారు. కానీ బతుకు బజార్న పడ్డది''.. ఇదీ నిర్వాసితుల ఘోష!

తెలంగాణలో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
TG: రాష్ట్రంలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Bay of Bengalలో వాతావరణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో రుతుపవనాలు యాక్టివ్‌గా ఉన్నాయి. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు ఉండొచ్చని తెలిపారు. నార్త్, ఈస్ట్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

రాఖీకి RTC షాక్.. ఛార్జీలు డబుల్!
పెద్ద కడ్మూర్–నార్వా నుంచి హైదరాబాద్‌కి సాధారణం రూ.280 టికెట్‌ని రాఖీ పండుగ పేరుతో రూ.380కి పెంచేశారు. Aug 27 నుంచి 31 వరకు ఈ అదనపు చార్జీ. టికెట్‌పై రూ.380 ముద్రించేశారు – ముందస్తు సమాచారం లేదు, క్లారిటీ లేదు. "పండుగ రద్దీ" అని చెప్పి రూ.100 extra వసూలు చేసేశారు. "రెగ్యులర్‌గా రూ.300 ఉంటే, ఇప్పుడు రూ.400 కట్టాల్సి వచ్చింది. బోర్డింగ్ తర్వాతే హైక్ తెలిసింద''ని ఓ ప్రయాణీకుడు చెప్పారు. ఈ ఛార్జీ పెంపు మీకు న్యాయమేనా? మీ ఊరి రూట్‌లో కూడా ఇలాంటి హైక్ ఉందా? కామెంట్స్‌లో మీ అనుభవం షేర్ చేయండి.

1000 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్.. బిగ్ ఈవెంట్స్!
TG: CM రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా 1,000 రోజుల బిగ్ మైల్‌స్టోన్‌ను పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా సర్కార్ చేసిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేసింది. రైతులు, మహిళలు, యువతపై ఫోకస్‌తో కొన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ 1,000 రోజుల పాలనను ప్రజా ప్రభుత్వంగా ప్రొజెక్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రజల ఆశలకు ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపింది.

₹47 వేల నుంచి ₹22 లక్షల వరకు..
భారత్, అమెరికాలో వైద్యం ఖర్చుల మధ్య ఎంత తేడా ఉంటుందో చెబుతూ ఓ భారతీయుడు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువాన్ ఇబానెజ్ గర్వారే తన అనుభవాన్ని పంచుకుంటూ.. భారత్‌లో పరీక్షలు, ప్రైవేట్ గది, చికిత్సకు కలిపి సుమారు రూ.47 వేల ఖర్చయిందని చెప్పారు. అమెరికాలో ఛాతి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా.. బిల్లు సుమారు రూ.22 లక్షలు వచ్చిందని, ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన జేబు నుంచి దాదాపు రూ.6.7 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.

నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్ట్ ఓపెనింగ్
AP: చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్టు కల నేడు నిజం కానుంది. CM చంద్రబాబు నాయుడు ఈరోజు Phase-Iను ప్రారంభించి 10.70 TMC కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. ఈ Phase-Iతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. 6 వేల మంది మహిళలకు చీర, గాజులు, పసుపు, కుంకుమతో ప్రత్యేక కిట్లు ఇవ్వనున్నారు. షిఫ్ట్ అవుతున్న కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

భారత్‌కు ఉజ్బెకిస్థాన్ నుంచి యురేనియం
భారత్ అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి మరో కీలక అడుగు వేసింది. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్‌కు దీర్ఘకాలంగా యురేనియం సరఫరా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అణు విద్యుత్ కేంద్రాలకు యురేనియం కీలక ఇంధనం కావడంతో.. ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను పెంచుకోవడం భారత్‌కు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారత్ వచ్చే సంవత్సరాల్లో అణు విద్యుత్ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యం పెరిగింది.

Lavender Marriage అంటే ఏంటి?
లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ తెలుసు.. మరి Lavender Marriage అంటే ఏంటో తెలుసా? లవ్ లేదా ఫిజికల్ అట్రాక్షన్ కంటే ఫ్యామిలీ ప్రెజర్, సమాజం లేదా ప్రైవసీ కోసం పరస్పర అంగీకారంతో చేసుకునే పెళ్లి. గతంలో LGBTQ+ వ్యక్తులు తమ సెక్సువల్ ఐడెంటిటీని దాచుకోవడానికి ఇలాంటి మ్యారేజ్‌లను ఎంచుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్రెజర్, కెరీర్, పర్సనల్ రీజన్స్ వల్ల కూడా కొందరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవి కూడా చట్టపరంగా సాధారణ మ్యారేజ్‌లాగే చెల్లుబాటు అవుతాయి.

సీసీ కెమెరా ఐ.. పోయిన బ్యాగ్ కనిపించింది!
రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్లో బెలవం గ్రామానికి చెందిన ఒండల జగ్గమ్మ పోగొట్టుకున్న బట్టల బ్యాగ్ను పోలీసులు సీసీ కెమెరాల సాయంతో గుర్తించి ఆమెకు తిరిగి అందజేశారు. ఆ బ్యాగ్లో రూ.4,000 నగదు, ఆధార్ కార్డు ఉన్న పర్స్ ఉన్నాయి. సీఐ నవీన్ కుమార్ ఆదేశాలతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కృతజ్ఞతలు తెలిపిన జగ్గమ్మ.. పోలీసుల సత్వర స్పందన, సీసీ కెమెరాల సాంకేతికత – రెండూ కలిసి పనిచేస్తే ప్రజా రక్షణ మరింత పటిష్టమవుతుందనడానికి ఇది మంచి ఉదాహరణ.

Gen Z మళ్లీ పేరెంట్స్ దగ్గరికే..
జాబ్ వచ్చింది, సిటీకి వెళ్లారు, ఇప్పుడు మళ్లీ పేరెంట్స్ దగ్గరికే వస్తున్నారా..? పెరుగుతున్న రెంట్స్, లివింగ్ కాస్ట్స్, జాబ్ అనిశ్చితి కారణంగా కొంతమంది Gen Z యువత తిరిగి ఫ్యామిలీతో కలిసి ఉండటాన్ని ఎంచుకుంటున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ ట్రెండ్‌ను ‘బూమరాంగ్ జనరేషన్’ అని కూడా పిలుస్తున్నారు. బయట ఉండి శాలరీలో పెద్ద భాగం రెంట్‌కే ఇవ్వడం కంటే ఇంట్లో ఉండి సేవింగ్స్ పెంచుకోవడం బెటర్ అనే మైండ్‌సెట్ కనిపిస్తోంది. అంటే పేరెంట్స్‌తో ఉండటం ఇప్పుడు ఫెయిల్యూర్ కాదు.. ఫైనాన్షియల్ స్ట్రాటజీగా మారుతోందా?

పిల్లి అనుకుని వెళ్తే పాప బయటపడింది
నేపాల్ భీకర వరదల తర్వాత రెస్క్యూ టీం ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతోంది. రాసువా జిల్లాలోని స్యాబ్రుబేసి దగ్గర శిథిలాల కింద ఏదో శబ్ధం రావడంతో పిల్లి కావొచ్చని అక్కడ తవ్వారు. తీరా చూస్తే ఆ శబ్దం ఐదేళ్ల పసిపాప మనీషాది. షాక్ తిన్న రెస్క్యూ టీం రెండు గంటల పాటు కష్టపడి పాపను సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. వెంటనే హెలికాప్టర్‌లో కాఠ్‌మాండూలోని టీచింగ్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడే పాప తన తల్లిదండ్రుల్ని కలుసుకుంది. ఈ విషాదంలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 752కు చేరింది. 2502 మంది కనిపించకుండా పోయారు.

వకుళమాత అన్నదాన భవన ప్రారంభం
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.6.25 కోట్ల సిజిఎఫ్ నిధులతో నిర్మించిన వకుళమాత అన్నదాన భవన నిర్మాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. తిరుమల తరహాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్న పుణ్యక్షేత్రం వాడపల్లి అని అన్నారు. కార్యక్రమంలో JSP ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు, బీజేపీ నేత పాలూరి సత్యానందం, చైర్మన్ ముదునూరి వెంకటరాజు పాల్గొన్నారు.
నా కొడుకు టెర్రరిస్ట్ కాదు: హీరో యశ్ తల్లి
కన్నడ హీరో యశ్ తల్లి పుష్ప అరుణ్‌కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. “నా కొడుకు టెర్రరిస్ట్ కాదు. అతను కర్ణాటకలోనే పుట్టి పెరిగాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, సొంతంగా ఈ స్థాయికి చేరుకున్నాడు. అతని ఎదుగుదలకు మీరెందుకు భయపడుతున్నారు?” అని అన్నారు. “KGFకి ముందే అతను అనేక హిట్ సినిమాలు ఇచ్చాడు. కన్నడలో సక్సెస్‌ఫుల్ స్టార్. ఎవరూ ఇవ్వని అవకాశాలు తన కష్టంతో సాధించుకున్నాడు” అని చెప్పారు. ‘KGFకి ముందు యశ్ ఎవరో తెలుసా’ అని గతంలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌కు ఆమె పరోక్షంగా ఆన్సర్ చేశారని చర్చ సాగుతోంది.

మనకు కలలెందుకు వస్తాయో తెలుసా?
మనం నిద్రపోతున్నప్పుడు కలలొస్తాయి. నిద్ర లేచాక చాలావరకు మర్చిపోతాం. ఆ కలలెందుకు వస్తాయో తెలుసా? రోజంతా మనం చేసిన పనులు, విన్న విషయాలు, అనుభవాలను మెదడు రాత్రి సమయంలో విడదీసి ముఖ్యమైన వాటిని దాచుకుంటుంది. అవే మనకు కలలుగా వస్తాయి. మనలోని ఆందోళనలు, భయాలు, సంతోషాలను మెదడు కలల రూపంలో ప్రాసెస్ చేస్తుంది. నిద్రలో కంటి కదలికలు జరిగే Rapid Eye Movement దశలో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఈ టైంలోనే కలలు ఎక్కువగా వస్తాయి. నిద్రలో మెదడు న్యూరాన్లు రియాక్ట్ అవ్వడం వల్ల కూడా చిత్రమైన కలలు వస్తుంటాయి.

అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రసాద్ పథకంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తెలంగాణలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలంపూర్‌లో ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్, లైట్ షోతో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి అన్నారు.

అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో లైట్ షో
అలంపూర్‌లో రూ.4.60 కోట్లతో ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్, లైట్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అలంపూర్ ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని వెలుగు, ధ్వని సమ్మేళనంతో ప్రదర్శించేలా ఈ షోను రూపొందించారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఒగ్గు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.