Latest

అఖిల్ అక్కినేనికి నాగ అఖిల్ అని ఫ్యాన్స్  కొత్త పేరు !
Cinema· 6 Jul 2026

అఖిల్ అక్కినేనికి నాగ అఖిల్ అని ఫ్యాన్స్ కొత్త పేరు !

అక్కినేని అఖిల్ కు తిరుపతి ఫ్యాన్స్ కొత్త పేరు పెట్టారు. మొన్నటి వరకూ అయ్యగారే నెంబర్ వన్ అంటూ అఖిల్ ను అభిమానులు కామెంట్ చేస్తూండేవారు. ఈకామెంట్లు అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇవాళ తిరుపతిలో జరిగిన లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఫ్యాన్ అఖిల్ కు నాగ అఖిల్ అని పేరు పెట్టారు. ఈ పేరుతో నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, నాగార్జున, అమల, పేర్లను చూసుకోవచ్చు. ఇక నుంచి ప్రతీ మూవీ డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అని అభిమానులు సంబర పడుతున్నారు.

ఆత్మీయులకు తియ్యని పలకరింపు ఓ చాక్లెట్ బైట్
General· 6 Jul 2026

ఆత్మీయులకు తియ్యని పలకరింపు ఓ చాక్లెట్ బైట్

చాక్లెట్ అంటే కేవలం స్వీట్ కాదు... అదో అద్భుతం! దీని శాస్త్రీయ నామం 'దేవతల ఆహారం'. క్రీస్తుపూర్వం 2,000 ఏళ్ల నాడే మాయన్, అజ్టెక్ ప్రజలు దీని గింజలతో ఘాటైన, చేదైన ‘రాయల్ డ్రింక్’ తయారుచేసుకునేవారు. ఆ తర్వాత 1502లో కొలంబస్ కంటిపడ్డ ఈ నల్లటి గింజలు, 1828 నాటి పారిశ్రామిక విప్లవంతో మనం ఇప్పుడు తినే తియ్యటి చాక్లెట్‌గా రూపాంతరం చెందాయి. మన దేశంలోకి ఇది బ్రిటిష్ వారి కాలంలో తమిళనాడు ద్వారా అడుగుపెట్టింది. అందుకే ఏటా జూలై 7న ప్రపంచమంతా దీని క్రేజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటుంది! సో మీ కిష్టమైన వారికి నోరూరించే చాక్లెట్స్ ఇచ్చేయండి..

ఐస్ తో క్రేజీ ఫుడ్ వెరైటీస్..నోరూరించే ఫ్లేవర్స్
General· 6 Jul 2026

ఐస్ తో క్రేజీ ఫుడ్ వెరైటీస్..నోరూరించే ఫ్లేవర్స్

ఎండలో చల్లదనం కోసం మాత్రమే కాదు.. ఇప్పుడు ఫైన్ డైనింగ్ ప్రపంచంలో ఐస్ ప్రత్యేక పదార్థంగా మారుతోంది. చెఫ్‌లు ఐస్‌ను రుచి, టెక్స్చర్, ప్రెజెంటేషన్, డైనింగ్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు వినియోగిస్తున్నారు. రోజా, పూలు, పండ్లు వంటి ఫ్లేవర్లతో ప్రత్యేక ఐస్ క్యూబ్స్ తయారు చేస్తున్నారు. కర్రీ ఆకులు–కొబ్బరి ఐస్‌క్రీమ్, వాటర్ చెస్ట్‌నట్ డెజర్ట్స్ వంటి వినూత్న వంటకాలతో సంప్రదాయ రుచులకు ఆధునిక టచ్ ఇస్తూ, ప్రతి ముద్దను ప్రత్యేక అనుభూతిగా మార్చుతున్నారు.

ఇండోనేషియాలో ప్రధానికి అపూర్వ స్వాగతం▶
Viral· 6 Jul 2026

ఇండోనేషియాలో ప్రధానికి అపూర్వ స్వాగతం

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేషియా చేరుకున్నారు. ఆయన విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే, ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16, సుఖోయ్-30 యుద్ధ విమానాలు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఆ ఫైటర్ జెట్స్ మోదీ విమానానికి ఇరువైపులా రక్షణగా (ఎస్కార్ట్‌గా) ఫార్మేషన్‌లో ఎగురుతూ జకార్తా వరకు తోడుగా వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక, రక్షణ సంబంధాలకు నిదర్శనంగా నిలిచిన ఈ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

AI లెర్నింగ్  కోసం స్టూడెంట్లవుతున్న సీఈఓలు
Technology· 6 Jul 2026

AI లెర్నింగ్ కోసం స్టూడెంట్లవుతున్న సీఈఓలు

టెక్నాలజీ మారుతున్న వేగాన్ని అందుకోవడానికి దశాబ్దాల అనుభవం ఉన్న టాప్ కంపెనీల సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మళ్లీ స్టూడెంట్స్‌గా మారుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై అవగాహన పెంచుకోవడానికి వారు గ్లోబల్ బిజినెస్ స్కూల్స్‌లో చేరుతున్నారు. కోట్లాది రూపాయల AI పెట్టుబడులపై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ సవాళ్లను అధిగమించడానికి ఈ కోర్సులు వీరికి సహాయపడుతున్నాయి. కంపెనీలను భవిష్యత్తుకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.

లెనిన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గళం ?
Cinema· 6 Jul 2026

లెనిన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గళం ?

బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఉరకలేస్తున్న అక్కినేని అఖిల్ ని టాలీవుడ్ స్టార్స్ కూడా సై అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. లేటెస్ట్ మూవీ , రూరల్ యాక్షన్ డ్రామా లెనిన్ లో క్యారెక్టర్స్ ని పరిచయం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో భాగమయ్యారు. తన పవర్ ఫుల్ వాయిస్ తో ఆయన ఇంట్రడక్షన్ అదిరిపోయే రేంజ్ లో ఉందని టాక్. జూనియర్ వాయిస్ మూవీకి అదనపు ఆకర్షణ. ఇప్పటికే చెర్రీ, మహేష్ బాబు, నానీ లాంటి స్టార్స్ అఖిల్ కి సపోర్ట్ లో సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేస్తున్నారు.

గేమింగ్ సంస్థ X box  నుంచి భారీగా లే ఆఫ్ లు
News· 6 Jul 2026

గేమింగ్ సంస్థ X box నుంచి భారీగా లే ఆఫ్ లు

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రముఖ గేమింగ్ సంస్థ ఎక్స్‌బాక్స్ (Xbox), తన మొత్తం సిబ్బందిలో 20 శాతం మందిని ( 3,200 మందిని) ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ ఉద్యోగులకు ఒక ఈమెయిల్ పంపారు.ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పెట్టిన పెట్టుబడిపై భారీగా నష్టాలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించడానికి మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించడం, వెండార్ ఖర్చులను 50% కోత పెట్టడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని తెలిపారు

రావణ్ ది మావోయిస్టు భావజాలం- పోలీసులు
AP· 6 Jul 2026

రావణ్ ది మావోయిస్టు భావజాలం- పోలీసులు

యూట్యూబర్ రావణ్ నిషేధిత మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని గన్నవరం పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. యువతను రెచ్చగొట్లేలా ప్రసంగాలు చేస్తున్నారని అందులో ప్రస్తావించారు. రావణ్ ఫోన్ లో మావోయిస్టు భావజాలం ఉందని, మావోయిస్టు హిడ్మాను ప్రశంసిస్తూ స్పీచ్ లు కూడా ఇచ్చారని గన్నవరం పోలీసుల రిమాండ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశ ఐక్యత, సమగ్రతలను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని ఉపా చట్టం సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.

మనుషులపై హ్యూమనాయిడ్ రోబో దాడి !▶
Viral· 6 Jul 2026

మనుషులపై హ్యూమనాయిడ్ రోబో దాడి !

ఇటీవల చైనా, జపాన్‌లలో రోబోల దాడులు పెరుగుతుండగా, తాజాగా ఇండోనేషియాలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. అక్కడ ఓ హ్యూమనాయిడ్ రోబో ఒక్కసారిగా మనుషులపై విరుచుకుపడింది. ప్రొఫెషనల్ ఫైటర్‌లా కిక్స్ ఇస్తూ కొందరిని గాయపరిచింది. అయితే, దాడి తర్వాత అది బ్రూస్ లీ తరహాలో ఇచ్చిన ఫైటింగ్ పోజు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

గుజరాత్ లో పశువుల కాపరిపై సింహం దాడి !▶
Viral· 6 Jul 2026

గుజరాత్ లో పశువుల కాపరిపై సింహం దాడి !

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఒక సింహం పశువుల కాపరిపై దాడి చేసిన భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవులకు మేత వేస్తుండగా అకస్మాత్తుగా సింహం అతనిపై పంజా విసిరి, దాదాపు 30 నిమిషాల పాటు వదలకుండా కింద పడేసి పట్టుకుంది. గ్రామస్థులు ఎంత అరిచినా, సింహం అతని చేతిని నోటితో, కాలును పంజాతో గట్టిగా పట్టి ఉంచింది. తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఎట్టకేలకు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

మైక్రోసాఫ్ట్ లో  4,800 మంది ఉద్యోగుల తొలగింపు
News· 6 Jul 2026

మైక్రోసాఫ్ట్ లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు

మైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు తెరలేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను విస్తృతంగా వాడుతుండటంతో, కంపెనీలో దాదాపు 4,800 మంది ఉద్యోగులను తీసివేయాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాలపై దీని ప్రభావం పడనుంది. టెక్ రంగంలో AI హవా పెరుగుతుండటంతో వ్యయాలను తగ్గించుకోవడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చుకోవడానికే మైక్రోసాఫ్ట్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

CM విజయ్ బాటలో మరో హీరో!▶
Politics· 6 Jul 2026

CM విజయ్ బాటలో మరో హీరో!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. నటుడు విజయ్ బాటలోనే ధనుష్ కూడా అడుగులు వేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ధనుష్ ఫ్యాన్ క్లబ్ ఫ్లాగ్ లాంచ్ అవ్వడం, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన పాలిటిక్స్‌లోకి వస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ధనుష్ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

MLA అరవ శ్రీధర్ శవయాత్ర!
Politics· 6 Jul 2026

MLA అరవ శ్రీధర్ శవయాత్ర!

రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ ప్రవర్తన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తమ లీడర్‌ను విమర్శించారంటూ రావణ్, జడ శ్రావణ్ కుమార్, ప్రకాష్ రాజ్‌ల ఫొటోలతో జనసేన ఆఫీస్ నుండి శవయాత్ర నిర్వహించారు. అనంతరం MLA స్వయంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. గతంలో వీణ అనే యువతి తనను MLA లైంగికంగా వేధించారంటూ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు MLA, జనసేన నేతల తీరు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకి సుగాలి ప్రీతి తల్లి కంప్లైంట్!▶
Legal· 6 Jul 2026

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకి సుగాలి ప్రీతి తల్లి కంప్లైంట్!

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పవన్ తన కూతురి మరణాన్ని పాలిటిక్స్ కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. పవర్‌లోకి వస్తే ఫస్ట్ సైన్ ప్రీతి కేసుపైనే అని చెప్పి, డిప్యూటీ CM అయ్యాక మాట మార్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని, తాను న్యాయం అడిగితే జనసేన వాళ్లను ఉసిగొల్పి తనపై దాడులు చేయిస్తున్నారంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకి సుగాలి ప్రీతి తల్లి కంప్లైంట్!
Legal· 6 Jul 2026

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకి సుగాలి ప్రీతి తల్లి కంప్లైంట్!

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పవన్ తన కూతురి మరణాన్ని పాలిటిక్స్ కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. పవర్‌లోకి వస్తే ఫస్ట్ సైన్ ప్రీతి కేసుపైనే అని చెప్పి, డిప్యూటీ CM అయ్యాక మాట మార్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని, తాను న్యాయం అడిగితే జనసేన వాళ్లను ఉసిగొల్పి తనపై దాడులు చేయిస్తున్నారంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

సాయికృష్ణ ఫ్యామిలీకి రూ.20 లక్షల సాయం▶
Legal· 6 Jul 2026

సాయికృష్ణ ఫ్యామిలీకి రూ.20 లక్షల సాయం

విజయవాడ కృష్ణలంక లాకప్‌డెత్ బాధితుడు గాదె సాయికృష్ణ కుటుంబాన్ని YSRCP నేతలు పరామర్శించారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లిన అంబటి రాంబాబు, ఆయన తల్లి విజయలక్ష్మిని ఓదార్చారు. పార్టీ తరపున ఆమెకు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మాట ఇచ్చారు.

పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారు!▶
Politics· 6 Jul 2026

పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారు!

‘ప్రశ్న రావణ్’ అరెస్ట్‌పై CPI నేత నారాయణ AP గవర్నమెంట్‌పై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారని.. కానీ రావణ్‌పై UAPA లాంటి తీవ్రమైన కేసులు పెట్టి జైల్లో వేయడం అన్యాయమన్నారు. బెయిల్ రాగానే మళ్లీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసే రైట్ అందరికీ ఉంటుందని మహారాష్ట్ర కోర్టు తీర్పును గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తోందని నారాయణ విమర్శించారు.

పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారు!▶
Politics· 6 Jul 2026

పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారు!

ప్రశ్న రావణ్ అరెస్ట్‌పై CPI నేత నారాయణ AP గవర్నమెంట్‌పై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారని, కానీ రావణ్‌పై UAPA లాంటి తీవ్రమైన కేసులు పెట్టి జైల్లో వేయడం అన్యాయమన్నారు. బెయిల్ రాగానే మళ్లీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసే రైట్ అందరికీ ఉంటుందని మహారాష్ట్ర కోర్టు తీర్పును గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తోందని, పోలీసులు పాలకుల చేతిలో పావుల్లా మారారని నారాయణ విమర్శించారు.

APలో రిటైర్ అయినా మళ్లీ జాబ్!
AP· 6 Jul 2026

APలో రిటైర్ అయినా మళ్లీ జాబ్!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్‌ని 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ కొత్త GO రిలీజ్ చేసింది. ఈ రూల్ 2022 జనవరి 1 నుండి వర్తిస్తుంది. అంటే.. అప్పటినుండి రిటైర్ అయిన వాళ్లను అవసరమైన చోట మళ్లీ డ్యూటీలోకి తీసుకుంటారు. మళ్లీ జాబ్‌లో చేరడం ఇష్టం లేని వాళ్లు 60 ఏళ్లకే రిటైర్ అవ్వచ్చు. ఈ డెసిషన్‌తో రిటైర్మెంట్ వయస్సుపై ఉన్న కన్ఫ్యూజన్‌కి ఎండ్ కార్డ్ పడింది.

AP హైకోర్టులో కొత్తగా ముగ్గురు జడ్జీలు!
Legal· 6 Jul 2026

AP హైకోర్టులో కొత్తగా ముగ్గురు జడ్జీలు!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్ వీళ్లతో ప్రమాణం చేయించారు. ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము గారు వీళ్ల నియామకానికి ఓకే చెప్పడంతో సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ కొత్త జడ్జీల ఎంట్రీతో AP హైకోర్టులో టోటల్ జడ్జీల సంఖ్య 29 నుండి 32కి చేరింది. ఈ ప్రోగ్రామ్‌కి పలువురు సీనియర్ లాయర్లు, అధికారులు అటెండ్ అయ్యారు.

లవర్‌ రూమ్‌లో వైఫ్‌ని చంపేసిన భర్త!
Crime· 6 Jul 2026

లవర్‌ రూమ్‌లో వైఫ్‌ని చంపేసిన భర్త!

హర్యానాలో ఒక ఘోరమైన మర్డర్ జరిగింది. అంకిత్ అనే వ్యక్తికి పెళ్లికి ముందే రజనీ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంది. కానీ అతను మధు అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లయ్యాక కూడా లవర్‌తోనే ఉన్న అంకిత్, వైఫ్‌ని వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. మే 21న భార్యను లవర్ రూమ్‌కి తీసుకెళ్లి గన్‌తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నేపాల్ పారిపోయారు. నెల రోజుల తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.