← Back to news

లవర్‌ రూమ్‌లో వైఫ్‌ని చంపేసిన భర్త!

By sahani· 6 Jul 2026· haryana
లవర్‌ రూమ్‌లో వైఫ్‌ని చంపేసిన భర్త!

హర్యానాలో ఒక ఘోరమైన మర్డర్ జరిగింది. అంకిత్ అనే వ్యక్తికి పెళ్లికి ముందే రజనీ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంది. కానీ అతను మధు అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లయ్యాక కూడా లవర్‌తోనే ఉన్న అంకిత్, వైఫ్‌ని వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. మే 21న భార్యను లవర్ రూమ్‌కి తీసుకెళ్లి గన్‌తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నేపాల్ పారిపోయారు. నెల రోజుల తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లవర్‌ రూమ్‌లో వైఫ్‌ని చంపేసిన భర్త!

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.