Latest

లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!
Crime· 6 Jul 2026

లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!

మహబూబ్‌నగర్ జైలు నుండి POCSO కేస్ రిమాండ్ ఖైదీ కిషోర్ కుమార్ (22) పరారయ్యాడు. వనపర్తి సఖి కేంద్రంలో ఉన్న తన లవర్‌ని కలవడానికి.. సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్‌కి వెళ్తున్నానని చెప్పి, 4 టవల్స్ సాయంతో జైలు గోడ దూకి ఎస్కేప్ అయ్యాడు. అమరచింత మండలానికి చెందిన ఈ ఖైదీ 25 రోజుల క్రితమే అరెస్టయ్యాడు. ఈ ఘటనపై DIG చౌహాన్ జైలు సూపరింటెండెంట్ శశికాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వన్‌టౌన్ పోలీసులు ఖైదీ కోసం వెతుకుతున్నారు.

లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!
News· 6 Jul 2026

లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!

మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఒక రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. POCSO కేసులో అరెస్టై జైలు క్యాంటీన్ లో పని చేస్తున్న కిషోర్ కుమార్ (22), సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్ కు వెళ్తున్నానని చెప్పి, టవల్ సాయంతో గోడ ఎక్కి పారిపోయాడు. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన ఇతను 25 రోజుల క్రితం పట్టుబడ్డాడు. ఖైదీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న DIG చౌహాన్, SP శశికాంత్తో మాట్లాడారు. One Town Police ఖైదీ కోసం గాలిస్తున్నారు.

భార్యకు వీడియో కాల్ చేస్తూ వ్యక్తి ఆత్మహత్య!
Crime· 6 Jul 2026

భార్యకు వీడియో కాల్ చేస్తూ వ్యక్తి ఆత్మహత్య!

వరంగల్ జిల్లా కాజీపేటలో షాకింగ్ ఘటన జరిగింది. రాజేష్ నాయక్ (45) అనే డాక్యుమెంట్ రైటర్, ఆస్తి గొడవల వల్ల భార్య, తల్లిదండ్రులతో గొడవపడి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రైలు పట్టాలపై నిలబడి, ఎదురుగా వస్తున్న రైలును భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ సూసైడ్ చేసుకున్నాడు. తాను చనిపోతున్నానని చెప్తే అతను బెదిరిస్తున్నాడని ఆమె లైట్ తీసుకుంది. సోమవారం ఉదయం పట్టాలపై శవమై తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.

తగ్గిన బంగారం ధరలు!
Politics· 6 Jul 2026

తగ్గిన బంగారం ధరలు!

గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి! హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹110, 22 క్యారెట్లపై ₹100 వరకు తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹1,46,620 గా ఉండగా.. 22 క్యారెట్ల రేట్ ₹1,34,400 గా ఉంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, షాపింగ్‌కి వెళ్లే ముందు లేటెస్ట్ రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.

వారణాసి మూవీలో మహేష్ బాబు రాముడు లుక్!
Cinema· 6 Jul 2026

వారణాసి మూవీలో మహేష్ బాబు రాముడు లుక్!

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 'వారణాసి' సినిమా సెట్స్‌ నుంచి లీకైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మహేష్ శ్రీరాముడి వేషధారణలో కాషాయ వస్త్రాలు, విల్లు, గడ్డంతో కనిపించారు. ఈ లుక్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచినా ఫొటో బయటకు రావడంతో అభిమానుల్లో భారీ చర్చ మొదలైంది. సినిమా విడుదలపై అంచనాలు మరింత పెరిగాయి.

బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి దుర్మరణం
Politics· 6 Jul 2026

బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి దుర్మరణం

ఇంటర్నెట్‌డెస్క్‌: బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి చెందారు. దురత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తోట నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. బహ్రెయిన్‌లోని ఓ సంస్థలో ప్రాజెక్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటర్‌గా శ్రీనివాస్ 2019 నవంబర్ 26 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బహ్రెయిన్ కోస్ట్‌గార్డు బృందాలు సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అనంతరం సంబంధిత అధికారులు చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించారు. శ్రీనివాస్ పని చేస్తున్న MAC సంస్థ యాజమాన్యం అతడి మృతికి సంతాపం ప్రకటించింది.

స్కూల్ స్టూడెంట్స్ వైరల్ వీడియో!▶
Education· 6 Jul 2026

స్కూల్ స్టూడెంట్స్ వైరల్ వీడియో!

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని తమ్మవరం గ్రామ స్కూల్ విద్యార్థులు రోడ్డుపై నిలబడి CM నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌లకు ఒక ఎమోషనల్ అప్పీల్ చేశారు. “CM సార్.. ప్లీజ్ మా ఊరికి ఒక తారు రోడ్డు వేయించండి, మమ్మల్ని కాపాడండి” అంటూ పిల్లలంతా కలిసి వేడుకున్నారు. వర్షాలు వస్తే రోడ్డు అధ్వాన్నంగా మారి స్కూల్‌కి వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను వారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్టూడెంట్స్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

తగ్గిన బంగారం ధరలు!
Politics· 6 Jul 2026

తగ్గిన బంగారం ధరలు!

గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి! హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹110, 22 క్యారెట్లపై ₹100 వరకు తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹1,46,620 గా ఉండగా, 22 క్యారెట్ల రేట్ ₹1,34,400 గా ఉంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, షాపింగ్‌కి వెళ్లే ముందు లేటెస్ట్ రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.

9వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!
Education· 6 Jul 2026

9వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్‌చుక్ స్టార్ట్ చేసిన నిరాహార దీక్ష ఈరోజుతో 9వ రోజుకు చేరింది. దీంతో ఆయన హెల్త్ కండిషన్ చాలా వీక్ అవుతోంది. లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ప్రకారం, ఆయన BP 107/67 కి పడిపోగా, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 72 కి డౌన్ అయ్యాయి. అంతేకాదు, ఈ 9 రోజుల్లో ఆయన ఏకంగా 6.9 Kgల వెయిట్ లాస్ అయ్యారు. ఆయన ఆరోగ్యంపై ప్రస్తుతం అందరిలోనూ ఆందోళన మొదలైంది.

టుడే గోల్డ్ రేట్స్ ఇవే!
Business· 6 Jul 2026

టుడే గోల్డ్ రేట్స్ ఇవే!

గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్, ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి! హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹110, 22 క్యారెట్లపై ₹100 వరకు తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹1,46,620 గా ఉండగా, 22 క్యారెట్ల రేట్ ₹1,34,400 గా ఉంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, షాపింగ్‌కి వెళ్లే ముందు లేటెస్ట్ రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.

ప్రశ్న రావణ్ రిమాండ్‌పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్!▶
Viral· 6 Jul 2026

ప్రశ్న రావణ్ రిమాండ్‌పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్!

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్, రిమాండ్‌పై యాక్టర్ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. "నాలుగు సార్లు అరెస్టు చేసి, నాలుగు సార్లు బెయిల్ వస్తే.. ఇప్పుడు UAPA చట్టాన్ని వాడుతూ రిమాండ్‌కు పంపుతారా?" అని ప్రశ్నించారు. "మీరు ఆట మొదలు పెట్టారు, ప్రజలు దాన్ని క్లోజ్ చేస్తారు" అంటూ ఫైర్ అయ్యారు. నెక్స్ట్ మార్ఫింగ్ వీడియోలతో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా అంటూ జనసైనికులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

KVR అరెస్ట్ వివాదంలో CI శ్రీనివాస్ ట్రాన్స్‌ఫర్!
News· 6 Jul 2026

KVR అరెస్ట్ వివాదంలో CI శ్రీనివాస్ ట్రాన్స్‌ఫర్!

తెలంగాణ జర్నలిస్ట్ KVR అరెస్ట్ కేసులో విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ CI శ్రీనివాస్‌పై బదిలీ వేటు పడింది. నాలుగు రోజుల క్రితం KVRను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సమయంలో ఆయన భార్యతో CI అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె హైదరాబాద్‌ సరూర్‌నగర్ PSలో కంప్లైంట్ చేయడంతో CIపై కేసు నమోదైంది. ఈ ఇష్యూ సీరియస్ అవ్వడంతో అధికారులు CI శ్రీనివాస్‌ను విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు షిఫ్ట్ చేశారు. గతంలో ఇదే కేసులో ఫెయిల్ అయిన బాడంగి SIను కూడా వీఆర్‌కు పంపారు.

అల్లు అర్జున్ 'సంధ్యా థియేటర్' కేసు అప్డేట్!
Cinema· 6 Jul 2026

అల్లు అర్జున్ 'సంధ్యా థియేటర్' కేసు అప్డేట్!

హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఈరోజు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై విచారణ జరగనుంది. గత హీరింగ్‌కు హీరో అల్లు అర్జున్ షూటింగ్ బిజీ వల్ల వర్చువల్‌గా హాజరుకాగా, ఈరోజు కూడా ఆయన ఆన్‌లైన్ ద్వారానే అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా ఉండగా, అందరూ కలిసి వస్తేనే తదుపరి విచారణ ముందుకు సాగుతుందని కోర్టు లాస్ట్ టైమ్ స్పష్టం చేసింది. దీంతో ఈరోజు కోర్టు విచారణపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'కు 14 రోజుల రిమాండ్!▶
Politics· 6 Jul 2026

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'కు 14 రోజుల రిమాండ్!

ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనపై UAPA చట్టం కింద దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోలీసులు ఆయనను నెల్లూరు సబ్ జైలుకు షిఫ్ట్ చేశారు. ఈ అరెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పవర్ ఫుల్ లోయర్ బాడీకి గాబ్లెట్ స్క్వాట్స్
Sports· 5 Jul 2026

పవర్ ఫుల్ లోయర్ బాడీకి గాబ్లెట్ స్క్వాట్స్

ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కు అత్యంత పరిచయమైన వర్కవుట్స్‌లో 'స్క్వాట్స్' (Squats) ఒకటి. అయితే, సాధారణ స్క్వాట్స్ కంటే 'గాబ్లెట్ స్క్వాట్స్' (Goblet Squats) చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఒక డంబెల్ లేదా కెటిల్‌బెల్‌ను ఛాతీకి దగ్గరగా పట్టుకుని చేసే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్ వల్ల లోయర్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. బాడీకి సరైన పొశ్చర్ వస్తుంది.నడుము , పొత్తికడుపు కండరాలు యాక్టివేట్ అయి బలపడతాయి. జిమ్‌లో భారీ బరువులు ఎత్తలేక పోయినా.. ఇంట్లోనే ఒక చిన్న డంబెల్‌తో ఈ 'గాబ్లెట్ స్క్వాట్స్' చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

E20 పెట్రోల్ పై ఢిల్లీలో వాహనదారుల నిరసనలు !
News· 5 Jul 2026

E20 పెట్రోల్ పై ఢిల్లీలో వాహనదారుల నిరసనలు !

ఢిల్లీలో E20 పెట్రోల్ (20% ఇథనాల్ బ్లెండింగ్) విధానానికి వ్యతిరేకంగా వాహనదారులు జంతర్ మంతర్ వద్ద మొదటిసారి రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఇంధనం వల్ల కార్ల మైలేజ్ భారీగా పడిపోతోందని, ఫ్యూయల్ సిస్టమ్స్ చోక్ (బ్లాక్) అయిపోతున్నాయని, ఇంజన్లు ఆగిపోతూ వేల రూపాయల రిపేర్ ఖర్చులు వస్తున్నాయని మోటారిస్ట్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం షుగర్ లాబీకి సపోర్ట్ చేస్తోందని విమర్శిస్తూ.. తమకు నచ్చిన ఫ్యూయల్ ఎంచుకునే ఛాన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ కన్నా చవకైన ఇంధనమంటూ తెచ్చిన ఈ ఇథనాల్ కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది.

ఖమేనీ అంత్యక్రియలకు ముగ్గురు కుమారులు హాజరు !
World· 5 Jul 2026

ఖమేనీ అంత్యక్రియలకు ముగ్గురు కుమారులు హాజరు !

ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆయన ముగ్గురు కుమారులు (ముస్తఫా, మేసమ్, మసౌద్) హాజరయ్యారు. కానీ, ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టిన మరో కుమారుడు మొజ్తబా ఖమేనీ మాత్రం రాలేదు. ఫిబ్రవరిలో జరిగిన దాడిలో మొజ్తబా గాయపడ్డారని, అందుకే భద్రతా కారణాల వల్ల ఆర్మీ (IRGC) ఆయనను బయటకు రావద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉండటంతోనే ఆయన రాలేదని సమాచారం.

సట్లెజ్ మూవీ కి మళ్లీ బ్రేక్-ZEE 5  ఓటీటీ నుంచి తొలగింపు
Cinema· 5 Jul 2026

సట్లెజ్ మూవీ కి మళ్లీ బ్రేక్-ZEE 5 ఓటీటీ నుంచి తొలగింపు

దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' (Punjab 95) మూవీ రిలీజైన రెండు రోజులకే ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నుండి డిలీట్ అయింది. సెన్సార్ బోర్డ్ (CBFC)తో మూడేళ్లు ఫైట్ చేసి, ఎన్నో కట్స్‌తో జూలై 3న స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమాను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ZEE5 ప్రకటించింది. క్రియేటివ్ విజన్‌కు తాము సపోర్ట్ చేస్తామని, ప్రస్తుత పరిణామాల వల్ల తాత్కాలికంగా తీసేసామని, త్వరలోనే లీగల్ ప్రొసీజర్ ద్వారా మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేసింది. దాంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అవుతున్నారు. పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత ఆధారంగా దీనిని తెరకెక్కించారు.

వైభవంగా  అమీర్ ఖాన్, గౌరీ స్ప్రట్ ల వెడ్డింగ్▶
Cinema· 5 Jul 2026

వైభవంగా అమీర్ ఖాన్, గౌరీ స్ప్రట్ ల వెడ్డింగ్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (61) తన గాళ్ ఫ్రెండ్ , వ్యాపారవేత్త అయిన గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. రెండేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట, జూలై 5న ముంబైలోని బాంద్రాలో అమీర్ ఖాన్ నివాసంలో అత్యంత వైభవంగా, సన్నిహితుల సమక్షంలో ఒకటయ్యారు. ఆ వెంటనే అమీర్ ఖాన్ PR ఏజెన్సీ ఈ వేడుక ఫస్ట్ పిక్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసి, తమ వివాహాన్నిRegister చేసుకున్నారు. ఆమీర్ ఇద్దరి భార్యల పిల్లలు ఈ వేడుకకు హాజరు కాగా, గౌరీ తన ఆరేళ్ల కొడుకును కూడా ఈ వేడుకకు తీసుకొచ్చారు. మొత్తం 150 మంది అతిధులు అటెండ్ అయ్యారు.

ఫిలిం మేకింగ్ కి యూ ట్యూబర్స్  నయా డెఫినిషన్ !
Entertainment· 5 Jul 2026

ఫిలిం మేకింగ్ కి యూ ట్యూబర్స్ నయా డెఫినిషన్ !

ఫిలిం మేకింగ్ కి కొత్త డెఫినిషన్ ఇస్తున్నారు నేటి యూ ట్యూబర్స్. హాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టూడియోలకి గట్టి షాకిస్తున్నారు ఈ యంగ్ స్టర్స్! 2026లో హర్రర్ సినిమాలు తీస్తూ, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తున్నారు. స్టూడియో సిస్టమ్‌ను పక్కనబెట్టి, సొంతంగా కథలు రాస్తూ, డైరెక్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. Talk to Me, Late Night with the Devil లాంటి సినిమాలు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. డిజిటల్ స్క్రీన్ల నుండి థియేటర్ల వరకు ఈ క్రియేటర్స్ హవా నడుస్తోంది. హాలీవుడ్‌లో ఈ యూట్యూబ్ స్టార్స్ నిజంగా సరికొత్త ట్రెండ్‌కి తెరలేపారు.

ఒక్క పంచ్ తో పితృస్వామ్యానికి చెక్ !
General· 5 Jul 2026

ఒక్క పంచ్ తో పితృస్వామ్యానికి చెక్ !

భారత్‌లో మహిళలు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో వేగంగా రాణిస్తూ బరిలో ప్రత్యర్థులతో పాటు సమాజంలోని పితృస్వామ్య భావజాలాన్నీ సవాలు చేస్తున్నారు. కఠిన శిక్షణ, గాయాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్లు, మహిళల దూకుడుపై సామాజిక విమర్శలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతున్నారు. రితికా పూజారి, నబీలా బిర్జ్, పూజా తోమర్ వంటి ఫైటర్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూ యువతులకు ధైర్యం, ఆత్మవిశ్వాసానికి కొత్త స్ఫూర్తిగా నిలుస్తున్నారు.