Latest

గుంపు మేస్త్రీ అయితే ఓకే.. ముంపు మేస్త్రీ కావొద్దు
Politics· 28 Jun 2026

గుంపు మేస్త్రీ అయితే ఓకే.. ముంపు మేస్త్రీ కావొద్దు

TG : CM రేవంత్‌ రెడ్డి.. గుంపు మేస్త్రీ అయితే తనకు అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రీ కావొద్దని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కర్ణాటకలో జరిగిన తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్‌ గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల సీఎంలు సమావేశమై ఒప్పందం చేసుకున్నారని, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ కలిసి తెలంగాణను ముంచుతుంటే.. ఆయా రాష్ట్రాల CMలతో కలిసి రేవంత్‌ రెడ్డి సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ముగ్గురు CMల సమక్షంలో జరిగిన చీకటి ఒప్పందం ఏంటో రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జులై 15 నుంచి కొత్త స్కీమ్
TG· 28 Jun 2026

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జులై 15 నుంచి కొత్త స్కీమ్

TG : రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) జులై 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ మొదటి సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని CS తెలిపారు. గతంలో చికిత్సలకు గరిష్ఠంగా రూ.2 లక్షలు చెల్లించేవారని, దాన్ని ఒకేసారి చికిత్సకు కనీసం రూ.5 లక్షలిచ్చేలా మార్చాలని TS PRTU రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి కోరారు.

ఆన్‌లైన్ ఫ్రాడ్ బాధితుల కోసం  ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు!
Politics· 28 Jun 2026

ఆన్‌లైన్ ఫ్రాడ్ బాధితుల కోసం ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు!

డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడుతున్న ఖాతాదారులకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రతిపాదనలు చేసింది. సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు నష్టపోయిన బాధితులకు బ్యాంకుల నుంచి వేగంగా పరిహారం (Compensation) అందేలా కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం కస్టమర్ల తప్పు లేకపోయినా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు ఎక్కువ సమయం పడుతోంది. అయితే, ఇకపై మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే బాధితులకు తగిన ఉపశమనం కలిగించేలా, బ్యాంకుల జవాబుదారీతనాన్ని పెంచేలా ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్‌బీఐ సిద్ధం చేస్తోంది.

సముద్ర గర్భంలో వింత లోకం.. రెండు వారాల్లో 31 కొత్త జీవుల గుర్తింపు!
World· 28 Jun 2026

సముద్ర గర్భంలో వింత లోకం.. రెండు వారాల్లో 31 కొత్త జీవుల గుర్తింపు!

సముద్రపు అగాధాలలో దాగున్న రహస్యాలను ఛేదించే క్రమంలో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. కేవలం రెండు వారాల పాటు సాగిన ఒక ప్రత్యేక సముద్ర పరిశోధన యాత్రలో ఏకంగా 31 కొత్త రకాల వింత సముద్ర జీవులను కనుగొన్నారు. ఇప్పటివరకు మానవ ప్రపంచానికి తెలియని సరికొత్త రకాల చేపలు, జెల్లీఫిష్‌లు, మరియు ప్రత్యేకమైన అండర్ వాటర్ జీవులు ఈ జాబితాలో ఉన్నాయి. అత్యాధునిక డీప్-సీ టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భంలో వేల అడుగుల లోతుకు వెళ్లి ఈ పరిశోధనలు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఆవిష్కరణ సముద్ర జీవవైవిధ్యంపై మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు.

పరీక్షల్లో ఏఐ గ్లాసెస్ కాపీయింగ్.. ఆసియా దేశాల్లో  కొత్త తలనొప్పి!
World· 28 Jun 2026

పరీక్షల్లో ఏఐ గ్లాసెస్ కాపీయింగ్.. ఆసియా దేశాల్లో కొత్త తలనొప్పి!

పరీక్షల్లో కాపీ కొట్టేందుకు కొందరు విద్యార్థులు అత్యాధునిక టెక్నాలజీని వాడుతుండటం ఇప్పుడు విద్యా రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) స్మార్ట్ గ్లాసెస్ సాయంతో ఎగ్జామ్స్‌లో సులువుగా చీటింగ్ చేస్తున్నట్లు వెల్లడైంది. నిరంతరం పరీక్షల ఒత్తిడి, ర్యాంకుల వేట ఎక్కువగా ఉండే ఆసియా దేశాలే ఈ రకమైన హైటెక్ కాపీయింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ గ్లాసెస్ ద్వారా క్వశ్చన్ పేపర్‌ను స్కాన్ చేసి, ఏఐ సాయంతో సమాధానాలు పొందుతున్నట్లు గుర్తించారు. దీనితో ఇన్విజిలేటర్లు మరియు విద్యా సంస్థలు ఈ కొత్త రకం మోసాన్ని అడ్డుకోవడానికి తలలు పట్టుకుంటున్నారు.

4వేల కిలోమీటర్ల ప్రయాణం.. అయినా నిలవని ప్రాణం
World· 28 Jun 2026

4వేల కిలోమీటర్ల ప్రయాణం.. అయినా నిలవని ప్రాణం

TG : ఇథియోపియా దేశానికి చెందిన 13ఏళ్ల బాలిక కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. స్వదేశంలో ఆమెకు రకరకాల వైద్యచికిత్సలు చేయించినప్పటికీ తగ్గలేదు. ఎలాగైనా కూతురిని బతికించుకోవాలని ఆరాటపడిన ఆ తండ్రి, భారత్‌లోని హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం అందుతుందని తెలుసుకున్నాడు. తన కూతురిని తీసుకుని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరాడు. విమానం శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అవుతుండగానే ఆ బాలిక తీవ్రమైన అస్వస్థతకు గురైంది. బాలికను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.

SIRతో అద్దె ఇంట్లో ఉండే వాళ్లలో టెన్షన్
TG· 28 Jun 2026

SIRతో అద్దె ఇంట్లో ఉండే వాళ్లలో టెన్షన్

TG: బతుకుదెరువు కోసం పట్టణాలు, నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న ప్రజలకు ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) భయం పట్టుకుంది. గతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉండి అక్కడే ఓటు పొందినవారు. ఇప్పుడు ఆ చిరునామాలో లేకుంటే తమ ఓటు తీసేస్తారా? అనే డౌట్‌తో టెన్షన్ పడుతున్నారు. కొత్త ఇంటి అడ్రస్‌కు సంబంధించిన రుజువుపత్రాలు లేకుంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అద్దెకు ఉంటున్నవారికి ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. తమ నివాసాన్ని నిర్ధారించే ఆధారాలు సమర్పించాలి. అడ్రస్ ఫ్రూప్ లేకపోతే BLOలు విచారణ చేసి నిర్ధారిస్తారు.

వెలిగొండ ప్రాజెక్టు 4 జిల్లాల తలరాతను మారుస్తుంది: CM▶
AP· 28 Jun 2026

వెలిగొండ ప్రాజెక్టు 4 జిల్లాల తలరాతను మారుస్తుంది: CM

AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ ఒక్కరూ నష్టపోకుండా నిర్వాసితులందరినీ ఆదుకుంటామని CM చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని ఫీడర్ కాల్వ లైనింగ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కొత్తూరు పొలాల్లో ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం చెక్కులు అందించారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల ప్రజల తలరాతను మారుస్తుందన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఫీడర్ కాల్వ లైనింగ్ పనులపై సీఎం సీరియస్ అయ్యారు. జులై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని, లేదంటే సంస్థను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.

పక్షుల భాషకు అర్థం కనుగొన్నందుకు.. రూ. 85 లక్షల ప్రైజ్ మనీ!
General· 27 Jun 2026

పక్షుల భాషకు అర్థం కనుగొన్నందుకు.. రూ. 85 లక్షల ప్రైజ్ మనీ!

మనుషులలాగే పక్షులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయా? వాటి కిలకిలరావాల్లో మనలాగే సంభాషణలు ఉంటాయా? అనే అంశంపై సుదీర్ఘ పరిశోధన చేసిన ఒక శాస్త్రవేత్తకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జీబ్రా ఫించ్ పక్షుల శబ్దాలను నిశితంగా పరిశీలించి, వాటి కమ్యూనికేషన్ పద్ధతులను డీకోడ్ చేసినందుకు గాను ఆమెకు వన్ లాఖ్ డాలర్స్ ప్రైజ్ మనీ దక్కింది. మనుషుల మాటల తీరును, స్పీచ్ థెరపీలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి కూడా పక్షులపై చేసిన ఈ బ్రెయిన్ స్టడీ ఉపయోగపడు తుందని సైంటిస్టులు భావిస్తున్నారు.

స్ట్రెస్ తగ్గించే కొత్త బ్రెయిన్ ట్రీట్‌మెంట్స్..  ఇవే
Health· 27 Jun 2026

స్ట్రెస్ తగ్గించే కొత్త బ్రెయిన్ ట్రీట్‌మెంట్స్.. ఇవే

స్ట్రెస్ తగ్గించే కొత్త బ్రెయిన్ ట్రీట్‌మెంట్స్.. ఎలా పనిచేస్తాయంటే? ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే, ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న సరికొత్త బ్రెయిన్ ట్రీట్‌మెంట్స్ మన మెదడుకు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో శిక్షణ ఇస్తున్నాయి. 'న్యూరోఫీడ్‌బ్యాక్' 'న్యూరోమాడ్యు లేషన్' వంటి అత్యాధునిక సాంకేతికతలతో మెదడులోని తరంగాలను గమనిస్తూ, వాటిని నియంత్రించేలా మనకు అలవాటు చేస్తారు. దీనివల్ల ఎలాంటి మందులు వాడకుండానే యాంగ్జైటీ, స్ట్రెస్ వంటి సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ కే జెన్ జీ మొగ్గు !
Entertainment· 27 Jun 2026

ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ కే జెన్ జీ మొగ్గు !

పెళ్లి అంటే కేవలం డీజేలు, భారీ లైటింగ్, టన్నుల కొద్దీ ఫుడ్ వేస్టేజ్ మాత్రమే కాదు.. తాము ప్రకృతికి హాని చేయకూడదనే స్పృహ జెన్-జీ లో బాగా కనిపిస్తోంది. అందుకే పెళ్లిళ్లలో 'సస్టైనబిలిటీ' (Sustainability) ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ప్లాస్టిక్ రహిత డెకరేషన్, స్థానికంగా దొరికే పూల వాడకం, ఆర్గానిక్ ఫుడ్ మెనూ, మరియు కాగిత రహిత డిజిటల్ ఇన్విటేషన్స్‌ను వీరు ఎంచుకుంటున్నారు. అర్థం లేని పాత ఆచారాల కంటే, ఇరు పక్షాల భావాలకు సరిపోయేలా వేడుకను పర్సనలైజ్ చేసుకుంటూ పెళ్లిని ఒక ‘మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్’గా మార్చుకుంటున్నారు.

ఆర్భాటాలకి బ్రేక్.. 'ఇంటిమేట్ వెడ్డింగ్స్' కే మొగ్గు!
General· 27 Jun 2026

ఆర్భాటాలకి బ్రేక్.. 'ఇంటిమేట్ వెడ్డింగ్స్' కే మొగ్గు!

లక్షలాది రూపాయల ఖర్చు, వేలాది మంది అతిథులతో జరిగే ‘బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్’ సంస్కృతికి నేటి యువత చెక్ పెడుతోంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల మధ్య జరిగే చిన్న, అర్థవంతమైన వేడుకలకే (Intimate Celebrations) ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్పు ఏంటంటే: పెళ్లి పేరుతో చేసే భారీ వృథా ఖర్చులను తగ్గించి, ఆ డబ్బును తమ భవిష్యత్తు అవసరాలకు, పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లేదా హనీమూన్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌ల కోసం ఉపయోగించుకోవడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. షో-ఆఫ్ కంటే క్వాలిటీ టైమ్‌కే జెన్-జీ ఓటేస్తోంది.

వందే భారత్ స్లీపర్ల లో పెట్స్  ను క్యారీ చేసే ఫెసిలిటీ
General· 27 Jun 2026

వందే భారత్ స్లీపర్ల లో పెట్స్ ను క్యారీ చేసే ఫెసిలిటీ

వందే భారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువులను (కుక్కలు/పిల్లులు) తీసుకెళ్లేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా 'పెట్ బాక్స్' సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే పూర్తిగా ఆఫ్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. వందే భారత్‌లో పెట్స్‌ని తీసుకెళ్లాలంటే రైలు టికెట్ కన్ఫర్మ్ అయి ఉండాలి. RAC లేదా వెయిట్‌లిస్ట్పె అయితే పెట్ బాక్స్ బుకింగ్ అనుమతించరు. ఒక PNR పై ఒక పెట్‌ని మాత్రమే అనుమతిస్తారు. రైలు ప్రయాణానికి 3 గంటల ముందే స్టేషన్‌లోని లగేజ్ ఆఫీస్ లో పెట్స్ ని వాటి ట్రాక్ రికార్డు, వాక్సినేషన్ డీటైల్స్, వెయిట్ అన్నీ రికార్డులు సబ్ మిట్ చేయాలి. పెట్ బరువును బట్టి చార్జి ఉంటుంది.

ఆప్ఘనిస్థాన్ ను కుదిపేసిన భూ కంపం !
World· 27 Jun 2026

ఆప్ఘనిస్థాన్ ను కుదిపేసిన భూ కంపం !

వెనిజులాను శిథిలాల దిబ్బ చేసిన భూకంపం ఆప్ఘనిస్థాన్ ను కూడా కుదిపేసింది. ఆప్ఘనిస్తాన్ లో రిక్టర్ స్కేల్ పై 6.2 గా తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెప్పింది. ఆప్ఘనిస్థాన్ లోని కలాఫ్ గాన్ కు 81 కిలోమీటర్ల దూరంలో ఈ భూ కంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే భూమిలో 215 కి.మీ లోతున ఈ ప్రకంపనలు రావడంతో భూమిపై దీని ప్రభావం, నష్టం పెద్దగా లేవు. ఇదే సమయంలో భారత్, పాకిస్థాన్,చైనా అప్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ లలో కూడా ప్రకంపనలు వచ్చాయి.

డబ్బులు అడిగితే చేతబడి చేస్తానని బెదిరింపు.. చివరికీ!
Crime· 27 Jun 2026

డబ్బులు అడిగితే చేతబడి చేస్తానని బెదిరింపు.. చివరికీ!

TG: చామర్తి రామ లచ్చారావు అనే పూజారి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని టార్గెట్ చేశాడు. పూజల పేరుతో నమ్మించి రూ. 20 లక్షలు కాజేశాడు. డబ్బులు తిరిగి అడిగితే చేతబడి చేస్తానని బాధితుడిని బెదిరించాడు. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా అమెరికాకు పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీసులు నిందితుడిపై FIR నమోదు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అమెరికాలో కూడా పలువురిని చీటింగ్ చేయడంతో అతనిపై కేసులు పెట్టాడు. దీంతో ఇండియాకు తిరుగుపయనమయ్యాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే అలర్ట్ అయిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో చిరుత కలకలం
Local· 27 Jun 2026

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో చిరుత కలకలం

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని చిన్మయ విద్యాలయ పరిసరాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాఠశాల సమీపంలో చిరుతను గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పరిసరాలను పరిశీలించి చిరుత ఆనవాళ్ల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా చిరుత కనిపిస్తే వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

నాకు ఏం జరిగినా రేవంత్‌ రెడ్డిదే బాధ్యత:  RS ప్రవీణ్‌కుమార్
Politics· 27 Jun 2026

నాకు ఏం జరిగినా రేవంత్‌ రెడ్డిదే బాధ్యత: RS ప్రవీణ్‌కుమార్

TG: రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షగట్టి వేధిస్తోందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలపై నిరంతరం గొంతెత్తుతూ, విపక్ష నేతగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తనను అధికార పక్షం టార్గెట్ చేసిందని ఆయన ఫైరయ్యారు. ప్రజల పక్షాన నిలబడటమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. తనకు కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం సెక్యూరిటీని తొలగించిందన్నారు. నాకు భవిష్యత్తులో ఏం జరిగినా, నా ప్రాణానికి ఏ హాని తలపెట్టినా CM రేవంత్ రెడ్డిదే బాధ్యత అని స్పష్టం చేశారు.

రన్నింగ్ స్కూల్ వ్యాన్ నుంచి కిందపడ్డ విద్యార్థులు▶
India· 27 Jun 2026

రన్నింగ్ స్కూల్ వ్యాన్ నుంచి కిందపడ్డ విద్యార్థులు

దేశంలో ఎక్కడైనా స్కూల్ వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉంటూ భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలి. తాజాగా నిన్న బెంగళూరులోని KR పురం ప్రాంతంలో ఓ కదులుతున్న స్కూల్ వ్యాన్ నుంచి ఐదుగురు విద్యార్థులు కిందపడిన ఘటన కలకలం రేపింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

YCP, TDP శ్రేణుల తోపులాట.. ఉండవల్లిలో ఉద్రిక్తత
Politics· 27 Jun 2026

YCP, TDP శ్రేణుల తోపులాట.. ఉండవల్లిలో ఉద్రిక్తత

AP: అమరావతిలోని ఉండవల్లిలో YCP నేతలను అడ్డుకునేందుకు TDP నాయకులు, రైతులు, నిరసన కారులు పెద్దఎత్తున రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. YCP నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, రైతు పరిరక్షణ కమిటి నేతలు అమరావతికి బయలుదేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. YCP శ్రేణులు, నిరసనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుకుంది. పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ పోలీస్ అధికారి స్పృహ తప్పి పడిపోవడంతో అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

రన్నింగ్ థార్ టాప్‌పై స్టంట్స్.. ఉప్పల్ బాలుపై కేసు▶
TG· 27 Jun 2026

రన్నింగ్ థార్ టాప్‌పై స్టంట్స్.. ఉప్పల్ బాలుపై కేసు

TG: ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు చేసిన వింత చేష్టలు తీవ్ర వివాదస్పదంగా మారాయి. దట్టమైన అటవీ ప్రాంత రహదారులపై వేగంగా వెళ్తున్న మహీంద్రా థార్ టాప్‌పై కూర్చొని ఉప్పల్ బాలు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ రీల్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన వికారాబాద్ ఫారెస్ట్ అధికారులు ఉప్పల్ బాలుపై కేసు నమోదు నమోదు చేశారు.

బస్సులో మహిళ ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్, కండక్టర్
TG· 27 Jun 2026

బస్సులో మహిళ ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్, కండక్టర్

TG: పెద్దపల్లి జిల్లా మద్దికుంట గ్రామానికి చెందిన తాండ్ర నిరోషా అనే మహిళ RTC బస్సులో వెళ్తోంది. ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో బస్సు సీట్లోనే స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన బస్సు కండక్టర్ సుమన్,, డ్రైవర్ రాజు వెంటనే అలర్ట్ అయ్యారు. బస్సును ఓదెలలోని 108 అంబులెన్స్ పాయింట్‌కు తీసుకొచ్చారు. మహిళను అంబులెన్స్ ఎక్కించి శ్రీరాంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డ్రైవర్, కండక్టర్‌లను శాలువాలతో సన్మానించి అభినందించారు.