వందే భారత్ స్లీపర్ల లో పెట్స్ ను క్యారీ చేసే ఫెసిలిటీ

వందే భారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువులను (కుక్కలు/పిల్లులు) తీసుకెళ్లేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా 'పెట్ బాక్స్' సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే పూర్తిగా ఆఫ్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. వందే భారత్‌లో పెట్స్‌ని తీసుకెళ్లాలంటే రైలు టికెట్ కన్ఫర్మ్ అయి ఉండాలి. RAC లేదా వెయిట్‌లిస్ట్పె అయితే పెట్ బాక్స్ బుకింగ్ అనుమతించరు. ఒక PNR పై ఒక పెట్‌ని మాత్రమే అనుమతిస్తారు. రైలు ప్రయాణానికి 3 గంటల ముందే స్టేషన్‌లోని లగేజ్ ఆఫీస్ లో పెట్స్ ని వాటి ట్రాక్ రికార్డు, వాక్సినేషన్ డీటైల్స్, వెయిట్ అన్నీ రికార్డులు సబ్ మిట్ చేయాలి. పెట్ బరువును బట్టి చార్జి ఉంటుంది.



