డబ్బులు అడిగితే చేతబడి చేస్తానని బెదిరింపు.. చివరికీ!

TG: చామర్తి రామ లచ్చారావు అనే పూజారి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని టార్గెట్ చేశాడు. పూజల పేరుతో నమ్మించి రూ. 20 లక్షలు కాజేశాడు. డబ్బులు తిరిగి అడిగితే చేతబడి చేస్తానని బాధితుడిని బెదిరించాడు. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా అమెరికాకు పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీసులు నిందితుడిపై FIR నమోదు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అమెరికాలో కూడా పలువురిని చీటింగ్ చేయడంతో అతనిపై కేసులు పెట్టాడు. దీంతో ఇండియాకు తిరుగుపయనమయ్యాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే అలర్ట్ అయిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.



