Latest

డబుల్ మిలియన్ మైల్ స్టోన్ దాటిన మా ఇంటి బంగారం..
Politics· 22 Jun 2026

డబుల్ మిలియన్ మైల్ స్టోన్ దాటిన మా ఇంటి బంగారం..

సమంత లీడ్ రోల్‌లో నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసా గిస్తోంది. ఈ చిత్రం తాజాగా డబుల్ మిలియన్ మైల్‌స్టోన్‌ (2 మిలియన్ డాలర్లు/వ్యూస్) మార్కును క్రాస్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.సామ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు తోడు స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ అరుదైన ఘనతతో ట్రేడ్ వర్గాల్లో 'మా ఇంటి బంగారం' రేంజ్ మరింత పెరిగింది. బాక్సాఫీస్ వద్ద సామ్ వన్‌మెన్ షోతో దూసుకుపోతోంది.

యోగా లో బాబా రాందేవ్‌తో పోటీపడుతున్న నారా లోకేష్..▶
Entertainment· 22 Jun 2026

యోగా లో బాబా రాందేవ్‌తో పోటీపడుతున్న నారా లోకేష్..

నిన్న జూన్ 21st ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అందరినీ షాక్‌కి గురిచేశారు. యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ఆయన ఒకే స్టేజ్‌పై యోగా ఆసనాలు వేశారు. బాబా రాందేవ్ వేగంగా ఆసనాలు వేస్తుంటే, లోకేష్ కూడా అంతే స్పీడ్‌తో, పర్‌ఫెక్ట్‌గా వేయడానికి ట్రై చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

చెరువు పైన పందిరి.. రోల్ మోడల్‌గా నిలిచిన రైతు!▶
Motivational· 22 Jun 2026

చెరువు పైన పందిరి.. రోల్ మోడల్‌గా నిలిచిన రైతు!

ఒడిశాలోని సుందర్‌గఢ్‌కు చెందిన ఒక రైతు వినూత్నంగా ఆలోచించి అందరికీ రోల్ మోడల్‌గా నిలిచారు. తనకున్న చెరువు పైన ఒక పందిరి సెటప్ చేసి సొరకాయలతో పాటు ఇతర తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. అదే సమయంలో కింద ఉన్న చెరువు నీటిలో చేపల పెంపకం కూడా చేస్తున్నారు. ఇలా ఒకే ప్లేస్‌లో అటు భూమిని, ఇటు నీటిని వేస్ట్ చేయకుండా వాడుకుంటూ డబుల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఈ వినూత్నమైన అగ్రికల్చర్ ఐడియా ఇప్పుడు చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.

హైదరాబాద్ లో ఈరోజు IT ఎంప్లాయ్స్‌ ఎర్లీ లాగౌట్స్!
News· 22 Jun 2026

హైదరాబాద్ లో ఈరోజు IT ఎంప్లాయ్స్‌ ఎర్లీ లాగౌట్స్!

హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయి ఐటీ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీలకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారు. ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా ఉండటానికి ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచే ఎంప్లాయ్స్‌కి షిఫ్టుల వారీగా ఎర్లీ లాగౌట్స్ ఇవ్వాలని కంపెనీలకు చెప్పారు. ఆఫీసులన్నీ ఒకేసారి కాకుండా గ్యాప్ ఇస్తూ వదిలితే రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని పోలీసులు తెలిపారు.

పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా? దీని వల్ల కలిగే నష్టాలు ఇవే!
Motivational· 22 Jun 2026

పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా? దీని వల్ల కలిగే నష్టాలు ఇవే!

పిల్లలు అడిగిన ప్రతిదాన్ని వెంటనే కొనిపెట్టడం ప్రేమ అనుకుంటే పొరపాటే. ఇలా చేయడం వల్ల వారి ఫ్యూచర్ పాడవుతుంది. ఏది అడిగినా వెంటనే వారికి దొరికేయడం వల్ల పిల్లల్లో ఓర్పు నశిస్తుంది. దేనికోసం వెయిట్ చేయడం వారికి అస్సలు నచ్చదు. అలాగే ఏ కష్టం లేకుండా అన్నీ వచ్చేస్తుంటే, వస్తువుల విలువతో పాటు వాటి వెనుక ఉన్న పేరెంట్స్ కష్టం కూడా వారికి అస్సలు తెలియదు. దీనివల్ల పిల్లల్లో మొండితనం, స్వార్థం పెరిగిపోయి ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. అందుకే పిల్లలకు ప్రేమతో పాటు క్రమశిక్షణ నేర్పడం, హద్దులు పెట్టడం, అవసరమైనప్పుడు 'కాదు' అని చెప్పడం పేరెంటింగ్‌లో చాలా ఇంపార్టెంట్.

అటానమస్ డ్రోన్లతో సైనికులను మట్టు పెట్టొచ్చు
Technology· 22 Jun 2026

అటానమస్ డ్రోన్లతో సైనికులను మట్టు పెట్టొచ్చు

యుద్ధరంగంలో చరిత్రలోనే తొలిసారిగా పూర్తిగా స్వయంప్రతిపత్తితో పనిచేసే డ్రోన్లు సైనికులను మట్టుబెట్టాయి. ఉక్రెయిన్ రక్షణ రంగానికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం ఒక నిర్దిష్ట ప్రాంతంలో శత్రువులను గుర్తించి, నాశనం చేసేందుకు నిర్వహించిన డ్రోన్ పరీక్షల్లో సైనికులు మరణించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘోర ఘటనా వివరాలు 'న్యూ సైంటిస్ట్' పత్రిక ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఫేక్ ప్రచారాల విషయంలో జాగ్రత్త: సీఎం చంద్రబాబు
Politics· 22 Jun 2026

ఫేక్ ప్రచారాల విషయంలో జాగ్రత్త: సీఎం చంద్రబాబు

AP: పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలన్నారు.

కోచింగ్ సెంటర్‌లో మంటలు.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన స్టూడెంట్స్!▶
News· 22 Jun 2026

కోచింగ్ సెంటర్‌లో మంటలు.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన స్టూడెంట్స్!

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఉన్న ఒక కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు వచ్చాయి. దాంతో లోపల ఉన్న స్టూడెంట్స్ ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్‌కి వచ్చి మంటలను కంట్రోల్ చేశారు.

10 ఏళ్లలో ఆరుగురు PMలు రిజైన్!▶
World· 22 Jun 2026

10 ఏళ్లలో ఆరుగురు PMలు రిజైన్!

బ్రిటన్ PM కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రిజైన్ చేయబోతున్నారంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసిన 24 గంటల్లోనే ఈ డెసిషన్ వచ్చింది. 2024లో PM అయిన స్టార్మర్, ఇంత ఫాస్ట్‌గా తప్పుకుంటారని ఎవరూ ఊహించలేదు. గత పదేళ్లలో బ్రిటన్‌లో ఇలా ఆరుగురు ప్రధానులు వరుసగా రాజీనామా చేయడం నిజంగా ఒక షాకింగ్ రికార్డ్.

కూతురి కోసం ఓ తండ్రి ఆవేదన..  ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు!▶
Education· 22 Jun 2026

కూతురి కోసం ఓ తండ్రి ఆవేదన.. ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు!

మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. జస్ట్ కొంచెం లేట్ అవ్వడం, బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, అలాగే అడ్మిట్ కార్డులో మిస్టేక్స్ ఉండటంతో ముగ్గురు అమ్మాయిలు Re-NEET ఎగ్జామ్ రాయలేకపోయారు. తన కూతురిని ఎలాగైనా లోపలికి పంపించాలని ఒక తండ్రి ఎగ్జామ్ సెంటర్ ముందే కిందపడి బోరున ఏడ్చారు. అయినా సరే రూల్స్ అంటూ అధికారులు ఆ స్టూడెంట్స్‌ని అస్సలు అలౌ చేయలేదు. ఇయర్ అంతా కష్టపడి చదివిన ఎగ్జామ్ రాయలేకపోయినందుకు ఆ స్టూడెంట్స్, పేరెంట్స్ అక్కడే కిందపడి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం
Politics· 22 Jun 2026

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం

రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. 60 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. దీంతో మాస్కోలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

RTO ఆఫీస్ ముందే RTO వెంకన్న స్పాట్‌ డెడ్!
Crime· 22 Jun 2026

RTO ఆఫీస్ ముందే RTO వెంకన్న స్పాట్‌ డెడ్!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. భూపాలపల్లి RTO ఆఫీస్ ముందు అధికారులు వెహికల్స్ చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో లారీలను ఆపి చెక్ చేస్తున్న RTO వెంకన్నపై నుంచి ఒక ఇసుక లారీ స్పీడ్‌గా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే స్పాట్‌లోనే చనిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. RTO ఆఫీస్ ముందే ఈ ఘోరం జరగడంతో అక్కడున్న సిబ్బంది, స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

మూడో రోజుకు చేరిన కాక్రోచెస్ ప్రొటెస్ట్!▶
Politics· 22 Jun 2026

మూడో రోజుకు చేరిన కాక్రోచెస్ ప్రొటెస్ట్!

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచెస్ చేస్తున్న ప్రొటెస్ట్ ఈరోజు మూడో రోజుకు చేరింది. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేవరకు తాము ఇక్కడి నుంచి కదిలేదే లేదని పాటలు పాడుకుంటూ కాక్రోచెస్ ఈ ప్రొటెస్ట్ ని మూడో రోజు కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి
Politics· 22 Jun 2026

బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి

బిహార్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీపై దాడి జరిగింది. ఓ భూ వివాదంలో ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు కర్రలతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పంకజ్ త్రిపాఠి స్వగ్రామమైన గోపాల్‌గంజ్ జిల్లా బెల్సంద్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన విజయేంద్రనాథ్‌ని గోపాల్‌గంజ్ మోడల్ ఆస్పత్రికి తరలించారు.

రజనీ, ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్!
Cinema· 22 Jun 2026

రజనీ, ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్ క్రియేట్ చేశారు. 'జైలర్' సినిమా కోసం ఆయన ఏకంగా 250 కోట్లు తీసుకున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్ కూడా తమ సినిమాలకి 200 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు టాక్ ఉంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ వీరందరినీ దాటేసి ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నిలిచారు. ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం వీరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ సరికొత్త రికార్డ్ సెట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అల్లు అర్జున్ ఆబ్సెంట్ పిటిషన్!
Cinema· 22 Jun 2026

అల్లు అర్జున్ ఆబ్సెంట్ పిటిషన్!

సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ కేసుపై నాంపల్లి కోర్టులో జరిగిన హియరింగ్‌కు హీరో అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఆయన తప్ప మిగతా వారంతా కోర్టుకు వచ్చారు. బన్నీ రాకపోవడంతో ఆయన తరపు లాయర్ కోర్టులో ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేశారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే జూలై 6న జరిగే హియరింగ్‌కు కూడా అల్లు అర్జున్ డైరెక్ట్‌గా రాకుండా, వర్చువల్‌గా (ఆన్‌లైన్ ద్వారా) అటెండ్ అవుతాడాని ఆయన లాయర్ కోర్టుకు ఇన్ఫార్మ్ చేశారు. పుష్ప 2 ప్రమోషన్స్ టైమ్‌లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన గొడవకు సంబంధించి ఈ కేసు నడుస్తోంది.

రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు
Politics· 22 Jun 2026

రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్‌పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్యాసింజర్‌ని దింపేందుకు పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. పంజాబ్ రాష్ట్ర డియర్ సమ్మర్ స్పెషల్ బంపర్ లాటరీలో ఫస్ట్ ప్రైజ్‌గా రూ.3 కోట్లను గెలుచుకున్నారు

జస్ట్ 1 నిమిషం లేట్! కూతురు కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న తండ్రి!▶
Education· 22 Jun 2026

జస్ట్ 1 నిమిషం లేట్! కూతురు కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న తండ్రి!

కీసర నీట్ ఎగ్జామ్ సెంటర్‌లో ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ జరిగింది. గూగుల్ మ్యాప్స్ తప్పుగా చూపించడం వల్ల ఒక స్టూడెంట్ కేవలం ఒక్క నిమిషం లేట్‌గా ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చింది. దాంతో ఎగ్జామ్ రాసేందుకు అఫీషియల్స్ పర్మిషన్ ఇవ్వలేదు. తన కూతురి ఫ్యూచర్ పాడైపోతుందని, లోపలికి పంపించాలంటూ ఆ తండ్రి అక్కడున్న పోలీసుల కాళ్లు పట్టుకుని ఏడుస్తూ బతిమాలాడు. అయినా రూల్స్ ఒప్పుకోకపోవడంతో లాభం లేకపోయింది. సంవత్సరం మొత్తం కష్టపడి చదివిన ఎగ్జామ్ రాయలేకపోయామని ఆ స్టూడెంట్, పేరెంట్స్ ఎంతో ఆవేదనతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CM విజయ్ బర్త్ డే స్పెషల్!▶
Politics· 22 Jun 2026

CM విజయ్ బర్త్ డే స్పెషల్!

తమిళనాడులో CM విజయ్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తూత్తుకుడి గవర్నమెంట్ హాస్పిటల్‌లో విజయ్ బర్త్ డే రోజే పుట్టిన ఆరుగురు చిన్న పిల్లలకి లోకల్ MLA, మినిస్టర్ శ్రీనాథ్ స్పెషల్‌గా గోల్డ్ రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. విజయ్ పుట్టినరోజే వాళ్ళు పుట్టడంతో ఆ ఫ్యామిలీస్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

వరల్డ్ రెయిన్‌ఫారెస్ట్ డే!
World· 22 Jun 2026

వరల్డ్ రెయిన్‌ఫారెస్ట్ డే!

మన భూమి మీద ఉన్న దట్టమైన అడవులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో చెప్పడానికే ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా జూన్ 22వ తేదీని "ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవం" (World Rainforest Day) గా జరుపుకుంటారు. ఈ అడవులు భూమిని చల్లగా ఉంచడానికి, టైమ్‌కి వర్షాలు పడటానికి ఎంతగానో హెల్ప్ అవుతాయి. మనం వాడే చాలా రకాల మెడిసిన్స్ కూడా ఈ అడవుల నుంచే వస్తాయి. ఈ ఇయర్ 2026 థీమ్ ఏంటంటే "The Forest Within You" అంటే మనలోనే అడవి ఉందని అర్థం. అందుకే అడవులను నరికేయడం ఆపి, పచ్చదనాన్ని సేవ్ చేసుకోవడం మనందరి రెస్పాన్సిబిలిటీ!

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్!
Business· 22 Jun 2026

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్!

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడాయిల్ రేట్లు తగ్గడం, డాలర్ స్ట్రాంగ్ అవ్వడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,46,070 కాగా, 22 క్యారెట్ల రేటు రూ.1,33,890 గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,46,220 గా, 22 క్యారెట్ల రేటు రూ.1,34,040 గా ఉంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి!