RTO ఆఫీస్ ముందే RTO వెంకన్న స్పాట్ డెడ్!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. భూపాలపల్లి RTO ఆఫీస్ ముందు అధికారులు వెహికల్స్ చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో లారీలను ఆపి చెక్ చేస్తున్న RTO వెంకన్నపై నుంచి ఒక ఇసుక లారీ స్పీడ్‌గా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే స్పాట్‌లోనే చనిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. RTO ఆఫీస్ ముందే ఈ ఘోరం జరగడంతో అక్కడున్న సిబ్బంది, స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



