Latest

మీనాక్షి నామినేషన్ రిజెక్ట్.. అసలు కారణం ఇదే
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ఓ మహిళను వేధించడం, చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆ కేసులో పార్టీ పరంగా మీనాక్షీ నటరాజన్ చర్యలు తీసుకోలేదు. తర్వాత శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. కానీ తర్వాత ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించినట్లు పిటిషన్‌లో సదరు మహిళ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం మీనాక్షికి సమన్లు జారీ చేయడంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.

పార్లమెంట్‌కు పోనివ్వకుండా బీజేపీ చేసిన కుట్ర: నారాయణ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయగా అధికారులు తిరస్కరించారు. దీనిపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. క్రిమినల్ కేసులు నమోదైన వారు నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది కానీ ఎలాంటి కేసులు లేని మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరికాదన్నారు. ఆమెను పార్లమెంట్‌కు పోనివ్వకుండా బీజేపీ చేసిన కుట్ర అని ఫైరయ్యారు.

HYDలో కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన వాహనాలు
హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. వరద ప్రవాహానికి కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్, హైటెక్స్‌లోని బుట్టా కన్వెన్షన్ హాల్, రాయదుర్గం మెట్రోస్టేషన్ కింద, బయోడైవర్సిటీ కూడలి, మల్కంచెరువు వద్దనున్న ఖాజాగూడ ప్రధాన రహదారి, గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో, కొత్తగూడ చౌరస్తాలో నడుములోతున వరదనీరు వచ్చి చేరింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు కార్లు నీటిలో చిక్కుకుని పడవల్లా తేలాయి.

తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత
ప్రముఖ తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు భారతీరాజా. తెలుగులో ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’, ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’, ‘కొత్త జీవితాలు’, ‘యువతరం పిలిచింది’ ఇలా ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించారు.

వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు మృతి
TG: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు యువకులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. పాతబస్తీలో ఆటో దిగిన యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా కరెంట్ వైర్లు తగలడంతో షాక్ కొట్టింది. వెంటనే స్థానికులు హాస్పిటల్‌కు తరలించేలోపే వారిద్దరూ చనిపోయారు. భారీ వర్షం వల్ల సిటీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరెంటు తీగలు తెగి పడిపోయాయి. వర్షంతోపాటు ఈదురుగాలులు కూడా వీయడంతో చాలా చోట్ల వైర్లు తెగి నేలపై పడ్డాయి. దీంతో అక్కడక్కడ కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై సహాయ చర్యలు చేపట్టారు.

మీ ఫిట్ నెస్ ట్రాకర్ సామర్ధ్మం ఎంత?
మార్కెట్లోని టాప్ హెల్త్ ట్రాకర్లన్నీ మంచి క్వాలిటీవి కాకపోవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ క్లినికల్ ల్యాబ్ టెస్టులు చెబుతున్నాయి. స్టాన్‌ఫోర్డ్ స్లీప్ మెడిసిన్ సెంటర్ ల్యాబ్ ఫలితాలతో పోల్చగా.. నిద్రను కచ్చితంగా అంచనా వేయడంలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 అగ్రస్థానంలో నిలిచింది. తీవ్రమైన శారీరక శ్రమ సమయాల్లో 'వూప్' (Whoop) మెరుగైన రీడింగ్స్ ఇవ్వగా.. ఫిట్‌బిట్, ఔరా రింగ్‌లు కొంతవరకు తప్పుడు ఫలితాలనిచ్చినట్లు ఈ పరిశోధనలో తేలింది.

దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది: మంత్రి ఉత్తమ్
TG: ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందని, 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కేంద్రం చెప్పిందని అన్నారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. దేశంలో పండే వరిలో 61 శాతం తెలంగాణలోనే ఉందన్నారు.

'రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం'
AP: రెండేళ్లలో లక్షల కోట్లు అప్పు చేయడం తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఉంగుటూరు మాజీ MLA పుప్పాల వాసుబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో "వెన్నుపోటుకు రెండేళ్లు "నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లలో జరిగిన కుటమి ప్రభుత్వం వైఫల్యాలకు నిరసనంగా బ్లాక్ బెలూన్స్ ఎగరవేశారు. కూటమి నాయకులు విచ్చలవిడిగా ప్రైవేట్ ఫైట్లలో తిరుగుతూ ప్రభుత్వానికి భారంగా మారి ప్రజలకు పొదుపు మంత్రాలతో నీతులు చెబుతున్నారని ఆయన అన్నారు.

టిడిపి రాజ్య సభ అభ్యర్ధి ఆస్తులివే !
. భాష్యం రామకృష్ణ పేరిట రూ.454.95 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రామకృష్ణ భార్య లక్ష్మీప్రసన్న,కుమారుడు సాకేత్ రామ్,కుమార్తె జననికృష్ణ పేరిట మొత్తం రూ.169.97 కోట్ల చరాస్తులు, రూ.502.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చారు. కుటుంబం వద్ద ఉన్న వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, షిప్‌ల విలువ రూ.18.37 కోట్లు కాగా.. అందులో రూ.18.14 కోట్ల విలువైన వాహనాలు కుమారుడు సాకేత్ రామ్ పేరిట ఉన్నాయి. కుటుంబ అప్పులు రూ.200.65 కోట్లు కాగా, అందులో రూ.132.43 కోట్లు రామకృష్ణ పేరిట ఉన్నాయి..

ఉద్దేశపూర్వకంగానే అపోహలు సృష్టిస్తున్నారు: లోకేష్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. కొందరు కార్మిక సంఘాల నేతలు కావాలనే ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని ఆయన ఫైరయ్యారు. ప్రమాదంలో మరణించిన శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు ఒకే తరహా సాయాన్ని మంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, వారి పిల్లల చదువుకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు స్టీల్ ప్లాంట్లోనే క్వార్టర్స్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

'MLA విజయరమణారావుకు మతిభ్రమించింది'
TG: పెద్దపల్లి MLA విజయరమణారావుకు మతిభ్రమించిందని , మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదని మాజీ MLA దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడారు. హరీశ్‌రావుపై ఎమ్మెల్యే విజయరమణారావు చేసిన అనుచిత ఆరోపణలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

HM కు మార్కాపురం MLA బంపర్ ఆఫర్
AP: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని మార్కాపురం MLA కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురంలోని ZP బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకటి, రెండోతరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గొట్లగట్టు ZP హైస్కూల్ విద్యార్థి 592మార్కులు సాధించి గవర్నమెంట్ స్కూల్ సత్తా చాటాడని అన్నారు. ఆ పాఠశాల HMకు ఈ నెల 19న మెగా పేరెంట్స్ డే సందర్భంగా రూ.1 లక్ష ప్రోత్సాహక బహుమతి అందజేస్తానని ప్రకటించారు.

గో మాంసం స్కూలుకు తెచ్చారని ఐదుగురు ముస్లిం స్టూడెంట్స్ పై వేటు?
అసోంలోని గోపాల్‌పరాకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాలలో లంచ్ బాక్స్‌లలో 'బీఫ్' (గోమాంసం) తెచ్చారనే వివాదం కలకలానికి దారి తీసింది. ఈ ఘటనపై హిందూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేవలం శాఖాహార భోజనాన్ని మాత్రమే అనుమతించాలని యాజమాన్యం నిర్ణయించింది. గో మాంసం తెచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ముస్లిం విద్యార్థులను స్కూలు నుంచి బహిష్కరిస్తారన్న వార్తలొస్తున్నాయి.

ప్రివెంటివ్ బ్లడ్ టెస్టులు అవసరమా? కాదా?
ప్రివెంటివ్ బ్లడ్ టెస్ట్స్ చేయించుకోవడం అవసరమా కాదా అన్న అంశంపై రకరకాల వాదనలున్నాయి.. ప్రమాదకరమైన జబ్బులను ముందే పసిగట్టాలంటే ముందస్తు వైద్య పరీక్షలు అవసరమేనని కొందరు నిపుణులు అంటుంటే.. అలా తరచుగా పరీక్షలు చేయించుకోవడం మంచిది కాదని మరికొందరు అంటున్నారు. అయితే అవసరాన్ని బట్టి వయసు, ఆరోగ్య చరిత్రనుబట్టి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ అంశంపై మింట్ న్యూస్ మ్యాగజైన్ నిర్వహించిన చర్చలో నిపుణులు ఈ సూచనలు చేశారు.

'మహిళలతో పెట్టుకున్నందుకే BRS ఓడిపోయింది'
మహిళలతో పెట్టుకున్నందుకే BRS పార్టీ ఓడిపోయిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మహిళా శక్తి మీటింగ్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు గుర్తింపు ఉంటుందన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం చెల్లించలేదు. తాము మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.10,500 కోట్లు చెల్లించామన్నారు.

'రెండేళ్లలో ఎవరూ సంతోషంగా లేరు'
AP: రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా లేరని YCP నాయకులు విమర్శించారు. మంగళవారం మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని భాస్కర్ రెడ్డి కల్యాణ మండపంలో YCP ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మిగతా రాష్ట్రాల కన్నా APలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 13న స్కూళ్లు క్లీన్ చేయనున్న బీజేపీ నేతలు
TG: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపునిచ్చారు. 'స్వచ్ఛ పాఠశాల' పేరిట ఈ నెల 11న 'టిఫిన్ బైఠక్', 13న బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు స్వయంగా క్లాస్ రూమ్‌లను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టనున్నారు. జూన్ 16న గ్రామాలు, పట్టణాల్లో బడిబాట నిర్వహించి, పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తెస్తామని బండి సంజయ్ తెలిపారు.

'రేవంత్ రెడ్డి పవర్‌లోకి రాగానే హిట్లర్‌లా మారారు'
TG: CM రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బట్లర్‌లా ఉండి.. పవర్‌లోకి రాగానే హిట్లర్‌గా మారారని భువనగిరి మాజీ MP, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మంగళవారం నాంపల్లి BJP స్టేట్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసే దమ్ములేదని, ఆ పార్టీ నాయకులకు మైక్ దొరికితే మాత్రం బీజేపీని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తిడుతున్నారన్నారు. మెట్రో, RRRకి కిషన్ రెడ్డి నిధులు తెస్తే రేవంత్.. మూసీ నదిలో గడ్డి పీకడానికి ఉన్నారా? అని ప్రశ్నించారు.

వెట్టిచాకిరి గుట్టురట్టు.. 10మంది కార్మికులకు విముక్తి
AP: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రెండు ఇటుక బట్టీలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు మేరకు వెట్టిచాకిరిపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కోనేటి శ్రీను ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన పది మంది కార్మికులను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారు. వీరికి వైద్య పరీక్షలు చేయించి వారి స్వగ్రామానికి పంపిస్తున్నట్లు లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు తెలిపారు.

స్వచ్ఛపాఠశాల పేరుతో బండి సంజయ్ వినూత్న ప్రొగ్రామ్
TG: నరేంద్ర మోదీ ప్రభుత్వం 12ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ స్కూళ్లను 'స్వచ్చ పాఠశాల' పేరుతో పరిశుభ్రం చేయాలని సంకల్పించారు. ఈ నెల 13వ తేదీన 7 అసెంబ్లీ నియోజవర్గాల్లోని అన్ని ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలన్నింటిన్నీ క్లీన్ చేయాలని నిర్ణయించారు.

మైండ్ రీచార్జ్ కావాలంటే సైలెన్స్ బెస్ట్ !
రోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా గడపడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్, బోస్టన్ యూనివర్సిటీల ఉమ్మడి అధ్యయనం ప్రకారం.. కాసేపు ప్రశాంతంగా మౌనం పాటించడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఈ అలవాటు మెదడులోని వివిధ భాగాలను అనుసంధానించి, ఆలోచనా శక్తిని మెరుగుపరచడమే కాకుండా మానసిక దృఢత్వాన్ని ఇస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.