← Back to news

వెట్టిచాకిరి గుట్టురట్టు.. 10మంది కార్మికులకు విముక్తి

By DK· 9 Jun 2026· Hmtvlive· ప్రకాశం జిల్లా
వెట్టిచాకిరి గుట్టురట్టు..  10మంది కార్మికులకు విముక్తి

AP: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రెండు ఇటుక బట్టీలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు మేరకు వెట్టిచాకిరిపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కోనేటి శ్రీను ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన పది మంది కార్మికులను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారు. వీరికి వైద్య పరీక్షలు చేయించి వారి స్వగ్రామానికి పంపిస్తున్నట్లు లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు తెలిపారు.

More in AP