← Back to news

వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు మృతి

By DK· 10 Jun 2026· News18· హైదరాబాద్‌
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు మృతి

TG: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు యువకులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. పాతబస్తీలో ఆటో దిగిన యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా కరెంట్ వైర్లు తగలడంతో షాక్ కొట్టింది. వెంటనే స్థానికులు హాస్పిటల్‌కు తరలించేలోపే వారిద్దరూ చనిపోయారు. భారీ వర్షం వల్ల సిటీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరెంటు తీగలు తెగి పడిపోయాయి. వర్షంతోపాటు ఈదురుగాలులు కూడా వీయడంతో చాలా చోట్ల వైర్లు తెగి నేలపై పడ్డాయి. దీంతో అక్కడక్కడ కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై సహాయ చర్యలు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.