Latest

అర్హతలు లేకుండా వైద్యం.. నకిలీ డాక్టర్ గుట్టురట్టు
TG: హన్మకొండలోని ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడి చేశారు. బత్తుల రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మొత్తం 41రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి ముప్పు అని మందుల శాంపిల్స్‌ను విశ్లేషణకు పంపారు. కేసు నమోదు చేసినట్లు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

భారత్ గ్రాండ్ మాస్టర్ కొత్త హిస్టరీ
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రతిష్టాత్మకమైన Norway Chess 2026 టైటిల్‌ను గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమెర్ ను ఓడించి 18 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచాడు. టోర్నీ మధ్యలో ప్రజ్ఞానంద్ వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకుని టైటిల్ సొంతం చేసుకున్నాడు. విశేషమేమిటంటే, ప్రపంచ నంబర్-1 మాగ్నస్ కార్లసన్ సొంత గడ్డపైనే ఈ ఘనత సాధించాడు.

హార్మూజ్ లో మళ్లీ యుద్ధ వాతావరణం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లు వాణిజ్య నౌకలకు ముప్పుగా మారుతుందని అమెరికా సైన్యం వాటిని సక్సెస్ ఫుల్ గా కూల్చేసింది. ఆ తర్వాత ఇరాన్ తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులకు దిగింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన జలసంధిలో యుద్ధవాతావరణం నెలకొనడం ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది.

రజనీ భార్య కొత్త సామాజిక వేదిక.. - మక్కల్ మడై !
సూపర్ స్టార్ రజనీ కాంత్ భార్య లత తమిళనాట మక్కల్ మడై అనే సరికొత్త సామాజిక వేదికను ప్రారంభించారు.. ప్రజల సమస్యలను వినడానికి, మహిళలు, పిల్లలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడేందుకు దీనిని ఏర్పాట్లు చేసినట్లు ఆమె ప్రకటించారు.రాస్ట్రం కోసం పనిచేయాలనుకునే వారంతా ఇందులో భాగం కావచ్చని ప్రకటించారు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని లత అన్నారు. అయితే దీనిని భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా భావించవచ్చని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. సీఎం విజయ్ కూడా ఇలాంటి వేదికతోనే బాగా పాపులర్ అయి ఆ తర్వాత పొలిటికల్ అరంగేట్రం చేశారు.

ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న నైజీరియన్ జంట !
ఢిల్లీలో హోటల్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో ఓ నైజీరియా జంట ఈ యాక్సిడెంట్ నుంచి సేఫ్ గా బయటపడింది.ఫైర్ యాక్సిడెంట్స్ అప్పుడు సెఫ్టీ మెజర్స్ మీద ఐడియా ఉన్న ఆ జంట బాత్ రూమ్ లో షవర్ ఆన్ చేసి నేలపై తువ్వాళ్లు పరుచుకుని రన్నింగ్ వాటర్ కింద తక్కువ ఎత్తులో పడుకుని సహాయం అందే వరకూ అలాగే ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ పైకి లేచి గదిలో పై భాగంలో పేరుకు పోతుంది. అందువల్ల షవర్ ఆన్ చేసి నేలకు దగ్గరగా ఉంటే ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నారు.

కర్ణాటక కేబినెట్ లో అలకల పర్వం... డికె కు తలనొప్పులు !
కర్ణాటక కొత్త సీఎం డి.కె. శివకుమార్ కు సరికొత్త తలనొప్పులు మొదలయ్యాయి. డికె తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కొందరు తమకు కోరిన శాఖ ఇవ్వలేదని అలకబూనారు. ఓ సినియర్ మంత్రి తన పదవిపై అసంతృప్తితో ఉండగా, రామలింగారెడ్డి అనే మంత్రి ఏకంగా పదవికే రాజీనామా చేసిపారేశారు.ఇక మునియప్ప అనే మంత్రి కూడా తనకు ఇచ్చిన శాఖపై అయిష్టతతో ఉన్నారు. సీనియర్ లంతా ఇలా అలక పాన్పు ఎక్కడంతో ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ఎవరినీ బుజ్జగించవద్దని సీఎం డి.కె . శివకుమార్ కు సూచించింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆన్‌లైన్ క్యాంపెయిన్..!
'గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్'పై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆన్ లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. #GreenOverGreed, #NicobarMatters హ్యాష్‌ట్యాగ్స్‌తో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. నికోబార్ దీవుల్లో స్కూబా డైవింగ్‌తో పగడపు దిబ్బలను విధ్వంసం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
కేరళలో భారీ వర్షాలు.. ఐఎండి రెడ్ అలర్ట్
కేరళలో నైరుతి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కేరళలో ఐదు జిల్లాలు కొజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్, కాసరగోడ్‌లకు శనివారం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ఐదు జిల్లాలో రాబోయే 24 గంటల్లో 204 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా వంటి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కాగా, ఐఎండి మలప్పురం, కొజికోడ్, వయనాడ్ జిల్లాలకు ఆదివారం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాసర్‌గోడ్, కన్నూర్, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాలకు కూడా సండే వరకూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది

ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్
TG : రంగారెడ్డి జిల్లా కొహెడలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సూసైడ్ ఘటన కలకలం రేపింది. హన్మకొండకు చెందిన దేవేందర్ రెడ్డి కొహెడలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో నాలుగు రోజుల క్రితమే తన నివాసం నుంచి హాస్టల్‌కు వచ్చాడు. హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యంగా చెప్పారని తల్లిదండ్రులు ఆరోపించారు.

'పాలన చేతకాకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి'
TG : పాలన చేతకాకపోతే CM పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ BJP బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామని సీఎం చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఫైరయ్యారు.

నేషనల్ హైవేపై కారు బోల్తా
AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేట సమీపంలోని నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పగలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మర్రిపాడు నుంచి ఆత్మకూరుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

బాలికపై లైంగికదాడి.. తండ్రీకొడుకులకు జీవితఖైదు
TG: కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన శివకుమార్(45), అతని కుమారుడు శామ్యూల్(21) మేడ్చల్ జిల్లాలోని కొంపల్లిలో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. 2023 ఆగస్టు 10న స్థానికంగా ఉండే కూలీ దంపతులు పనికి వెళ్తూ తమ ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లారు. ఓ బాలికను పక్కింటి శివకుమార్, శామ్యూల్ వారి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు బాధిత తల్లి పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా కోర్టు తండ్రీకొడుకులకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
AP: కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు నీటి గుంతలో పడి మృతి చెందారు. దుంపలగట్టు విలేజ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు సంజన(18), అర్చన (14) తమ పందులకు నీళ్లు తాపడం కోసం పొలం పరిసరాల్లోకి వెళ్లారు. అక్కడ ఉన్న నీటిగుంతలో ఒకరు పడిపోగా, వారిని రక్షించే క్రమంలో మరొకరు మునిగిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరి డెడ్‌బాడీలను బయటకు తీశారు.

'రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'
TG: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అబద్దాల లెక్కలు నమ్ముకుంటే రైతులు డ్రిప్పులు, స్ప్రింక్లర్ల మీదే ఆధారపడాల్సి వస్తుందన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది KCR అని గుర్తు చేశారు.

మెక్సికోలో దొంగిలించిన ఫ్యూయల్ తో ఉన్న ట్యాంకర్ భారీ పేలుడు
మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలో దొంగిలించిన ఇంధనాన్ని తీసుకెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ ట్రక్ ఒక్కసారిగా భారీ అగ్నిగోళంలా పేలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా స్థానిక నివాసితులు, ఆసుపత్రి రోగులు,విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ప్యూబ్లాకు సమీపంలో ఉన్న టెపీకా అనే చిన్న నగరం లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ట్యాంకర్ పేలుడుతో నారింజ రంగులో పుట్టగొడుగు షేప్ లో అగ్నిగోళం ఎగసిపడింది.

ఈతకు వెళ్లి నలుగురు గల్లంతు
TG: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బొల్లక్‌పల్లి వద్ద మంజీరా నదిలోకి ఈతకు వెళ్లిన నలుగురు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో వారిలో ముగ్గురి డెడ్‌బాడీలను బయటకు తీశారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కిష్టాపూర్‌కు చెందినవారుగా గుర్తించారు.
రాజ్‌పాల్ యాదవ్‌పై అక్షయ్ కుమార్ క్రేజీ ప్రాంక్!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సెట్స్‌లో ఎంత అల్లరి చేస్తారో ఈ వీడియోలో చూడండి. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'వెల్‌కమ్ టు ది జంగిల్' షూటింగ్ సెట్స్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌పై అక్షయ్ కుమార్ ఒక క్రేజీ ప్రాంక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే కాబట్టి, సెట్స్‌లో వీరు చేసిన ఈ సందడి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బే సిటీగా విశాఖ నగరం - చంద్రబాబు
బే సిటిగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం 9 జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష జరిపారు..నగరంలోని కైలాసగిరి నుంచి భోగా పురం వరకూ ఈ బేసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని, కైలాసగిరిని ఆధ్యాత్మికంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దా లని స్పష్టం చేశారు.

పెద్దపులి సంచారంతో తగ్గిన పర్యాటకులు
AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెంలో పులి సంచారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్, డ్రోన్ కెమెరాలతో కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పులి సంచారం దృష్ట్యా దేవీపట్నంలోని గండిపోచమ్మ టెంపుల్‌కు వెళ్లే రోడ్డు మూసివేశారు. పాపికొండలు వీక్షించేందుకు వచ్చే టూరిస్ట్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది.
'ఉప్పెన'ను మించి 'పెద్ది' రెస్పాన్స్: డైరెక్టర్ బుచ్చిబాబు
రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు స్పందించారు. తన మొదటి సినిమా "#Uppena కంటే 'పెద్ది'కి వస్తున్న రెస్పాన్స్ 10 రెట్లు ఎక్కువగా ఉంది" అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ రియాక్షన్ చూసి తాము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా, ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ గారు పడ్డ కష్టాన్ని, ఆయన డెడికేషన్‌ను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.

పవన్ పై నో కామెంట్ అన్న రేవంత్
తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపలేదు. 'పవన్ ప్రశ్నించారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు, ఇక మనకెందుకు శ్రమ' అని దాటవేశారు. ఇదే సమయంలో, కేసీఆరే నీళ్లు అనేది అబద్ధమని.. కేసీఆర్ అంటే సారా, సోడా అంటూ బీఆర్ఎస్ అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు.