← Back to news

కేరళలో భారీ వర్షాలు.. ఐఎండి రెడ్‌ అలర్ట్‌

By DS· 5 Jun 2026· kerala

కేరళలో నైరుతి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కేరళలో ఐదు జిల్లాలు కొజికోడ్‌, వయనాడ్‌, మలప్పురం, కన్నూర్‌, కాసరగోడ్‌లకు శనివారం వరకు రెడ్‌ అలర్ట్‌ ‌ప్రకటించింది. ఈ ఐదు జిల్లాలో రాబోయే 24 గంటల్లో 204 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఐఎండి రెడ్‌ అలర్ట్‌ ‌ప్రకటించింది. ఇక తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా వంటి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ‌ప్రకటించింది. కాగా, ఐఎండి మలప్పురం, కొజికోడ్‌, వయనాడ్‌ ‌జిల్లాలకు ‌ఆదివారం వరకు రెడ్‌ అలర్ట్‌ ‌ప్రకటించింది. కాసర్‌‌గోడ్‌, కన్నూర్‌, త్రిస్సూర్‌, పాలక్కాడ్‌ ‌జిల్లాలకు కూడా సండే వరకూ ఆరెంజ్‌ ‌అలర్ట్‌ ‌ప్రకటించింది

More in News