Latest

పవన్ కళ్యాణ్‌కు సివియర్ బ్యాక్ పెయిన్!
Politics· 4 Jun 2026

పవన్ కళ్యాణ్‌కు సివియర్ బ్యాక్ పెయిన్!

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ నుండి మధ్యలోనే వెళ్ళిపోయారు. అమరావతిలో Secretariat లో జరుగుతున్న మీటింగ్ కి ఆయన attend అయ్యారు. అయితే మీటింగ్ జరుగుతుండగానే పవన్ కళ్యాణ్‌కు సడన్‌గా seviour Back Pain రావడంతో ఆయన మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఈ హెల్త్ ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటైల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.

యాక్సిడెంట్ అయినా తగ్గేదేలే!▶
Viral· 4 Jun 2026

యాక్సిడెంట్ అయినా తగ్గేదేలే!

ఇది సినిమా స్టంట్ కాదు, AI Video అసలే కాదు. ట్రాఫిక్ కెమెరాలో రికార్డ్ అయిన రియల్ incident. రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూటర్ రైడర్.. ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను గట్టిగా ఢీకొట్టాడు. ఆ ఇంపాక్ట్‌కి అతను గాల్లోకి లేచి, సరిగ్గా ఎదురుగా వస్తున్న ఒక పెద్ద ట్రక్ పై ఎగిరిపడ్డాడు. కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే! అంత పెద్ద ప్రమాదం జరిగినా ఆ రైడర్ ఏమాత్రం కంగారు పడకుండా, వెంటనే తేరుకుని ఏమీ జరగనట్టు సైలెంట్‌గా లేచి అక్కడ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

మంటల్లో వెల్లి విరిసిన మానవత్వం... పరుపుల దుకాణం ఓనర్  పెద్ద మనసు
General· 4 Jun 2026

మంటల్లో వెల్లి విరిసిన మానవత్వం... పరుపుల దుకాణం ఓనర్ పెద్ద మనసు

ఢిల్లీలోని 'ఫ్లరిష్ స్టేస్' హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోయారు. అయితే, అక్కడ ఎదురుగా ఉన్న ఒక పరుపుల దుకాణం యజమాని రియాజుద్దీన్ మన్సూరి, అతని కుమారుడు అర్మాన్ చూపిన మానవత్వం మరిన్ని ప్రాణాలను కాపాడింది.తమ వ్యాపార నష్టాన్ని సైతం లెక్కచేయకుండా, సుమారు ₹2 లక్షల విలువైన 20-22 కొత్త పరుపులను, రగ్గులను బిల్డింగ్ కింద పరిచారు. దీనివల్ల పై అంతస్తుల్లో చిక్కుకున్న వారు కిందకు దూకి ప్రాణాలు దక్కించుకోగలిగారు.

నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు గల్లంతు
Politics· 4 Jun 2026

నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు గల్లంతు

AP: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం విలేజ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న నీటికుంటలో పడి గల్లంతయ్యారు. చిన్నారుల ఆర్తనాదాలు, కేకలు విన్న స్థానికులు నీటికుంటలో దూకి గాలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారులు దినేశ్(10), పొందిలి చిన్ను(11), కరేటి సుశాంత్(12), కరేటి అభిరామ్‌(14)లు గల్లంతైనట్లు గుర్తించారు. తమ పిల్లల ఆచూకీ దొరకకపోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఢిల్లీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ లో కంటతడిపెట్టించే ఎమోషనల్ విజువల్స్ !!
Politics· 4 Jun 2026

ఢిల్లీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ లో కంటతడిపెట్టించే ఎమోషనల్ విజువల్స్ !!

ఢిల్లీలోనిFlourish Stay BnB హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో బాధితులు చనిపోయిన తీరు చాలా పెయిన్ ఫుల్ గా కనిపిస్తోంది. ఒక జంట ఒకరినొకరు హత్తుకుని కాలి బూడిదైపోయారు. మంటలనుంచి తప్పించుకోడానికి వారు గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు లాక్ చేసుకున్నారు. రక్షించడానికి వచ్చిన మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి ఆ తలుపులు బద్దలుకొట్టి చూడగా.. వారు ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుని చనిపోయారు. మంటల వల్ల కాకుండా, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. మరొక రూమ్ లో ఒక జంట బెడ్ అంచుల్లో కూర్చున్న వారు అదే పొజిషన్ లో కాలిపోయారు.

PV సింధు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!
Politics· 4 Jun 2026

PV సింధు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకు ఇండోనేషియా ఓపెన్‌లో మరోసారి షాక్ తగిలింది. ఈరోజు జరిగిన రౌండ్-ఆఫ్-16 మ్యాచ్‌లో సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ఆన్ సే-యంగ్ చేతిలో సింధు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆన్ సే-యంగ్ 17-21, 14-21 స్కోర్‌తో సింధుపై ఈజీగా గెలిచింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన మొత్తం 10 మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడిపోయింది. లాస్ట్ వీక్ జరిగిన సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్‌లో కూడా సింధు ఓటమి ఫేస్ చేసిన సంగతి తెలిసిందే.

భార్యను చంపి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త
Crime· 4 Jun 2026

భార్యను చంపి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

TG: కుటుంబ కలహాలతో భర్త భార్యపై కత్తితో దాడిచేసి చంపాడు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కైతలాపూర్‌ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న ఆస్మరా బేగం(24), షేక్ రహీంలకు 2024లో పెళ్లి అయింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మ్యారేజ్ అయినప్పటి నుంచి వీరికి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై గతంలో దంపతులిద్దరూ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం వారి మధ్య గొడవ జరగడంతో రహీం కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం డైరెక్ట్‌గా రహీం స్థానిక PSలో లొంగిపోయాడు.

పవన్ కళ్యాణ్‌ స్క్రిప్ట్ లేనిదే మాట్లాడలేడు!▶
Viral· 4 Jun 2026

పవన్ కళ్యాణ్‌ స్క్రిప్ట్ లేనిదే మాట్లాడలేడు!

జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నిరుద్యోగ JAC లీడర్ జనార్ధన్ గట్టిగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏ సభలో మాట్లాడినా స్క్రిప్ట్ లేనిదే మాట్లాడలేరని. ఆయనకు ప్రజా సమస్యలపై అస్సలు అవగాహన లేదని అన్నారు. పవన్ మాటల్లో ఓన్లీ సినిమా డైలాగులే ఉంటాయని, సమస్యల తీవ్రత గురించి ఆయనకు ఏమాత్రం తెలీదని కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 15ఇయర్స్ పైనే అయినా, ప్రెసెంట్ డిప్యూటీ CM పొజిషన్‌లో ఉన్నా. పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారంటూ జనార్ధన్ సెటైర్లు వేశారు.

రాజ్య సభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్ !!
Politics· 4 Jun 2026

రాజ్య సభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్ !!

తమిళనాడులో టీవీకే కి ఉన్న ఏకైక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించారు సీఎం విజయ్. కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ చోడంకర్ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఈ రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ వ్యూహకర్త ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏఐఏడీఎంకే (AIADMK) నేత సి.వి. షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. మైనారిటీ టీవీకే ప్రభుత్వ స్థిరత్వానికి కాంగ్రెస్ మద్దతు చాలా ముఖ్యం. టీవీకేకు సొంతంగా పూర్తి మెజారిటీ లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఇక్కడ కీలకంగా మారింది.

తరతరాలకు స్ఫూర్తి  వియత్నాం  హ్యూమన్  బ్రిడ్జ్... ఎందుకో తెలుసా?▶
Viral· 4 Jun 2026

తరతరాలకు స్ఫూర్తి వియత్నాం హ్యూమన్ బ్రిడ్జ్... ఎందుకో తెలుసా?

వియత్నాం యుద్ధ కాలం నాటి ఓ గగుర్పాటు కలిగించే చారిత్రక సత్యం ఇది. అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించి అక్కడి వంతెనలన్నింటినీ కూల్చేసింది. సైన్యం ముందుకు వెళ్లే దారి మూసుకుపోయింది. కానీ అక్కడి మహిళలంతా కలిసి స్వయంగా ఒక "హ్యూమన్ బ్రిడ్జ్"లా మారారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, వియత్నామీస్ సైనికులు నది దాటడానికి దారినిచ్చారు. చరిత్ర పుటల్లో ఇదొక చెరిగిపోని దృశ్యం! తుపాకులు, బాంబులు తాత్కాలిక భయాన్ని సృష్టించగలవేమో గానీ... ఒక జాతి సంకల్పాన్ని మాత్రం ఏ శక్తీ లొంగదీసుకోలేదు అనడానికి వియత్నాం మహిళల త్యాగమే అతిపెద్ద నిదర్శనం! సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

లైఫ్ రిస్క్ చేసి వాటర్ లోకి దూకిన పోలీస్!▶
Politics· 4 Jun 2026

లైఫ్ రిస్క్ చేసి వాటర్ లోకి దూకిన పోలీస్!

ఉత్తరప్రదేశ్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడారు. వాటర్ లో మునిగిపోతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను చూసిన ఆ పోలీస్, ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వాటర్ లోకి దూకారు. చాలా స్పీడ్ గా ఆమె దగ్గరికి తాడు హెల్ప్ తో వెళ్ళి, సేఫ్ గా ఒడ్డుకు చేర్చారు. కరెక్ట్ టైమ్‌లో రెస్పాండ్ అయ్యి ప్రాణాలు కాపాడిన ఈ పోలీస్‌ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ప్రెసెంట్ ఈ రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

లంగ్ కేన్సర్ రోగులకు వరం -7నిమిషాల్లో రిలీఫ్  ఇచ్చే ఇంజెక్షన్..
Politics· 4 Jun 2026

లంగ్ కేన్సర్ రోగులకు వరం -7నిమిషాల్లో రిలీఫ్ ఇచ్చే ఇంజెక్షన్..

ఊపిరి తిత్తుల కేన్సర్ తో బాధపడేవారికి ఏడు నిమిషాల్లో పనిచేసే సరికొత్త ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీని ధర మాత్రం రూ.3.7 లక్షలు. అయితే దీనికి ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్ చేసుకునే వెసులు బాటు ఉంది. ఈ డ్రగ్ పేరు అటెజోలిజుమాబ్ (Atezolizumab).. దీనిని టెసెంట్రిక్ (Tecentriq) అనే బ్రాండ్ పేరుతో పిలుస్తారు. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచి కేన్సర్ కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. గ్లోబల్ ఫార్మా కంపెనీ రోచ్ ఈ సరికొత్త ఇంజెక్షన్ ను ఇండియాలో కూడా విడుదల చేసింది.

మట్టిలో చిక్కుకున్న తాబేలు▶
Viral· 4 Jun 2026

మట్టిలో చిక్కుకున్న తాబేలు

సోషల్ మీడియాలో ఒక హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఒక బీచ్ పక్కన మట్టిలో పూర్తిగా ఇరుక్కుపోయి, కదలలేని స్థితిలో ఉన్న పెద్ద తాబేలును ఒక వ్యక్తి చూసి, తన చేతులతో మట్టిని తవ్వి కష్టపడి ఆ తాబేలును బయటకు తీశాడు. ఆ తర్వాత అది సముద్రంలో కలిసిపోయింది. జంతువుల పట్ల అతను చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

పులి సంచారం భయం భయం..  హైఅలెర్ట్
Local· 4 Jun 2026

పులి సంచారం భయం భయం.. హైఅలెర్ట్

AP: పోలవరం జిల్లా దేవిపట్నం మండలం గంగపాలెం విలేజ్‌లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. స్థానిక కొండ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియోకాలర్ సిగ్నల్స్ ఆధారంగా, డ్రోన్ల సాయంతో దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారంతో గండిపోచమ్మ టెంపుల్‌కు వెళ్లే రహదారులను అధికారులు క్లోజ్ చేశారు. గంగపాలెం చుట్టుపక్కల ఉన్న గిరిజన, మైదాన ప్రాంత గ్రామాల్లో అధికారులు హైఅలర్ట్ అనౌన్స్ చేశారు. ఎవరూ ఒంటరిగా అడవి వైపు వెళ్లకూడదని సూచించారు.

అమీర్‌పేట్ KSR షాపింగ్ కాంప్లెక్స్‌లో ఫైర్ యాక్సిడెంట్
TG· 4 Jun 2026

అమీర్‌పేట్ KSR షాపింగ్ కాంప్లెక్స్‌లో ఫైర్ యాక్సిడెంట్

TG: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ KSR ఫ్యాషన్స్‌లో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్‌లో ఎగిసిపడ్డ మంటలు క్రమంగా ఇతర దుకాణాలకూ వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఆన్‌లైన్ నుండి గ్రౌండ్ లెవెల్ ల్లో 'కాక్రోచెస్  జనతా పార్టీ’
Politics· 4 Jun 2026

ఆన్‌లైన్ నుండి గ్రౌండ్ లెవెల్ ల్లో 'కాక్రోచెస్ జనతా పార్టీ’

ఓన్లీ సోషల్ మీడియా లోనే కాకుండా.. ‘కాక్రోచెస్ జనత పార్టీ’ (CJP) ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో స్ట్రాంగ్ ఆర్గనైజేషన్‌గా మారుతోంది. ఆల్రెడీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్‌ని అనౌన్స్ చేసిన CJP, జూన్ 6న ఢిల్లీ ప్రొటెస్ట్‌కి ఫుల్ గా ప్రిపేర్ అవుతోంది. లీగల్ యాక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని తెలిసినా ఫౌండర్ అభిజీత్ దిప్కే ఇండియాకి రిటర్న్ వస్తున్నారు. వీళ్ళ మూమెంట్‌కి మెయిన్ పొలిటికల్ పార్టీల నుండి కూడా రెస్పాన్స్ వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కాక్రోచెస్ జనత పార్టీ ఫస్ట్ ప్రెస్ మీట్ updates!▶
Politics· 4 Jun 2026

కాక్రోచెస్ జనత పార్టీ ఫస్ట్ ప్రెస్ మీట్ updates!

కాక్రోచెస్ జనతా పార్టీ (CJP) స్పోక్స్ పర్సన్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ ఢిల్లీలో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు. జూన్ 6th మార్నింగ్ 8AM కి అభిజీత్ దిప్కే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాబోతున్నారని అనౌన్స్ చేశారు. అక్కడి నుండి సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి అందరూ పార్లమెంట్ స్ట్రీట్‌కి చేరుకుంటారని, జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ కోసం పర్మిషన్ అడుగుతామని చెప్పారు. ఈ ప్రొటెస్ట్‌కి అన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు.

యంగ్ కాక్రోచెస్ తో సోనమ్ వాంగ్‌చుక్!▶
Politics· 4 Jun 2026

యంగ్ కాక్రోచెస్ తో సోనమ్ వాంగ్‌చుక్!

"మనం కాకపోతే ఇంకెవరూ? ఇప్పుడే కాకపోతే ఇంకెప్పుడు?" అంటూ ప్రముఖ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ సోషల్ మీడియాలో ఒక పవర్‌ఫుల్ పోస్ట్ చేశారు. లక్షలాది మంది యూత్ ఫ్యూచర్ spoile అవుతుంటే, కనీస గౌరవం ఉన్న ఏ మినిస్టర్ అయినా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 5 లోపు పరిస్థితులు మారకపోతే, జూన్ 6th ఢిల్లీలో 'CJP' మెంబర్స్‌తో కలవబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ పోస్ట్ ప్రెసెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్స్!
Politics· 4 Jun 2026

పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్స్!

తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ సెటైర్లు వేశారు. "మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి బాస్.. కానీ వచ్చే ముందు సింగిల్ గా వస్తున్నారా? లేదా ఎవరితోనైనా పొత్తుతో వస్తున్నారా? అది చెప్పి రండి" అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రెసెంట్ ఈ పొలిటికల్ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రకాష్ రాజ్: షూటింగ్‌లో ఉన్నా సరే.. ఆ రోజు అక్కడికి వస్తా!
Politics· 4 Jun 2026

ప్రకాష్ రాజ్: షూటింగ్‌లో ఉన్నా సరే.. ఆ రోజు అక్కడికి వస్తా!

ఈ నెల 6న జరగబోయే 'కాక్‌రోచ్ మూమెంట్' ప్రోగ్రామ్‌కి యాక్టర్ ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. ప్రెసెంట్ ఒక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల కొంచెం దూరంగా ఉన్నానని, అయినప్పటికీ ఆ రోజు ఎలాగైనా అక్కడికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "యంగ్ కాక్రోచెస్ అందరూ అక్కడికి రండి" అంటూ యూత్‌కి పిలుపునిచ్చారు.

ఈ రోజు గోల్డ్ రేట్ ఎంతో తెలుసా?
Politics· 4 Jun 2026

ఈ రోజు గోల్డ్ రేట్ ఎంతో తెలుసా?

గోల్డ్ రేట్స్ వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.110 తగ్గి రూ.1,56,110 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,100 గా ఉంది. ఇక సిల్వర్ రేట్ అయితే భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో ఇప్పుడు ధర రూ.2,85,000 కి చేరింది. మిగతా నగరాల్లోనూ ఇవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి. నోట్: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి, సో కొనే ముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోండి.