రాజ్య సభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్ !!

తమిళనాడులో టీవీకే కి ఉన్న ఏకైక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించారు సీఎం విజయ్. కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ చోడంకర్ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఈ రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ వ్యూహకర్త ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏఐఏడీఎంకే (AIADMK) నేత సి.వి. షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. మైనారిటీ టీవీకే ప్రభుత్వ స్థిరత్వానికి కాంగ్రెస్ మద్దతు చాలా ముఖ్యం. టీవీకేకు సొంతంగా పూర్తి మెజారిటీ లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఇక్కడ కీలకంగా మారింది.


