అమీర్‌పేట్ KSR షాపింగ్ కాంప్లెక్స్‌లో ఫైర్ యాక్సిడెంట్

TG: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ KSR ఫ్యాషన్స్‌లో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్‌లో ఎగిసిపడ్డ మంటలు క్రమంగా ఇతర దుకాణాలకూ వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.



