Latest
పండల్ తో పాటు మనిషి కూడా గాలి లో ఎగిరిపోయాడు!
యూపీ భదోహిలో జరిగిన ఈ సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది బ్రో! సినిమాల్లో కూడా ఇలాంటి స్టంట్స్ చూడలేం. పెళ్లి పందిరి సెట్ చేస్తుంటే, గాలివానకి ఆ పందిరితో పాటే ఒక వ్యక్తి గాలిలో ఎగిరిపోయాడు. అది చూడ్డానికి చాలా షాకింగ్‌గా ఉంది. యూపీలో తుఫాను బీభత్సం వల్ల ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి!
అమెరికా చేరుకున్న హంటా వైరస్ రోగి .. భయం లేదంటున్న డాక్టర్లు
డచ్ కి చెందిన క్రూయిజ్ షిప్ లో హంటా వైరస్ సోకిన రోగి ఒకరు స్వదేశం అమెరికా చేరుకున్నారు. ఆ రోగిని ఐసలేషన్ లో ఉంచి వైద్యులు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. కరోనా మాదిరిగా ఇది కూడా సోకితే ఎలాగన్న సందేహాలున్నాయి. అయితే వైద్య నిపుణులు మాత్రం ప్రజారోగ్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని చెబుతున్నారు. వారేమంటున్నారో మీరే ఈ వీడియోలో చూడండి.
ఎగిరే సైకిల్!
జపాన్ స్టూడెంట్ ఫుషా సకాయ్ ఇన్వెంట్ చేసిన ఈ Flying Bicycle చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది బ్రో! 🚲✈️ దీనికి 'సురూగి' అని పేరు పెట్టారు. జిమ్‌లో సైక్లింగ్ చేసినట్టు పెడల్ తొక్కితే చాలు, ఇది గాల్లోకి టేకాఫ్ అవుతుంది. పెద్ద రెక్కలు, భారీ ప్రొపెల్లర్‌తో ఇది చూడటానికి క్రేజీగా ఉంది. ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. పెట్రోల్ అక్కర్లేదు, లెగ్ పవర్ ఉంటే బర్డ్ లా ఎగిరిపోవచ్చు!
లాయర్ అవతారంలో మమత
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఇవాళ లాయర్ గా కోర్టు ఆవరణలో కనిపించారు. బెంగాల్ లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించి దాఖలైన పిల్ విచారణలో ఆమె లాయర్ గా తన వాదనలు వినిపిస్తారు. ఈ పిల్ ను టీఎంసీ నాయకులే వేశారు. హింసకు సంబంధించి కోల్ కతా హైకోర్టులో మమత న్యాయమూర్తిపై పలు ప్రశ్నలు సంధించడానికి సిద్ధమయ్యారు.
సిరిసిల్ల లో ఘోరమైన రోడ్డు ఆక్సిడెంట్!
సిరిసిల్లలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం వీడియో చూస్తే షేక్ అవుతున్నాం బ్రో! గంభీరావుపేట మండలం గజసింగారం స్టేజీ దగ్గర బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు మీధకి ఓక కారు సడన్గా వచ్చింది. ఈ ఆక్సిడెంట్ లో లక్ష్మి (35) అనే మహిళ స్పాట్‌లో చనిపోయింది. ఇంకో మహిళ అండ్ ఒక చిన్నారికి గాయాలు అయ్యాయి. లోకల్స్ వెంటనే వాల్లని హాస్పిటల్ కి షిఫ్ట్ చేసారు. ఓవర్ స్పీడ్ వల్ల ఇంత దారుణం జరిగింది.

ప్రధాని మోదీ పిలుపుతో ఏపీలో పొదుపు చర్యలు..బాబు, పవన్ కాన్వాయ్ కుదింపు
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీ బాటలో పయనిస్తున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా తమ కాన్వాయ్ ని సగానికి సగం తగ్గించారు. సీఎం చంద్రబాబు కాన్వాయ్ 12 వాహనాల నుంచి 4 వాహనాలకు తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేశ్ వాహనాలు 4 నుంచి 2కి తగ్గాయి. ఏపీ మంత్రులు, ఇతర వీఐపీలు కూడా పొదుపు చర్యలు మొదలు పెట్టారు.

ఢిల్లీ బస్సులో మహిళ గ్యాంగ్ రేప్.. నిందితుల అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 30 ఏళ్ల మహిళపై కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నంగ్లోయ్ దగ్గర ఆమెను బస్సు నుంచి దింపేసి పరారయ్యారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో మరోసారి మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పశ్చిమాసియా సంక్షోభం: పంచదార ఎగుమతులపై బ్యాన్
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా ఉండేందుకు సెప్టెంబర్ 30 వరకు ఎగుమతులపై నిషేధం విధించింది. పండగ సీజన్ వస్తున్నందున సామాన్యుడిపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండియా నిర్ణయంతో గ్లోబల్ గా షుగర్ ధరలకు రెక్కలొచ్చాయి.

ట్రంప్, జిన్‌పింగ్ కీలక భేటీ.. ఇరాన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల టైమ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా టూర్ ప్రాధాన్యత దక్కించుకుంది. బీజింగ్‌లో చైనా అధినేత షి జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఇరాన్ యుద్ధం వల్ల పాక్షికంగా మూతపడిన హార్ముజ్ జలసంధిని తెరిపించడం, తైవాన్ ఆయుధ ఒప్పందాలు మరియు వాణిజ్య సుంకాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మస్క్, జెన్సన్ హువాంగ్ వంటి దిగ్గజాలు ట్రంప్ వెంట ఉన్నారు. ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం జరుగుతున్న ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

పెట్రోల్ సెగ: సామాన్యుడికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
అందరూ అనుకున్నట్టే అవుతోంది. పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదిరితే దేశంలో ఇంధన ధరలు పెరిగే ఛాన్స్ ఉందని సాక్షాత్తూ RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి రావచ్చని ఆయన చెప్పారు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది.

కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన SI!
ప్రేమ పేరుతో ఒక మహిళా కానిస్టేబుల్‌ని మోసం చేసిన ఎస్సై సురేష్ కుమార్ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. 2018 బ్యాచ్‌కు చెందిన సురేష్, కూకట్‌పల్లిలో వర్క్ చేస్తున్న కానిస్టేబుల్‌ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చాడు. బాధితురాలు పెళ్లి గురించి అడగడంతో, కుదరదు అని చెప్పడమే కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడు. దీంతో బాధితురాలు కంప్లైంట్ చేయగా.. పోలీసులు ఎస్సై సురేష్ కేసు ఫైల్ చేశారు.
వర్క్ ఫ్రమ్ హోమే ఫ్యూచర్! చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు ఒక రియాలిటీ. ఫ్యూచర్‌లో ప్రపంచం మొత్తం ఇంట్లోనే ఉండి పని చేస్తుంది. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, ఫ్యూచర్ అంతా డిజిటల్ వర్క్ వైపే ఉంటుందని. చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి!
బండి సంజయ్ శ్రీరాముడి గురుంచి ముందు మీ కొడుకుకి చెప్పు!
మిస్టర్ బండి సంజయ్. చెడు పనుల కోసం శ్రీరాముడి పేరును వాడుకోకండి అంటూ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత (X) వేదికగా ఫైర్ అయ్యారు. మీకు కనీసం మనస్సాక్షి ఉంటే, మీ కొడుకుకి శ్రీరాముడి గొప్పతనం గురించి చెప్పండి అంటూ బండి సంజయ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని, హోం మంత్రి కాన్వాయ్ కుదింపు
పెట్రోల్,డీజిల్ యూసేజ్ పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని, హోంమంత్రి తన కాన్వాయ్ ను తగ్గించుకున్నారు. ప్రధానికి జామర్ యూసేజ్ తో కూడిన పెద్ద పెద్ద కార్లు, వాహనాలు కనీసం 12నుంచి 15 ఉంటాయి. కానీ ఆయన రెండు కార్లకే తన భద్రతను కుదించుకున్నారు. అలాగే హోం మంత్రి అమిత్ షా కూడా తన కాన్వాయ్ ను తగ్గించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన కాన్వాయ్ ను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

అమెరికా వైస్ ప్రెసిడెంట్ లవ్ స్టోరీ!
ఉష దొరక్కపోతే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండేవాడ్ని అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన కొత్త బుక్‌లో రాశారు. కాలేజీలోనే తన తెలివితేటలతో ఫిదా చేసిన ఈ తెలుగు అమ్మాయిని, 2014లో హిందూ సాంప్రదాయంలో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ కపుల్ 4త్ బేబీ కోసం వెయిట్ చేస్తున్నారు!

గోల్డ్ కొనుగోళ్లపై ఇంపోర్ట్ డ్యూటీ 15 శాతం పెంపు !
గోల్డ్ కొనుగోళ్లను తగ్గించేలా చేసేందుకు కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 6 శాతంనుంచి అమాంతం 15 శాతానికి పెంచేసింది. ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల విదేశాలనుంచి బంగారం కొనుగోళ్లు, దిగుమతుల రూట్ మారుతుందని కేంద్రం భావిస్తోంది. భారత, యుఏఈ మధ్య కుదిరిన సమగ్ర ఎకనామికల్ పార్ట్ నర్ షిప్ కింద ఒకశాతం తక్కువకే బంగారం మనకు దిగుమతి అవుతుంది. దీనివల్ల గోల్డ్ వ్యాపారులు దుబాయ్ ద్వారా బంగారం ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈ ట్రేడ్ పార్ట్ నర్ షిప్ వల్ల కొంత లాభం కలుగుతుంది.
హిందూ సమాజానికి అలీ క్షమాపణలు!
కమీడియన్ అలీ చేసిన సోప్ యాడ్‌లో. సబ్బుకు పూజ చేయడం ఏంటి అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ యాడ్ ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపై అలీ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ యాడ్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందూ సమాజానికి సారీ చెబుతూ, ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశ్యం కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రెసెంట్ ఈ అపాలజీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది
మహిళల కష్టాలు తీర్చిన CM విజయ్!
రెసిడెన్షియల్ ఏరియాలు, స్కూల్స్ దగ్గర ఉన్న వైన్ షాపులను మూసివేయాలని CM విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ మూవ్‌తో లేడీస్ అందరూ గవర్నమెంట్‌కి థాంక్స్ చెబుతున్నారు. పబ్లిక్ సేఫ్టీ విషయంలో విజయ్ తీసుకున్న ఈ బోల్డ్ స్టెప్ కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది!

విజయ్ ఓఎస్డీ నియామకం వెనక్కి !!
ముఖ్యమంత్రి Joseph Vijay కార్యాలయంలో Officer on Special Duty (Political)గా రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నియామకం పై తీవ్ర విమర్శలు రావడంతో, Governmentఈ నిర్ణయం తీసుకుంది. .సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ నియామకంపై పెద్ద ఎత్తున చర్చ జరగగా, వివాదం మరింత ముదరకముందే ప్రభుత్వం అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసింది. వెట్రివేల్ జ్యోతిష్కుడు కావడంతో, విజయ్ కు ఆతగాడు సెంటిమెంటల్ గా సలహాలు ఇస్తుంటాడని జ్యోతిష్యుని సలహాలతో ప్రభుత్వాలు నడపడమేంటని విమర్శలు వచ్చాయి. అందుకే వెనక్కి తీసుకున్నారు.

ఆన్‌లైన్‌లో మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ (బప్పం) వెబ్‌సైట్
సినిమాలను పైరసీ చేసి ఆన్ లైన్ లో పెట్టే ఐ బొమ్మ ( ఐ బప్పం ) పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో కొత్త సినిమాలు కనిపించడంతో టాలీవుడ్ పెద్దలు మరోమారు షాక్ కు గురయ్యారు. ఐబొమ్మ సైట్ ను అందుబాటులో లేకుండా చేసినా మళ్లీ ప్రత్యక్షం అవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరిణామం కొత్త సినిమా నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇంట్లో ఉన్న గోల్డ్ తో ఇక మనీ సంపాదించండి!
మీ ఇంట్లో ఉన్న గోల్డ్‌తో మనీ సంపాదించే ఛాన్స్ వస్తోంది! కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త 'గోల్డ్ మానిటైజేషన్ పాలసీ' రాబోతోంది. జస్ట్ 10 గ్రాములు ఉన్నా బ్యాంకులో డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ పొందొచ్చు. బయట దేశాల నుంచి గోల్డ్ కొనడం తగ్గించి, మన దగ్గర ఉన్న స్టాక్ వాడాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల రూపాయి వాల్యూ పెరగడమే కాకుండా మీకు టాక్స్ సేవింగ్స్ కూడా ఉంటాయి. ఇంట్లో లాకర్లో ఉన్న గోల్డ్ కి ఇక వాల్యూ పెరగనుంది!