Latest

రాజస్థాన్ లో నీట్ పేపర్ లీక్ ? మరోసారి వివాదంలో ఎగ్జామ్
రాజస్థాన్‌లో నీట్ (NEET-UG) 2026 పరీక్షకు సంబంధించి పెను కలకలం రేగుతోంది. మే 3న జరిగిన ఈ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు, అంతకుముందు రోజు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక 'గెస్ పేపర్' ప్రశ్నలు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండటంతో పేపర్ లీక్ అయ్యిందనే అనుమానాలు బలపడుతున్నాయి. కొన్ని ప్రశ్నల్లో ఆప్షన్ల సీక్వెన్స్ కూడా మ్యాచ్ అయినట్టు దర్యాప్తులో బయటపడింది. ఈ పేపర్లు ₹20 వేల నుంచి ₹2 లక్షల వరకు అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ SOG, కేంద్ర సంస్థలు విచారణ చేస్తున్నాయి. అయితే NTA మాత్రం “ఎగ్జామ్ పూర్తి సెక్యూరిటీతో నిర్వహించాం” అని చెబుతోంది

ఇరాన్ పీస్ డీల్ కి ట్రంప్ నో
ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ TOTALLY UNACCEPTABLE అంటూ తిరస్కరించారు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్ పంపిన ఈ డీల్‌పై ట్రంప్ స్పందిస్తూ.. "ఇరాన్ ప్రతినిధులు పంపిన రిపోర్ట్ చదివాను, అది నాకు నచ్చలేదు" అని తేల్చిచెప్పారు. అంతేకాదు, ఇరాన్ దగ్గరున్న యురేనియం నిల్వలపై వైపు ఎవరైనా వెళ్లాలని చూస్తే బాంబులతో లేపేస్తామని హెచ్చరించారు. ఇరాన్ మాత్రం “మా యురేనియం ప్రోగ్రామ్‌పై కాంప్రమైజ్ ఉండదు” అని క్లియర్ చేసింది. ఈ పరిణామాలతో మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ భయాలు పెరుగుతున్నాయి.

టెక్కీని బలితీసుకున్న వ్యాలీ ఫీవర్: అమెరికాలో తెలుగువారికి అలర్ట్
అమెరికాలో కాలిఫోర్నియా ఉంటున్న తెలుగు టెక్కీ చిరంజీవి కొల్లా (37) ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాలీ ఫీవర్ (Valley Fever)తో పోరాడి మరణించారు. ఈ వ్యాధి ప్రధానంగా మట్టిలో ఉండే కాక్సిడియోయిడ్స్ అనే ఫంగస్ రేణువులను పీల్చడం వల్ల ఇది వస్తుంది. సాధారణ ఫ్లూలా మొదలై ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదట న్యుమోనియా అనుకున్నా, టెస్టుల్లో ఇది వ్యాలీ ఫీవర్ అని తేలింది. చిరంజీవి మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పొడి ప్రాంతాల్లో ఉండేవారు, ముఖ్యంగా డస్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు

తమిళనాడు సర్కార్ అప్పులపై విజయ్, స్టాలిన్ డైలాగ్ వార్ !
తమిళనాడు కొత్త సీఎం విజయ్, డిఎంకే అధినేత స్టాలిన్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. స్టాలిన్ ప్రభుత్వం ఐదేళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఖజనానా ఖాళీగా ఉందని, ప్రజలకు ఎంత మేరకు సంక్షేమం అందివ్వగలమో చూడాలని విజయ్ తన ఓపెనింగ్ స్పీచ్ లో అన్నారు. అయితే గంట వ్యవధిలోనే స్టాలిన్ ఎక్స్ ద్వారా బదులిచ్చారు. అప్పులేం ఎక్కువ చేయలేదని, తాము చాలా వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేసామని, కేంద్రం సపోర్ట్ లేకపోయినా తాము కోవిడ్ టైమ్ ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని స్టాలిన్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం ప్రచురిస్తామని విజయ్ అన్నారు.
నాతోరా.. కోరిన ఎత్తుకి తీసుకెళ్తా..- రేవంత్ కు మోడీ ఆఫర్
హైదరాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోడీ తెలంగాణ సీఎం రేవంత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రేవంత్ తమతో చేతులు కలిపితే కలసి పనిచేయవచ్చని, ఆయన ఊహించిన స్థానానికి తీసుకు వెడతానని మోడీ అన్నారు.

బంగారం కొనుగోళ్లు నిలిపివేయండి... ప్రజలకు ప్రధాని సూచన !
ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపేయాలని ప్రధాని కోరారు. కోవిడ్ తర్వాత సప్లయ్ చెయిన్ లో సమస్యలు తలెత్తాయని అన్నారు. మరో వైపు యుద్ధం హడావుడిలతో చమురు ధరలు విపరీతంగా పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా చూసామని అన్నారు. బంగారు రేట్లు ఇంటర్నేషనల్ గా బాగా పెరిగాయని అందువల్ల ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోవడం మంచిదని సూచించారు. ప్రజలు కూడా ఆయిల్ యూసేజ్ తగ్గించాలని, కంపెనీలు, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వాడుకోవాలని అన్నారు. సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో బీజేపి బహిరంగ సభలో ఆయన స్పీచ్ ఇచ్చారు..
ప్రధాని కాన్వాయ్ లో భద్రతా లోపం- అడ్డుకున్న ఆప్ మహిళ
హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ కాన్వాయ్ లో భద్రతా లోపం బయటపడింది. .పరేడ్ గ్రౌండ్స్ వైపు వస్తున్న సమయంలో ఒక్క సారిగా మోదీ కాన్వాయ్ కు అడ్డంగా వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత హేమా.. నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు హడలిపోయారు. అయితే ఆ వెంటనే తేరుకుని హేమను అదుపులోకి తీసుకుని బేగంపేట పీఎస్ కు తరలించారు.

కాంగ్రెస్ పారసైట్.. బాక్ స్టాబర్- మోడీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి... లాంగ్ టైమ్ ఇండి కూటమిలో ఫ్రెండ్ గా ఉన్న డీఎంకేను వెన్నుపోటు పొడిచి తాజాగా టీవీకే పార్టీ సరసన చేరిందని ప్రధాని మోడీ విమర్శించారు. దాదాపు 25-30 ఏళ్ల నుంచి కాంగ్రెస్, డీఎంకే స్నేహం చేస్తున్నాయి. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న ప్రతీసారి డీఎంకే బాసటగా నిలిచందని కానీ నేడు డీఎంకేను మోసగించి టీవీకే కు మద్దతుగా నిలిచిందని విమర్శించారు. బీజేపి మాత్రం తమిళ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. రాజకీయాల్లో లైమ్ లైట్ లో ఉండటానికి ఎవరో ఒకరి చంక ఎక్కడం ఆ పార్టీకి అలవాటేనని అన్నారు.
స్పెషల్ లుక్ లో మెరిసిన త్రిష !
విజయ్ ప్రమాణ స్వీకారానికి నటి త్రిష పూర్తి ట్రెడిషనల్ లుక్ లో వచ్చారు. పాలపిట్ట రంగు కాంచీవరం చీరలో, సిగలో పూలు పెట్టుకుని ఆమె వచ్చారు. ప్రమాణ స్వీకార ప్రాంగణంలో మంగళవాయిద్యాలు మోగుతుండగా ఆమె ప్రవేశం జరిగింది. అందరికీ ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

విజయ్ సభలో వందేమాతరం ఫుల్ లెంగ్త్ గీతం
విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వందేమాతరం ఫుల్ లెంగ్త్ గీతం విజయ్ ప్రమాణ స్వీకారంలో పూర్తిగా ప్లేచేశారు. స్టేజ్ పై రాహుల్ గాంధీ సహా పలువురు నేతలుండగా ఈ గీతాన్ని వినిపించారు. అది పూర్తిగా అయ్యాకే జనగణమన పాడారు. విజయ్ ప్రమాణ స్వీకారంలో ఇది హైలైట్ గా నిలిచింది. ఫిబ్రవరిలో గతంలో మినహాయించిన రెండు, నాలుగు స్టాంజాలనుసైతం ఉంచాల్సిందేనన్న మోడీ ఉత్తర్వులకు లోబడి ఈ గీతం ఇక్కడ ప్లే అయింది. బెంగాల్ ప్రమాణ స్వీకారంలో కూడా అంతే..

రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం- విజయ్ ఎమోషనల్ స్పీచ్
సీఎం విజయ్ తొలి స్పీచ్ లోనే అభిమానులను, ఆడియన్స్ ను అలరించారు. తమ ప్రభుత్వంలో కేవలం ఒక పవర్ సెంటర్ మాత్రమే ఉంటుందని అన్నారు. పేదరికం అంటే నాకు తెలుసు. నేను అందులోనే పుట్టా.. నేనెప్పటికీ మీకు తమ్ముడిగా ఉంటా.. అసిస్టెంట్ డైరక్టర్ నా తండ్రి. చేయలేని వాగ్దానాలు చెప్పను.మిమ్మల్నెవరినీ కలవడానికి నిరాకరించను. మీలో ఒకడిగా ఉంటా. రాష్ట్ర పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తా. ఆ తర్వాతే నా పాలన మొదలవుతుంది అని విజయ్ తన స్పీచ్ లో తెలిపారు.

సీఎం విజయ్ తొలి ప్రామిస్ ఉచిత విద్యుత్ !
తమిళనాడులో 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం జోసెఫ్ విజయ్ ప్రకటించారు. సీఎం గా ప్రమాణం చేశాక ఆ ఫైల్ తొలిసంతకం చేశారు. డ్రగ్స్ నిరోధక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయ్ తో పాటు కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది.
జోసెఫ్ విజయ్ అనే నేను...
తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. టీవీకే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా వచ్చారు. తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. సి. జోసెఫ్ విజయ్ అనే నేను అని విజయ్ చెప్పగానే స్టేడియం హోరెత్తిపోయింది. వీడియో చూడండి.
విజయ్ ప్రమాణస్వీకారంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్
చెన్నైలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి నటి త్రిష వచ్చారు. నెహ్రూ స్టేడియానికి వచ్చిన త్రిష అందరికీ చేతులూపుతూ అభివాదం చేశారు. విజయ్ తల్లిదండ్రులతో పాటు, భారీీగా వచ్చిన అభిమానులు, టీవీకే కార్యకర్తలతో స్టేడియం కిక్కిరిసిపోయింది.

గోరు చిక్కుడు కాయలు ఎందుకు తినాలో తెలుసా?
గోరు చిక్కుడు కాయల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మాంసాహారం తిననివారికి ఇవి అద్భుతమైన ప్రోటీన్లనిస్తాయి. వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను గట్టిగామార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటిలొ ఉండే విటమిన్ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువ. జీర్ణక్రియకు బాగా హెల్ప్ అవుతుంది.

నన్ను చంపితే అణు దాడులే ః కిమ్
నియంతృత్వానికి మారు పేరైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ లేటెస్ట్ గా రాజ్యాంగ సవరణ చేశారు. ఏ దేశమైనా తమపై దాడి చేసి కిమ్ ను హతమారిస్తే ఆ వెంటనే అణు దాడులు జరిపేలా రాజ్యాంగాన్ని సవరించారు. ఇటీవల ఇజ్రాయెల్ , అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ నేత ఖొమైనీ చనిపోయిన నేపధ్యంలో కిమ్ ఈ మార్పులు చేసుకున్నారు.

మాజీ సీఎంగా మమత ఎక్స్ బయో అప్డేట్ !
ఎట్టకేలకి మమత దిగొచ్చారు. రేపు బెంగాల్ సీఎంగా సువేందు పగ్గాలు చేపట్టబోతున్నందుకో ఏమో ఆమె మెంటల్ గా తన ఓటమిని అంగీకరిస్తున్నట్టున్నారు. తన ఎక్స్ బయోలో మూడు సార్లు బెంగాల్ సీఎం ని అని అప్డేట్ చేశారు. అంతకుముందు తన ఎక్స్ ఖాతాలో బెంగాల్ సీఎం అని ఉండేది. ఇప్పుడు అది అప్డేట్ అయ్యింది. సో ఆమె సమాధానపడ్డారు. అంతకు ముందు సీఎంగా తాను రిజైన్ చేసేది లేదని మంకు పట్టుపట్టారు.

నెంబర్ గేమ్ లో విజయ్ సక్సెస్ ..వీసికే అన్ కండిషనల్ సపోర్ట్
టీవీకే సంకీర్ణ ప్రభుత్వం తమిళనాడులో కొలువు తీరబోతోంది. టీవీకే పార్టీకి ఎలాంటి కండిషన్లు లేకుండా సపోర్ట్ చేసేందుకు విదుతలై చిరుతైగల్ కచ్చి ( విసికే) ముందుకొచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన 118 సీట్ల బలం విజయ్ ప్రభుత్వం సాధించింది. విసీకేకు రెండు సీట్లున్నాయి. ఇప్పటికే 4 సీట్లున్న లెఫ్ట్ పార్టీలు అన్ కండిషనల్ సపోర్ట్ ప్రకటిస్తుండగా ఐదు సీట్లున్న కాంగ్రెస్ రెండు కేబినెట్ బెర్తులు ఆశిస్తోంది. ఇవికాకIUML(2) 'సపోర్ట్ కూడా ఉంది. ముగ్గురు అన్నాడిఎంకె రెబెల్స్ విజయ్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది! బాలీవుడ్ ఆక్టర్ పోస్ట్..
తమిళనాడులో ఒకవైపు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు ఆయన పర్సనల్ లైఫ్ పై అంతే చర్చ నడుస్తుంది. ఇంస్టాగ్రామ్ లో రాఖీ సావంత్ పోస్ట్ చేసిన స్టోరీ లో విజయ్-త్రిష ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. అంటూ ఆమె చేసిన ఓపెన్ స్టేట్‌మెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఒకవైపు పొలిటికల్ టెన్షన్ నడుస్తుంటే, ఇలాంటి టైమ్‌లో విజయ్ పెళ్లి గురించి వస్తున్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ కి ఆ ఒక్క పార్టీ సపోర్ట్ దొరికితే CM సీటు ఫిక్స్?
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై విజయ్ తన ప్రయత్నాలను స్పీడప్ చేశారు. ఇవాళ ఆయన 4వ సారి గవర్నర్ ని కలవబోతున్నారు. ఇప్పటికే లోక్ భవన్ దగ్గరున్న తన హౌస్ కి విజయ్ చేరుకున్నారు. ఒకవేళ VCK పార్టీ కూడా తమ సపోర్ట్ అనౌన్స్ చేస్తే, గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందని విజయ్ టీమ్ భావిస్తోంది. ఇప్పుడు అందరి కళ్లు గవర్నర్ డెసిషన్ పైనే ఉన్నాయి. చెన్నైలో పొలిటికల్ హీట్ ఇప్పుడు పీక్స్ లో ఉంది.

TVK గవర్నమెంట్ ఫిక్స్? అన్నాడీఎంకే చీఫ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
తమిళనాడులో కొత్త గవర్నమెంట్ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ టైమ్ లో ADMK చీఫ్ పళనిస్వామి పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గెలిచిన పార్టీకి విషెస్ చెప్పిన ఆయన, ఎక్కడా విజయ్ పేరు గానీ, TVK పేరు గానీ మెన్షన్ చేయలేదు. ఆల్రెడీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు విజయ్‌కి సపోర్ట్ ప్రకటించగా.. VCK డెసిషన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. పళనిస్వామి స్ట్రాటజీ ఏంటో అర్థం కాక పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెరిగింది.