Latest

బండి సంజయ్ కొడుకు కేసుపై మంచు మనోజ్ సీరియస్ పోస్ట్!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై ఉన్న POCSO కేసు గురించి హీరో మంచు మనోజ్ ఒక స్ట్రాంగ్ పోస్ట్ పెట్టారు. "పవర్, పొజిషన్ లేదా స్టేటస్ ఏవైనా సరే.. చట్టం ముందు అందరూ సమానమే" అని ఆయన చెప్పారు. మైనర్ గర్ల్స్‌కు సంబంధించిన కేసుల్లో ట్రాన్స్‌పరెన్సీ ఉండాలని, ఎలాంటి ప్రెజర్ లేకుండా ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్టు అందరికీ కనిపించాలని.. ఈ విషయంలో ఎలాంటి డిలే చేయకూడదని మనోజ్ మంచు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
స్టాలిన్ ఇంటికి వెళ్ళిన CM విజయ్!
చెన్నైలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. తమిళనాడు New CM జోసెఫ్ విజయ్.. మాజీ CM, DMK ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లారు. అక్కడ స్టాలిన్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను కూడా విజయ్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మాట నిలబెట్టుకున్న గ్రేట్ టీచర్!
చీపురుపల్లి హైస్కూల్ బయాలజీ టీచర్ కృష్ణారావు తన స్టూడెంట్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. టెన్త్ క్లాస్‌లో టాప్ మార్క్స్ వచ్చిన హేమంత్ అనే స్టూడెంట్‌ను తన సొంత డబ్బుతో విశాఖ నుండి విజయవాడ వరకు ఫ్లైట్ లో తీసుకెళ్లారు. స్టూడెంట్స్ మధ్య కాంపిటీషన్ పెంచడమే తన ఉద్దేశం అని ఆయన చెప్పారు. విజయవాడలోని కొన్ని ఫేమస్ ప్లేసెస్ వీళ్లు విజిట్ చేస్తారు. ఈ టీచర్ చేసిన పనిని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.

తనికెళ్ల భరణి: మోదీలో దేవున్ని చూశాను!
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధాని మోదీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "నేను రాముడిని, కృష్ణుడిని లేదా వివేకానందుడిని చూడలేదు.. కానీ వాళ్లందరినీ పీఎం మోదీలో చూశాను" అంటూ ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మోదీని తాను హగ్ చేసుకున్నానని, షేక్ హ్యాండ్ ఇచ్చానని.. ఆయనను కలవడంతో తన తన జన్మ ధన్యమైందని ట్వీట్ చేశాడు. మోదీపై భరణికి ఉన్న ఈ లెవల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.

బండి భగీరథ్ కేసులో CM రేవంత్ సీరియస్!
బండి భగీరథ్ పై ఉన్న కేసు విషయంలో CM రేవంత్ రెడ్డి ఫుల్ సీరియస్ అయ్యారు. May 8th న కంప్లైంట్ వస్తే యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు డిలే అయిందని DGP సీవీ ఆనంద్‌ని క్వశ్చన్ చేశారు. PM మోదీ విజిట్ సెక్యూరిటీ వల్ల బిజీగా ఉన్నామని DGP ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని CM ఆర్డర్స్ వేశారు. ఇప్పుడు ఈ మ్యాటర్ స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది.
హిస్టరీ క్రియేట్ చేశారు! విజయ్‌కు సిద్ధరామయ్య ఫోన్..
తమిళనాడు new CM జోసెఫ్ విజయ్‌కి కర్ణాటక CM సిద్ధరామయ్య కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు అంటూ విజయ్ విక్టరీని ఆయన అప్రిషియేట్ చేశారు. ఇదే టైమ్ లో విజయ్‌ని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు.. బెంగళూరుకి ఎప్పుడు వస్తున్నారు? అని సిద్ధరామయ్య విజయ్‌ని ఇన్వైట్ చేశారు. ఇద్దరు స్టేట్స్ CMల మధ్య జరిగిన ఈ కాన్వర్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పిల్లలకి ఫుడ్ తినిపిస్తున్న మమ్మీ బర్డ్!
సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఒక మమ్మీ బర్డ్ తన పిల్లలకు రెస్టారెంట్‌లో ఎంతో ప్రేమగా, అక్కడ ఉన్న టేబుల్ మీద ఫుడ్ తినిపిస్తోంది. ఈ క్యూట్ సీన్ చూసి అక్కడి వారు సర్ప్రైజ్ అయ్యారు. మనుషుల్లాగే పక్షులకు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుందని ఈ వీడియో ప్రూవ్ చేస్తోంది.

National Technology Day.. ఎందుకు జరుపుకుంటున్నామంటే ?
National Technology Dayను భారత్ ప్రతి ఏడాది మే 11న జరుపుకుంటుంది. 1998లో ఇదే రోజున పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటాం. ఈ ఏడాది థీమ్ "Responsible Innovation for Inclusive Growth" ముఖ్యంగా ఈ ఏడాది AI, సెమీకండక్టర్లు మరియు క్లీన్ ఎనర్జీ , డిజిటల్ పేమెంట్స్ రంగాల్లో రంగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి చర్చ జరుగుతోంది. “Tech made in India” ఇప్పుడు global levelలో ట్రెండ్ అవుతోంది.

77 runs తేడా తో RR పై గెలిచిన GT!
జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడారు, బ్రదర్! సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో వారు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించారు. అయితే, శుభ్‌మన్ గిల్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు—కేవలం 44 బంతుల్లో 84 పరుగులు చేయడం మామూలు విషయం కాదు. జీటీ జట్టు 229 పరుగులు చేయగా, ఆర్ఆర్ వారిని 152 పరుగులకే పరిమితం చేసింది. జీటీ మొత్తం 77 పరుగుల తేడాతో గెలిచింది!

డెవలప్ అవుతున్న ఇండియన్ ఎకానమీ!
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తి రూపం లో ఉందీ బ్రో! తయారీ మరియు సేవల PMI డేటా చుస్తే డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. క్యాబినెట్ కుడా బ్యాక్ టు బ్యాక్ అనుమతులు ఇస్తోంది-రైల్వేలు, సెమీకండక్టర్లు మరియు షిప్పింగ్ ప్రాజెక్టులకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. గ్లోబల్ షాక్స్ ఉన్నా, ఇండియా సూపర్ రెసిలెంట్ అని మూడీస్ కుడా థంప్స్ అప్ ఇచ్చేసింది. ప్రభుత్వం దృష్టి అంత వృద్ధి మరియు ఉత్పాదకత మీదే ఉంది, ఇది మార్కెట్‌లకు "పవర్‌హౌస్" వారంగా మారింది!

ఆపరేషన్ సింధూర్ పూర్తి అయ్యి ఈరోజుకు ఒక సంవత్సరం!
భారత్, పాకిస్తాన్‌ల మధ్య నాలుగు రోజుల వైమానిక ఘర్షణకు ఇప్పుడు మొదటి వార్షికోత్సవం వచ్చింది! పాకిస్తాన్ రావల్పిండిలో సంబరాలు చేసుకుంటుండగా, భారత్ కూడా ఇది ఒక పెద్ద వ్యూహాత్మక విజయం అని చెబుతూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం, 2025 మే 10న ఈ యుద్ధం ఆగిపోయింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణను పటిష్టంగా పాటించండి. ఇరు దేశాలు సైనిక పాఠాలు నేర్చుకుంటున్నాయి, ఇప్పుడు పూర్తి చర్చలు జరుపుతున్నాం.
పోక్సో కేసులో ట్విస్ట్: బండి సంజయ్ బాధితులను బెదిరిస్తున్నారా?
బండి సంజయ్ కొడుకుపై ఫైల్ అయిన పోక్సో కేసుపై BRS లీడర్ Rs. ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విక్టిమ్ క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ బండి సంజయ్ చీప్ కామెంట్స్ చేస్తున్నారని, బాధితులను బెదిరిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ కేసులో బీజేపీ లీడర్ సంగప్ప మధ్యవర్తిగా ఉన్నారని, వెంటనే బండి సంజయ్ ఇంటి సీసీటీవీ ఫుటేజీతో పాటు అందరి కాల్ డేటాను ఇన్వెస్టిగేట్ చేయాలని హైదరాబాద్ సీపీని ఆయన డిమాండ్ చేశారు.
కియారా అద్వానీ: 6 మంత్స్ నరకం చూశాను!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన లైఫ్‌లోని ఒక టఫ్ ఫేజ్ గురించి ఓపెన్ అయ్యారు. 2025లో పాప పుట్టిన తర్వాత తాను పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ తో అల్మోస్ట్ 6మంత్స్ నరకం చూశానని ఎమోషనల్ అయ్యారు. ఆ టైమ్‌లో తనను తాను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మదర్‌హుడ్ ఇచ్చే ఆ కొత్త మార్పుని తట్టుకోవడానికి తనకు చాలా టైమ్ పట్టిందని, ఫియర్ మీద కాకుండా సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ చేయడం నేర్చుకున్నానని కియారా ఓపెన్ అయ్యారు.

BJP MP అండ్ Union Minister కొడుకు పై POCSO కేసు!
హైదరాబాద్ మోయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ బ్రో! కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ మీద ఒక 17 ఏళ్ల అమ్మాయి POCSO Act కింద కేసు పెట్టింది. తనతో బలవంతంగా డ్రింక్ చేయించి, అసాల్ట్ చేశాడని ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయి ఫ్యామిలీ తనని ₹5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని భగీరథ్ కౌంటర్ కేసు పెట్టాడు. రెండు వైపులా ఇన్వెస్టిగేషన్ గట్టిగా నడుస్తోంది.
సోమ్ నాథ్ ఆలయంలో అమృత్ మహోత్సవ్.. ప్రధాని ప్రత్యేక పూజలు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా వైభవంగా ‘సోమనాథ్ అమృత మహోత్సవ్’ కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కుంభాభిషేకం, ధ్వజారోహణాన్ని తిలకించారు. అంతకు ముందు దాదాపు 1.5 కిలోమీటర్ల రూట్‌లో రోడ్ షో చేశారు. వేలాది మంది ప్రజలు మోదీకి స్వాగతం పలికారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు.

స్టేట్ సాంగ్ వివాదంలో సీఎం విజయ్
తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన రోజే రాష్ట్ర గీతం 'తమిళ తాయ్ వాల్తు' గీతం వివాదాన్ని రాజేసింది. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్ర గీతాన్ని ఫస్ట్ ప్లే చేస్తారు. కానీ విజయ్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో వందేమాతరం, జనగణమన తర్వాత మూడో స్థానంలో ప్లే చేశారు. దీనిపై CPI ఫైర్ అయింది. తమిళ గౌరవాన్ని తగ్గించేలా చేశారని మండిపడింది. అయితే TVK మాత్రం గవర్నర్ కార్యాలయం నుంచి అందిన సూచనల వల్లే అలా జరిగిందని వివరణ ఇచ్చింది.

యూపీఐ పేమెంట్ తో బుక్కయ్యారు: సువేందు PA హంతకులు చిక్కారిలా!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అనుచరుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో నిందితులు యూపీఐ (UPI) వాడి బుక్కయ్యారు. హత్య చేసిన తర్వాత పారిపోతున్న షూటర్లు, దారిలో టోల్ ప్లాజా దగ్గర యూపీఐ పేమెంట్ చేయడంతో వారి లొకేషన్‌ను పోలీసులు ఈజీగా పట్టేసుకున్నారు. టెక్నాలజీ సాయంతో యూపీ, బీహార్ సరిహద్దుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎంత ప్లాన్ చేసినా, ఒక చిన్న ఆన్‌లైన్ పేమెంట్ హంతకులను కటకటాల వెనక్కి నెట్టింది.
కాకినాడలో ఘోరం: వాకింగ్‌కి వెళ్లిన కానిస్టేబుల్ దారుణ హత్య!
కాకినాడ గాంధీనగర్‌లో ఒక APSP కానిస్టేబుల్ మీద జరిగిన ఎటాక్ నిజంగా షాకింగ్ బ్రో. నగేశ్వరరావు గారు క్యాజువల్‍గా వాకింగ్ వెళ్తుంటే, ఎవరో అటాకర్స్ సడన్‌గా వచ్చి గొంతు కోసి మరీ మర్డర్ చేశారు. సీన్ చూస్తే చాలా వైల్డ్‌గా ఉంది. పోలీసులు వెంటనే స్పాట్‌కి వచ్చి CCTV ఫుటేజ్ చెక్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పాత గొడవలా లేక పర్సనల్ రీజన్సా అనేది ఇంకా సస్పెన్సే! ఈ క్రైమ్ చూస్తుంటే సిటీలో సేఫ్టీ మీద డౌట్స్ వస్తున్నాయి.
మొక్కజొన్న రైతుల కష్టాలు.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం
తెలంగాణలో మొక్కజొన్న రైతుల కష్టాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తూ ఉండడంతో దళారులకే తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం బస్తాకి రూ.2,400 మద్దతు ధర ఇస్తోంది. కానీ ఎక్కడా కొనుగోళ్లు లేవు. దీంతో రైతులు దళారులకి 1600 నుంచి 1900కే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నలు నిల్వ చేసి ప్రభుత్వం కొన్నప్పుడే అమ్ముదామని అనుకుంటే అకాల వర్షాల వల్ల మొక్కజొన్నలు మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
అసెంబ్లీలో అడుగు పెట్టిన విజయ్.. పెరంబూర్ ఎమ్మెల్యేగా ప్రమాణం
తమిళనాడు సీఎం విజయ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. పెరంబూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణం చేశారు. తిరుచ్చి ఈస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన విజయ్ వదులుకుంటున్నారు. ఆ స్థానానికి ఆరు నెలల్లో ఉప ఎన్నిక రానుంది.

బంగారం కొనద్దు అన్న మోదీ.. రీజన్ ఇదే
ఇరాన్ టెన్షన్‌తో ఆయిల్ ధరలు భారీగా పెరిగిన వేళ.. ఏడాది బంగారం కొనొద్దు ప్రధాని అని మోదీ చేసిన సూచన వెనుక అతి పెద్ద ఆర్థిక సంక్షోభం వస్తూ ఉండడమే కారణం. అటు గోల్డ్, ఇటు ఆయిల్ రెండూ మనం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. భారత్ అవసరాల్లో 88% చమురును దిగుమతి చేసుకుంటుండగా.. 2025-26లో గోల్డ్ ఇంపోర్ట్స్ 72 బిలియన్ డాలర్లు దాటాయి. ఈ రెండింటికీ భారీగా డాలర్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి రుపీ వీక్ అవుతోంది. ఇప్పటికే రూపాయి మారకం విలువ 95 దాటేసింది. ఇదింకా కొనసాగితే దేశం ఆర్థిక సంక్షోభం పడిపోతుందని నిపుణుల హెచ్చరిక.