Latest

బెంగాల్ ప్రజలకు మోదీ సాష్టాంగ నమస్కారం!▶
Politics· 9 May 2026

బెంగాల్ ప్రజలకు మోదీ సాష్టాంగ నమస్కారం!

బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి ప్రమాణస్వీకారం లో ప్రధాని మోదీ అందరినీ సర్ప్రైజ్ చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి, మోదీ బెంగాల్‌లో బిజెపిని ఫస్ట్ టైమ్ గెలిపించినందుకు కృతజ్ఞతగా ప్రజలకు ఆయన సాష్టాంగ వందనం చేశారు. మోకాళ్లపై కూర్చుని ప్రధాని మొక్కిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ తన గ్రాటిట్యూడ్ ని ఇలా చూపించారు.

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు ఫైల్!
Politics· 9 May 2026

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు ఫైల్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు రిజిస్టర్ చేశారు. ఒక మైనర్ అమ్మాయికి ఆల్కహాల్ తాగించి, ఫార్మ్ హౌస్ లో రేప్ చేశాడని ఆ అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ అయింది. అయితే ఇది హనీ ట్రాప్ అని, తమను 5 కోట్లు డిమాండ్ చేశారని, 50 వేలు ఇచ్చామని బండి సంజయ్ టీమ్ అంటోంది. కానీ, తప్పు చేయకపోతే 50 వేలు ఇవ్వడం ఏంటని అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం..▶
Politics· 9 May 2026

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం..

పశ్చిమ బెంగాల్ కొత్త CMగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. బెంగాల్ హిస్టరీలో బిజెపి పార్టీ నుండి CM బాధ్యతలు తీస్కున్న ఫస్ట్ పర్సన్ గా ఆయన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కి ప్రైమ్ మినిస్టర్ మోదీతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ అందరూ అటెండ్ అయ్యారు. బెంగాల్ పాలిటిక్స్‌లో ఇదొక బిగ్ టర్నింగ్ పాయింట్.

డాలర్ ఇచ్చి ఫుడ్ కొనుక్కున్న కాకి!▶
Politics· 9 May 2026

డాలర్ ఇచ్చి ఫుడ్ కొనుక్కున్న కాకి!

నేచర్ లో కొన్నిసార్లు మనం ఊహించని వింతలు జరుగుతుంటాయి. రీసెంట్ గా ఒక కాకి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆ కాకి ఒక వెండింగ్ మెషీన్ లో డాలర్ నోటును ఇన్సర్ట్ చేసి, ఫుడ్ ని తీసుకుంది. మనుషుల్లాగే మెషీన్ ఎలా వాడాలో, డబ్బులు ఇస్తేనే ఫుడ్ వస్తుందని దానికి ఎలా తెలిసింది అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇధి AI క్రియేట్ చేసిన వీడియొ అని కింద కామెంట్స్ చేస్తున్నారు.

మఖన్‌లాల్ సర్కార్ కాళ్లు మొక్కిన మోదీ!▶
Politics· 9 May 2026

మఖన్‌లాల్ సర్కార్ కాళ్లు మొక్కిన మోదీ!

పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకారంలో, స్టేజ్‌పై ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది.. స్టేజ్‌పై ఉన్న 97 ఏళ్ల మఖన్‌లాల్ సర్కార్ కాళ్లకు మోదీ మొక్కిన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. సిలిగురికి చెందిన మఖన్‌లాల్ బీజేపీలో మోస్ట్ సీనియర్ లీడర్. జనసంఘ్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఈయన అసిస్టెంట్‌గా ఉండేవారు. బెంగాల్‌లో బీజేపీ ఫస్ట్ టైమ్ పవర్ లోకి రావడంతో ఆ పాత కాలం నాటి నాయకుడికి మోదీ ఇలా కాళ్ళు మొక్కారు.

బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం.. కొలువు దీరిన బీజేపీ తొలి సర్కార్
Politics· 9 May 2026

బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం.. కొలువు దీరిన బీజేపీ తొలి సర్కార్

పశ్చిమ బెంగాల్ లో తొలి బీజేపీ సర్కార్ ఏర్పడింది. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కతా బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. 55 ఏళ్ల సువేందు అధికారి కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి శిశిర్ అధికారి కుమారుడు. రాజకీయ నేపథ్యం ఉండడంతో యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ లో చేరారు. తర్వాత టీఎంసీలో చేరి మమత కుడి భుజంగా ఉన్నారు. 2020లో బీజేపీలో చేరి ఆరేళ్లలోనే ఆ పార్టీని విజయానికి దగ్గర చేశారు.

సువేందు అధికారిపై మోదీ ఆ వీడియో వైరల్ ▶
Viral· 9 May 2026

సువేందు అధికారిపై మోదీ ఆ వీడియో వైరల్

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేస్తున్న వేళ ప్రధాని మోదీ పాత వీడియో వైరల్ గా మారింది. సువేందు అధికారి టీఎంసీలో ఉన్నప్పుడు నారద స్కామ్ కేసులో డబ్బులు తీసుకుంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. 2016 ఎన్నికల ప్రచార సభలో మోదీ మీరు టీవీలో చూశారా లేదా ? కెమెరాలకు అతను ఎలా దొరికిపోయాడో అంటూ సువేందు అధికారి డబ్బులు ఎలా తీసి దాచుకున్నారో యాక్షన్ చేసి మరీ చూపిస్తూ ఎగతాళి చేశారు. ఇప్పుడు అతనినే ఏరికోరి సీఎం పీఠంపై ఎక్కించారు. నిజంగానే పదేళ్లలో ఎంత మార్పు.

 ఫోర్జరీ లెటర్ వివాదం, దినకరన్ నోరు మూయించిన TVK▶
Politics· 9 May 2026

ఫోర్జరీ లెటర్ వివాదం, దినకరన్ నోరు మూయించిన TVK

తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఫోర్జరీ లెటర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. AMMK చీఫ్ TTV దినకరన్.. విజయ్ పార్టీ TVKపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు ఇచ్చినట్టు నకిలీ లేఖ తయారు చేసి గవర్నర్‌కు చూపించారంటూ ఆరోపించారు. అయితే TVK దినకరన్ ఆరోపణలకి గట్టి షాక్ ఇచ్చింది. AMMK ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖపై సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసి దినకరన్ నోరు మూయించింది. మేము ఎవరితోనూ బేరసారాలు ఆడాల్సిన అవసరంలేదంటూ విజయ్ టీమ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

బలనిరూపణ రాజ్ భవన్ లో జరగాలా ? : పూంచీ కమిషన్ ఏం చెబుతోంది?
Politics· 9 May 2026

బలనిరూపణ రాజ్ భవన్ లో జరగాలా ? : పూంచీ కమిషన్ ఏం చెబుతోంది?

తమిళనాడులో విజయ్ పార్టీ 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలన్న గవర్నర్ నిర్ణయం సరైనదేనా ? హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాజ్యాంగం గవర్నర్ తనకున్న విచక్షణాధికారాల్ని ఇష్టారాజ్యంగా వాడకుండా 2007లో సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో పూంచీ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. అవేంటంటే అత్యధిక సీట్లు వచ్చిన Pre-poll alliance ఫస్ట్ ప్రయార్టీ లేదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఛాన్స్ ఇచ్చి బలనిరూపణకి టైమ్ ఇవ్వాలి. బలనిరూపణ అన్నది ఎప్పుడైనా చట్టసభల్లో జరగాలే తప్ప రాజ్ భవన్ లో కాదు. అందుకే ఇప్పుడు గవర్నర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా అపోజిషన్లో..  బీజేపీ నేత స్పీచ్ వైరల్ ▶
Politics· 9 May 2026

సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా అపోజిషన్లో.. బీజేపీ నేత స్పీచ్ వైరల్

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా టీవీకేని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టైమ్ లో బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ 1997 లోక్స భలో మాట్లాడిన స్పీచ్ వైరల్ గా మారింది. ఆనాటి ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీ ప్రధానిగా వాజపేయి ప్రమాణం చేసి 13 రోజుల తర్వాత బలం సరిపోదని రిజైన్ చేశారు. ఆ తర్వాత దేవెగౌడ్ ప్రధానిగా యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంలో బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ మాట్లాడుతూ నేను లోక్ సభ మెంబర్ ని, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సభ్యుడిని. కానీ నేను అపోజిషన్ లో ఉన్నాను. అని కామెంట్ చేశారు.

IUML యూటర్న్.. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్
Politics· 9 May 2026

IUML యూటర్న్.. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్

తమిళనాడులో సీఎం కుర్చీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వరుసగా మూడోసారి గవర్నర్‌ను కలిసిన నటుడు విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి క్లెయిం చేసినా.. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. TVKకు 5 సీట్లున్నbకాంగ్రెస్ , 4 సీట్లున్న వామపక్షాల మద్దతు లేఖలు ఉన్నాయి. 2 సీట్లు ఉన్న వీసీకే ఇవాళ మద్దతు లేఖ ఇస్తామని చెప్పింది. మరోవైపు ఐయూఎంఎల్ మొదట మద్దతు ఇస్తామని చెప్పి ఆ తర్వాత యూ టర్న్ తీసుకుంది. దీంతో విజయ్ పార్టీకి మేజిక్ ఫిగర్ 118 ఇంకా లభించలేదు. విజయ్ ఎప్పటికి సీఎం అవుతాడాని అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

మధ్యాహ్న భోజనంలో పాము.. ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?
Politics· 8 May 2026

మధ్యాహ్న భోజనంలో పాము.. ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?

బిహార్‌లోని సహర్సా జిల్లాలో ఒక గవర్నమెంట్ స్కూల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ofternoon భోజనం తిన్న 150 మందికి పైగా స్టూడెంట్స్ ఒక్కసారిగా సిక్ అయ్యారు. పప్పు ఉంచిన గిన్నెలో పాము కనిపించిందని పేరెంట్స్ చెప్తున్నారు. ఫుడ్ తిన్న కొద్దిసేపటికే పిల్లలకు వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రెసెంట్ స్టూడెంట్స్ అందరినీ ట్రీట్‌మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఫుడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తే గాని అసలు ఏం జరిగిందో క్లియర్ గా తెలియదు.

తాటి ముంజెలులో హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో !!
Health· 8 May 2026

తాటి ముంజెలులో హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో !!

తాటి ముంజెలు లో Ice apples) హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వేసవి కాలంలో వాటిని తింటే ఒంట్లే వేడి తగ్గుతుంది. జీర్ణ శక్తి బలపడుతుంది. తాటి ముంజెల నీటిలో పుష్కలమైన ఎలక్ట్రో లైట్స్ ఉంటాయి. ప్రొటీన్, ఫైబర్, అన్ని ఉంటాయి. లేత తాటి ముంజెలను తొక్కతో తింటే ఫైబర్ బాగా ఉంటుంది. ముదిరిపోయినవైతే తొక్క తీసి తినాలి. అసిడిటీ, మలబద్ధకం ఉన్నవారికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే వీటిని మూడు, నుంచి నాలుగు వరకూ తింటే పర్లేదు. అంతకు మించి తింటే కడుపునొప్పి, అజీర్తి వచ్చే ఛాన్స్ ఉంది.

DMK Vs Congress- నడిరోడ్డుపై కొట్టుకున్న కార్యకర్తలు!▶
Politics· 8 May 2026

DMK Vs Congress- నడిరోడ్డుపై కొట్టుకున్న కార్యకర్తలు!

తమిళనాడు పాలిటిక్స్‌లో హీట్ మామూలుగా లేదు. విజయ్ CMగా ప్రమాణస్వీకారం చేయాలనే డిమాండ్‌తో మైలదుత్తురైలో ప్రొటెస్ట్ జరుగుతుండగా.. DMK, Congress కార్యకర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. విజయ్‌కి Congress సపోర్ట్ ఇవ్వడాన్ని DMK తట్టుకోలేకపోతోంది. మమ్మల్ని మోసం చేసి విజయ్‌కి ఎలా సపోర్ట్ చేస్తారు? అంటూ డీఎంకే వాళ్లు Congress కార్యకర్తలపై అటాక్ చేశారు. అంతేకాకుండా Congress జెండాలను, కండువాలను రోడ్డుపై పడేసి తొక్కేస్తూ తమ కోపాన్ని చూపించారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు స్టేట్ మొత్తం వైరల్ అవుతోంది.

 బెంగాల్ పగ్గాలు సువేందు అధికారివే
Politics· 8 May 2026

బెంగాల్ పగ్గాలు సువేందు అధికారివే

బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేస్తారు. బీజేపి సోర్సెస్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాయి. బెంగాల్ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన సువేందుకు సీఎం పదవి ఇవ్వాలని బీజేపి శాసన సభాపక్షంలో డిసైడ్ అయ్యారు. దీనితో బెంగాల్ లో 15 ఏళ్ల మమత పాలనకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంగా నియమిస్తారని తెలుస్తోంది. అందులో ఒక మహిళకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. జ్యోతి బసు పాలన తర్వాత బెంగాల్ ఎప్పు డూ ఇద్దరు డిప్యూటీ సీఎం లను చూడలేదు.

MP పదవికి రిజైన్.. CM సీటుపై సైన్!
Politics· 8 May 2026

MP పదవికి రిజైన్.. CM సీటుపై సైన్!

కేరళలో కాంగ్రెస్ కూటమి గెలవడంతో ఇప్పుడు అందరి కళ్లు సీఎం సీటుపైనే ఉన్నాయి. ఈ రేసులో ఎంపీ కేసీ వేణుగోపాల్ అందరికంటే ముందున్నారు. ఢిల్లీ పెద్దలకు ఆయన చాలా క్లోజ్ కావడం ప్లస్ పాయింట్ అయ్యింది. ఒకవేళ ఆయనే ఫిక్స్ అయితే మే 11న ప్రమాణస్వీకారం ఉండొచ్చు. పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు అప్పుడే ఆయనను నాయకుడు, రియల్ హీరో అంటూ పోస్టర్లు వేసి సందడి చేస్తున్నారు. ఒకవేళ సీఎం అయితే ఆయన తన ఎంపీ పదవికి రిజైన్ చేయాల్సి ఉంటుంది.

 విజయ్ కు మద్దతుగా 120 మంది.. కాసేపట్లో గవర్నర్ తో మీట్
Politics· 8 May 2026

విజయ్ కు మద్దతుగా 120 మంది.. కాసేపట్లో గవర్నర్ తో మీట్

ఎట్టకేలకు తమిళనాడు సీఎం గా విజయ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. నాలుగు రోజుల నెంబర్ గేమ్ లో ఆయన నెగ్గారు. యేకంగా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు సాధించారు. కాంగ్రెస్, వీసీకె, సిపిఐ, సిపిఎం, ఎఎంఎంకె, ఐయుఎంఎల్ ఆయనకు మద్దతు ప్రకటించాయి. అందుకు థాంక్ ఫుల్ గా విజయ్ వారికి కెబినెట్ లో మినిస్ట్రీలు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ కు 2, వీసీకె కు1, లెఫ్ట్ పార్టీలకు రెండు కేబినెట్ బెర్తులిచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఈ సాయంత్రం ఆయన గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరతారు.

మరీనా బీచ్ పై విజయ్ ప్రభావం!▶
Politics· 8 May 2026

మరీనా బీచ్ పై విజయ్ ప్రభావం!

తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరిగింది. టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సందిగ్ధత నేపథ్యంలో, చెన్నై పోలీసులు మెరీనా బీచ్ వద్ద భారీగా మోహరించారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందడంలో జాప్యం జరుగుతుండటంతో, ఆగ్రహించిన అభిమానులు మెరీనా బీచ్ వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. బీచ్ కి వెళ్లే దారులను బారికేడ్లతో మూసివేసి, ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. మెరీనా తీరం ఇప్పుడు పోలీసుల పహారాలో ఉంది.

 తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే ఢిష్యుం ఢిష్యుం !!▶
Politics· 8 May 2026

తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే ఢిష్యుం ఢిష్యుం !!

తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మయిలాడుదురైలో గవర్నర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేపట్టడంపై డీఎంకె కార్యకర్తలు ఆగ్రహించారు. జెండాలు లాక్కుని రోడ్డుపై పడేశారు. కాంగ్రెస్ పార్టీని రాష్టం నుంచి తరిమి కొట్టాలని నినాదాలు చేశారు. టీవీకె చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నిరసన చేపడితే కాంగ్రెస్ నిరసనను డీఎంకే వ్యతిరేకించింది.ఫలితంగా ఇద్దరి మధ్యా ఘర్షణ రేగింది.

"ఇది నా బిడ్డ విజయం": MLA రత్న దేబ్నాథ్▶
Politics· 8 May 2026

"ఇది నా బిడ్డ విజయం": MLA రత్న దేబ్నాథ్

ఆర్‌జి కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ పానిహతిలో ఘనవిజయం సాధించారు. గెలిచిన తర్వాత ఆమె ఎమోషనల్ అవుతూ, "ఈ విజయం నా బిడ్డకు న్యాయం జరిగే దిశగా పడిన మొదటి అడుగు. ఇది కేవలం నా గెలుపు కాదు, బెంగాల్ ప్రజలందరి విజయం" అని అన్నారు. మహిళల భద్రతే తన ప్రాధాన్యతని, తన బిడ్డకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఆమె స్పష్టం చేశారు. ఈ తీర్పు వ్యవస్థలోని మార్పుకు సంకేతమని ఆమె పేర్కొన్నారు.

బెంగాల్ లో అసెంబ్లీ రద్దు!
Politics· 8 May 2026

బెంగాల్ లో అసెంబ్లీ రద్దు!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్! అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మమతా బెనర్జీ రాజీనామాకు నో చెప్పడంతో, గవర్నర్ తన పవర్స్ ఉపయోగించి అసెంబ్లీని డిసాల్వ్ చేశారు. లోక్ భవన్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీంతో దీదీ సీఎంగా తన పదవిని కోల్పోయారు. బెంగాల్‌లో ఇప్పుడంతా నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. కంప్లీట్ వైల్డ్ సీన్ కదా!