Latest

కోహ్లీ.. నాకు కాల్ చెయ్! యూట్యూబర్ ఐషోస్పీడ్ క్రేజీ ఛాలెంజ్!▶
Politics· 5 May 2026

కోహ్లీ.. నాకు కాల్ చెయ్! యూట్యూబర్ ఐషోస్పీడ్ క్రేజీ ఛాలెంజ్!

వరల్డ్ ఫేమస్ యూట్యూబర్ ఐషోస్పీడ్ మరోసారి ఇంటర్నెట్‌లో సందడి చేశాడు. విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఇతడు, రీసెంట్‌గా కరేబియన్ దీవుల్లో క్రికెట్ ఆడుతూ ఒక విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో వికెట్ పడగొట్టాడు. ఆ ఆనందంలో నేరుగా కోహ్లీకే సవాల్ విసిరాడు. "కోహ్లీ.. నాకు కాల్ చెయ్! ఐసీసీ, ముంబై ఇండియన్స్ కూడా నాకు కాల్ చేయాల్సిందే" అంటూ హల్చల్ చేశాడు. ప్రస్తుతం ఈ Funny వీడియో సోషల్ మీడియాలో ఫుల్ Viral అవుతోంది.

ఒకే ఒక్క ఓటు డీఎంకే మంత్రి కొంపముంచింది
Politics· 5 May 2026

ఒకే ఒక్క ఓటు డీఎంకే మంత్రి కొంపముంచింది

మనం ఓటు వెయ్యకపోతే ఏమైందిలే ఒక్క ఓటే కదా అని అనుకోవడానికి లేదు. ఆ ఒక్క ఓటు తమిళనాడు మంత్రిని ఎన్నికల్లో ఓటమి పాలు చేసింది. తిరప్పత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డీఎంకే మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. ఆయనపై నటుడు విజయ్ స్థాపించినTVK అభ్యర్థి ఆర్. సీనివాస సేతుపతి ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. సేతుపతికి 83,375 ఓట్లు వస్తే పెరియకరుప్పన్ కి ఒక్క ఓటు తక్కువగా 83,374 ఓట్లు పోలయ్యాయి.

మోదీ Teleprompter రికార్డు... బీజేపీ కార్యకర్తపై వేటు ▶
Viral· 5 May 2026

మోదీ Teleprompter రికార్డు... బీజేపీ కార్యకర్తపై వేటు

ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల టైమ్ లో ఒక సభలో ప్రధాని మోదీ Tele prompter చూస్తూ ప్రసంగించడం కనిపిస్తుంది. అప్పుడే అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్త ఒకరు మోదీని వీడియో తీస్తుంటే పొరపాటున Teleprompter కూడా రికార్డు అయింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ కార్యకర్తని పార్టీ సస్పెండ్ చేసింది. ఇది ఎక్కడ జరిగిందో ఇంకా తెలీలేదు. ప్రపంచ దేశాల నాయకులంతా కూడా టెలిప్రాంప్టర్ చూసే ప్రసంగాలు చేస్తారని, అందులో తప్పేముందని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

డొమస్టిక్ హెల్పర్ నుంచి అసెంబ్లీ వరకు..
Politics· 5 May 2026

డొమస్టిక్ హెల్పర్ నుంచి అసెంబ్లీ వరకు..

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒక అద్భుతం జరిగింది. ఒకప్పుడు నలుగురి ఇళ్లల్లో అంట్లు తోమి, బట్టలుతుకి జీవనం సాగించిన కలితా మాఝీ ఎన్నికల్లో గెలుపొందారు. Ausgram నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె తన ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి శ్యామ్ ప్రసన్న లోహార్ పై 12 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పడానికి ఈమె గెలుపే నిదర్శనం.

ట్రైన్‌లో వేధింపులు.. వీడియో తీస్తుంటే అమ్మాయిపై దాడి!▶
Crime· 4 May 2026

ట్రైన్‌లో వేధింపులు.. వీడియో తీస్తుంటే అమ్మాయిపై దాడి!

ట్రైన్ లో జర్నీ చేస్తున్న ఒక అమ్మాయి పట్ల ఒక వ్యక్తి చాలా అసభ్యకరమైన సైగలతో వేధించాడు. ఆ అమ్మాయి ధైర్యంగా అతని behavior ని తన Phone లో record చేయడం స్టార్ట్ చేసింది. దాంతో అతను రెచ్చిపోయి ఆమెపై దాడి చేసి కొట్టడం స్టార్ట్ చేశాడు. ఈ షాకింగ్ incident కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో Viral అవుతోంది. women safetyపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ వీడియో వైరల్- 234 సీట్లలో నేనే క్యాండిడేట్!▶
Politics· 4 May 2026

విజయ్ వీడియో వైరల్- 234 సీట్లలో నేనే క్యాండిడేట్!

తమిళనాడు పాలిటిక్స్‌లో దళపతి విజయ్ ఒక Massive Record క్రియేట్ చేశారు. మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ వేరే వాళ్ల పేర్లు కాకుండా, అన్ని చోట్లా తానే స్వయంగా అభ్యర్థిగా తన పేరును ప్రకటించుకుని అందరినీ Surprise చేశారు. పార్టీ గెలవడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ Viral అవుతోంది.

బీజేపీ కార్యకర్తకు చుక్కలు చూపించిన అమ్మాయి!▶
Politics· 4 May 2026

బీజేపీ కార్యకర్తకు చుక్కలు చూపించిన అమ్మాయి!

వెస్ట్ బెంగాల్‌లో ఒక అమ్మాయి "BJPకి ఓటు వేయొద్దు" అని Facebook లో పోస్ట్ పెడితే, ఒక బీజేపీ కార్యకర్త ఆమెను Rape చేస్తానని బెదిరించాడు. అయితే ఆ అమ్మాయి అస్సలు Panic అవ్వకుండా, డైరెక్ట్‌గా అతని ఇంటికే వెళ్లి "ఏం చేస్తావో చెయ్ చూద్దాం" అంటూ Challenge చేసింది. ఆమెను ఇంటిముందు చూసి షాక్ అయిన ఆ వ్యక్తి, వెంటనే అందరి ముందు సారీ చెప్పాడు.

విజయ్ ముందున్న సవాళ్ళు ఇవే!
Politics· 4 May 2026

విజయ్ ముందున్న సవాళ్ళు ఇవే!

విజయ్ elections టైమ్ లో మేనిఫెస్టోలో ప్రకటించిన ఆ అదిరిపోయే పథకాలు ఇవే చూడండి.

అంతా మోదీమయం
Politics· 4 May 2026

అంతా మోదీమయం

పశ్చిమ బెంగాల్ లో విజయం దిశగా దూసుకుపోతున్న బీజేపీ దేశమంతా మోదీమయంగా మారిందని సంబరాలు చేసుకుంటోంది. దేశం ఎలా కాషాయం రంగులోకి మారిందో తన ఎక్స్ అకౌంట్ లో ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కాషాయం పార్టీదే హవా అని చెప్పింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకుంది.

ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ కింగ్ .. PK జోస్యం వీడియో వైరల్!▶
Politics· 4 May 2026

ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ కింగ్ .. PK జోస్యం వీడియో వైరల్!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నటుడు విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే ఆయన గెలవడానికి ఛాన్స్ లు చాలా ఎక్కువని పీకే ఇక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏ విధంగా అలా చెప్పగలరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈ వీడియో దాచి ఉంచండి. టీవీకే ఒంటరిగా బరిలో దిగితే రిజల్ల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడండి అని చెప్పారు. ఇప్పుడు ఫలితాలు అదే విధంగా రావడంతో పీకే వీడియో SMలో వైరల్ అవుతోంది.

కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి
Politics· 4 May 2026

కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి

తమిళనాడు సీఎం స్టాలిన్ కు తగిలింది. కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన TVK అభ్యర్థి V.S.బాబు చేతిలో ఓడిపోయారు. డీఎంకే పార్టీకి నిజంగా ఇది పెద్ద షాక్. మూడో స్థానంలోకి పడిపోయిన ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలో కూడా లేదు. ఇప్పుడు స్టాలిన్ కూడా ఓడిపోయారు. చెపాక్ నుంచి పోటీ పడిన ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విజయం దోబూచులాడుతోంది.

తమిళనాడులో TVK విజయం వెనుక VMI రోల్
Politics· 4 May 2026

తమిళనాడులో TVK విజయం వెనుక VMI రోల్

TVK విజయానికి ముందే తమిళనాడులో విజయ్ ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయక్కమ్ (VMI) జనానికి దగ్గరైంది. 2009లో స్టార్ట్ అయిన ఫ్యాన్ క్లబ్ కి లక్ష బ్రాంచీలున్నాయి. పార్టీ పెట్టక ముందే ప్రకృతి విపత్తుల సమయంలో VMI కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. జల్లికట్టుని బ్యాన్ చేయాలనే ఉద్యమాన్నే తెర వెనకుండి నడిపించారు ఎడ్యుకేషన్ అవార్డ్స్, నిరుపేద విద్యార్థులకు చదువు, ఇతర సంక్షేమ కార్యక్రమాలెన్నో VMIతో చేయించి కష్టాల్లో ఉన్నప్పుడు విజయ్ తోడుగా ఉంటాడన్న నమ్మకాన్ని కలిగించారు. 2021 లోకల్ బాడీ ఎన్నికల్లో VMI బలపరిచిన అభ్యర్థులు 169 సీట్లలో పోటీ చేసి 127 సీట్లు గెలిచారంటే విజయ్ పవరేంటో తెలుస్తుంది.

విజయ్ ను చూసి కార్యకర్తల కేరింతలు !▶
Politics· 4 May 2026

విజయ్ ను చూసి కార్యకర్తల కేరింతలు !

విజయ్ఇంటి ముందు సంబరాలు మొదలైపోయాయి.టీవీకే కార్యకర్తల సంతోషం పీక్స్ లో ఉంది. కార్యకర్తలంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతుంటే.. నినాదాలు చేస్తుంటే ఎట్టకేలకు తలపతి బయటకు వచ్చాడు.. ఉత్సాహంగా అందరికీ నమస్కరించి హాయ్ చెప్పాడు.. దాంతో ఆ ప్రాంతం అరుపులు, నినాదాలతో మార్మోగింది.

కేరళలో పినరయి విజయన్ ఓటమికి కారణాలివే..
Politics· 4 May 2026

కేరళలో పినరయి విజయన్ ఓటమికి కారణాలివే..

కేరళలో దశాబ్దాలుగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. గతసారి LDF వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించినా, ఈసారి ప్రజలు మళ్ళీ మార్పు కోరుకున్నారు. సీఎం పినరయి విజయన్ వన్ సైడెడ్ గా డెసిషన్స్ తీసుకుంటారని, పార్టీలో ప్రభుత్వంలో ఎవరికీ స్వేచ్ఛలేదని విపక్షాల ప్రచారం యూడీఎఫ్ కి కలిసొచ్చింది. లైఫ్ మిషన్ ప్రాజెక్టు, ఇతర కాంట్రాక్ట్ లలో అవినీతి ఆరోపణలు మిడిల్ క్లాస్ లో వ్యతిరేకతను పెంచాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో విజయన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఉద్యోగాల్లేక యువత ఫ్రస్ట్రేషన్ లో ఉండడం ఎల్ డీఎఫ్ కు వ్యతిరేకంగా మారింది.

ఫైనల్ గా మేమే గెలుస్తాం : దీదీ ధీమా
Politics· 4 May 2026

ఫైనల్ గా మేమే గెలుస్తాం : దీదీ ధీమా

బెంగాల్ ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు 3 రౌండ్లు మాత్రమే లెక్కించారని, తుది ఫలితాలొస్తే తామే గెలుస్తామని ధీమాగా చెప్పారు. ఇంకా 70 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుని ఈసీ వెల్లడించలేదన్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎవరూ వెళ్లవద్దని కార్యకర్తలకు సూచించారు.

 విజయ్ ఇంట సంబరాలు.. షురూ !▶
Politics· 4 May 2026

విజయ్ ఇంట సంబరాలు.. షురూ !

ఇప్పటికే విజయ్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. తండ్రి చంద్రశేఖర్ ఇంట కేరింతలు, హడావుడి మొదలైంది. అటు వైపు కౌంటింగ్ సెంటర్ల నుంచి డీఎంకే కార్యకర్తలు వెనుదిరుగుతున్నారు. డిఎంకె ఫ్లెక్సీలను, జెండాలను పీకేస్తున్నారు. కొందరు డీఎంకే కార్యకర్తలు ఓటమిని జీర్ణించుకోలేక రోదిస్తున్నారు.

బెంగాల్ లో బీజేపీ బూత్ మేనేజ్ మెంట్ ఇలా..
Politics· 4 May 2026

బెంగాల్ లో బీజేపీ బూత్ మేనేజ్ మెంట్ ఇలా..

బెంగాల్ ఎన్నికల్లో BJP, RSS బూత్ లెవల్లో అలుపెరగకుండా పని చేశారు. 80 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలుంటే ప్రతీ బూత్ కి 'సప్తర్షి' పేరుతో ఏడుగురు సభ్యులతో కమిటీలు వేశారు. ఓటర్ల జాబితాలో ప్రతీ పేజీకి ఒక పన్నా ప్రముఖ్ నియమించారు. వీరు 10-15 కుటుంబాల బాధ్యత తీసుకున్నారు. 2011లో బెంగాల్‌లో సుమారు 500 ఉన్న ఆరెస్సెస్ శాఖలు, 2026 నాటికి 2,500 కి పెరిగాయి. వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా జంగల్ మహల్ లో , సరస్వతి శిశు మందిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరెస్సెస్ బలమైన పునాది వేసింది. ప్రతి బూత్‌కు ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి, స్థానిక సమస్యలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

 సీఎం పీఠం పై విజయ్ పట్టు బిగిస్తారా?
Politics· 4 May 2026

సీఎం పీఠం పై విజయ్ పట్టు బిగిస్తారా?

తమిళనాడులో సీఎం సీటు విజయ్ నే వరించే ఛాన్స్ కనిపిస్తోంది. ట్రెండ్స్ లో కనిపించిన లీడ్ తర్వాత తగ్గుతూ వస్తున్నా అవసరమైతే కాంగ్రెస్, సీపీఐ, పీఎంకే పార్టీల మద్దతు కోరే అవకాశముంది. తమిళనాట ఇప్పటి వరకూ పీఎంకే6, కాంగ్రెస్ 5, సీపీఐ 2 సీట్లలో లీడింగ్ లో ఉన్నాయి. విజయ్ ఇప్పటికే కాంగ్రెస్ ను కాంటాక్ట్ చేసింది. అన్నా డీఎంకేతో పవర్ షేరింగ్ కి విజయ్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. చెన్నై సిటీలో తప్ప అని్న చోట్లా టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది.

త్రిష బర్త్ డే రోజే ‘విజయ్’ విజయం!▶
Politics· 4 May 2026

త్రిష బర్త్ డే రోజే ‘విజయ్’ విజయం!

తమిళనాడు పాలిటిక్స్‌లో నటుడు విజయ్ చరిత్ర సృష్టించారు. సరిగ్గా నటి త్రిష బర్త్ డే (May 4) రోజే వస్తున్న ఎలక్షన్ రిజల్ట్స్‌లో ఆయన పార్టీ TVK 100కు పైగా సీట్లతో Leadingలో ఉంది. అయితే అందరినీ షాక్ కి గురిచేస్తున్న విషయం ఏంటంటే, విజయ్ వయసు ఇప్పుడు 52 Years! ఈ ఏజ్ లో కూడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తన Massive Crazeతో ద్రావిడ పార్టీల కోటలను బద్దలు కొట్టారు. త్రిష బర్త్ డే వేళ విజయ్ గెలుపుతో అభిమానుల Celebrations డబుల్ అయ్యాయి.

స్టాలిన్ కు ఈ స్థాయి ఓటమి ఎందుకు ?
Politics· 4 May 2026

స్టాలిన్ కు ఈ స్థాయి ఓటమి ఎందుకు ?

తమిళనాడులో DMK ఓడిపోవడానికి గత పదేళ్లుగా అధికారంలో ఉండడం ఒక కారణమైతే వారసత్వ రాజకీయాలపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత మరో ఇంపార్టెంట్ రీజన్. కుమారుడు ఉదయ నిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం ను చేయడంతో ఆ పార్టీపై వారసత్వ ముద్ర పడింది. తమిళనాడు ఒక డ్రగ్స్ స్టేట్ అని, యువత భవిష్యత్ ని డ్రగ్స్ దెబ్బ తీస్తున్నాయన్న ప్రచారంతో మిడిల్ క్లాస్ స్టాలిన్ కు దూరమైంది. పోక్సో కేసులు రెట్టింపు కావడం వల్ల శాంతి భద్రతలు గాల్లో కలిసాయన్న విపక్షాల ప్రచారం డీఎంకేని దెబ్బ కొట్టింది. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో పళనిస్వామి చేసిన కృషి, విజయ్ పార్టీ రావడంతో యువత దూరమవడం డీఎంకేని దెబ్బ తీశాయి.

 విజయ్ కి  కలిసొచ్చిన  అంశాలివే !
Politics· 4 May 2026

విజయ్ కి కలిసొచ్చిన అంశాలివే !

తమిళనాట విజయ్ పార్టీ సంచలన ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ వాక్యూమ్ ను విజయ్ టార్గెట్ చేయగలిగారు. తలపతికి ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్, క్రేజ్ కూడా బాగా కలిసొచ్చింది. ఎన్నికల ముగింపు సభల్లో విజయ్ స్పీచ్ లు కదిలించేలా సాగాయి. ఓటర్లకు అపీల్ కూడా ప్రతీ ఒక్కరిని కదిలించేలా చేసింది. ఇతర పార్టీలు విజయ్ ను పదే పదే టార్గెట్ చేయడం, వేధింపులకు గురి చేయడంతో ప్రజల్లో సానుభూతి పెరిగింది. డీఎంకె కి ఫెయిల్యూర్స్ ఒక వైపు యాంటీ హిందూ స్టేట్ మెంట్స్ నెగటివ్ అయ్యాయి. తలపతి లో మరో ఎంజీఆర్ ను, జయలలితను ప్రజలు చూసుకున్నారు.