స్టాలిన్ కు ఈ స్థాయి ఓటమి ఎందుకు ?

తమిళనాడులో DMK ఓడిపోవడానికి గత పదేళ్లుగా అధికారంలో ఉండడం ఒక కారణమైతే వారసత్వ రాజకీయాలపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత మరో ఇంపార్టెంట్ రీజన్. కుమారుడు ఉదయ నిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం ను చేయడంతో ఆ పార్టీపై వారసత్వ ముద్ర పడింది. తమిళనాడు ఒక డ్రగ్స్ స్టేట్ అని, యువత భవిష్యత్ ని డ్రగ్స్ దెబ్బ తీస్తున్నాయన్న ప్రచారంతో మిడిల్ క్లాస్ స్టాలిన్ కు దూరమైంది. పోక్సో కేసులు రెట్టింపు కావడం వల్ల శాంతి భద్రతలు గాల్లో కలిసాయన్న విపక్షాల ప్రచారం డీఎంకేని దెబ్బ కొట్టింది. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో పళనిస్వామి చేసిన కృషి, విజయ్ పార్టీ రావడంతో యువత దూరమవడం డీఎంకేని దెబ్బ తీశాయి.


