Latest

జలంధర్‌లో జంట పేలుళ్లు!
Crime· 6 May 2026

జలంధర్‌లో జంట పేలుళ్లు!

పంజాబ్ జంట పేలుళ్లతో ఒక్కసారిగా దద్దరిల్లింది. కేవలం రెండు గంటల వ్యవధిలో జలంధర్ BSF హెడ్ క్వార్టర్స్ మరియు అమృత్‌సర్ ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో పేలుళ్లు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఆర్మీ యూనిట్లే లక్ష్యంగా ఈ ఘటనలు జరగడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భద్రతా బలగాలు అప్రమత్తమై విచారణ చేపడుతున్నాయి. ఇది కచ్చితంగా హై-అలర్ట్ సిట్యుయేషన్!

బ్లౌజ్ మొత్తం Diamonds! అంబానీ వారసురాలి రేంజే వేరు!▶
News· 6 May 2026

బ్లౌజ్ మొత్తం Diamonds! అంబానీ వారసురాలి రేంజే వేరు!

మెట్ గాలా 2026లో ఈషా అంబానీ తన స్టైల్ తో అందరికీ షాక్ ఇచ్చారు. ఆమె కట్టుకున్న సారీని ప్యూర్ గోల్డ్ త్రెడ్స్‌తో రెడీ చేశారు. ముఖ్యంగా బ్లౌజ్ మీద వందలాది Diamondsని చేత్తో కుట్టారు, ఈ సారీ కోసం 25 మంది ఆర్టిస్టులు 1200 గంటల పాటు కష్టపడ్డారు. ఆమె మదర్ నీతా అంబానీకి చెందిన కాస్ట్లీ జ్యువెలరీతో పాటు, చేతిలో Mango షేప్ ఉన్న పర్సుతో ఈషా అంబానీ ఫుల్ ట్రెండీగా కనిపించారు.

బానిస బతుకులు వద్దు: పవన్‌పై కానిశెట్టి హరి తిరుగుబాటు!▶
Politics· 6 May 2026

బానిస బతుకులు వద్దు: పవన్‌పై కానిశెట్టి హరి తిరుగుబాటు!

రాజంపేట ఇన్‌ఛార్జ్ కానిశెట్టి హరి పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో విజయ్ కులబలం లేకుండా గెలిస్తే, 25% ఓటు బ్యాంకు ఉన్నా మనం ఎందుకు బానిసలమయ్యామని ప్రశ్నించారు. అయితే, చంద్రబాబును సీఎం చేయడానికి మరో 15 ఏళ్లు ఓపిక పట్టాలని పవన్ ముందే చెప్పారని, ఈ విషయం హరికి తెలియదా అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

పోలీస్ ఆఫీసరా లేక ప్రొఫెషనల్ సింగరా?▶
Politics· 6 May 2026

పోలీస్ ఆఫీసరా లేక ప్రొఫెషనల్ సింగరా?

మన తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్ ఒకరు తన voice తో అందరి hearts గెలుచుకున్నారు. రంగబలి సినిమాలోని #EndhayyaSaami పాటను ఆమె ఎంతో మధురంగా పాడారు. present ఈమె పాడిన సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ Viral అవుతోంది. నెటిజన్లు ఆమె singing టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు.

అన్నాడీఎంకేలో చీలిక ? విజయ్ కి మద్దతుగా 35 మంది ఎమ్మెల్యేలు
Politics· 6 May 2026

అన్నాడీఎంకేలో చీలిక ? విజయ్ కి మద్దతుగా 35 మంది ఎమ్మెల్యేలు

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయ్ పార్టీ మెజార్టీకి కేవలం 10 సీట్లు దూరంలో ఉండిపోవడంతో ఆయనకు మద్దతు ఇవ్వడానికి పార్టీలు పోటీపడుతున్నాయి. అయిదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విజయ్ దెబ్బకి ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ చీలిపోయేలా కనిపిస్తోంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగానికి లాయల్ గా ఉండే 35 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. వారంతా షణ్ముగాన్ని కలిసి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించాలని చెబుతున్నారు. పార్టీ నిర్ణయం ఏమైనా వారు జంప్ చేస్తారా ? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

కుర్చీ దిగనంటున్న దీదీ.. రాజ్యాంగం ఏం చెబుతోంది ?
Politics· 6 May 2026

కుర్చీ దిగనంటున్న దీదీ.. రాజ్యాంగం ఏం చెబుతోంది ?

పశ్చిమ బెంగాల్లో ఓడిపోయినా మమతా బెనర్జీ సీఎం పదవి వీడేది లేదంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, గెలిచింది తానేనంటూ రాజీనామాకు నిరాకరించారు. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. రాజ్యాంగంలో ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ అభీష్టం మేరకే సీఎం పదవిలో ఉంటారు. కాబట్టి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్ కు ఉంటుంది. రెండోది ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ గడువు ముగిసిన వెంటనే ఆటోమేటిక్ గా ప్రభుత్వం రద్దయిపోతుంది. మే7తో అసెంబ్లీ గడువు ముగిసిపోనుంది. కాబట్టి ఆ తర్వాత మమత రాజీనామా చేసినా, చెయ్యకపోయినా ప్రభుత్వమైతే ఉండదు.

కోల్ కతాలో టెన్షన్ టెన్షన్.. టీఎంసీ ఆఫీసుని కూల్చేసిన బుల్డోజర్లు ▶
Politics· 6 May 2026

కోల్ కతాలో టెన్షన్ టెన్షన్.. టీఎంసీ ఆఫీసుని కూల్చేసిన బుల్డోజర్లు

పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్న అర్ధరాత్రి కోల్ కతాలోని హాగ్ మార్కెంట్ ప్రాంతంలో టీఎంసీ యూనియన్ ఆఫీసుని కొందరు వ్యక్తులు బుల్ డోజర్లతో కూల్చేశారు. వారి చేతుల్లో బీజేపీ , ఆరెస్సెస్ జెండాలు ఉన్నాయి. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. మరోవైపు కొందరు బీజేపీ కార్యకర్తలు మటన్ షాపులు మూసివేయాలంటూ వీధుల్లో తిరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఎల్ నినో ఎఫెక్ట్ మొదలు … ఇక రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావం
General· 6 May 2026

ఎల్ నినో ఎఫెక్ట్ మొదలు … ఇక రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావం

ఫసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఎల్ నినో ఎఫెక్ట్ ప్రారంభమైందని Indian National Centre for Ocean Information Services (ఇన్ కాయిస్) ప్రకటించింది. మేలో మొదలైన మార్పులు 2027 జనవరి వరకు కొనసాగుతాయని తెలిపింది. ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే వర్షాలు లేక, కరువు పరిస్థితులు ఉంటాయి. రుతుపవాల్ని అడ్డుకోవడం వల్ల వర్షపాతంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఉత్తర మహాసముద్రంలో వేడి గాలులు ఏర్పడి వాతావరణ సమతుల్యత దెబ్బ తినే ఛాన్స్ కూడా ఉంది.

బంకర్ లో పుతిన్ మకాం..! హత్య చేస్తారని భయపడుతున్న రష్యా అధినేత
World· 6 May 2026

బంకర్ లో పుతిన్ మకాం..! హత్య చేస్తారని భయపడుతున్న రష్యా అధినేత

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళనలో ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో దేశ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. డ్రోన్ దాడులు, అంతర్గత తిరుగుబాటు లేదా హత్యాయత్నం జరగొచ్చన్న భయంతో ఆయన తన నివాసాన్ని భూగర్భ బంకర్లకు మార్చినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. పుతిన్ కు అత్యంత సన్నిహితులే ఈ సమాచారం చెప్పినట్టు వెల్లడించింది. యూరోపియన్ ఇంటెలిజెన్స్ పుతిన్ భద్రతను పెంచి బంకరుకు పంపారని ఎక్కువ సమయం ఆయన అక్కడే గడుపుతూ పరిపాలన సాగిస్తున్నరని వివరించింది.

విజయ్ కు కాంగ్రెస్ మద్దతు , 2 మంత్రి పదవుల కోసం డిమాండ్
Politics· 6 May 2026

విజయ్ కు కాంగ్రెస్ మద్దతు , 2 మంత్రి పదవుల కోసం డిమాండ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజయ్ నేతృత్వంలోని TVKకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని అయితే రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మేజిక్ ఫిగర్ కు విజయ్ పార్టీ కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ అయిదు స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే మెజార్టీకి మరో 5 స్థానాలు కావాలి. లెఫ్ట్ పార్టీలు చెరో రెండు సీట్లలో గెలిచారు. ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వాటి సాయంతో విజయ్ సర్కార్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CM పదవికి రాజీనామా చేయనంటే డిస్మిస్ చేస్తాం!
Politics· 5 May 2026

CM పదవికి రాజీనామా చేయనంటే డిస్మిస్ చేస్తాం!

తాను ఓడిపోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ చేసిన కామెంట్స్‌పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఆమె రాజీనామా చేయకపోతే, మేమే ఆమెను పదవి నుంచి Dismiss చేస్తాం" అని స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుండగా, మే 9న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ప్రజలు ఎంతో కాలంగా ఆమెను భరిస్తున్నారని, ఇక ఆమె పనైపోయిందని హిమంత బిశ్వ శర్మ రియాక్ట్ అయ్యారు.

ప్రధాని మోదీకి విజయ్ ధన్యవాదాలు!
Politics· 5 May 2026

ప్రధాని మోదీకి విజయ్ ధన్యవాదాలు!

తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్ లో TVK పార్టీ గెలవడం తో, విజయ్‌కు PM modi, Rahul Ghandi wish చేశారు. వీరికి థాంక్స్ చెప్పిన విజయ్. politics కు అతీతంగా State Development కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు Developmentకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చెయ్యాలని మోదీని కోరారు. త్వరలోనే విజయ్ CMగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో, తమిళ పాలిటిక్స్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ ఔతుంది.

రౌడీ షీటర్‌ను పట్టించిన ఆటో డ్రైవర్..▶
News· 5 May 2026

రౌడీ షీటర్‌ను పట్టించిన ఆటో డ్రైవర్..

హైదరాబాద్‌లో ఒక ఆటో డ్రైవర్ రియల్ హీరో అనిపించుకున్నాడు. బేగం బజార్‌లో ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని పారిపోతున్న రౌడీ షీటర్‌ను మహమ్మద్ జాహెర్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోతో అడ్డుకున్నాడు. ఎలాంటి ప్రతిఫలం ఆలోచించకుండా. తన ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను పోలీసులకు పట్టించిన జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం తన ఛాంబర్‌లో ప్రత్యేకంగా సన్మానించి, Cash Prize అందించారు. జాహెర్ చూపించిన ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో Viral అవుతోంది.

రెండోసారి MLAగా మాజీ క్రికెటర్!
Politics· 5 May 2026

రెండోసారి MLAగా మాజీ క్రికెటర్!

పశ్చిమ బెంగాల్ ఎలెక్షన్స్ లో BJP భారీ విజయం సాధించగా, టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా మోయ్నా constituency నుండి వరుసగా 2nd టైమ్ MLA గా గెలిచారు. తన ప్రత్యర్థిపై 14 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. 2021లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి పాలిటిక్స్‌లోకి వచ్చిన అశోక్ దిండా, ఈసారి బెంగాల్‌ BJP గవర్నమెంట్ లో Minister అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. IPL lo కోల్‌కతా (KKR) తరఫున ఆడిన దిండాకు ఫ్యాన్స్ congratulation చెబుతున్నారు

మమతా బెనర్జీ- 'ఇండి' కూటమిలో కొనసాగుత!
Politics· 5 May 2026

మమతా బెనర్జీ- 'ఇండి' కూటమిలో కొనసాగుత!

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఈసీ (EC) బీజేపీకి ఏజెంట్‌గా మారిందని, 100 పైగా సీట్లను లూటీ చేశారని ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, తనను ప్లాన్ ప్రకారం ఓడించారని మండిపడ్డారు. తను ఓడిపోలేదని, అందుకే Resignation చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. 'ఇండి' కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనతో మాట్లాడారని, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తనకు సపోర్ట్‌గా ఉన్నారని, 'ఇండి' కూటమిలోనే తాను కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు.

రోడ్డు లేక దారిలోనే మహిళ ప్రసవం!▶
News· 5 May 2026

రోడ్డు లేక దారిలోనే మహిళ ప్రసవం!

శ్రీకాకుళం జిల్లా హీరమండలం మండలంలో దారుణం జరిగింది. లింగాపురం గ్రామానికి చెందిన సునీత అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో, సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు ఆమెను 2 కిలోమీటర్స్ వరకు Doli లో మోసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో పాతపట్నం హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా, ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంపై జనం ఫైర్ అవుతున్నారు.

 గవర్నర్ ను కలసిన విజయ్... రెండు వారాల గడువు కోరిన తలపతి
Politics· 5 May 2026

గవర్నర్ ను కలసిన విజయ్... రెండు వారాల గడువు కోరిన తలపతి

తమిళనాడు గవర్నర్ ను టీవీకే పార్టీ అధినేత విజయ్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నానని, రెండు వారాల గడువు కావాలని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ తో టచ్ లోకి వచ్చింది. డీఎంకె నేతలు కూడా కొందరు విజయ్ వైపు మొగ్గేందుకు సుముఖంగా ఉన్నారు. ఇవాళ పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేసినా కొందరు ఎమ్మెల్యేలు మీటింగ్ కు దూరంగా ఉన్నారు. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ కు ప్రభుత్వ ఏర్పాటుకు పది సీట్లు అవసరమవుతాయి.

కొత్త  ఎమ్మెల్యేలతో విజయ్ మాటా మంతి..▶
Politics· 5 May 2026

కొత్త ఎమ్మెల్యేలతో విజయ్ మాటా మంతి..

టీవీకే కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కలుసుకుని విజయ్ అభింనందనలు చెబుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో అదే..

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే !!
Politics· 5 May 2026

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే !!

దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ అస్త్రంగా మారిపోయింది. కర్ణాటకలో శక్తి, తెలంగాణలో మహాలక్ష్మి, ఏపీలో స్త్రీ శక్తి పేరుతో ఈ స్కీమ్స్ రన్ అవుతున్నాయి. తాజాగాకేరళలో కాంగ్రెస్ ఇందిర గ్యారంటీ పేరుతో తమిళనాడులో వెట్రి పయనం పేరుతో టీవీకే పార్టీ ఉచిత బస్సు ప్రయాణం హామీలిచ్చారు. ఇప్పుడు అక్కడ కూడా స్కీములు అమలవడం మొదలైతే సౌత్ స్టేట్స్ కి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇక భవిష్యత్తులో కూడా అస్త్రంగా మిగిలిపోతుందా?

కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ ఫైర్!
Politics· 5 May 2026

కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ ఫైర్!

పశ్చిమ బెంగాల్‌లో TMC ఓడిపోయిందని కాంగ్రెస్ నేతలు celebrate చేసుకోవడం పై రాహుల్ గాంధీకి serious అయ్యారు. ఇది TMC ఓటమి కాదు, BJP దేశ Democracyని పాడు చేస్తోందని ఆయన Serious అయ్యారు. మనలో మనకి గొడవలు ఉంటే అది బీజేపీకే Advantage అవుతుందని రాహుల్ హెచ్చరించారు. అందరూ కలిసి దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

వికెట్ తీసి "జై శ్రీరామ్" పేపర్ చూపించిన ముంబై బౌలర్!▶
Sports· 5 May 2026

వికెట్ తీసి "జై శ్రీరామ్" పేపర్ చూపించిన ముంబై బౌలర్!

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ తన First IPL Wicket తీసి చాలా ఎమోషనల్ అయ్యాడు. వికెట్ తీశాక జేబులోంచి ఒక పేపర్ తీసి.. “రాధే రాధే.. గత 15 ఏళ్ల డ్రీం ఈరోజు నెరవేరింది. థాంక్యూ ముంబై ఇండియన్స్.. జై శ్రీరామ్” అని రాసి ఉన్న పేపర్ ని చూపించాడు. 33 ఏళ్ల వయసులో రఘుకు ఈ Chance దక్కింది. రఘు చేసిన ఈ Emotional Celebration వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ Viral అవుతోంది.