Latest

బెంగాల్ ఎన్నికల ఫలితాల్ని మార్చేసిన “సర్”
Politics· 4 May 2026

బెంగాల్ ఎన్నికల ఫలితాల్ని మార్చేసిన “సర్”

బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణ SIR ఫలితాల్ని మార్చేసింది. మొత్తం ఓట్లలో ఏకంగా 12% అంటే 90.66 లక్షల ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్‌లో 7.66 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ఈ ప్రక్రియ ముగిసేసరికి 6.75 కోట్లకు పడిపోయింది. 2021 ఎన్నికల్లో TMC, BJP మధ్య ఉన్న ఓట్ల తేడా సుమారు 10%. దాని కంటే ఎక్కువ శాతం ఓట్లే జాబితా నుంచి తొలగించారు. దీని ఎఫెక్ట్ 140 నియోజకవర్గాల్లో పడింది. ఈ ఓట్లన్నీ దొంగ ఓట్లు అని బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లు తొలగించామని బీజేపీ చేసిన ప్రచారం బాగా పని చేసింది.

 విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత...  విజయం దిశగా టీవీకే
Politics· 4 May 2026

విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత... విజయం దిశగా టీవీకే

తమిళనాడులో భారీ ఆధిక్యత దిశగా టీవీకే పార్టీ దూసుకుపోతోంది. విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రతను మోహరించారు. నిఘా పెరిగింది. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే సంచలన ఫలితాలను టీవీకే పార్టీ సాధించింది. యూత్, దళిత్ బ్యాంకులు విజయ్ కు బాగా కలిసొచ్చాయనే చెప్పాలి. డీఎంకే పై పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత స్టాలిన్, కొడుకును కూడా దెబ్బతీసింది. యాంటీ హిందూత్వ ముద్ర డీఎంకేను బాగానే దెబ్బ తీసింది.

బెంగాల్ లో మమతని దెబ్బ తీసిన మహిళా ఓటర్లు
Politics· 4 May 2026

బెంగాల్ లో మమతని దెబ్బ తీసిన మహిళా ఓటర్లు

WBలో మమత బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. దీంతో అధికార వ్యతిరేత బాగా పని చేసింది. మమతా బెనర్జీకి ఉన్న అతిపెద్ద బలం మహిళా ఓటర్లు. దీన్ని దెబ్బతీయడానికి బీజేపీ భారీ హామీలను ఇచ్చింది. ప్రస్తుతం టీఎంసీ మహిళలకి నెలకి 1500 సాయం అందిస్తూ ఉంటే బీజేపీ ప్రతీ నెల 3 వేలు డైరెక్ట్ ట్రాన్సఫర్ చేస్తామని హామీ ఇచ్చింది. గర్భిణీ స్త్రీలకు ₹21,000 ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ , మండలానికో పోలీసు స్టేషన్, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, 75 లక్షల మంది మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ లక్ష్మీపతి దీదీలుగా తీర్చిదిద్దుతామన్న హామీలు మహిళలంతా బీజేపీ వైపు నడిచేలా చేశాయి.

సెంచురి కొట్టిన TVK!
Politics· 4 May 2026

సెంచురి కొట్టిన TVK!

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుత Election Trends ప్రకారం, ఆయన పార్టీ TVK 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ Top Positionలో నిలుస్తోంది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలను వెనక్కి నెట్టి విజయ్ విజయం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ Landslide Victoryతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. అభిమానులు ఇప్పుడే Celebrations మొదలుపెట్టారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పడు దేశవ్యాప్తంగా ఒక Sensation!

తమిళనాడు కింగ్ విజయ్.. పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారం దిశగా
Politics· 4 May 2026

తమిళనాడు కింగ్ విజయ్.. పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారం దిశగా

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో పెను సంచలనం సృష్టిస్తున్నారు. ఫిబ్రవరి 2, 2024న పార్టీ స్థాపించిన విజయ్, కేవలం రెండేళ్లలోనే తన పార్టీని అధికారానికి చేరువగా తీసుకెళ్లారు. 104 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు లీడ్స్ లో ఉన్నారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్‌తో రాజకీయాల్లో రాణిస్తున్నది విజయే. యూత్, ఫస్ట్ టైమ్, ఓటర్లు, మహిళలు విజయ్ పార్టీ వైపే ఉన్నారు. పార్టీలకతీతంగా ఫ్యాన్స్ బేస్ ని తన వైపు తిప్పుకోవడంలో విజయ్ సక్సెస్ కొట్టారు.

మూడు రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత
Politics· 4 May 2026

మూడు రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఏ మాత్రం అందకుండా తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే దూసుకుపోతోంది. 100కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక అధికార డీఎంకే ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. పశ్చిమ బెంగాల్ లో కూడా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మెజార్టీ స్థానాల దిశగా బీజేపీ దూసుకుపోతోంది. కేరళలో పినరయి విజయన్ కి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం దిశగా దూసుకుపోతోంది.

మూడో స్థానానికి పడిపోయిన డీఎంకే
Politics· 4 May 2026

మూడో స్థానానికి పడిపోయిన డీఎంకే

తమిళనాడులో ఎవరి అంచనాలకు అందని విధంగా విజయ్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. అధికార డీఎంకే ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితి ఎవరూ ఊహించలేదు. డీఎంకేకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. విజయ్ పార్టీ 89 స్థానాల్లో లీడింగ్ లో ఉంటే, ఏఐఏడీఎంకే 65 స్థానాల్లో, డీఎంకే 55 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 118

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ముందంజ
Politics· 4 May 2026

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ముందంజ

పశ్చిమ బెంగాల్ లో మమత కోటకు బీటలు పడుతున్నట్టుగానే అనిపిస్తోంది. మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 134 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. టీఎంసీ 105 స్థానాలు, కాంగ్రెస్ 2, లెఫ్ట్ పార్టీలు 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ లో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా 148 స్థానాలు రావాలి.

అధికారంలోకి రావాలంటే …
Politics· 4 May 2026

అధికారంలోకి రావాలంటే …

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుంటే ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా 148 స్థానాలు రావాలి. తమిళనాడు 234 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 118, కేరళలో 140 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 71 అసోంలో 126 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 64 పుదుచ్చేరిలో 30 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 16

పోస్టల్ బ్యాలెట్ లో విజయ్ పార్టీకి ఆధిక్యం
Politics· 4 May 2026

పోస్టల్ బ్యాలెట్ లో విజయ్ పార్టీకి ఆధిక్యం

అయిదు రాష్ట్రాల ఎన్నికలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ దాదాపుగా పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటే, తమిళనాడులో విజయ్ టీఎంకే ఆధిక్యంలో ఉంది. కేరళలో యూడీఎఫ్, ఎల్ డీఎఫ్ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతూ ఉంటే, అసోంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.

జులై నుంచి ఇక రాలేది నిప్పు కణికలే !.. 2026 హాటెస్ట్ ఇయర్ !
World· 3 May 2026

జులై నుంచి ఇక రాలేది నిప్పు కణికలే !.. 2026 హాటెస్ట్ ఇయర్ !

2026 చరిత్రలోనే మోస్ట్ హాటెస్ట్ ఇయర్ గా రికార్డులకెక్కనుంది. ఈ ఏడాది జులై నుంచి మొదలయ్యే ఎల్ నినో కారణంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో హీట్ వేవ్ నమోదవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వేడి పెరిగిపోతుందని సైంటిస్టులు వార్న్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 2024 మోస్ట్ హాటెస్ట్ ఇయర్ గా రికార్డయింది. ఈసారి ఎల్ నినో కారణంగా దారుణమైన టెంపరేచర్లు రికార్డు కానున్నాయని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఇప్పటి వరకూపారిశ్రామిక విప్లవం తర్వాత 2024లో నే భూగోళం టెంపరేచర్ 1.5 డిగ్రీలు పెరిగింది.

సంతానం పేరుతో నైజీరియాలో అనాగరిక  ఫెస్టివల్ !!
News· 3 May 2026

సంతానం పేరుతో నైజీరియాలో అనాగరిక ఫెస్టివల్ !!

నైజీరియాలో సంతానం కోసం నిర్వహించే ఒక అనాగరిక ఉత్సవం తెరపైకి వచ్చింది. ఆలూ దో ఫెస్టివల్ అనే ఈ వేడుకలో మహిళలను రోడ్లపై పరుగులు తీయించి వారి దుస్తులు చించి, రోడ్లపైనే బహిరంగంగా రేప్ చేయడం.. దీనిని రేప్ ఫెస్టివల్ అని కూడా అంటారు. డెల్టా అనే స్టేట్ లో కొందరు మగవారు ఆడవారిని రోడ్లపై పరుగులు పెట్టించి, దుస్తులు చింపి బాహాటంగా రేప్ చేశారు. అటుగా వెహికల్ పై వెడుతున్న లేడీస్ ని కూడా లాగి న్యూడ్ గా చేసి వారిని రేప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులంతా నడివయసు మగవారేనని, కొందరు యువకులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

కరీంనగర్‌లో పీఎంజే జ్యుయెలరీ షాప్ లో భారీ దోపిడీ !▶
Crime· 3 May 2026

కరీంనగర్‌లో పీఎంజే జ్యుయెలరీ షాప్ లో భారీ దోపిడీ !

కరీంనగర్ లోని పట్టణంలోని పీ ఎం జే జ్యువెలరీ షాపులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో లోపలికి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది...పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు..! నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై డీజీపీ సివి ఆనంద్ ఆరా తీశారు.నగరాన్ని అష్ట దిగ్బంధనం చేసి గాలిస్తున్నారు.

యుద్ధ విరమణకు ఇరాన్ కౌంటర్ ప్రపోజల్ !
World· 3 May 2026

యుద్ధ విరమణకు ఇరాన్ కౌంటర్ ప్రపోజల్ !

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఇంతకుముందు చేసిన ప్రతిపాదనకు 14 పాయింట్లతో కౌంటర్ ప్రతిపాదన చేసింది. పాకిస్థాన్ ద్వారా అమెరికాకు ఈ ప్రతిపాదనను ఇరాన్ పంపింది. ఇందులో 30 రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకుని యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. అయితే ఇరాన్ మళ్లీ తప్పుగా ప్రవర్తిస్తే సైనిక దాడులు తిరిగి ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు..

 తల్లి ఆశీస్సులు తీసుకున్న సి.వి. ఆనంద్ !!
News· 3 May 2026

తల్లి ఆశీస్సులు తీసుకున్న సి.వి. ఆనంద్ !!

తన కుమారుడు డీజీపీ అయితే చూడాలని కలలు కన్న ఆ కన్నతల్లి కోరిక నెరవేరింది. తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ తల్లి తన కొడుకు డీజీపీ పదవిలో చూడాలని తపన పడ్డారు. అయితే జనవరి నుంచి తీవ్ర అనారోగ్యం పాలైన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సి.వి. ఆనంద్ అదే హోదాలో వెళ్లి తన తల్లి ఆశీస్సులు అందుకున్నారు. మంచానికే పరిమితమైన ఆమె కళ్లలో సంతోషం చూసి సంబర పడ్డారు. ఆ కోరికే ఆమెను కోలుకునేలా చేసిందని ఆనంద్ సంతోషంతో తెలిపారు.

తెలంగాణలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్
General· 3 May 2026

తెలంగాణలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్

ఎండలతో మండిపోతున్న తెలంగాణ వాసులకు శుభవార్త.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

 ట్రంప్ పై కాల్పులకు సంబంధించి  ఒరిజినల్  వీడియో !1▶
World· 3 May 2026

ట్రంప్ పై కాల్పులకు సంబంధించి ఒరిజినల్ వీడియో !1

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పాల్గొన్న కరస్పాండెంట్ డిన్నర్ హాల్‌లో జరిగిన కాల్పుల ఘట నకు సంబంధించిన క్వాలిటీ వీడియోను అమెరి కా ఇటీవల విడుదల చేసింది.. భద్రతా సిబ్బంది హాలు ప్రాంగణంలో నిలబడి ఉండగా, నిందితుడు అలెన్ తుపాకీతో కాల్పులు జరుపుకుంటూ లోపలికి దూసుకొచ్చాడు.. భద్రతా సిబ్బంది కూడా వెంటనే స్పందించి అతనిపై కాల్పులు జరిపారు..తర్వాత, వారు నిందితుడిని సజీవంగా పట్టుకున్నారు•• ఆ వీడియో మీరు కూడా చూడండి..

ఆఫ్రికాలో కొత్త సముద్రం ఏర్పడుతుందా ?
Science· 3 May 2026

ఆఫ్రికాలో కొత్త సముద్రం ఏర్పడుతుందా ?

ఆఫ్రికా ఖండం నెమ్మదిగా రెండు ముక్కలుగా విడిపోతోంది. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఈ పరిణామం ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ ఖండం తూర్పు భాగంలో ఏర్పడిన భారీ చీలిక (East African Rift) వల్ల భవిష్యత్తులో ఒక కొత్త సముద్రం ఏర్పడబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతుండటమే దీనికి కారణం. అయితే ఇదంతా జరగడానికి మరో 5 మిలియన్ సంవత్సరాలు పడుతుంది.

గుజరాత్ యూనివర్సీటీ సిలబస్ లో మోదీతత్వ..
India· 3 May 2026

గుజరాత్ యూనివర్సీటీ సిలబస్ లో మోదీతత్వ..

బీజేపీ హయాంలో విద్య కాషాయీకరణే మాత్రమే కాదు వ్యక్తి పూజ కూడా మొదలైంది. గుజరాత్ లో ని బరోడా యూనివర్సిటీలో బీఏ, ఎంఏలోని సోషియాలజీ సబ్జెక్టులో మోదీ తత్వ అనే కొత్త సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో మోదీలో నాయకత్వ లక్షణాలు, దేశాన్ని ఎలా నడిపించారు ? అభివృద్దికి ఏం చేయాలి ? వంటి అంశాలు బోధిస్తారు. మోదీపై పాఠాలేంటి అన్న విమర్శల్ని విద్యాశాఖ అధికారులు తిప్పి కొట్టారు. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఇండియన్ పాలిటిక్స్ లో మోదీ చెరగని ముద్ర వేశారని, ఆయన గురించి తెలుసుకోవడం భావితరాలకు అవసరమని సమర్థించుకుంటున్నారు.

ఢిల్లీ కోర్టు జడ్జి అమన్ కుమార్ శర్మ ఆత్మహత్య..
India· 3 May 2026

ఢిల్లీ కోర్టు జడ్జి అమన్ కుమార్ శర్మ ఆత్మహత్య..

ఢిల్లీ కోర్టు జడ్జి అమన్ కుమార్ శర్మ (35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం సాయంత్రం సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో ఆయన మరణించి ఉండడాన్ని బావమరిది గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆయన మరణానికి గల కారణాలు తెలీలేదు. భార్యతో విభేదాల వల్లే అమన్ ఈ స్టెప్ తీసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితమే కార్కర్ డూమా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఆయన సెక్రటరీగా అపాయింట్ అయ్యారు.

బెంగాల్‌లో ఈసీ సంచలన నిర్ణయం..  నియోజకవర్గం మొత్తం రీ పోలింగ్
India· 3 May 2026

బెంగాల్‌లో ఈసీ సంచలన నిర్ణయం.. నియోజకవర్గం మొత్తం రీ పోలింగ్

పశ్చిమ బెంగాల్‌లో ఈసీ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఫాల్టా నియోజకవర్గంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిందన్న ఆరోపణలతో మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 21న మళ్లీ పోలింగ్ నిర్వహించి మే 24న ఫలితాలు వెల్లడిస్తుంది. మిగిలిన నియోజకవర్గాల్లో యధావిధిగా రేపే కౌంటింగ్ ఉంటుంది. టీఎంసీ, బీజేపీ మధ్య హింసాత్మక ఘటనలు , ఆందోళనలు జరగడంతో ఈసీ నిర్ణయం తీసుకుంది.