Latest

అన్న క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు బర్త్ డే▶
Local· 20 Apr 2026

అన్న క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు బర్త్ డే

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడ పటమటలోని అన్న క్యాంటిన్ కు వెళ్లారు. అక్కడ నిరుపేదలకు తానే స్వయంగా వడ్డించి వారితో పాటు టిఫిన్ తిన్నారు. రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల ఒక్క రోజు ఖర్చు రూ.76 లక్షలను భువనేశ్వరి విరాళంగా ఇచ్చారు. క్యాంటిన్ దగ్గరకి పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు వచ్చి సీఎంకు బర్త్ డే విషెస్ చెప్పారు.

అమెరికాతో చర్చలకు ఇరాన్ నో
World· 20 Apr 2026

అమెరికాతో చర్చలకు ఇరాన్ నో

అమెరికాతో జరగాల్సిన రెండో రౌండ్ శాంతి చర్చలను ఇరాన్ తిరస్కరించింది. ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అమెరికా చేస్తున్నవన్నీ అర్థం లేని డిమాండ్స్ అని మండిపడింది. సముద్ర మార్గంలో దిగ్బంధనం చేస్తూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని యూఎస్ ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపించింది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇది దౌత్యానికి ఇస్తున్న చివరి అవకాశం అని వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే దాడులు తప్పవని హెచ్చరించారు.

చర్చలు ఫెయిల్ అయితే దాడులేః ట్రంప్
World· 20 Apr 2026

చర్చలు ఫెయిల్ అయితే దాడులేః ట్రంప్

రేపు ఇస్లామాబాద్ కు అమెరికా ప్రతినిధులు వెళతారని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఒప్పందాలను ఒప్పుకోకపోతే దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలను కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ లో నౌకలపై ఇరాన్ కాల్పులను ట్రంప్ తప్పుబట్టారు. సీజ్ ఫైర్ ను ఇరాన్ ఉల్లంఘించిందని అన్నారు. హర్ముజ్ మూసేయడం ఇరాన్ కే నష్టమన్నారు.

కిరాణా షాపులో పల్లీలు తిన్న ప్రధాని▶
Politics· 20 Apr 2026

కిరాణా షాపులో పల్లీలు తిన్న ప్రధాని

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ స్థానిక ప్రజలకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఝాడ్గామ్ లో ర్యాలీ చేసిన ఆయన తన కాన్వాయ్ మధ్యలో ఆపేసి ఓ కిరాణా షాపులోకి వెళ్లారు. అక్కడ పల్లీలు, చిరుతిళ్లు కొనుక్కొని తిని డబ్బులు ఇచ్చారు. షాపు యజమానితో కాసేపు ముచ్చటించారు. మీరు ఉల్లి తింటారా అని దుకాణ దారుడు అడగగా ..తింటాను.. బుర్ర మాత్రం తినను అంటూ చమత్కరించారు. మోదీని చూసి అక్కడున్న వారు 'భారత్ మాతాకీ జై', 'జై శ్రీరామ్', 'మోదీజీ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.

చియా సీడ్స్ తింటున్నారా?
Health· 19 Apr 2026

చియా సీడ్స్ తింటున్నారా?

హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకునే వారికి చియా సీడ్స్ మంచి సూపర్ ఫుడ్. అయితే దీనిని తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ.. ఆకలిని నియంత్రించి, హైడ్రేషన్ ఇచ్చే ఈ సీడ్స్ ను ఉదయం పూట తింటే బెటర్.అలాగే వెయిట్ లాస్ అవాలనుకునే వారు ఉదయమే ఇవి తీసుకుంటే రోజంతా మీ ఆకలిని ఇది కంట్రోల్ చేస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి, జీర్ణక్రియకు ఇది సాయపడుతుంది.

ఇరాన్ నౌకల కోసం  అమెరికా వేట !!
World· 19 Apr 2026

ఇరాన్ నౌకల కోసం అమెరికా వేట !!

హర్మూజ్‌ జలసంధి వద్ద కొరకరాని కొయ్యగా మారిన ఇరాన్‌ను లొంగదీసుకొనేందుకు అమెరికా మరో వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్‌కు సంబంధించిన వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు ఎక్కడున్నా సీజ్‌ చేయాలనే వ్యూహంపై కసరత్తు చేస్తోంది.

కవలల గొంతు కోసి చంపేసిన ఓ తండ్రి !!
Politics· 19 Apr 2026

కవలల గొంతు కోసి చంపేసిన ఓ తండ్రి !!

భార్య మీద అనుమానంతో 11 ఏళ్ల వయసున్న కవల పిల్లలను గొంతు కోసి చంపేశాడు ఓ మెడికల్ రిప్రజంటేటివ్. యూపీలో కాన్పూర్ కు చెందిన శశి రంజన్ మిశ్రా తరచుగా భార్యతో గొడవపడేవాడు. ఆమెను కొడుకుతో ఉండమని తాను కవల పిల్లలని చూసుకుంటానని చెప్పి అర్దరాత్రి దాటాక వారిని బాత్రూమ్ కి తీసుకెళ్లి గొంతులు కోసి చంపేశాడు. భార్య కంప్లయింట్ తో స్పందించిన పోలీసులు శశిని అదుపులోకి తీసుకున్నారు. .కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్న శశి ఇంటి నిండా సీసీ కెమెరాలు బిగించాడు.

క్లియరెన్స్ ఇచ్చి కాల్పులా? ఆడియో లీక్... కలకలం
World· 19 Apr 2026

క్లియరెన్స్ ఇచ్చి కాల్పులా? ఆడియో లీక్... కలకలం

హర్ముజ్ లో ఫైరింగ్ బారిన పడిన భారతీయ నౌకలలో ఒక నౌకకు సంబంధించిన ఆడియో ఒకటి రిలీజ్ అయింది. మారీటైమ్ ట్యాంకర్ ట్రాకర్స్ నుంచి వచ్చిన ఆ మెసేజ్ లో సెపా నేవీ సెపా నేవి మాకు హర్ముజ్ దాటేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. మీ లిస్ట్ లో రెండో పేరు మాదే.. తీరా మేం దాటుతుండగా ఫైరింగ్ జరిపారు. మమ్మల్ని వెనక్కు వెళిపోనివ్వండి అంటున్న సన్మర్ హోరాల్డ్ రిక్వెస్ట్ ఆడియో బయటపడింది. కాల్పులు జగ్ అర్నవ్ అనే ఇండియన్ షిప్ పై జరిగాయని అయితే నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని మన దేశం తెలిపింది.

గ్లోబల్ గేమ్ ని మార్చేస్తున్న విజింజామ్ పోర్టు !
Politics· 19 Apr 2026

గ్లోబల్ గేమ్ ని మార్చేస్తున్న విజింజామ్ పోర్టు !

హార్ముజ్ గేట్ వే మూసేయడంతో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది, కానీ కేరళలోని మన Vizhinjam Port మాత్రం వేరే లెవల్‌లో ఉంది! హార్ముజ్ క్రైసిస్ వల్ల షిప్పులన్నీ కేరళ వైపు క్యూ కడుతున్నాయి. ఎంపీ Shashi Tharoor చెప్పినట్టు, ఇది ఇండియా కి ఒక "Main Character Energy" మూమెంట్. 100 షిప్పులు వెయిటింగ్‌లో ఉన్నాయంటే మామూలు విషయం కాదు. మన పోర్ట్ ఇప్పుడు గ్లోబల్ గేమ్‌ని మార్చేస్తోంది.

ఇటలీ గురుద్వారా బయట కాల్పులు.. ఇద్దరు ఇండియన్స్ దుర్మరణం
World· 19 Apr 2026

ఇటలీ గురుద్వారా బయట కాల్పులు.. ఇద్దరు ఇండియన్స్ దుర్మరణం

ఇటలీలో దారుణం జరిగింది. బెర్గామో ప్రావిన్స్‌లోని ఒక గురుద్వారా బయట ఇద్దరు భారతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పంజాబ్‌కు చెందిన వీరిద్దరూ అక్కడ పని చేసుకుంటుండగా ఈ దాడి జరిగింది. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి క్రైమ్ జరగడం అక్కడి ఇండియన్ కమ్యూనిటీని భయాందోళనకు గురిచేస్తోంది. అసలు ఏం జరిగిందనే కోణంలో ఇటలీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు… ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే ▶
Local· 19 Apr 2026

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు… ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే

శ్రీరాముడిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై కేసు కూడా నమోదు కావడంతో నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడనని ముద్ర వేశారన్నారు. అన్ని ధర్మాలను ప్రేమించే తనకు ఆ అవసరం లేదన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో వీడియోలో చూడండి.

వీల్ చైర్ పై భారతీ రాజా▶
Local· 19 Apr 2026

వీల్ చైర్ పై భారతీ రాజా

సీతాకోక చిలుక, టిక్ టిక్ టిక్, ఆరాధన వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు భారతీ రాజా వీల్ చైర్ కు పరిమితయ్యారు. ఆయనను కలవడానికి వెళ్లిన నటి రాధిక ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన గురువుని ఇలా చూడడం బాధగా ఉందని, అయినా ఆయనతో గడిపిన సమయం తనకెంతో విలువైనదని పోస్టు చేశారు. తమ అభిమాన దర్శకుడిని అలాంటి స్థితిలో చూసిన నెటిజన్లు ఆయన ఆరోగ్యం బాగుపడాలని కామెంట్స్ పెడుతున్నారు.

మళ్లీ తల్లి కాబోతున్న దీపికా పదుకొణె
Local· 19 Apr 2026

మళ్లీ తల్లి కాబోతున్న దీపికా పదుకొణె

బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. తాము సెకండ్ టైమ్ పేరెంట్స్ కాబోతున్నామంటూ ఒక క్యూట్ ఫోటోతో కన్ఫర్మ్ చేశారు. వాళ్ల కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. అందులో పాజిటివ్ అని కనిపిస్తోంది. ఈ క్రేజీ న్యూస్ తో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్లాస్టిక్ పై మనం వార్ చేయనక్కర్లేదు…!
Business· 19 Apr 2026

ప్లాస్టిక్ పై మనం వార్ చేయనక్కర్లేదు…!

Yes. మీరు చదువుతున్నది నిజమే. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ఆసియాలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పై పడింది. పెట్రో రసాయనాల సరఫరా తగ్గిపోవడంతో ప్లాస్టిక్ కు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు కంపెనీలు చూస్తున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే కాగితం, వెదురు, బయోడీగ్రేడబుల్ ప్యాకేజీంగ్ వైపు మళ్లుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పర్యావరణ వేత్తలు నెత్తి నోరు బాదుకన్నా వినని వారు, ఈ యుద్ధంతో తప్పనిసరై ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి.

మలక్కా జలసంధికి, ఉసిరికాయకి సంబంధం ఏంటంటే
World· 19 Apr 2026

మలక్కా జలసంధికి, ఉసిరికాయకి సంబంధం ఏంటంటే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Next Target మలక్కా జలసంధి అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికా పేరు ఎలా వచ్చిందో ఒక క్రేజీ స్టోరీ బయటకొచ్చింది. మనం తినే ఉసిరికాయకి, మలేసియాలో మలక్కా కి మధ్య ఒక లింక్ ఉంది. 14వ శతాబ్దంలో సుమత్రా రాజు పరమేశ్వర ఒక వేటలో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు ఒక చిన్న జింక తన వేట కుక్కలను ఎదురించి తరిమికొట్టడం చూసి షాక్ అయ్యాడు. ఆ ధైర్యానికి ఫిదా అయిపోయి, అక్కడే ఒక రాజ్యాన్ని స్థాపించాడు. తాను కూర్చున్న చెట్టు పేరే రాజ్యానికి, సముద్రమార్గానికి పెట్టాడు. అదే మలక్కా ట్రీ.. మన దగ్గర ఉసిరి చెట్టు అని పిలుస్తాం

పిల్లల జోలికొస్తే... కన్న తల్లి ఎవరైనా అంతే !!▶
Entertainment· 19 Apr 2026

పిల్లల జోలికొస్తే... కన్న తల్లి ఎవరైనా అంతే !!

ఓ మూడు పిల్లి కూనలు సరదాగా కలుగులో ఆడుకుంటున్నాయి. అంతలో వచ్చింది ఓ త్రాచు పాము. ఏం చేయాలో తెలీక అయోమయంగా చూస్తున్న ఆ కూనల్లో ఒక దానిని నోట కరచింది. మిగతా రెండూ లోపలికి పారిపోయాయ్. సీన్ ని అంత దూరం నుంచి చూసింది తల్లి.అంతే సివంగిలా ఆ పాముపై దూకింది. నాగరాజు బుస్సు బుస్సుమంటున్నా లెక్క చేయలేదు.ప్రాణాలకు తెగించి పోరాడింది.పిల్లల జోలికొస్తే ఏ తల్లయినా అంతే.. మరి ఈ పోరులో గెలుపెవరిది? ఇంకెందుకు వీడియో చూసేయండి..

చిన్నపిల్లల కోసం సమ్మర్ టిప్స్..
Health· 19 Apr 2026

చిన్నపిల్లల కోసం సమ్మర్ టిప్స్..

పెరుగుతున్న ఎండల వల్ల పిల్లలు డీ హైడ్రేషన్, వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. అందుకే వారికి ఎక్కువగా వాటర్, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి. ఎండలో బయటకు తీసుకెళ్ళకండి, లూస్ గా ఉండే కాటన్ క్లాత్స్ వేయాలి. పిల్లలు ఉండే గది చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకూడదు. చర్మంపై దద్దుర్లు రాకుండా జాగ్రత్త పడుతూ, ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

నార్కొటిక్స్  డెకాయ్ ఆపరేషన్ లో బయటపడిన గుట్టు▶
Crime· 19 Apr 2026

నార్కొటిక్స్ డెకాయ్ ఆపరేషన్ లో బయటపడిన గుట్టు

మీరు చూస్తున్న ఈ వీడియో నార్కోటిక్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో దుకాణాల్లో పిల్లలకు యధేచ్ఛగా టుబాకో ప్రొడక్ట్స్ అమ్ముతున్న వైనం.. అయితే ఇది ఎక్కడ అన్నది మాత్రం వారు చెప్పలేదు.స్కూలు పిల్లలు, కాలేజీ యువత అక్కడ ఓపెన్ గానే సిగరెట్లు తాగుతున్నారు.కొందరు పేరెంట్స్ కంప్లైంట్ ఆధారంగా నార్కోటిక్స్ డిపార్టు మెంటు ఈ తనిఖీలు నిర్వహించగా బయటపడిన విజువల్స్ ఇవన్నీ.. సో పేరెంట్స్ .. మీ పిల్లల కదలికలపై కన్నేసి ఉంచండి..

ఫైరింగ్ జరిపినది భారత నౌకలపైనే !!▶
World· 18 Apr 2026

ఫైరింగ్ జరిపినది భారత నౌకలపైనే !!

హర్ముజ్ గేట్ వే దాటుతున్న రెండు భారత నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు దళాలు కాల్పులు జరిపాయి. ఈ నౌకలురెండూ రెండు మిలియన్ బారెళ్ల ఇరాకీ చమురును భారత్ కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒమన్ కు 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ నౌకలపై ఎలాంటి ముందస్తు వార్నింగ్ లేకుండా కాల్పులు జరిపింది. ఘటన పై మన విదేశాంగ శాఖ సీరియస్ అయింది.భారత్ లోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చింది.

పవన్ కల్యాణ్ కు ఎమర్జెన్సీ సర్జరీ !!
Politics· 18 Apr 2026

పవన్ కల్యాణ్ కు ఎమర్జెన్సీ సర్జరీ !!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ కు అత్యవసర సర్జరీ జరిగింది. ఇటీవల తరచు అనారోగ్యానికి గురవుతున్న పవన్ ఓ కేబినెట్ భేటీలో తీవ్రంగా ఇబ్బంది పడటంతో అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఎమ్మారై తీసి అత్యవసర సర్జరీ చేయాల్సి వచ్చి ఆపరేషన్ చేశారు. పవన్ ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

మహిళా బిల్లు పాపం కాంగ్రెస్ దే..ఐయామ్ సారీ !!
Politics· 18 Apr 2026

మహిళా బిల్లు పాపం కాంగ్రెస్ దే..ఐయామ్ సారీ !!

మహిళల చిరకాల స్వప్నం నెరవేరకుండా కాంగ్రెస్ అడ్డుపడిందని ప్రధాని మోడీ విమర్శించారు. ఇందుకు మహిలకు క్షమాపణలు చెబుతున్నామన్నారు.మహిళల రిజర్వేషన్ కు తమ పార్టీ కట్టుబడి ఉందని వాటిని సాధించి తీరుతామని అన్నారు. ఇటీవల కాలంలో అన్ని మంచి ప్రయత్నాలకు కాంగ్రెస్ అడ్డు పడిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ విపక్షాలకే ఇస్తామని చెప్పినా వినలేదన్నారు. పార్టీల అసలు ముసుగు తొలగిందన్నారు. అయినా అన్ని అడ్డంకులు ఎదుర్కొని విజయం సాధిస్తామన్నారు.