Latest

క్లియరెన్స్ ఇచ్చి కాల్పులా? ఆడియో లీక్... కలకలం
World· 19 Apr 2026

క్లియరెన్స్ ఇచ్చి కాల్పులా? ఆడియో లీక్... కలకలం

హర్ముజ్ లో ఫైరింగ్ బారిన పడిన భారతీయ నౌకలలో ఒక నౌకకు సంబంధించిన ఆడియో ఒకటి రిలీజ్ అయింది. మారీటైమ్ ట్యాంకర్ ట్రాకర్స్ నుంచి వచ్చిన ఆ మెసేజ్ లో సెపా నేవీ సెపా నేవి మాకు హర్ముజ్ దాటేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. మీ లిస్ట్ లో రెండో పేరు మాదే.. తీరా మేం దాటుతుండగా ఫైరింగ్ జరిపారు. మమ్మల్ని వెనక్కు వెళిపోనివ్వండి అంటున్న సన్మర్ హోరాల్డ్ రిక్వెస్ట్ ఆడియో బయటపడింది. కాల్పులు జగ్ అర్నవ్ అనే ఇండియన్ షిప్ పై జరిగాయని అయితే నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని మన దేశం తెలిపింది.

గ్లోబల్ గేమ్ ని మార్చేస్తున్న విజింజామ్ పోర్టు !
Politics· 19 Apr 2026

గ్లోబల్ గేమ్ ని మార్చేస్తున్న విజింజామ్ పోర్టు !

హార్ముజ్ గేట్ వే మూసేయడంతో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది, కానీ కేరళలోని మన Vizhinjam Port మాత్రం వేరే లెవల్‌లో ఉంది! హార్ముజ్ క్రైసిస్ వల్ల షిప్పులన్నీ కేరళ వైపు క్యూ కడుతున్నాయి. ఎంపీ Shashi Tharoor చెప్పినట్టు, ఇది ఇండియా కి ఒక "Main Character Energy" మూమెంట్. 100 షిప్పులు వెయిటింగ్‌లో ఉన్నాయంటే మామూలు విషయం కాదు. మన పోర్ట్ ఇప్పుడు గ్లోబల్ గేమ్‌ని మార్చేస్తోంది.

ఇటలీ గురుద్వారా బయట కాల్పులు.. ఇద్దరు ఇండియన్స్ దుర్మరణం
World· 19 Apr 2026

ఇటలీ గురుద్వారా బయట కాల్పులు.. ఇద్దరు ఇండియన్స్ దుర్మరణం

ఇటలీలో దారుణం జరిగింది. బెర్గామో ప్రావిన్స్‌లోని ఒక గురుద్వారా బయట ఇద్దరు భారతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పంజాబ్‌కు చెందిన వీరిద్దరూ అక్కడ పని చేసుకుంటుండగా ఈ దాడి జరిగింది. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి క్రైమ్ జరగడం అక్కడి ఇండియన్ కమ్యూనిటీని భయాందోళనకు గురిచేస్తోంది. అసలు ఏం జరిగిందనే కోణంలో ఇటలీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు… ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే ▶
Local· 19 Apr 2026

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు… ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే

శ్రీరాముడిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై కేసు కూడా నమోదు కావడంతో నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడనని ముద్ర వేశారన్నారు. అన్ని ధర్మాలను ప్రేమించే తనకు ఆ అవసరం లేదన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో వీడియోలో చూడండి.

వీల్ చైర్ పై భారతీ రాజా▶
Local· 19 Apr 2026

వీల్ చైర్ పై భారతీ రాజా

సీతాకోక చిలుక, టిక్ టిక్ టిక్, ఆరాధన వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు భారతీ రాజా వీల్ చైర్ కు పరిమితయ్యారు. ఆయనను కలవడానికి వెళ్లిన నటి రాధిక ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన గురువుని ఇలా చూడడం బాధగా ఉందని, అయినా ఆయనతో గడిపిన సమయం తనకెంతో విలువైనదని పోస్టు చేశారు. తమ అభిమాన దర్శకుడిని అలాంటి స్థితిలో చూసిన నెటిజన్లు ఆయన ఆరోగ్యం బాగుపడాలని కామెంట్స్ పెడుతున్నారు.

మళ్లీ తల్లి కాబోతున్న దీపికా పదుకొణె
Local· 19 Apr 2026

మళ్లీ తల్లి కాబోతున్న దీపికా పదుకొణె

బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. తాము సెకండ్ టైమ్ పేరెంట్స్ కాబోతున్నామంటూ ఒక క్యూట్ ఫోటోతో కన్ఫర్మ్ చేశారు. వాళ్ల కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. అందులో పాజిటివ్ అని కనిపిస్తోంది. ఈ క్రేజీ న్యూస్ తో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్లాస్టిక్ పై మనం వార్ చేయనక్కర్లేదు…!
Business· 19 Apr 2026

ప్లాస్టిక్ పై మనం వార్ చేయనక్కర్లేదు…!

Yes. మీరు చదువుతున్నది నిజమే. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ఆసియాలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పై పడింది. పెట్రో రసాయనాల సరఫరా తగ్గిపోవడంతో ప్లాస్టిక్ కు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు కంపెనీలు చూస్తున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే కాగితం, వెదురు, బయోడీగ్రేడబుల్ ప్యాకేజీంగ్ వైపు మళ్లుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పర్యావరణ వేత్తలు నెత్తి నోరు బాదుకన్నా వినని వారు, ఈ యుద్ధంతో తప్పనిసరై ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి.

మలక్కా జలసంధికి, ఉసిరికాయకి సంబంధం ఏంటంటే
World· 19 Apr 2026

మలక్కా జలసంధికి, ఉసిరికాయకి సంబంధం ఏంటంటే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Next Target మలక్కా జలసంధి అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికా పేరు ఎలా వచ్చిందో ఒక క్రేజీ స్టోరీ బయటకొచ్చింది. మనం తినే ఉసిరికాయకి, మలేసియాలో మలక్కా కి మధ్య ఒక లింక్ ఉంది. 14వ శతాబ్దంలో సుమత్రా రాజు పరమేశ్వర ఒక వేటలో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు ఒక చిన్న జింక తన వేట కుక్కలను ఎదురించి తరిమికొట్టడం చూసి షాక్ అయ్యాడు. ఆ ధైర్యానికి ఫిదా అయిపోయి, అక్కడే ఒక రాజ్యాన్ని స్థాపించాడు. తాను కూర్చున్న చెట్టు పేరే రాజ్యానికి, సముద్రమార్గానికి పెట్టాడు. అదే మలక్కా ట్రీ.. మన దగ్గర ఉసిరి చెట్టు అని పిలుస్తాం

పిల్లల జోలికొస్తే... కన్న తల్లి ఎవరైనా అంతే !!▶
Entertainment· 19 Apr 2026

పిల్లల జోలికొస్తే... కన్న తల్లి ఎవరైనా అంతే !!

ఓ మూడు పిల్లి కూనలు సరదాగా కలుగులో ఆడుకుంటున్నాయి. అంతలో వచ్చింది ఓ త్రాచు పాము. ఏం చేయాలో తెలీక అయోమయంగా చూస్తున్న ఆ కూనల్లో ఒక దానిని నోట కరచింది. మిగతా రెండూ లోపలికి పారిపోయాయ్. సీన్ ని అంత దూరం నుంచి చూసింది తల్లి.అంతే సివంగిలా ఆ పాముపై దూకింది. నాగరాజు బుస్సు బుస్సుమంటున్నా లెక్క చేయలేదు.ప్రాణాలకు తెగించి పోరాడింది.పిల్లల జోలికొస్తే ఏ తల్లయినా అంతే.. మరి ఈ పోరులో గెలుపెవరిది? ఇంకెందుకు వీడియో చూసేయండి..

చిన్నపిల్లల కోసం సమ్మర్ టిప్స్..
Health· 19 Apr 2026

చిన్నపిల్లల కోసం సమ్మర్ టిప్స్..

పెరుగుతున్న ఎండల వల్ల పిల్లలు డీ హైడ్రేషన్, వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. అందుకే వారికి ఎక్కువగా వాటర్, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి. ఎండలో బయటకు తీసుకెళ్ళకండి, లూస్ గా ఉండే కాటన్ క్లాత్స్ వేయాలి. పిల్లలు ఉండే గది చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకూడదు. చర్మంపై దద్దుర్లు రాకుండా జాగ్రత్త పడుతూ, ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

నార్కొటిక్స్  డెకాయ్ ఆపరేషన్ లో బయటపడిన గుట్టు▶
Crime· 19 Apr 2026

నార్కొటిక్స్ డెకాయ్ ఆపరేషన్ లో బయటపడిన గుట్టు

మీరు చూస్తున్న ఈ వీడియో నార్కోటిక్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో దుకాణాల్లో పిల్లలకు యధేచ్ఛగా టుబాకో ప్రొడక్ట్స్ అమ్ముతున్న వైనం.. అయితే ఇది ఎక్కడ అన్నది మాత్రం వారు చెప్పలేదు.స్కూలు పిల్లలు, కాలేజీ యువత అక్కడ ఓపెన్ గానే సిగరెట్లు తాగుతున్నారు.కొందరు పేరెంట్స్ కంప్లైంట్ ఆధారంగా నార్కోటిక్స్ డిపార్టు మెంటు ఈ తనిఖీలు నిర్వహించగా బయటపడిన విజువల్స్ ఇవన్నీ.. సో పేరెంట్స్ .. మీ పిల్లల కదలికలపై కన్నేసి ఉంచండి..

ఫైరింగ్ జరిపినది భారత నౌకలపైనే !!▶
World· 18 Apr 2026

ఫైరింగ్ జరిపినది భారత నౌకలపైనే !!

హర్ముజ్ గేట్ వే దాటుతున్న రెండు భారత నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు దళాలు కాల్పులు జరిపాయి. ఈ నౌకలురెండూ రెండు మిలియన్ బారెళ్ల ఇరాకీ చమురును భారత్ కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒమన్ కు 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ నౌకలపై ఎలాంటి ముందస్తు వార్నింగ్ లేకుండా కాల్పులు జరిపింది. ఘటన పై మన విదేశాంగ శాఖ సీరియస్ అయింది.భారత్ లోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చింది.

పవన్ కల్యాణ్ కు ఎమర్జెన్సీ సర్జరీ !!
Politics· 18 Apr 2026

పవన్ కల్యాణ్ కు ఎమర్జెన్సీ సర్జరీ !!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ కు అత్యవసర సర్జరీ జరిగింది. ఇటీవల తరచు అనారోగ్యానికి గురవుతున్న పవన్ ఓ కేబినెట్ భేటీలో తీవ్రంగా ఇబ్బంది పడటంతో అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఎమ్మారై తీసి అత్యవసర సర్జరీ చేయాల్సి వచ్చి ఆపరేషన్ చేశారు. పవన్ ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

మహిళా బిల్లు పాపం కాంగ్రెస్ దే..ఐయామ్ సారీ !!
Politics· 18 Apr 2026

మహిళా బిల్లు పాపం కాంగ్రెస్ దే..ఐయామ్ సారీ !!

మహిళల చిరకాల స్వప్నం నెరవేరకుండా కాంగ్రెస్ అడ్డుపడిందని ప్రధాని మోడీ విమర్శించారు. ఇందుకు మహిలకు క్షమాపణలు చెబుతున్నామన్నారు.మహిళల రిజర్వేషన్ కు తమ పార్టీ కట్టుబడి ఉందని వాటిని సాధించి తీరుతామని అన్నారు. ఇటీవల కాలంలో అన్ని మంచి ప్రయత్నాలకు కాంగ్రెస్ అడ్డు పడిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ విపక్షాలకే ఇస్తామని చెప్పినా వినలేదన్నారు. పార్టీల అసలు ముసుగు తొలగిందన్నారు. అయినా అన్ని అడ్డంకులు ఎదుర్కొని విజయం సాధిస్తామన్నారు.

వరుణ్ తేజ్‌కు సర్జరీ.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?
Entertainment· 18 Apr 2026

వరుణ్ తేజ్‌కు సర్జరీ.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల తన కొత్త సినిమా 'Bari' షూటింగ్‌లో వాలీబాల్ ఆడుతుండగా కాలికి గాయమైంది. దీనికి సంబంధించి Surgery సక్సెస్ అయిందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని ఆయన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. త్వరలోనే మరింత బలంగా మళ్లీ యాక్షన్ లోకి దిగుతానని అభిమానులకు ప్రామిస్ చేశారు. ఈ మూవీని నిహారిక కొణిదెల నిర్మిస్తుండగా, యదు వంశీ డైరక్షన్ చేస్తున్నాడు.

బస్సులో యువతిని వేధించిన వృద్ధుడు▶
Crime· 18 Apr 2026

బస్సులో యువతిని వేధించిన వృద్ధుడు

కేరళ వెళ్తున్న ప్రభుత్వ బస్సులో ఒక వృద్ధుడు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో భయపడకుండా, ఆమె వెంటనే తన మొబైలు లో వీడియొ రికార్డు చేసింది. అనంతరం ధైర్యంగా ఆ వృద్ధుడిని నిలదీసి అందరి ముందు బుద్ధి చెప్పింది. తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

రామ మందిరం, పార్లమెంట్ టార్గెట్? నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్!
Crime· 18 Apr 2026

రామ మందిరం, పార్లమెంట్ టార్గెట్? నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్!

ఢిల్లీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి IED బాంబు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, రామ మందిరం మరియు పార్లమెంట్ హౌస్ వంటి ప్రముఖ కట్టడాలే లక్ష్యంగా వీరు దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా నెట్‌వర్క్ పెంచుకుంటూ, కీలక ప్రాంతాల్లో నిఘా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత: భారత ట్యాంకర్‌పై కాల్పులు!
Politics· 18 Apr 2026

హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత: భారత ట్యాంకర్‌పై కాల్పులు!

పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. హోర్ముజ్ స్ట్రెయిట్ వద్ద ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఇందులో ఇండియన్ ఫ్లాగ్ ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా ఉంది. అదృష్టవశాత్తూ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఈ దారిని మూసివేయడంతో, భారత్‌కు రావాల్సిన మరికొన్ని నౌకలను సురక్షిత ప్రాంతాలకు Divert చేశారు.

ఫ్లాష్.. ఫ్లాష్...  ఇండియన్ షిప్స్ పై   ఫైరింగ్ !!
Politics· 18 Apr 2026

ఫ్లాష్.. ఫ్లాష్... ఇండియన్ షిప్స్ పై ఫైరింగ్ !!

హోర్ముజ్ జలసంధిలో ఫైరింగ్ బారిన పడిన రెండు నౌకలకు ఇండియన్ ఫ్లాగ్స్ ఉండటం కలకలం రేపుతోంది. ఇండియన్‌ షిప్స్ పై ఫైరింగ్ జరిగిందన్న అనుమానంతో దీనిపై వివరణ కోరేందుకు భారత్ త్వరలోనే ఇరాన్ రాయబారిని (Envoy) పిలిపించే అవకాశం ఉంది. కాల్పులు ఎవరు జరిపారు? టార్గెటెడ్ గా జరిపారా లేక పొరపాటున ఫైరింగ్ జరిగిందా అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. భారత్ ఎంక్వైయిరీ చేస్తోంది.

రన్నింగ్ ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు..▶
Politics· 18 Apr 2026

రన్నింగ్ ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు..

KRBA-TVCN SF Expressలో ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. స్లీపర్ కోచ్ S1లో ప్రయాణిస్తున్న తనతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు వీడియొ తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. రిజర్వ్డ్ కోచ్‌లలో కూడా మహిళలకు రక్షణ లేకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ Shocking Inciden tపై రైల్వే పోలీసులు స్పందించి Action తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రయాణికుల Safetyపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మహిళా బిల్లు వైఫల్యం కాంగ్రెస్ దేనా?
Politics· 18 Apr 2026

మహిళా బిల్లు వైఫల్యం కాంగ్రెస్ దేనా?

డీ లిమిటేషన్ , మహిళా బిల్లులను ఒకేసారి రాజ్యాంగ సవరణకు లింకు పెట్టి సభలో ఓటింగ్ పెట్టిన బీజేపి తెలివిగా ఈ వైఫల్యాన్ని కాంగ్రెస్ పై రుద్దే పని మొదలు పెట్టింది. మహిళల దశాబ్దాల కల అయిన విమెన్ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మోకాలడ్డిందంటూ ప్రచారం మొదలు పెట్టింది. బీజేపి మహిళా ఎంపీలంతా రాహుల్ ఇంటి వరకూ ప్రదర్శనగా వెళ్లారు. ధోకే బాజ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.