పేరెంట్స్‌కి అలర్ట్.. ఈ దగ్గు సిరప్‌లపై కేంద్రం వార్నింగ్

చిన్న పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇచ్చే విషయంలో కేంద్రం జాగ్రత్తలను పెంచుతోంది. ముఖ్యంగా Chlorpheniramine Maleate, Phenylephrine కలిపిన సిరప్‌లను 4 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వకూడదని సూచించింది. 2025లోనే 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వొద్దని ఆరోగ్య శాఖ తెలిపింది. సిరప్ బాటిళ్లపై ఎరుపు రంగులో హెచ్చరికలు పెట్టే విషయాన్ని CDSCO పరిశీలిస్తోంది. డాక్టర్ల సలహా లేకుండా పిల్లలకు మందులు ఇవ్వకండి.



