← Back to news

సింగరేణి అధికారులకు దసరా కానుక

By Vishi· 3h ago
సింగరేణి అధికారులకు దసరా కానుక

TG: తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ(SCCL) అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా, దీపావళి పండుగ కానుకగా శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న అధికారుల వేతన సవరణ డిమాండ్‌ను నెరవేర్చింది. సింగరేణి ఎగ్జిక్యూటివ్ అధికారుల వేతనాల సవరణకు సంబంధించి జీవో జారీ అయ్యింది. ఈ నిర్ణయం ద్వారా సింగరేణివ్యాప్తంగా 1,800 మంది ఎగ్జిక్యూటివ్ అధికారులు (ఈ-1 నుండి ఈ-7 గ్రేడ్లు) లబ్ధి పొందనున్నారు. ఈ అధికారుల వేతన సవరణను కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) వేతనాల స్థాయికి సమానం చేశారు.

More in TG